For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  3 పదార్థాల కలయికతో చేసిన ఈ మాస్క్ తో మీ స్కిన్ టోన్ ని ప్రకాశవంతం చేసుకోండి!

  By Ashwini Pappireddy
  |

  మీ చర్మం రోజు రోజుకి నిస్తేజంగా మరియు అస్పష్టంగా మారుతోందా? మీరు ప్రతిరోజు వాడుతున్న క్రీం వలన మీ చర్మానికి ఎలాంటి నిగారింపు రావట్లేదా? ఎన్ని సార్లు ప్రయత్నించినా ఎలాంటి మృదువైన చర్మాన్ని పొందలేకపోతున్నారా? అలాంటప్పుడు మీరు మీ చర్మం గురించి అదనపు సమయం కేటాయించాల్సి ఉంటుంది మరియు మీరు తిరిగి కాంతివంతమైన చర్మాన్ని పొందడానికి చర్మం రంగుమారడానికి వాడే మాస్క్ ల కన్నా వేరే మార్గం ఏముంది? అవును, మీరు అనుకుంటున్నది సరైనదే.. ఎగ్ మాస్క్!

  ఈ డిఐవై చర్మపు నిగారింపు మాస్క్ చర్మం పొరలలోనికి లోతుగా చొచ్చుకుని, చనిపోయిన చర్మ కణాల నుండి తొలగిస్తుంది, చర్మపు రంద్రాలను శుభ్రంచేసి మరియు చర్మం రంగును మెరుగుపరుస్తుంది.

  ఈ మాస్క్ తయారుచేయడానికి కావాల్సినవి అవోకాడో, నిమ్మ మరియు గుడ్డు. అవోకాడో విటమిన్లు B, E మరియు అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. విటమిన్ B చర్మం యొక్క వృద్ధాప్యం ప్రక్రియను మందగించడంతో పాటు మొటిమలను తగ్గిస్తుంది మరియు విటమిన్ E ను స్వేచ్ఛా రాశులను నిరోధించటానికి సహాయపడుతుంది.

  Skin Brightening Mask | Avocado Mask To Tighten Skin | How To Remove Wrinkles Naturally | DIY Skin-Lightening Mask | Honey To Brighten Skin Tone

  నిమ్మకాయ రసంలో వుండే సిట్రిక్ యాసిడ్ చర్మంలో వున్న మృతకణాలను తొలగించి చర్మంలోని మలినాలను శుభ్రపరుస్తుంది మరియు చర్మంపై వుండే మచ్చలను తగ్గిస్తుంది. ఇంకా ఇది విటమిన్ సి ని అధిక నిష్పత్తి లో కలిగి ఉంటుంది.

  మరోవైపు గుడ్డు, చర్మం యొక్క కొల్లాజెన్ స్థాయిని పెంచే ప్రోటీన్లతో నిండి ఉంటుంది, దీని వలన దెబ్బతిన్న చర్మ కణాలను సరిచేస్తుంది మరియు కొత్త చర్మ కణజాల పునరుత్పాదనను ప్రోత్సహిస్తుంది.

  ఇక్కడ ముడుతలను తొలగించి, మీ చర్మాన్ని మెరిసేలా చేయడానికి ఈ క్రింది విధానాలను అనుసరించండి....

  దశ 1:

  దశ 1:

  1 గుడ్డుని తీసుకొని అందులో పచ్చసొన నుండి తెల్ల సొన ని వేరు చేయండి. తెల్ల సొనని తీసి పక్కన పెట్టుకోండి. దీనిని కొన్ని నిమిషాల పాటు రిఫ్రిజిరేటర్ లో పెట్టి తర్వాత తీసేయండి.

  దశ 2:

  దశ 2:

  ఒక అవోకాడోని తీసుకొని దానిలోని విత్తనాల్ని తొలగించండి. ఇప్పడు ఒక ఫోర్క్ సహాయంతో ఒక మృదువైన పేస్ట్ లా మారేంతవరకు మాష్ చేయండి. మీరు కావాలనుకుంటే బ్లెండర్లో ఉంచి, పల్ప్ లాగా చేసుకోవచ్చు.

  దశ 3:

  దశ 3:

  ఇప్పడు మనం ముందుగా తయారుచేసుకున్న గుడ్డు తెల్ల సొన కి ఈ అవకాడో పేస్ట్ ని కలపండి. తరువాత, దీనికి ఒక టీస్పూన్ నిమ్మ రసం ని కలపండి. ఒక ఫోర్క్ ని ఉపయోగించి, ఈ అన్ని పదార్ధాలు బాగా కలిసేంతవరకు బాగా కలపాలి.

  దశ 4:

  దశ 4:

  మీరు ఈ ప్యాక్ కి తేనెను కూడా కలపవచ్చు. తేనె అమైనో ఆమ్లం యొక్క గొప్ప మూలం, ఇది చర్మాన్ని హైడ్రేట్లు చేస్తుంది మరియు దీనిలో వుండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎలాంటి బ్యాక్టీరియా చర్మానికి దరి చేరకుండా కాపాడుతాయి.

  దశ 5:

  దశ 5:

  మీ చర్మం లో వుండే మలినాలను తొలగించడానికి మీ చర్మాన్ని మంచి నీటితో శుభ్రపరచండి. ఒకవేళ మీరు ఏదయినా మేకప్ క్రీమ్స్ వుపయోగించి ఉంటే తేలికపాటి ప్రక్షాళన ఉపయోగించండి. పొడిగా ఉంచుకోండి.

  దశ 6:

  దశ 6:

  ఇప్పుడు మీ ముఖం కొద్దిగా తడిగా ఉన్నప్పుడు, ఈ మాస్క్ ని మీ ముఖం మరియు మెడకు సమానంగా రాయండి, కానీ మీ కళ్ళ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని మాత్రం వదిలివేయండి. దానిని 20 నిముషాల పాటు ఆరనివ్వండి.

  దశ 7:

  దశ 7:

  మీరు వేసుకున్న మాస్క్ కొంచం పొడిగా మారినప్పుడు, మీ ముఖం మీద కొంత నీటిని చల్లండి. ఈ మాస్క్ కొంచం ఆరిన తర్వాత మెల్లగా వృత్తాకారంగా స్కర్బ్ చేయండి మరియు సాదా నీటితో కడిగేయండి.

  దశ 8:

  దశ 8:

  చమురు లేనటువంటి మాయిశ్చరైజర్తో మీ చర్మాన్ని మసాజ్ చేయండి. ఒక నిమిషం లేదా రెండు నిముషాల పాటు మసాజ్ చేయడం వలన,ఇది రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది మరియు మీ చర్మానికి ఒక రోజీ గ్లో ని ఇస్తుంది!

  హ్యాండీ చిట్కాలు

  హ్యాండీ చిట్కాలు

  ఈ మిశ్రమాన్ని మీరు బయట ఉంచినప్పుడు వెంటనే రంగు మారుతుంది. కాబట్టి, మీరు ఏదైనా వస్తువు లో గాలి చేరని కంటైనర్లో నిల్వ చేసి రిఫ్రిజిరేటర్లో ఉంచండి.

  మీరు చాలా పొడి చర్మాన్ని కలిగి ఉంటే, నిమ్మకాయ రసాన్ని తగ్గించి మరియు తేనె ను పెంచండి.

  ముగింపు ఫలితం!

  ముగింపు ఫలితం!

  ఈ తేనె మాస్క్ మీ చర్మం టోన్ను ప్రకాశవంతం చేస్తుంది, ఇది సూపర్- స్మూత్ గా కనిపించేలా చేస్తుంది. గమనించదగ్గ ఫలితాల కోసం దీనిని వారానికి రెండుసార్లు రాసుకోండి.

  English summary

  Skin Brightening Mask | Avocado Mask To Tighten Skin | How To Remove Wrinkles Naturally | DIY Skin-Lightening Mask | Honey To Brighten Skin Tone

  Here is a step-by-step guide on how to remove wrinkles and lighten your skin tone naturally.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more