For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ముఖంలో నల్ల మచ్చలు (డార్క్ స్పాట్స్)నివారించే ఫేస్ మాస్క్ లు!

  By Ashwini Pappireddy
  |

  గడుస్తున్న ప్రతి రోజూ చర్మ సమస్యలు చాలా సాధారణంగా మారుతున్నాయి. కలుషిత రహదారుల లో రోజూ ప్రయాణం చేయడం మరియు జీవనశైలిలో తరచూ మార్పుల కారణంగా, ముఖం మీద చాలా అగ్లీ గా మచ్చలు మరియు డార్క్ స్పాట్స్ ఏర్పడుతున్నాయి.

  స్కిన్ డేటాక్సిఫికేషన్ చేయడం వలన చర్మం ఉపరితలం మరియు పొరల లో దాగివున్న మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. మొటిమలు మరియు డార్క్ స్పాట్స్ మచ్చలు వచ్చే అవకాశాలు తగ్గించడంతో ఇది మీ చర్మం ఆరోగ్యకరంగా మరియు మెరిసేలా చేస్తుంది.

  కాళ్లపై అసహ్యంగా ఉండే డార్క్ స్పాట్స్ నివారించే పవర్ ఫుల్ రెమిడీస్..!!

  ఈ CTM సమస్య తో మీరు బాధపడుతున్నట్లైతే దీని గురించి అసలు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీతో పాటు లక్షలాది ఇదే సమస్యతో బాధపడుతున్నారు. అది పూర్తిగా సాధారణమైనదని మీరు తెలుసుకోవాలి. ధూళి మరియు ధూళి కణాలు మా చర్మం లోపలి పొరలకు వెళ్లి, సాధారణ క్రీమ్స్ ని వాడటం వాళ్ల చర్మాన్ని వదిలిపెట్టకుండా అలాగే వుండి పోతాయి.

  మోటిమలు మరియు స్పాట్ మార్క్స్ ని వదిలించుకోవడానికి డేటాక్సీఫయింగ్ మాస్కస్

  మన చర్మం యొక్క ఉపరితలం మీద చిన్న రంధ్రాలను కలిగి ఉంటుంది, వీటినే పోర్స్ అని కూడా పిలుస్తారు.ఈ ప్రాంతాలలో ధూళి మరియు ధూళి రేణువులు రంధ్రాల లోకి వెళ్లి అక్కడే స్థిరపడి మూసుకుపోతాయి. చివరికి ఈ మలినాలు పెద్ద ఎర్రని మొటిమలను ఏర్పరుచుట ద్వారా ముగుస్తాయి మరియు తరచూ వీటిని శుభ్రం చేయడం చాలా కష్టం గా ఉంటుంది. ఈ పింపుల్స్ చాలా వికారంగా ఉండి మరియు భయంకరమైన నొప్పిని కలిగిస్తాయి.వీటిని నయం చేయడానికి చాలా కాలం పడుతుంది మరియు చెత్త భాగం ఏంటంటే అగ్లీ మచ్చలను మిగిల్చి ప్రజలను భయపెడుతూ ఉంటాయి.

  ముఖ్యంగా పండుగ సీజన్లో ఈ సమస్య తీవ్రమవుతుంది. దీని వెనుకగల కారణం ఇలాంటి సందర్భాలలో తరచుగా మేకప్ ఉత్పత్తులను ఉపయోగించడం. మేకప్ ఉత్పత్తులు తరచూ జిడ్డుగా ఉంటాయి మరియు రసాయనాలతో నిండి ఉంటాయి. ఈ రసాయనాలు రంధ్రాల కు అడ్డుపడి మరియు మొటిమలకు కారణమవుతుంది. సాధారణ క్లీన్సింగ్ రొటీన్ చర్మం శుభ్రం చేయడానికి సరిపోకపోవచ్చు. లోపలి పొరల నుండి మలినాలను తొలగించాలి. కేవలం నిర్విషీకరణ ద్వారా అది చేయవచ్చు. స్కిన్ నిర్విషీకరణ చర్మం ఉపరితలం మరియు పొరల లో కూడా దాగిన మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. మోటిమలు మరియు స్పాట్ డార్క్స్ యొక్క అవకాశాలు తగ్గించడంతో ఇది మీ చర్మం ఆరోగ్యకరంగా మరియు మెరిసేలా చేస్తుంది.

  మచ్చలు, ముడతలు.. చర్మ సమస్యలన్నింటికీ పర్ఫెక్ట్ సొల్యూషన్..!

  ఇక్కడ కొన్ని డేటాక్సీఫయింగ్ మాస్కస్ లు మీ చర్మం యొక్క మలినాలను తొలగించడానికి సహాయపడుతాయి. ఈ హోమ్ రెమెడీస్ ఫాలో అవడం చాలా సులభం మరియు వీటిని తరుచూ వాడటం వలన మీ చర్మం శుభ్రంగా ఉండి, తాజాదనాన్ని ఇచ్చి మరియు ప్రకాశిస్తూ ఉంటుంది...

  ద్రాక్షపండు మరియు వోట్మీల్ యొక్క డేటాక్సీఫయింగ్ మాస్క్ :

  ద్రాక్షపండు మరియు వోట్మీల్ యొక్క డేటాక్సీఫయింగ్ మాస్క్ :

  ద్రాక్షపండు మరియు వోట్మీల్ డేటాక్సీఫయింగ్ మాస్క్ అనేది ఒక సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు.ఇది యాంటీ ఆక్సిడెంట్లతో పూర్తిగా నిండివుంటుంది. ఇందులో విటమిన్ సి సమృద్ధిగా గా ఉండటం వలన, ఇది నల్ల మచ్చలను తేలికగా తొలగిస్తుంది మరియు దాగున్న మలినాలను శుభ్రపరచడంలో సహాయం చేస్తుంది. వోట్మీల్ వాపు మరియు ఎర్రగా మారడాన్ని తగ్గిస్తుంది, దీని వలన ఎర్రటి బంప్ ను తగ్గించవచ్చు. ఈ పరిష్కారం ఖచ్చితంగా మీ చర్మం ఆరోగ్యకరంగా ఉండేలా చేసి మరియు ప్రకాశించేలా చేస్తుంది.

  కావలసిన పదార్థాలు:

  --1 గ్రేప్ఫ్రూప్ట్

  -1/2 కప్పు వోట్మీల్

  -1 కప్ పాలు గ్రేప్ఫ్రూప్ట్

  తాయారు చేసే విధానం : పాలతో పాటు వోట్మీల్ ఉడికించి దానిని కాసేపు చల్లారనివండి. గ్రేప్ఫ్రూప్ట్ యొక్క పల్ప్ ను తొలగించి, చల్లారిన వోట్మీల్ తో కలపాలి. దీనిని చర్మంపై 20 నిముషాల పాటు మసాజ్ చేసివదిలివేయాలి కాసేపు తరవాత చల్లటి నీటితో కడగాలి.

  టమోటా జ్యూస్ అండ్ క్లే డిటాక్సింగ్ ఫేస్ మాస్క్:

  టమోటా జ్యూస్ అండ్ క్లే డిటాక్సింగ్ ఫేస్ మాస్క్:

  -టమోటా జ్యూస్ అండ్ క్లే డిటాక్సింగ్ ఫేస్ మాస్క్-టమోటాలు జిడ్డు చర్మం ఉన్నవారికి చాలా మంచివి. ఇది తేలిక మరియు ముదురు మచ్చలను తొలగించి మరియు చర్మం ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. సహజ బంకమట్టి చర్మాన్ని లోపలి పొరల నుండి దాచిన మలినాలను తొలగించి తీసివేస్తుంది. ఈ ప్యాక్ కూడా చర్మం నిర్మాణం మెరుగుపడుతుంది.

  దీనికి కావాల్సిన పదార్థాలు

  -1 టమోటా

  -3 టేబుల్ స్పూన్స్ బంకమట్టి

  తయారుచేసే విధానం: ఒక బ్లెండర్ లో టమోటా జ్యూస్ తయారుచేసుకోవాలి. ఈ టమోటా జ్యూస్ కి మట్టితో కలిపి ముఖానికి అప్లై చేసుకోవడానికి వీలుగా కలపాలి. ఇప్పుడు దీనిని మీ ముఖానికి అప్లై చేసుకొని మరియు 15 నిముషాల పాటు వదిలివేయాలి లేదా పూర్తిగా పొడిగా అయేంతవరకు ఉంచాలి. తరువాత చల్లటి నీటితో కడగాలి.

  కాఫీ మరియు కొబ్బరి స్కిన్ డిటాక్సింగ్ ఫేస్ మాస్క్:

  కాఫీ మరియు కొబ్బరి స్కిన్ డిటాక్సింగ్ ఫేస్ మాస్క్:

  కాఫీ మరియు కొబ్బరి చర్మం డిటాక్సింగ్ ఫేస్ మాస్క్-కాఫీ లో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధంగా ఉంటాయి. మీ అలసటతో నిండిన చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది మరియు అది రెజువెనేటెడ్ ఫీలింగ్ నిస్తుంది. కొబ్బరి నూనె మలినాలను తొలగించి, చర్మం పోషించేలా చేస్తుంది మరియు ఇది ఆరోగ్యకరమైన గ్లో ఇస్తుంది.

  కావాల్సిన పదార్థాలు

  --1 టీస్పూన్ గ్రౌండ్ కాఫీ పొడి

  -1/2 టీస్పూన్ అదనపు వర్జిన్ కొబ్బరి నూనె

  తయారుచేసే విధానం: ఒక గిన్నెలో ఈ రెండు పదార్ధాలను కలపండి.మిశ్రమాన్ని మీ ముఖం మీద వేసి 15 నిముషాల పాటు వదిలివేయండి.చల్లటి నీటితో కడగాలి. మీరు ఒకవేళ ఆయిలీ స్కిన్ ని కలిగిఉంటే మరియు కొబ్బరి నూనె ను ఉపయోగించడం గురించి ఆందోళన చెందుతుంటే, మీరు తేనెను ఒక ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. అయితే ఫలితం లో ఎలాంటి మార్పు ఉండదు.

  అవోకాడో మరియు పార్స్లీ స్కిన్ డిటాక్సింగ్ ఫేస్ మాస్క్-:

  అవోకాడో మరియు పార్స్లీ స్కిన్ డిటాక్సింగ్ ఫేస్ మాస్క్-:

  అవోకాడో మరియు పార్స్లీ స్కిన్ డిటాక్సింగ్ ఫేస్ మాస్క్-ఈ పేస్ మాస్క్ అనేది సహజంగా శక్తివంతమైన డిటాక్సింగ్ల మిశ్రమం. అవెకాడో లో ఫాట్ సమృద్ధిగా ఉంటుంది ఇది మీ చర్మాన్ని నునుపుగా మరియు శుభ్రంగా ఉండేటట్లు చేస్తుంది. పార్స్లీ లోపల వున్న హెర్బ్ చర్మం లోపల దాగున్న టాక్సిన్ ని బయటకు ఫ్లష్ చేస్తుంది. ఈ మాస్క్ మచ్చలు తగ్గించడంలో మరియు చర్మం నిర్విషీకరణకు చాలా ప్రభావవంతమైనది.

  కావాల్సిన పదార్థాలు:

  -అవోకాడో పల్ప్ -2 టబుల్స్పూన్

  -చిన్న ముక్కలుగా తరిగిన పార్స్లీ 1 టీస్పూన్

  తయారు చేసే విధానం: పైన తెలిపిన పదార్థాలను ఒక గిన్నెలో కలపండి. దీనిని మీ మీ ముఖానికి రాసుకొని ముఖం మీద వేసి 15 నిముషాల పాటు ఉంచండి. తర్వాత చల్లటి నీటితో కడగాలి.

  స్ట్రాబెర్రీ అండ్ హనీ డిటాక్సింగ్ ఫేస్ మాస్క్ :

  స్ట్రాబెర్రీ అండ్ హనీ డిటాక్సింగ్ ఫేస్ మాస్క్ :

  -స్ట్రాబెర్రీ అండ్ హనీ డిటాక్సింగ్ ఫేస్ మాస్క్-స్ట్రాబెర్రీస్ చర్మం రంధ్రాలను బిగించి, మీ చర్మం రిఫ్రెష్ చేస్తాయి. తేనె మాయిశ్చరైజింగ్ మరియు యాంటీ బాక్టీరియల్. ఇది మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను చంపి, నల్ల మచ్చలు వున్న ప్రాంతాన్ని నయం చేయటానికి సహాయపడుతుంది.

  కావాల్సిన పదార్థాలు:

  3-4 తాజా స్ట్రాబెర్రీలు

  1 టబుల్స్పూన్ తేనె

  తయారుచేసే విధానం: స్ట్రాబెర్రీస్ బాగా స్మాష్ చేసి పల్ప్ లాగా తయారుచేయండి దానికి తేనెను మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని 20 నిముషాల పాటు వదిలివేయండి తరువాత చల్లటి నీటితో శుభ్రం చేయండి.

  English summary

  Natural Detoxifying Masks To Get Rid Of Acne And Dark Spots

  Here are certain detoxifying masks which will help you remove the skin's impurities. These At-home remedies are easy to do and will leave your skin feeling squeaky clean, fresh and glowing.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more