For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మంలోపల నొప్పితో బాధించే మొటిమలకు చెక్ పెట్టే సింపుల్ టిప్స్..!

By Lekhaka
|

మొటిమలు అసహ్యంగా ఉండటమే కాకుండా నొప్పి మరియు చర్మం మిగతా భాగాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. మొటిమలు చర్మం లోతుగా ఉండుట వలన నరాలు మూసివేయ బడతాయి. దాంతో విపరీతమైన నొప్పి మరియు వాపు పెరుగుతుంది.

మొటిమలు కొన్ని చర్మం కింద సంభవిస్తాయి. చర్మం కింద ఏర్పడే ఈ మొటిమలను బ్లైండ్ మొటిమలు అని అంటారు. ఇవి ముఖం మీద అదనపు చమురు ఉత్పత్తి మరియు చర్మ రంద్రాలకు అడ్డుపడతాయి.

ఈ మొటిమలు సాధారణంగా ఎరుపు రంగు మరియు చీము కలిగి ఉంటాయి. వీటిని ఎదుర్కోవటం చాలా బాధాకరం. మీరు చర్మం కింద మొటిమలను వదిలించుకోవాలంటే...ఇక్కడ కొన్ని సాధారణ నివారణ చికిత్సలు ఉన్నాయి. ఒక లుక్ వేయండి.

1. టీ ట్రీ ఆయిల్

1. టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్ లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండుట వలన చర్మ పొరల కింద ఉన్న మొటిమలను నివారించడంలో సహాయపడుతుంది. ఇది ముఖం మీద వ్యాప్తిని నిరోధించడం మరియు బాక్టీరియాను చంపడానికి సహాయపడుతుంది. ఒక కాటన్ బాల్ ని టీ ట్రీ ఆయిల్ లో ముంచి మొటిమ ఉన్న ప్రాంతంలో రాసి కొంచెం సేపు నొక్కి పట్టుకోవాలి. టీ ట్రీ ఆయిల్ మూసుకుపోయిన చర్మ రంద్రాలు తెరుచుకోవటానికి మరియు అధికంగా ఉన్న నూనెను నియంత్రించటానికి సహాయపడి బ్లైండ్ మొటిమలను నయం చేస్తుంది.

2. పచ్చి పాలు

2. పచ్చి పాలు

పాలు ఒక తేలికపాటి ప్రక్షాళనగా పనిచేసి చర్మం కింద మొటిమలను నివారించడానికి సహాయపడుతుంది. పాలలో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు (AHA) చనిపోయిన చర్మం యొక్క బయటి పొరను తొలగించటం ద్వారా అడ్డుపడే రంధ్రాలను తెరవడానికి సహాయపడతాయి. అంతేకాకుండా చర్మంపై పేరుకున్న మలినాన్ని తొలగించటానికి మరియు అదనపు నూనె చేరకుండా నిరోధిస్తుంది. ఒక కాటన్ బాల్ తీసుకోని పాలలో ముంచి మొటిమలు ఉన్న ప్రాంతంలో రాసి 10 నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో 2 లేదా 3 సార్లు చేస్తే చర్మం క్లియర్ మరియు మెరుస్తుంది.

3. తేనే

3. తేనే

తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉండుట వలన మొటిమలకు కారణం అయిన బ్యాక్టీరియా మీద పోరాటం చేస్తుంది. మొటిమల మీద తేనెను రాసి 20 నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా రోజులో 2 లేదా 3 సార్లు చేస్తే బ్లైండ్ మొటిమలను సులభంగా వదిలించుకోవచ్చు.

4. ఆపిల్ గుజ్జు

4. ఆపిల్ గుజ్జు

ఆపిల్ గుజ్జు చర్మం కింద ఏర్పడ్డ మొటిమలను నయం చేస్తుందని నిరూపణ అయింది. ఆపిల్ గుజ్జులో విటమిన్స్ మరియు అవసరమైన ఫైబర్ ఉండుట వలన బ్లైండ్ మొటిమల చికిత్సలో సహాయపడుతుంది. ఆపిల్ గుజ్జులో ఒక చుక్క టీ ట్రీ ఆయిల్, ఒక స్పూన్ తేనే కలిపి పేస్ట్ గా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న ప్రాంతంలో రాసి 15 నిముషాలు అయ్యాక శుభ్రం చేసుకోవాలి. ఇది ఇంటి వద్ద బ్లైండ్ మొటిమలను వదిలించుకోవడానికి సమర్ధవంతంగా పనిచేస్తుంది.

5. టూత్ పేస్టు

5. టూత్ పేస్టు

కొంత మంది టూత్ పేస్టు మొటిమల చికిత్సలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుందని అంటారు. అయితే, బ్లైండ్ మొటిమల కోసం టూత్ పేస్టు ఉపయోగిస్తే సున్నితమైన చర్మం, చికాకు, దురద మరియు చర్మంపై బ్రేక్ ఔట్స్ కి దారితీయవచ్చు. అందువల్ల టూట్ పేస్ట్ లో లవంగం నూనె లేదా పుదీనా పేస్టును కలిపి ఉపయోగించాలి. టూత్ పేస్టును కొంచెం తీసుకోని బ్లైండ్ మొటిమ ఉన్న ప్రాంతంలో రాసి రాత్రి సమయం అంతా ఆలా వదిలేసి మరుసటి ఉదయం శుభ్రం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేయాలి.

6. నిమ్మరసం

6. నిమ్మరసం

నిమ్మరసంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన చర్మం కింద ఉండే మొటిమలను నిరోధించడానికి సహాయం మరియు అధిక నూనె ఉత్పత్తిని నియంత్రిస్తుంది. నిమ్మను ఉపయోగిస్తే ముఖం మీద బ్రేక్ ఔట్స్ నిరోధించడానికి మరియు బాక్టీరియా యొక్క ఉనికిని నిరోధించడానికి సహాయపడుతుంది.ముఖం మీద నిమ్మరసం రాసి 15 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే అత్యుత్తమ ఫలితాలను పొందవచ్చు.

7. ఎప్సోమ్ ఉప్పు

7. ఎప్సోమ్ ఉప్పు

ఎప్సోమ్ ఉప్పు బ్లైండ్ మొటిమల చికిత్సలో సహాయపడే మరొక సమర్థవంతమైన నివారణ మార్గంగా చెప్పవచ్చు. ఇది మోటిమలు వలన వచ్చే మంట మరియు నొప్పిని ఎదుర్కోవటానికి సహాయపడుతుంది,

అరకప్పు వేడి నీటిలో ఒక స్పూన్ ఎప్సోమ్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న ప్రాంతంలో రాసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజులో 2 సార్లు చేస్తే మొటిమలను సులభంగా నివారించవచ్చు.

English summary

Quick Home Remedies To Treat Under-The-Skin Pimples

Pimple, which occurs under the skin, is also called blind pimple because these types of pimples are found under the skin, which produces extra oil on the face and thereby leads to clogged pores.
Desktop Bottom Promotion