మెడపై ముడతలు రాకుండా నివారించే చిట్కాలు

Posted By:
Subscribe to Boldsky

స్కిన్ ఆరోగ్యంగా ఉండాలంటే చర్మంలో కొలాజెన్ ఉత్పత్తి చాలా అవసరం. చర్మంలో ఉత్పత్తి అయ్యే కొల్లాజెన్ స్కిన్ ఎలాసిటిని పెంచుతుంది. చర్మంలో కొలాజెన్ ఉత్పత్తి సరిగా లేనప్పుడు చర్మంలో సన్నని చారలు, ముడుతలను మొదలవుతాయి. ఇవి ముఖం, మెడ నుండి ప్రారంభమై, నిధానంగా చేతులకు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాప్తి చెందుతుంది.

ముఖంలో చారలు, ముడుతలను నివారించుకోవడానికి కొంత మంది ఫేషియల్స్ చేసుకుంటారు. అయితే ముఖం క్రింద మరో అందమైన మెడ భాగాన్ని వదిలేస్తుంటారు. మెడకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మెడ మీద చర్మం ముఖ చర్మం కంటే మందంగా కనబడుతుంది. దాంతో మెడ మీద చారలు, ముడతలు ఎత్తి కనబడుతుంటాయి. యూవి కిరణాలు మెడ మీద పడటంతో మరింత ఎక్కువ కనబడుతుంటాయి. ఇంకా జెనటిక్ సమస్యలు, స్ట్రెస్, మరియు ఇతర రీజన్స్ వల్ల కూడా మెడ మీద ముడతలు ఇబ్బంది కలిగిస్తాయి.

ముఖంలో వలే మెడ మీద ఫైన్ లైన్స్ , ముడుతలను నివారించుకోవడానికి ఫేస్ మాస్క్ లు అంతగా ఉపయోగపడకపోవచ్చు . అయితే కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను ఉపయోగించి ముడుతలను కనబడకుండా కవర్ చేయోచ్చు. మరియు ముడుతలను నివారించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. ముఖంలో, మెడ మీద చారలను, ముడతలను నివారించుకోవడానికి మార్కెట్లోని టాక్సిక్ కెమికల్స్ ఉపయోగించడం వల్ల సమస్య మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి, నేచురల్ పదార్థాలను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. అలోవెరాలో ఉండే మాలిక్ యాసిడ్ మీ స్కిన్ ఎలాసిటిని పెంచుతుంది?

లేదా జింజర్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ముడతలను నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.మెడ మీద ముడుతలను నివారించుకోవడానికి వీటితో పాటు మరికొన్ని నేచురల్ రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

అరటిపండ్లు:

అరటిపండ్లు:

మీరు నమ్ముతారో నమ్మరో, అరటిపండ్లలో ఉండే విటమిన్స్, మినిరల్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ మెడమీద ముడుతలను నివారిస్తుంది. ఇవి ముడుతలను నివారించడం మాత్రమే కాదు, చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

ఉపయోగించే విధానం: బాగా పండిని అరటిపండును స్మూత్ గా పేస్ట్ చేసి మెడకు అప్లై చేయాలి. 150 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ పద్దతిని వారంలో రెండు రోజులు ఫాలో అయితే చాలు మంచి ఫలితం ఉంటుంది.

బాదం ఆయిల్ :

బాదం ఆయిల్ :

బాదంను రెగ్యులర్ గా తినడం లేదా బాదం ఆయిల్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మంలో మ్యాజిక్ జరగుతుంది. ముడుతలను నివారిచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ , ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్ మరియు ఓలియక్ యాసిడ్ స్కిన్ హెల్త్ కు గ్రేట్ మ్యాజిక్ చేస్తుంది. ఉపయోగించే విధానం: కొద్దిగా బాదం ఆయిల్ తీసుకుని, గోరువెచ్చగా చేసి , మెడకు అప్లై చేసి మసాజ్ చేయాలి. సున్నితంగా మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

బొప్పాయి :

బొప్పాయి :

మెడపై ముడుతలను నివారించే మరో ఎఫెక్టివ్ హోం రెమెడీస్ బొప్పాయి. బొప్పాయిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ , పెక్టిన్ చర్మంలో ముడతను నివారించడంలో గ్రేట్ గా సమాయడపుతుంది.

విధానం: బాగా పండిన బొప్పాయిని ముక్కలుగా చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత దీనికి కొద్దిగా తేనె, నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ మిశ్రమాన్ని మెడకు కూడా అప్లై చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ ను వారంలో రెండు మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

అలోవెర జెల్ :

అలోవెర జెల్ :

అలోవెర జెల్లో మాలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది మెడపై ఉండే ముడతలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అలోవెర లీఫ్ ను కట్ చేసి అందులోని జెల్ తీసుకుని, మెడకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. మెడనలుపు కూడా తగ్గుతుంది. దీనికి కొద్దిగా నిమ్మరసం కూడా మిక్స్ చేయాలి. అలాగే దీనికి కొద్దిగా నిమ్మరసం కూడా జోడించాలి. దీన్ని మెడకు అప్లై చేసి మసాజ్ చేయాలి. 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుబ్రం చేసుకోవాలి.

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్లో యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్ ఇ మరియు ఎ లు ఫుష్కలంగా ఉన్నాయి. ఆలివ్ ఆయిల్ చర్మానికి రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది. ఫ్రీరాడికల్స్ కారణంగా చర్మం డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది.ఉపయోగించే విధానం: ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్లో అర టీస్సూన్ ఆర్గానిక్ హనీ మిక్స్ చేయాలి. అందులోనే కొన్ని చుక్కల గ్లిజరిన్ మిక్స్ చేసి , మెడకు అప్లై చేసి మసాజ్ చేయాలి. మెడ క్రింది నుండి పైకి మసాజ్ చేయాలి.

తేనె :

తేనె :

చర్మానికి మేలైన మాయిశ్చరైజర్ తేనె. స్కిన్ లేయర్స్ లోకి అద్భుతంగా షోషింపబడుతుంది, ఇందులో ఉండే విటమిన్ బి మరియు పొటాషియంలు స్కిన్ ఎలాసిటి పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఉపయోగించే విధానం:తేనెను మెడకు అప్లై చేసి మసాజ్ చేయాలి. చర్మం టైట్ గా మారే వరకు అలాగే ఉండే తర్వాత చల్లటి నీటితో శుబ్రం చేసుకోవాలి. దీన్ని రెగ్యులర్ మాయిశ్చరైజర్ గా ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మెంతులు:

మెంతులు:

మెంతులు, మెంతి ఆకులలో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. ఇది ఫైన్ లైన్స్ మరియు ముడతలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఉపయోగించే విధానం:మెంతులను నీటిలో వేసి మరిగించి ఆ నీటితో ఫ్రీక్వెంట్ గా ముఖం శుభ్రం చేస్తుండాలి. దాంతో చర్మం చూడటానికి టైట్ గా మారుతుంది. చర్మం స్మూత్ గా తయారవుతుంది.

గుడ్డు:

గుడ్డు:

బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఎఫెక్టివ్ ప్రొడక్ట్స్ ఎగ్ . ఎందుకంటే ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. స్కిన్ ఎలాసిటిని పెంచుతుంది మరియు కొల్లాజెన్ ఉత్పత్తిని రీస్టోర్ చేస్తుంది. ఉపయోగించే విధానం: ఎగ్ వైట్ తీసుకుని, దాన్ని ముఖం, మెడకు అప్లై చేయాలి. అప్లై చేసిన కొద్దిసేపటికి, మెడ స్ట్రెచ్ అయినట్లు ఫీలవుతారు, ఈ మాస్క్ ముఖానికి వేసుకున్న తర్వాత వైటిష్ గా మారుతుంది. అప్పుడు, చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాను వారంలో రెండు సార్లు ఫాలో అయితే చాలు నెక్ అందంగా కనబడుతుంది.

క్యారెట్:

క్యారెట్:

క్యారెట్ లో బీటా కెరోటీన్ మరియు విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. ఇది స్కిన్ రీజనరేషన్ ను ప్రోత్సహిస్తుంది, కొల్లాజెన్ ప్రొడక్షన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఉపయోగించే విధానం: క్యారెట్ జ్యూస్ చేసి, ఆ రసాన్ని ముఖానికి అప్లై చేయాలి. ప్రతి రోజూ అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

నిమ్మరసం :

నిమ్మరసం :

మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఇది మెడ మీద ముడుతలను నివారిస్తుంది. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది. ఏజింగ్ లక్షణాలను పోగొడుతుంది. నిమ్మరసంలో ఉండే లక్షణాలు యాస్ట్రిజెంట్ గా పనిచేస్తుంది. ముడుతలను, మచ్చలను నివారిస్తుంది. మెడకు రెండు మూడు చెంచాల నిమ్మరసం అప్లై చేసి 20 నిముషాల తర్వాత మెడను చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

Simple Home Remedies To Treat Neck Wrinkles

Taking care of your skin can help to prevent wrinkles on the neck and also keep it hydrated and moisturised for a longer period of time. Check out some of the effective home remedies that could help you treat neck wrinkles.
Story first published: Tuesday, March 7, 2017, 12:12 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter