పాదాలు అందంగా..కాంతివంతంగా కనబడాలంటే రోజూ ఇలా చేయండి!

By: Mallikarjuna
Subscribe to Boldsky

చేతులు అందంగా కనిపించడం కోసం రోజూ రాత్రి నిద్రించడానికి ముందు నైట్ క్రీములను అప్లై చేస్తుంటాము. మరి పాదాల సంగతేంటి ?

రోజువారి పనులతో బిజీగా ఉండటం వల్ల పాదాల మీద శ్రద్ద పెట్టము, దానికి తోడు కొంత మంది రాత్రుల్లో పాదాలను నీటిత కూడా కడగరు, ఫలితం పాదలు అందవిహీనంగా మారుతాయి. పాదాలు వాసన వస్తాయి,పాదాల నొప్పులు, పాదాల మీద తెల్లటి, నల్లటి ప్యాచ్ లు, మరిన్ని సమస్యలుంటాయి. అందువల్ల పాదాల పట్ల జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

వర్షాకాలంలో పాదాల సౌందర్యానికి సింపుల్ టిప్స్

పాదాలు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే, కొన్ని సులభ చిట్కాలను ఫాలో అవ్వాలి. ఈ పాదాలు ఎక్కువ సమయం అందంగా కనిపించాలంటే చాలా సింపుల్ టిప్స్ ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ప్రతి పదిహేను రోజులకొక్కసారి ఈ చిట్కాలను ఫాలో అయితే చాలు, అందమైన పాదాలను పొందవచ్చు.

1. పాదాలు పొడిగా ఉంచాలి:

1. పాదాలు పొడిగా ఉంచాలి:

కాళ్ళు కనబడకుండా షులు ధరించినప్పుడు పాదాలలో కూడా చెమట పడుతుంది చెమటపడుతుంది. పాదాలను పొడిగా మార్చుకోవాలి. షులను తీసి, అప్పుడప్పుడు పాదాలకు గాలి తోలే ఉంచాలి. చెమటను పొడిబట్టతో తుడవాలి.

2. వట్టి కాళ్ళతో నడవకూడదు:

2. వట్టి కాళ్ళతో నడవకూడదు:

సహజంగ కొంతమంది చెప్పులు వేసుకుకోకుండా నడుస్తుంటారు. ఇంట్లో ఫ్లోర్ మీద క్లీన్ గా ఉంటుంది కాబట్టి, చెప్పులు లేకుండా నడవచ్చు. కానీ బయట వెళ్లేటప్పుడు పాద సంరక్షణకు చెప్పులు చాలా అవసరం.

3. స్ర్కబ్బింగ్ అండ్ క్లీనింగ్ :

3. స్ర్కబ్బింగ్ అండ్ క్లీనింగ్ :

స్నానం చేసే సమయంలో ఒక ఐదు నిముషాలు పాదాల కోసం గడపండి, పాదాలను ఫ్యూమిస్ రాయితో రుద్దడం, లేదా స్ర్కబ్బర్ తో రుద్ది క్లీన్ చేయడం వల్ల పాదాలు, సాప్ట్ గా మరియు అందంగా ఉంటాయి.

చిటికెలో పాదాల సొగసు మీ సొంతం...

4. పెడిక్యుర్:

4. పెడిక్యుర్:

పెడిక్యుర్ గురించి ఎంత మందికి తెలుసు?ప్రొఫిషినల్ పెడిక్యూర్ సెలూన్ల చేయించుకోవడం మరియు పాదాల మసాజ్ వల్ల పాదాల చర్మంమీద కణాలు యాక్టివ్ గా ఉంటాయి. పెడిక్యుర్ లో వివిధ రకాలున్నాయి. పెడిక్యుర్ ఎంపిక చేసుకునేప్పుడు , మీ పాదాల సమస్యలకు సరిపోయేవి ఎంపిక చేసుకోవాలి.

5. పాదాలకు విశ్రాంతి:

5. పాదాలకు విశ్రాంతి:

శరీరంలాగే పాదాలు కూడా అలసిపోతాయి. మెత్తగా, చదునగా ఉండే ఫ్లోర్ మ్యాట్ మీద పాదాలను ఉంచి విశ్రాంతి తీసుకోవాలి. వాకింగ్, లేదా వ్యాయామాల వల్ల కూడా పాద సమస్యలుంటాయి, కాబట్టి, పాదాలకు అప్పుడప్పుడువిశ్రాంతి కలిగించడం మంచిది.

6. కాలి గోళ్ళు షేప్ చేయడం, ట్రిమ్ చేయడం:

6. కాలి గోళ్ళు షేప్ చేయడం, ట్రిమ్ చేయడం:

పాదాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కాలి గోళ్ళు అందంగా షేప్ చేయడం, ట్రిమ్ చేయాలి. గోళ్ళు ఎక్కువగా పెరగకుండా ఎప్పటికప్పుడు కట్ చేయడం వల్లపాదాలు అందంగా కనబడుతాయి.

అల్లం పేస్ట్ తో పాదాల దుర్వాసనకు చెక్!

7. డెర్మటాజిస్ట్ కలవడానికి సిగ్గుపడకండి:

7. డెర్మటాజిస్ట్ కలవడానికి సిగ్గుపడకండి:

పాద సంరక్షణలో భాగంగా, కాళ్ళ పగుళ్ళు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, రంగు మారడం వంటి సమస్యలున్నప్పడు డెర్మటాలజిస్ట్ ను తప్పకుండా కలిసి, చికిత్స తీసుకోవాలి. చిన్నసమస్యలున్నప్పడు ఇంట్లోనే చిట్కాలను ఉపయోగించాలి.

8. పాదాలకు సరిపోయే చప్పల్స్ ను ఎంచుకోవాలి:

8. పాదాలకు సరిపోయే చప్పల్స్ ను ఎంచుకోవాలి:

పాదాల సమస్యలలో ఒకటి మీరు ఎంచుకునే సాండిల్స్, చప్పల్స్. చీప్ గా దొరికే వాటిని వేసుకోవడం వల్ల పాదాల మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి, మీ పాదాలకు సరిపోయే చప్పల్స్ ను ఎంపిక చేసుకోవాలి, మన్నికైన వాటిని ఎంపిక చేసుకుని, పాదాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

9. నెయిల్ పెయింట్:

9. నెయిల్ పెయింట్:

నెయిల్ పాలిష్ ను రోజూ మార్చే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే మన్నికైనవి ఎంపికచేసుకుంటే మంచిది, చౌకైనవి, మన్నికలేని వాటిని వేసుకోవడం వల్ల పాదాల ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. అందువల్ల నెయిల్ పెయింట్ కొనే వారు బ్రాండెడ్ నెయిల్ పెయింట్స్ ఎంపిక చేసుకోవాలి.

10. కాలికి మాయిశ్చరైజర్ :

10. కాలికి మాయిశ్చరైజర్ :

పాదాలకు రోజూ మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. లేదంటా పాదాలు పొడిగా , అందవిహీనంగా కనబడుతాయి.స్నానం చేసిన వెంటనే పాదాలకు మాయిశ్చరైజర్ ను అప్లైచేయాలి. సమయం ఉన్నప్పుడు వంటింటి వస్తువలతో పాలకు మాయిశ్చరైజర్స్ ను అప్లై చేయాలి.

11.కొత్త షు కొన్నప్పుడు:

11.కొత్త షు కొన్నప్పుడు:

పాదాల మీద తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. షు లేదా చెప్పల్స్ తీసుకోవాలనుకున్నప్పుడు, పాదాలకు సరిపోయే వాటిని ఎంపిక చేసుకోవడానికి మద్యహ్నా సమయం మంచిది. రోజంతా చెమటలు పడుతాయి. కానీ, మద్యహ్నా సమయంలో పాదాలు కొద్దిగా వాచి ఉండటం వల్ల మీ పాదాలకు సరిపోయే వాటిని ఎంపిక చేసుకోవచ్చు.

12.కొత్త ఫూట్ కేర్ ప్రొడక్ట్స్ ను కొనాలి:

12.కొత్త ఫూట్ కేర్ ప్రొడక్ట్స్ ను కొనాలి:

పాద సంరక్షణ కోసం ఎప్పుడు పాత వాటిని ఎంపిక చేసుకోకండి , మార్కెట్లో వచ్చే కొత్త వాటిని ఎంపిక చేసుకోవడం మంచిది. వాటిలో ఫ్యూమిస్ స్టోన్, ఫూట్ క్రీమ్, పెడిక్యుర్ సెట్, గ్లిజరిన్ , ఇతర ఫూట్ కేర్ ప్రొడక్ట్స్ ను ఎంపిక చేసుకోవడం మంచిది.

English summary

10+ Everyday Foot care Tips For Happy and Healthy Feet

Check out these everyday footcare tips that are easy to do and render results fast.
Subscribe Newsletter