స్కిన్ బ్లీచింగ్ అనగానేమి? అందులో రకాలేంటి? ఎలా ఉపయోగించాలి?

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

స్కిన్ బ్లీచింగ్ అనేది ఒక పార్లర్ వంటిది (లేదా) గృహ-ఆధారిత చికిత్సగా చెప్పవచ్చు, ఇది ముఖంపై వెంట్రుకలతో పాటు, అన్ని రకాల చర్మ మచ్చలు, మార్కుల వంటివి లేకుండా మీ చర్మాన్ని తక్షణం మెరిసేలా చేస్తుంది.

ఇంట్లోనే ఎఫెక్టివ్ అండ్ నేచురల్ స్కిన్ బ్లీచింగ్ టిప్స్

స్కిన్ బ్లీచింగ్ అనేది చర్మాన్ని తెల్లబరచడటం (లేదా) చర్మపు మెరుపును పెంచే ప్రక్రియ అని కూడా పిలుస్తారు, దీని లక్ష్యం కూడా చర్మం కాంతివంతమైన రంగును పొందడం, దీని వలన అది చర్మంలో వచ్చిన మార్పును బయటపెట్టేదిగా కూడా ఉండవచ్చు.

స్కిన్ బ్లీచింగ్ మరియు రకాలు :

ఈరోజు, మీరు మీపై ఈ పనిని ప్రారంభించడానికి ముందు, మీరు చర్మంతో సంబంధం ఉన్న అన్ని వాస్తవాలను పరిశీలించాలి.

కాంతివంతమైన చర్మానికి నేచురల్ స్కిన్ బ్లీచ్...

1. స్కిన్ బ్లీచింగ్ను ఎలా చేయాలి?

1. స్కిన్ బ్లీచింగ్ను ఎలా చేయాలి?

స్కిన్ బ్లీచింగ్ను చేయటానికి రెండు మార్గాలున్నాయి - 1) స్కిన్ బ్లీచింగ్ క్రీమ్ తో 2) సహజ సిద్ధమైన ఇంట్లో లేదా పార్లర్ వద్ద స్కిన్ బ్లీచింగ్ను చేయడానికి, మీరు స్కిన్ బ్లీచింగ్ క్రీమ్ను ఉపయోగించాలి. స్కిన్ బ్లీచింగ్ క్రీమ్ కిట్లో - స్కిన్ బ్లీచింగ్ క్రీమ్ మరియు ప్రభావవంతమైన పౌడర్ను కలిగి ఉంటుంది, మీ చర్మంపై వాటిని అప్లై చేసే ముందు ఆ రెండు మిశ్రమాలను బాగా కలపాలి.

చర్మాన్ని తెల్లబరిచే (స్కిన్ బ్లీచింగ్) క్రీమ్ యొక్క ఫలితాలు తక్షణమే మరియు వేగవంతంగా ఉంటాయి. మీరు మీ చర్మాన్ని తెల్లబరిచేందుకు సహజమైన బ్లీచింగ్ ప్రక్రియను గాని అప్లై చేస్తే ఫలితం కోసం కాస్త ఎక్కువ సమయం పడుతుంది. అయినప్పటికీ, ఈ పద్ధతి చర్మం పై తక్కువ ప్రతిచర్యల ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

2. స్కిన్ బ్లీచింగ్ క్రీమ్ ఎలా పని చేస్తుంది?

2. స్కిన్ బ్లీచింగ్ క్రీమ్ ఎలా పని చేస్తుంది?

స్కిన్ బ్లీచింగ్ క్రీమ్లు "హైడ్రోక్వినాన్" అని పిలిచే ఒక రకమైన పదార్ధం వాటిలో ఉండటం వలన అవి బాగా పని చేస్తాయి. స్కిన్ బ్లీచింగ్ క్రీములలో హైడ్రోక్వినాన్ యొక్క భాగం 2%-5% మధ్యలో మారుతూ ఉంటుంది. హైడ్రోక్వినాన్ అనేది మెలనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది మరియు మెలనిన్ను తేలికగా కనిపించేలా చేస్తుంది.

3. స్కిన్ బ్లీచింగ్ క్రీమ్ ఎలా ఉపయోగించాలి?

3. స్కిన్ బ్లీచింగ్ క్రీమ్ ఎలా ఉపయోగించాలి?

స్కిన్ బ్లీచింగ్ క్రీమ్ సెట్ లో, ఒక క్రీమ్ మరియు పౌడర్ కలిగి ఉన్న రెండు ప్యాక్ లో వస్తాయి. కొన్ని ప్యాక్ లో చిన్న గరిటెలాంటివి కూడా కలిగి ఉన్నాయి.

మొదట మీ చర్మం కోసం ప్యాక్ ను తయారు చేయడానికి అందులో ఇవ్వబడిన క్రీమ్ మరియు పౌడర్ ను కలిపేందుకు చిన్న గరిటెను ఉపయోగించాలి.

గరిష్టంగా మీ ముఖం మీద ఈ ప్యాక్ ను అప్లై చెయ్యడానికి చిన్న గరిటేను వాడండి. మీ నోరు, కళ్ళు చుట్టూ ఈ బ్లీచింగ్ క్రీమ్ను అప్లై చెయ్యవద్దు.

బ్లీచ్ క్రీమ్ను మీ ముఖానికి లేపనంగా పూసిన తర్వాత, నల్లని చర్మం కలవారు సుమారుగా 10 నుండి 15 నిమిషాల (ముఖంపై నల్లని ఛాయతో ఉన్నవారు) సమయం వరకూ వేచి ఉండండి.

మీ ముఖం మరియు చర్మం నుండి బ్లీచింగ్ క్రీమ్ను తుడవడం ఒక టిష్యూ పేపర్ ని ఉపయోగించండి. అప్పుడు, మీ ముఖాన్ని శుభ్రంగా కడగటానికి ఒక సున్నితమైన క్లీనర్ను ఉపయోగించండి.

4. సహజంగా మీ చర్మాన్ని ఎలా బ్లీచ్ చేస్తారు?

4. సహజంగా మీ చర్మాన్ని ఎలా బ్లీచ్ చేస్తారు?

మీరు సహజంగా మీ చర్మాన్ని బ్లీచింగ్ చేస్తుంటే, మీరు క్రింది పద్ధతులను ప్రయత్నించవచ్చు:

 • నిమ్మకాయ,
 • బంగాళాదుంప,
 • తేనె,
 • పాలు,
 • గంధపు పొడి,
 • పిండి,
 • ఆరెంజ్,
 • పెరుగు,
 • శనగ,
 • లికోరైస్ రసం
 • మల్బరీ పళ్లు
5. స్కిన్ బ్లీచింగ్ గురించి గమనించవలసిన ముఖ్యమైన పాయింట్లు :

5. స్కిన్ బ్లీచింగ్ గురించి గమనించవలసిన ముఖ్యమైన పాయింట్లు :

స్కిన్ బ్లీచింగ్ - క్రీమ్ కంటే, సహజమైన స్కిన్ బ్లీచింగ్ను ఎల్లప్పుడూ ఉపయోగించడానికి ఎక్కువ మద్దతు ఇవ్వబడుతుంది.

స్కిన్ బ్లీచింగ్ - క్రీమ్ను ఉపయోగించడానికి ముందుగా, మీ చర్మాన్ని ప్యాచ్ టెస్ట్ కోసం వెళ్ళినప్పుడు మీకు ఎటువంటి ప్రతిచర్యగాని కలగకపోతే అప్పుడు ఆ క్రీమ్ ను ఉపయోగించడం కోసం కొనసాగించండి.

సహజమైన స్కిన్-బ్లీచింగ్ పద్ధతులు చర్మంపై ఫలితాలను చూపించడానికి సమయం పడుతుంది కానీ చర్మం యొక్క ప్రతిచర్యలు తక్కువగా ఉంటాయి.

ఒక క్రీమ్ ఉపయోగించి స్కిన్ బ్లీచింగ్ చేసిన తరువాత, మీ చర్మంను రెండు గంటల సమయం వరకూ సూర్యుకాంతిలో బహిర్గతం చేయవద్దు. అందువలన, స్కిన్ బ్లీచింగ్ ప్రక్రియను సాయంత్రం లేదా నిద్రవేళలో అప్లై చేయడం అనేది సిఫారసు చేయబడుతుంది.

మీరు స్కిన్ బ్లీచింగ్ క్రీమ్ను ఉపయోగించడం కోసం వెళుతున్నట్లయితే, ఒక నెలలో - ఒకటి కంటే ఎక్కువసార్లు దానిని ఉపయోగించకండి.

ఎందుకంటే ఇది మీ చర్మం మీద ఉన్న జుట్టును తొలగిస్తుంది, ఇది జరగటం తప్పు. ఇది కేవలం చర్మం యొక్క రంగును పోగొట్టడానికి (లేదా) చర్మం మీద నలుపు రంగును తక్కువగా చేసేందిగా ఇది కనిపిస్తుంది.

స్కిన్ బ్లీచ్ క్రీమ్ను మీ శరీరమంతటా ఉపయోగించుకోవచ్చు (ఇది మీకు సరిపోయేలా ఉంటే). ఏమైనప్పటికీ, ఈ క్రీమ్ను శరీర భాగాలైన కళ్ళు, పెదవులు మరియు జననేంద్రియల చుట్టూ గల శరీర భాగాల వద్ద వీటిని ఉపయోగించకుండా నివారించాలి.

స్కిన్ బ్లీచింగ్ క్రీమ్ యొక్క రెండు సాధారణ దుష్ప్రభావాలు ఏంటంటే, నల్లటి వలయాలను మరియు పలుచని ముఖ చర్మంను కలిగి ఉండటం.

క్రీమ్ యొక్క ప్రయోజనాలలో, అది సహజమైన స్కిన్ బ్లీచింగ్ పద్ధతులు కంటే ఆర్థికపరంగా మెరుగైనదిగా ఉంటుంది.

అనేక చర్మపు బ్లీచింగ్ క్రీమ్లు పాదరసంను కలిగి వుంటాయి కాబట్టి వాటిని సుదీర్ఘకాలం ఉపయోగించకూడదని - చర్మవ్యాధి నిపుణులు సూచిస్తున్నారు. మెర్క్యూరీ అనేది ముఖము మరియు శరీరంలోని కణాలలో సంచరించడం ద్వారా విషాన్ని కలిగించవచ్చు, ఇది ప్రతికూల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

సాయంత్రం సమయంలో, బ్లీచ్ క్రీమ్ను ఉపయోగించడం చాలా ఉత్తమం. కాబట్టి మీరు దానిని అప్లై చేసిన తరువాత నిద్రపోవచ్చు మరియు మీ చర్మం తరువాతి 7-8 గంటలకు ప్రత్యక్ష సూర్యుకాంతి నుండి నిరోధించబడుతుంది.

ముదురు రంగు చర్మం కోసం, బ్లీచ్ క్రీమ్ను 10 - 12 నిమిషాల కంటే ఎక్కువగా సేపు వదిలివేయవద్దు. లేదంటే మీ ముఖ జుట్టు చాలా తేలికగా మారుతుంది, మీ ముదురు రంగు చర్మంను కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  English summary

  What Is Skin Bleaching And Its Different Types?

  Skin bleaching is also called skin whitening or skin lightening process, where the aim is to obtain an uniform skin colour, so that it can have an even exposure.
  Story first published: Saturday, October 7, 2017, 8:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more