కనుబొమ్మల మీద ఇబ్బంది కలిగించే మొటిమలకు కారణాలు, నివారణ చిట్కాలు

By: Mallikarjuna
Subscribe to Boldsky

ముఖంలో ఏ మాత్రం చిన్న రెడ్ బంప్స్ కనబడ్డాయంటే తెగ హైరానపడిపోతుంటారు కొంతమంది. రెడ్ బంప్స్ అంటే మొటిమలు. అందమైన ముఖంలో మొటిమలు చాలా అసహస్యంగా కనబడుతాయి. ఇది అత్మన్యూనత భావనను దెబ్బతీస్తుంది. ముఖ్య చర్మం ఇన్ఫ్లమేషన్ కు గురైనప్పుడు, చర్మ రంద్రాలు బ్లాక్ అయినప్పుడు ఆయిల్ గ్రంథుల నుండి నూనె ఎక్కువగా శ్రవించడం వల్ల మొటిమలకు దారితీస్తుంది.

యవ్వనంలో ఉన్నప్పుడు మాత్రమే మొటిమలు రావు. మొటిమలు యవ్వనస్తులు, మద్యవయస్కులలో కూడా వస్తాయి. పెద్దల్లో వారి ఆరోగ్య పరిస్థితి బట్టి వస్తుంటాయి. బుగ్గల మీద, నుదిటి మీద, ఐబ్రోస్ దగ్గరలో మొటిమలను ఏర్పడటం గమనిస్తుంటాము. సహజంగా చెప్పాలంటే మొటిమలు తాత్కాకం. ఇవి ఎలా వస్తాయో అదే విధంగా అవంతట అవే కొద్ది రోజులకు తగ్గిపోతుంటాయి. ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకపోతే మరింత త్వరగా నయం అవుతాయి. ఐబ్రో దగ్గరలోనో లేదా ఐబ్రోస్ మీద వచ్చిన మొటిమలు దురద, చీకాకు కలిగిస్తాయి. అసౌకర్యానికి గురిచేస్తాయి. కాబట్టి, వీటి గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

Pimples On Eyebrows: Causes And How To Get Rid Of It

కనుబొమ్మల మీద మొటిమలు రావడానికి కారణాలు:

కనుబొమ్మల మీద మొటిమలు రావడానికి 5 కారణాలు క్రింది విధంగా ఉన్నాయి.

1. అలర్జీలు

1. అలర్జీలు

కను బొమ్మల మీద మొటిమలు ఏర్పడటానికి అలర్జీలు కూడా కారణమవుతాయి. మీ చర్మం అలర్జీలకు త్వరగా రియాక్ట్ అవ్వడం వల్ల ఆ ప్రదేశంలో మొటిమలు ఏర్పడవచ్చు. కొంత మందిలో డ్రగ్స్ (మందులు) అలర్జీకి కారణం అయితే మరికొందరిలో మేకప్ వల్ల చర్మంలో దురద, చర్మ ఎర్రగా కందడం, వాపు వంటి లక్షణాలు కనబడుతాయి. మేకప్ ప్రొడక్ట్స్ లో ఉండే పదార్థాలు అలర్జీలకు కారణం అవుతాయి. అది వాపు, చర్మం ఎర్రగా కందడానికి కారణం అవుతాయి.

కనుబొమ్మల మీద ఏర్పడిన మొటిమలకు ఫుడ్ అలర్జీ కూడా కారణం కావచ్చు. ఫుడ్ అలర్జీ వల్ల వ్యాధినిరోధకతకు వ్యతిరేఖంగా పోరాడటం వల్ల ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తుంది.

3. థైరాయిడ్ సమస్యలు:

3. థైరాయిడ్ సమస్యలు:

థైరాయిడ్ సమస్యల వల్ల కూడా ఐబ్రోస్ మీద మొటిమలు ఏర్పడుతాయి. థైరాయిడ్ గ్రంథులు విడుదల చేసి హార్మోన్లు శరీరం నార్మల్ ఫంక్షనింగ్ కోసం సహాయపడుతాయి. ఈ గ్రంథులు ఎక్సెస్ థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తే హైపర్ థైరాయిడిజంగా సూచిస్తారు. అలాగే సరిగా థైరాయిడ్ హార్మోన్లు సరిగా ఉత్పత్తి కాకపోతే దాన్ని హైపో థైరాయిడిజంగా సూచిస్తారు.

హైపోథైరాయిడిజం సెబమ్ లేదా ఆయిల్ ను ఎక్సెస్ గా ఉత్పత్తి చేయడం వల్ల మొటిమలు వస్తాయి, మొటిమలను నివారణకు క్రీములు వాడటం తాత్కాలిక మార్గం. వీటిని పూర్తిగా పోగొట్టడానికి రూట్ కాస్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది.

4. హార్మోనుల్లో మార్పులు

4. హార్మోనుల్లో మార్పులు

హార్మోనుల్లో మార్పులు కూడా కనుబొమ్మల మీద మొటిమలకు కారణం అవుతుంది

ఆండ్రోజెన్స్, ఈ మేల్ హార్మోన్స్ స్త్రీ, పురుషులిద్దరిలోనూ ఉంటుంది. ఇది మొటిమలకు కారణం అవుతుంది. ఇవి నూనె గ్రంథులను ఎక్కువగా ఉత్పత్తి చేయడం వల్ల ఎక్కువ నూనెలను ఉత్పత్తి చిసి, మొటిమలకు దారితీస్తుంది.

కనుబొమ్మల చుట్టూ ఉండే ఈ చిన్న చిన్న మొటిమలు, యవ్వనంలో సర్వసాధారణం. ఇంకా మెనుష్ట్రువల్ సమయంలో కూడా వస్తుంటాయి. పీరియడ్స్ సమయంలో హార్మోనుల్లో మార్పుల వల్ల మొటిమలు ఏర్పడుతాయి.

5. ఐబ్రో పెర్సింగ్

5. ఐబ్రో పెర్సింగ్

ఐబ్రో పెర్సింగ్ వల్ల కూడా కనుబొమ్మల మీద మొటిమలు ఏర్పడవచ్చు

బాడీ పార్ట్స్ లో పెర్సింగ్చేయడం కామన్. అయితే ఐబ్రోస్ మీద కుట్టడం అనేది కొంచెం కష్టమైన పని, ఎందుకంటే అక్కడ కుట్టినప్పుడు సరిగా క్లీన్ గా లేకపోయి, సరైన టిప్స్ అండ్ ట్రిక్స్ అనుసరించకపోయినా, ఇన్ఫెక్షన్స్ కు దారితీస్తుంది. కనుబొమ్మల మీద కుట్టినప్పుడు గాయాలు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లైతే ఇన్ఫెక్షన్ రాకుండా నివారించుకోవచ్చు , అలాగే ఆ చుట్టు పక్కల మొటిమలు ఏర్పడకుండా నివారించవచ్చు. కొన్ని సందర్భాల్లో కనుబొమ్మల్లో ఏర్పడే మొటిమలు చీము పడుతుంది.

కనుబొమ్మల మీద ఏర్పడే మొటిమలను నివారించే మార్గాలు:

కనుబొమ్మల మీద ఏర్పడే మొటిమలను నివారించే మార్గాలు:

చర్మం పట్లు కొంచెం శ్రద్ద పెడితే కనుబొమ్మల చుట్టూ ఏర్పడే మొటిమలను నివారించుకోవచ్చు. స్కిన్ ఎక్స్ ఫ్లోయేషన్, క్లీనింగ్, మాయిశ్చరైజింగ్ వంటివి రెగ్యులర్ గా చేస్తుంటే మొటిమలను నివారిస్తుంది. చర్మంలో రెడ్ బంప్స్ తొలగిపోతాయి. మొటిమలు క్రమం తప్పకుండా వస్తుంటే కాస్మోటిక్ వాడకం పూర్తిగి తగ్గించాలి. అయినా కూడా మొటిమలు అలాగే కనబడుతుంటే, ఈ క్రింది సూచించిన హోం రెమెడీస్ ను ఉపయోగించడం వల్ల కనుబొమ్మల మీద మొటిమలను నివారించుకోవచ్చు.

లెమన్ జ్యూస్:

లెమన్ జ్యూస్:

నిమ్మరసం కొంచెం స్టిక్కిగా ఉన్నప్పటికి, దీన్ని మొటిమల మీద అప్లై చేయడం వల్ల రెడ్ నెస్, పెయిన్ తగ్గుతుంది. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ లో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉన్నాయి. ఇవి కూడా మొటిమలు కనబడకుండా చేస్తాయి.

టూత్ పేస్ట్ :

టూత్ పేస్ట్ :

టూత్ పేస్ట్ మొటిమలు మాడిపోయేలా చేయడం మాత్రమే కాదు, మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. టూత్ పేస్ట్ లో ఉండే హైడ్రోజెన్ పెరాక్సైడ్ మరియు ట్రైక్లోసన్ అందుకు సమాయపడుతుంది. ఇవి చర్మం మీద యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావం కలిగి ఉంటుంది. దాంతో మొటిమల వాపు, నొప్పి తగ్గిస్తుంది. జెల్ బేస్డ్ టూత్ పేస్ట్ ను నివారించాలి, అలాగే అలర్జీలున్న వారు టూత్ పేస్ట్ వాడకూడదు.

ఎక్స్ ఫ్లోయేషన్:

ఎక్స్ ఫ్లోయేషన్:

మొటిమలు కనబడిన తర్వాత కూడా ఎక్స్ ఫ్లోయేట్ చేయవచ్చు. ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుంటే మైల్డ్ స్ర్కబ్ ఉపయోగించడం వల్ల మొటిమలు తొలగిపోతాయి.

English summary

Pimples On Eyebrows: Causes And How To Get Rid Of It

Pimples On Eyebrows: Causes And How To Get Rid Of It,Generally, pimples are temporary and heal on their own, unless they are infected. Pimples that appear on the eyebrows can be itchy and irritate your skin, if not taken care of.Causes Of Pimples On Eyebrows
Subscribe Newsletter