For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ మొహంపై మచ్చలుపడ్డ చర్మాన్ని వదిలించుకోటం ఎలా?

|

మీ ముఖంపై వచ్చిన గోధుమ లేదా ఎర్ర మచ్చలను వదిలించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ రోజు ఆర్టికల్ మీ కోసమే. ఈరోజు బోల్డ్ స్కైలో, మీ మచ్చలు పడ్డ చర్మానికి ఎలా సహజ పద్ధతులలో వీడ్కోలు చెప్పవచ్చో మీకు తెలియజేయటానికే వచ్చాం.

మీ చర్మంపై మచ్చలు ఏర్పడటానికి వివిధ రకాల కారణాలుండవచ్చు.సున్నితమైన చర్మం ఉన్నవారు లేదా సూర్యకాంతి వలన పాడైన చర్మాలు ఇలాంటి అందవికారమైన చర్మసమస్యలకి గురవుతాయి.

<strong>అందానికే మచ్చ తీసుకొచ్చే మొటిమలకు మనకు తెలియని 15 కారణాలు</strong>అందానికే మచ్చ తీసుకొచ్చే మొటిమలకు మనకు తెలియని 15 కారణాలు

ఈ మచ్చలను దాచిపెట్టడం కష్టమవవచ్చు, ఎందుకంటే మేకప్ సామాను కూడా అవి పూర్తిగా కన్పించకుండా చేయలేవు. అదృష్టవశాత్తూ, ఈ సమస్య నుంచి ఉపశమనం పొందటానికి కొన్ని సహజ పద్ధతులున్నాయి,అవే మేము ఇక్కడ పొందుపరిచాం.

ఈ పద్ధతులకి కావాల్సిన వస్తువులు ఇంట్లో ఉన్నాయో లేదో చూసుకుని, ఈ మచ్చల నుంచి కొంత విముక్తి పొందండి. ఇక్కడ మేము పాడయిన చర్మాన్ని శాంతపర్చి, ప్రస్ఫుటంగా కన్పించే మచ్చలను కన్పడనీయకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న చిట్కాలను అందించాం..

1. వంటసోడా

1. వంటసోడా

ఎలా వాడాలి

-చిటికెడు వంటసోడాను 1చెంచా మంచినీరుతో కలపండి.

--సమస్య ఉన్నచోట్ల దాన్ని పూయండి. 5-10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీరుతో కడిగేయండి.

-తర్వాత మీ మొహాన్ని చల్లనీరుతో కడుక్కోండి. వారానికి ఒకసారి ఇలా చేసి మచ్చల చర్మానికి గుడ్ బై చెప్పండి.

2. ఆలోవెరా జెల్

2. ఆలోవెరా జెల్

ఎలా వాడాలి

-ఆలోవెరా జెల్ ను సింపుల్ మచ్చలమీద రాయండి. రాత్రంతా దాన్ని అలానే ఉండనివ్వండి.

-పొద్దున్నే, గోరువెచ్చని నీరుతో కడిగేయండి. తర్వాత, చల్లనీరును ముఖంపై కొట్టుకోండి.

-ఈ రాత్రిపూట చిట్కాను వారానికి 3-4సార్లు ప్రయత్నించి ఫలితాలను చూడండి.

3.ఓట్ మీల్

3.ఓట్ మీల్

ఎలా వాడాలి

-1/2 చెంచా ఓట్ మీల్ ను 1 చెంచా ఆర్గానిక్ తేనెతో కలపండి.

-ఈ మిశ్రమాన్ని మచ్చలున్న చర్మం అంతా పట్టించండి. 5నిమిషాలు అలా వదిలేయండి.

-గోరువెచ్చని నీరుతో కడిగి, తర్వాత చల్లనీరుతో కూడా కడగండి.

-ఈ మిశ్రమాన్ని వారానికోసారి వాడుతూ ఈ చర్మసమస్యను వదిలించుకోండి.

4. పెరుగు

4. పెరుగు

ఎలా వాడాలి

-తాజా పెరుగును సింపుల్ గా మీ ముఖంపై సమస్య ఉన్నచోట్ల రాయండి.

-10-15 నిమిషాలు అలా వదిలేసి, గోరువెచ్చని నీరుతో కడిగేయండి.

- వారానికి 3-4సార్లు ఈ పద్దతి పాటించి మచ్చలు లేని చర్మాన్ని మీ సొంతం చేసుకోండి.

5. కొబ్బరినూనె

5. కొబ్బరినూనె

ఎలా వాడాలి

-కొంచెం కొబ్బరినూనెను మచ్చలున్న ప్రదేశం అంతా రాయండి.

-10నిమిషాల పాటు అలా వదిలేసి, గోరువెచ్చని నీటితో కడిగేయండి.

- దీన్ని వారానికి 3-4 సార్లు వాడి, మొండిగా ఉన్న మచ్చలను కూడా వదిలించుకోండి.

<strong>మొటిమలు నుదుటి పై ఉంటే ఏమర్థం, బుగ్గపై ఉంటే మని అర్థం..</strong>మొటిమలు నుదుటి పై ఉంటే ఏమర్థం, బుగ్గపై ఉంటే మని అర్థం..

6.దోసకాయ

6.దోసకాయ

ఎలా వాడాలి

-పండిన దోసకాయ ముక్కలు కొన్నితీసుకుని, బాగా చిదిపి పేస్టులా తయారుచేయండి.

- ఈ పేస్టును సమస్య ఉన్న చోట అంతా రాసి, 10 నిమిషాల పాటు వదిలేయండి.

-గోరువెచ్చని నీరుతో అక్కడ అంతా కడిగేసి, చల్లనీళ్ళు ముఖంపై కొట్టుకుని చర్మరంధ్రాలు మూసుకునేలా చేయండి.

- వారానికి 3-4 సార్లు ఈ పద్ధతి పాటించి కావాల్సిన ఫలితాలు చూడవచ్చు.

7. విటమిన్ ఇ నూనె

7. విటమిన్ ఇ నూనె

ఎలా వాడాలి

-విటమిన్ ఇ టాబ్లెట్ నుంచి నూనెను తీసి మీ ముఖంపై మొత్తం రాయండి.

-5-10 నిమిషాలు అలానే ఉంచి, గోరువెచ్చని నీరుతో ముఖాన్ని కడిగేయండి.

- వారానికి 3-4 సార్లు ఇలా చేసి మచ్చలను వదిలించుకోండి.

8. అరటిపండు

8. అరటిపండు

ఎలా వాడాలి

-పండిన అరటిపండును బాగా చిదిపేసి, ఆ పేస్టును సమస్య ఉన్నచోట రాయండి.

- 15 నిమిషాలు దాన్ని అలా వదిలేసి, గోరువెచ్చని నీరుతో ఆ తర్వాత కడిగేయండి.

- ఈ చిట్కాను వారానికి 3-4 సార్లు ప్రయత్నించి గమనించదగ్గ ఫలితాలను చూడండి.

9.రోజ్ వాటర్

9.రోజ్ వాటర్

ఎలా వాడాలి

- కొంచెం రోజ్ వాటర్ ను మొహంపై ఉన్న అన్ని మచ్చలపై రాయండి.

- రాత్రంతా దాన్ని అలానే ఉండనివ్వండి.

- పొద్దున్నే గోరువెచ్చని నీరుతో మొహం కడిగేయండి.

- రోజూ ఈ పద్ధతి పాటించి మచ్చలు లేని శుభ్రమైన చర్మం పొందండి.

English summary

How To Get Rid Of Blotchy Skin On Your Face

Here are the best remedies to get rid of blotchy skin on the face,
Story first published:Wednesday, November 15, 2017, 17:09 [IST]
Desktop Bottom Promotion