For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆయిల్ స్కిన్ నివారించుకోవడం ఎలా? ఆయిల్ స్కిన్ నివారించే 8 ఫేస్ ప్యాక్స్!

|

జిడ్డు చర్మానికి... వేసవి కష్టకాలం. ఎండ తీవ్రతకు చర్మంలోని నూనె గ్రంథులు మరింతగా స్రవిస్తాయి. ఆ జిడ్డు మీద దుమ్మూధూళి, కాలుష్య రేణువులు చేరినప్పుడు చర్మం ఇరిటేషన్‌కు గురవుతుంది. గుల్లలు, మచ్చలు వస్తాయి. చర్మం అదనపు నూనెను ఉత్పత్తి చేయడానికి అనేక కారణాలున్నాయి. టీనేజర్స్ లో ఆయిల్ స్కిన్ ఏర్పడటానికి ప్రధాన కారణం హార్మోనుల్లో మార్పులు. అదేవిధంగా వేడి, అధికంగా స్మోక్ చేయడం, ప్రెగ్నెన్సీ, మోనాపాజ్ మొదలగునవి ఆయిల్ స్కిన్ కు ప్రధాన కారణాలు.

కారణం ఏదైనప్పటికి, ఆయిల్ స్కిన్ ఒక చీకాకు కలిగించే ఒక బాధాకరమైన సమస్య. కాబట్టి, మీ చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి, చర్మంలో అదనపు నూనెను సమర్థవంతంగా వదిలించుకోవడం చాలా అవసరం. ఆయిల్ స్కిన్ వదలించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే సమస్యను నివారించుకోవడానికి అనేక మార్గాలున్నాయి. అందుకు ఖర్చుచేయాల్సిన అవసరం లేదు . ఈ కష్టాలను తప్పించడానికి ఇంట్లోనే చేసుకోగలిగిన బ్యూటీ ట్రీట్‌మెంట్‌లు కొన్ని...

1. టొమాటో ప్యాక్‌:

1. టొమాటో ప్యాక్‌:

టొమాటోను చిదిమి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో కడిగితే ముఖం మీద ఉన్న జిడ్డు పోయి రోజంతా తాజాగా ఉంటుంది. వంట కోసం వాడేటప్పుడు చిన్న ముక్కను తీసుకుని ముఖానికి రుద్దుకోవచ్చు. కొంతమందికి టొమాటో సరిపడదు, స్కిన్‌కు ఇరిటేషన్‌ వస్తుంటుంది. అలాంటప్పుడు ఒకటి - రెండు ద్రాక్ష పండ్లను స్కిన్‌ తొలగించి గుజ్జును చిదిమి ముఖానికి రాసుకోవచ్చు.

2. హనీ–కార్న్‌ మాస్క్‌:

2. హనీ–కార్న్‌ మాస్క్‌:

ఒక పచ్చిబంగాళదుంప, ఒక టేబుల్‌స్పూను కార్న్‌ఫ్లోర్, ఒక టేబుల్‌ స్పూను తేనె తీసుకోవాలి. బంగాళదుంపను తురిమి రసం తీసుకోవాలి. ఆ రసానికి తేనె, కార్న్‌ఫ్లోర్‌ కలిపి ముఖానికి, మెడకు, చేతులకు ప్యాక్‌ వేయాలి. ఇది ఆరే కొద్దీ స్కిన్‌ను టైట్‌ చేస్తుంది. పదిహేను నిమిషాల తర్వాత ప్యాక్‌ను కడిగేయాలి. కడిగిన వెంటనే తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఆయిలీ స్కిన్‌కు మాత్రమే. సెన్సిటివ్‌ చర్మానికి, పొడి చర్మానికి ఈ ప్యాక్‌ వేస్తే మరీ పొడిబారే అవకాశముంది. కాబట్టి ఈ రెండు రకాల చర్మానికి కార్న్‌ఫ్లోర్‌ను మినహాయించి ప్యాక్‌ వేసుకోవచ్చు.

3. క్యారట్‌ ఫేస్‌ మాస్క్‌:

3. క్యారట్‌ ఫేస్‌ మాస్క్‌:

ఎర్రని క్యారట్‌ను గ్రైండ్‌ చేసి రసం తీసుకుని అందులో నాలుగైదు చుక్కల బాదం నూనె కలిపి ముఖానికి పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత వేడి నీటితో కడగాలి. ఇలా రోజుకొకసారి నెలరోజుల పాటు ప్యాక్‌ వేస్తే ముఖం మీద ఉన్న ట్యాన్‌తో పాటు ఇతర మచ్చలు పోయి ముఖవర్చస్సు పెరుగుతుంది.

4 .ఎగ్ వైట్ :

4 .ఎగ్ వైట్ :

ఎగ్ బైట్ లో విటమిన్ అధికంగా ఉంది, ఎగ్ వైట్ చాలా ఎఫెక్టివ్ చర్మకాంతిని పెంచుతుంది అదే విధంగా చర్మాన్ని టైట్ చేసి, జిడ్డును తొలగిస్తుంది. ఎగ్ వైట్ ను అలాగే ప్లెయిన్ గా లేదా నిమ్మరసం జోడించి మిక్స్ చేసి ముఖ చర్మంకు పట్టించి ఎడిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా వారానికి ఒకటి రెండు సార్లు చేస్తే సరిపోతుంది.

5. నిమ్మరసం:

5. నిమ్మరసం:

నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక గొప్ప ఆస్ట్రిజెంట్. ఇందులో యాంటీసెప్టిక్ లక్షణాలు కలిగి ఉండి, చర్మ కాంతిని పెంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. అలాగే చర్మంలో పిహెచ్ ను బ్యాలెన్స్ చేస్తుంది. ఒక చెంచా నిమ్మరసంలో అరటీస్పూన్ డిస్టిల్ వాటర్ మిక్స్ చేసి, కాటన్ బాల్స్ తో ముఖం మీద అప్లై చేసి 10నిములు అలాగే ఉంచి, తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి . నిమ్మరసం మీ చర్మాన్ని డ్రై చేస్తుంది. కాబట్టి, కొంచె ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజ్ ను అప్లై చేయాలి. ఇలా ప్రతి రోజూ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

6. పెరుగు :

6. పెరుగు :

పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంది. ఇది చర్మానికి చాలా అద్భుతంగా ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది. చర్మంలో ఉండే అదనపు జిడ్డు,నూనెతో ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. ఒక చెంచా సాదా పెరుగు ను మీ ముఖం మీద అప్లై చేసి 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతి రోజూ ఒక సారి చేసుకుంటే, ఆయిల్ స్కిన్ శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చు.

7. పాలు:

7. పాలు:

పాలు ఒక గొప్ప ఆయిల్ ఫ్రీ క్లెన్సర్. ఆయిల్ స్కిన్ సాఫ్ట్ గా మరియు సపల్ గా ఉంచతుంది . పాలలోని ఆల్ఫా హైడ్రాక్సీ ఆసిడ్స్ చాలా గొప్పగా ఉండి చర్మానికి గొప్పగా పనిచేస్తుంది మరియు చర్మంలోని పిచ్ ను బ్యాలెన్స్ చేస్తుంది.

పాలలో రెండు మూడు చుక్కల సాండిల్ ఉడ్ లేదా లావెండ్ ఆయిల్ మిక్స్ చేసి నిద్రించే ముందు ముఖానికి పట్టించాలి. బాగా మసాజ్ చేసి రాత్రి అలాగే వదిలేయాలి. ఉదయం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

8. కలబంద

8. కలబంద

అలొవెరాలో యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఆయిల్ స్కిన్ తొలగించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

తాజా అలొవెరాను కట్ చేసి జెల్ ను ముఖానికి అప్లై చేయాలి. బాగా ఎండిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకు ఒకటి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

English summary

How to get rid of oily skin: 8 Effective Face Pack Recipes for Oil skin

Oily skin is very tricky to deal with. Managing oily face is really a challenge, especially for people having large pores. Here we present to you some of the most effective face packs for oily skin which will sure surely bring back the liveliness on your face.