For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో స్కిన్ రిఫ్రెష్ చేసే కూల్ కూల్ కుకుంబర్ ఫేస్ మాస్క్..!

By Lekhaka
|

వేసవిలో బాగా ఫేమస్ అయిన వెజిటేబుల్స్ లో ఒకటి కీరదోసకాయ. ఇది శరీరానికి లేదా చర్మానికి విరివిగా ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే కీరదోసకాయలో నీటిశాతం అధికంగా ఉండటం వల్ల శరీరానికి మరియు చర్మానికి పోషణ అందివ్వడంతో పాటు, చల్లగా ఉంచుతుంది. ఈ చౌకైన వెజిటేబుల్లో అద్భుతమైన న్యూట్రీషియన్స్, విటమిన్ సి, విటిమన్ ఎ, కెరోటీన్స్ మొదలగునవి అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి , చర్మానికి వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటారు.

Refreshing Cucumber Face Mask To Use This Summer

కీరదోసకాయను ఎక్కువగా వినియోగిస్తూ అలాగే చర్మానికి ఉపయోగిస్తు వేసవి తాపం నుండి ఆహ్లాదం పొందుతుంటారు. ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు, సమ్మర్ స్కిన్ కేర్ ప్రొడక్ట్, మరి అటువంటి కుకుంబర్ ను సమ్మర్లో చర్మానికి ఏవిధంగా ఉపయోగించాలి. ఎలా ఉపయోగిస్తే వేసవిలో చర్మం కూల్ గా, కాంతివంతంగా కనబడుతుందో తెలుసుకుందాం..
కీరోదసకాయ, పెరుగు

కీరోదసకాయ, పెరుగు

కీరదోసకాయ మరియు పెరుగును రెండింటిని ఉపయోగించడం వల్ల డ్రై స్కిన్ ను నివారించుకోవచ్చు. కీరదోసకాయను మెత్తగా పేస్ట్ చేసి, అందుో కొద్దిగా పెరుగు చేర్చి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ముఖానికి ప్యాక్ లా వేసుకుని, మసాజ్ చేయాలి. కొద్దిసేటితర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ముఖంలో మచ్చలను మాయం చేసి, చర్మం స్మూత్ గా మార్చుతుంది. చర్మానికి తగిన హైడ్రేషన్ ను అందిస్తుంది.

కీరదోసకాయ మరియు అలోవెర మాస్క్

కీరదోసకాయ మరియు అలోవెర మాస్క్

కీరోదోసకాయ, అలోవెర మాస్క్ యాంటీ ఏజింగ్ స్కిన్ మాస్క్ లా పనిచేస్తుంది. ఇది చర్మంను స్మూత్ గా మార్చుతుంది. ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది. ఒక కీరదోసకాయ, ముక్కలుగా చేసి స్మూత్ పేస్ట్ చేయాలి. తర్వాత అందులో ఒక టీస్పూన్ నిమ్మరసం మిక్స్ చేయాలి. వీటిని బాగా మిక్స్ చేసి, ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

కీరోదసకాయ మరియు ఓట్స్

కీరోదసకాయ మరియు ఓట్స్

చర్మంలో డెడ్ స్కిన్ సెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు , కీరదోసకాయ మరియు ఓట్స్ మాస్క్ గ్రేట్ గా సహాయపడుతుంది. కీరదోసకాయను తీసుకుని, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఓట్స్ చేర్చి పేస్ట్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా పసుపు చేర్చి, అన్ని పదార్తాలను మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

కీరోదసకాయ మరియు ఆరెంజ్ జ్యూస్ మాస్క్

కీరోదసకాయ మరియు ఆరెంజ్ జ్యూస్ మాస్క్

ఈ రెండింటి కాంబినేషన్ లో చర్మంను హైడ్రేట్ గా మార్చుతుంది. కీరదోసకాయ పేస్ట్ లో కొద్దిగా ఆరెంజ్ జ్యూస్ మిక్స్ చేసి , చిక్కగా పేస్ట్ చేసి, ముఖానికి అప్లై చేసి, కొద్దిసేపటి తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. కీరదోసకాయ, ఆరెంజ్ మాస్క్ కొల్లాజెన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది చర్మానికి కావల్సిన హైడ్రేషన్ ను అందిస్తుంది.

కీరదోసకాయ, బేసన్ ప్యాక్

కీరదోసకాయ, బేసన్ ప్యాక్

అరకప్పు కీరదోసకాయను తీసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి. అందులో కొద్దిగా శెనగపిండి, నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఈ మాస్క్ ను కొద్దిసేపు ఉండనిచ్చి, అరగంట తర్వాత డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. బేసన్ ప్యాక్ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

 కీరదోసకాయ, టమోటో ప్యాక్

కీరదోసకాయ, టమోటో ప్యాక్

నేచురల్ స్కిన్ లైటనింగ్ ట్రీట్మెంట్ లో కీరదోస, టమోటో ప్యాక్ ఒకటి. అరకప్పు కీరదోస ముక్కలు తీసుకుని టమోటోతో కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం ,మెడకు ప్యాక్ వేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

కీరదోసకాయ, ఆలివ్ ఆయిల్

కీరదోసకాయ, ఆలివ్ ఆయిల్

కీరదోసకాయ, ఆలివ్ ఆయిల్ మాస్క్ ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. డ్రై మరియు ఇచ్చీ స్కిన్ నివారిస్తుంది. ఆలివ్ ఆయిల్ చర్మంలో దురద తగ్గిస్తుంది. స్కిన్ హైడ్రేషన్ మెరుగుపరుస్తుంది. కీరదోసకాయ తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి, అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

కీరదోసకాయ, వాటర్ మెలోన్ మాస్క్

కీరదోసకాయ, వాటర్ మెలోన్ మాస్క్

కీరదోసకాయ, వాటర్ మెలోన్ మాస్క్ ఎఫెక్టివ్ కొల్లాజెన్ మాస్. ఇది గ్లోయింగ్ స్కిన్ ను అందిస్తుంది. ఇది సన్ టాన్ నివారిస్తుంది. సమ్మర్లో స్కిన్ ప్రొటెక్ట్ చేస్తుంది. కీరదోసకాయను తీసుకుని అందులోనే కొద్దిగా వాటర్ మెలోన్ కూడా వేసి, రెండూ మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేసి 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

కీరదోసకాయ, సాండిల్ ఉడ్ ఫేస్ మాస్క్

కీరదోసకాయ, సాండిల్ ఉడ్ ఫేస్ మాస్క్

కీరదోసకాయ, సాండిల్ ఉడ్ ఫేస్ మాస్క్ సన్ బర్న్ నివారిస్తుంది. కొద్దిగా కీరదోసకాయ తీసుకుని, సాండిల్ ఉండ్ సౌడ్ మిక్స్ చేసి కొద్దిగా పెరుగు , నిమ్మరసం చేర్చి పేస్ట్ చేయాలి. ఈ మాస్క్ ను ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

కీరదోసకాయ, రోజ్ వాటర్

కీరదోసకాయ, రోజ్ వాటర్

అరకప్పు కీరదోసకాయ, పేస్ట్ చేసి, అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ముఖం మెడకు ప్యాక్ వేసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. .ఈ ఫేస్ మాస్క్ సమ్మర్లో డల్ అండ్ డ్రై స్కిన్ ను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. ఉదయం పూట ఈ మిశ్రమాన్ని పెట్టుకుంటే రోజంతా చర్మాన్ని కాపాడుతుంది.

Read more about: skin care cucumber face mask summer
English summary

Refreshing Cucumber Face Mask To Use This Summer

Cucumber is also used in several hydrating, herbal or summer skin care products, thanks to its skin benefiting properties. Well, if you are wondering about how to include cucumber in your summer skin care routine, here are some easy face masks to try at home.
Desktop Bottom Promotion