సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించే ముందు ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి!

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

మనందరి నమ్మకం ప్రకారం, ప్రతిరోజూ సన్స్క్రీన్ లోషన్ను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు-

ఎ) చర్మం కఠినమైన UV కిరణాల నుండి సూర్యుని నుండి రక్షిస్తుంది.

బి) ఇది చర్మం టాన్ అవకుండా కాపాడుతుంది.

సి) సన్స్క్రీన్ చర్మం కోసం మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.

డి) మీరు ముందుగా అప్లై చేసుకోవం వలన ఈత కొలనులో క్లోరినేటెడ్ నీటి నుండి మీ చర్మాన్ని రక్షిస్తుంది.

స) సన్స్క్రీన్ ముఖం మీద అలాగే సూర్యుడికి గురయ్యే శరీర భాగాలపై కూడా వర్తించవచ్చు.

డేంజర్ : సన్ స్క్రీన్ లోషన్ వాడితే స్పెర్మ్ క్వాలిటీ తగ్గుతుందా...?!

సన్స్క్రీన్ లోషన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్

సన్స్క్రీన్ లోషన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్

సన్స్క్రీన్ లోషన్ గురించి పై అంచనాలపై ఆధారపడి, పురుషులు మరియు మహిళలు ఇద్దరూ ఏడాది పొడవునా వారి చర్మానికి అప్లై చేస్తారు. అయితే, సన్స్క్రీన్ లోషన్ యొక్క ఈ ప్రయోజనాలకు విరుద్ధంగా, సన్స్క్రీన్ ఔషదంని ఉపయోగించడం వల్ల చర్మానికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వున్నాయి. కొన్నిసార్లు ప్రతిరోజు సన్స్క్రీన్ లోషన్ని ఉపయోగించడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదు.

సన్ స్క్రీన్ లో వుండేటటువంటి PABA అలెర్జీ కి దారితీస్తుంది

సన్ స్క్రీన్ లో వుండేటటువంటి PABA అలెర్జీ కి దారితీస్తుంది

సన్స్క్రీన్ లోషన్ లో వుండే రసాయనాలలో ఇది ఒకటి, దీనినే PABA అని పిలుస్తారు, ఇది చర్మంపై అలెర్జీ సంఖ్య ను పెంచుతుంది.అధిక కంటెంట్ లో PABA వాడటం వలన చర్మం ఎరుపు అవడం, వాపు,మండటం లేదా దురదకు దారితీస్తుంది. చర్మం సాధారణమైనది కాకపోయినా, జిడ్డు లేదా పొడిగా ఉంటే, సున్నితమైన చర్మంపై అప్లై చేసినప్పుడు PABA ఖచ్చితంగా ప్రతిస్పందిస్తుంది. సో, మీరు ఒక అలెర్జీ స్పందన కి

దారితీసే ఒక సన్స్క్రీన్ ఔషదం ని అప్లై చేసినట్లయితే, అప్పుడు దానిలోని PABA కంటెంట్ ఎంత వుందో చెక్ చేయండి.

సన్ స్క్రీన్ లోషన్స్ మొటిమ మరియు మచ్చల మీద రియాక్ట్ అవుతాయి

సన్ స్క్రీన్ లోషన్స్ మొటిమ మరియు మచ్చల మీద రియాక్ట్ అవుతాయి

సన్స్క్రీన్ లోషన్లు మొటిమలు మరియు మచ్చల మీద ప్రభావాన్ని చూపుతాయి. ఇది మీ మొటిమలు మరియు మచ్చల మీద తీవ్రతను పెంచి ఎరుపు లేదా చికాకు ను కలిగించవచ్చు. దీనికి ఒకే ఒక పరిహారం నాన్-కామేడోజినిక్ మరియు నాన్-ఆయిలీ సన్స్క్రీన్ లను మాత్రమే ఉపయోగించాలి. అలాగే, సౌందర్య నిపుణులతో సంప్రదించి మీ చర్మ అవసరాలను తీర్చగల సన్స్క్రీన్ లోషన్ల కోసం చూడండి.

ముఖం మరియు శరీర సన్స్క్రీన్ లోషన్ మధ్య తేడా

ముఖం మరియు శరీర సన్స్క్రీన్ లోషన్ మధ్య తేడా

మీరు మీ ముఖానికి అప్లై చేసే సన్స్క్రీన్ లోషన్ ని మిగిలిన శరీర భాగాలకు వాడకూడదు. బ్యూటీ స్టోర్స్ లో, వివిధ భాగాలకు శరీర ప్రత్యేకమైన సన్స్క్రీన్ లోషన్లు అందుబాటులో ఉన్నాయి మరియు మీరు మీ అవసరాలకు అనుగుణంగా ఒక లోషన్ని ఎంచుకొని, ఇచ్చిన సూచనల ఆధారంగా ఉపయోగించాలి. మీ ముఖం యొక్క చర్మం మరియు శరీర చర్మం భిన్నంగా ఉంటుంది మరియు ఒకే సన్స్క్రీన్ ఉపయోగించడం వలన పెథెటిక్ చర్మ సమస్యలకు దారితీస్తుంది.

సన్స్క్రీన్ లోషన్స్ కళ్ళకి చాలా డేంజరస్

సన్స్క్రీన్ లోషన్స్ కళ్ళకి చాలా డేంజరస్

మీరు మీ సన్స్క్రీన్ లోషన్ తో సూపర్ సంతృప్తి చెందినప్పటికీ, అది మీ కళ్ళ కి మాత్రం అప్లై చేయకండి. సన్ స్క్రీన్ చాలా నెమ్మదిగా మరియు జాగ్రత్తగా మీ బుగ్గలు, గడ్డం మరియు ముక్కు మీద మాత్రమే ఉపయోగించండి. ఒకవేళ సన్స్క్రీన్ లోషన్ మీ కళ్ళలోకి ప్రవేశిస్తే, వెంటనే మీకు వైద్య సహాయం అవసరం కావచ్చు. అందువలన, ముఖం మీద సన్స్క్రీన్ను అప్లై చేయడానికి కొంత సమయాన్ని కేటాయించండి మరియు అంతేకాని పనిలో పనిగా మొత్తం రాసుకోకండి.

UVB vs UVA రేస్

UVB vs UVA రేస్

సాధారణ సన్స్క్రీన్ లలో అబోబెన్జోన్, ఆక్సిబెన్జోన్, డియోక్సిబెన్జోన్ మరియు ఆక్టోక్రిలీన్ లు సూర్యుని యొక్క UVB కిరణాల మీద ప్రభావితం చేస్తాయి.అయినప్పటికీ, సూర్యుని యొక్క UVA కిరణాల మీద అవి అసమర్థంగా ఉంటాయి. పోల్చితే, సూర్యుని యొక్క UVA కిరణాలు చర్మానికి మరింత ప్రమాదకరం. అందువల్ల, సన్స్క్రీన్ తో మీ చర్మం మీద ఉన్నప్పటికీ, తరచూ దానివలన ఏమి ప్రయోజనాలు లేవు.

English summary

Effects Of Sunscreen Lotion | Demerits Of Sunscreen Lotion | Unknown Side Effects Of Sunscreen Lotion

Learn these side effects of sunscreen lotion before you buy one.
Subscribe Newsletter