వయసైన ఛాయలు కనుమరుగయ్యేలా చేసే 9 ఫ్రూట్స్

By Sindhu
Subscribe to Boldsky

వయసు పెరగడాన్ని ఎవరూ ఆపలేరు. అది సహజంగా జరిగే ప్రక్రియ. అయితే వయసు ఛాయలు కనిపించకుండా.. మాత్రం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. కొన్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల చర్మాన్ని యాంటీ ఏజింగ్ నుంచి కాపాడుకోవచ్చు. మనం తీసుకునే ఆహారం అనేక మార్పులు తీసుకొస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల చర్మంలో లాస్టిసిటీ మెరుగుపరచవచ్చు. దీనివల్ల చర్మంపై ముడతలు కనిపించకుండా కాపాడవచ్చు.

యాంటీ ఏజింగ్ లా పనిచేయడానికి కేవలం క్రీములు, బ్యూటీ ప్రొడక్ట్స్ మాత్రమే కాదు ఫుడ్స్ కూడా సహాయపడతాయి. యాంటీ ఏజింగ్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల వయసు మీదపడుతున్న లక్షణాలతో పోరాడవచ్చు.

యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పండ్లు... చర్మ ఆరోగ్యానికి సహాయపడతాయి.

యాంటీ ఏజింగ్ పనిచేసే పండ్లను రోజూ తీసుకోవడం వల్ల చర్మం హైడ్రేట్ గా ఉండి.. ముడతలు, సాగేగుణాన్ని, గీతలను నివారిస్తాయి. కాబట్టి ఏజింగ్ ప్రాసెస్ కి దూరంగా ఉంచే ఈ ఆహారాలు, ఫ్రూట్స్ ని మీ డైట్ చేర్చుకోండి. యాంటీ ఏజింగ్ లా పనిచేసే ఫ్రూట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కివీ

కివీ

యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉన్న కివీ ఫ్రూట్ తీసుకోవడం వల్ల ముఖంపై ముడతలు, గీతలు ఏర్పడకుండా.. అరికట్టవచ్చు. కివీలో విటమిన్ సి, ఈ ఎక్కువగా ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. చర్మానికి హాని కలిగించే రేడియేషన్స్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది.

దానిమ్మ

దానిమ్మ

దానిమ్మలో ఉండే విటమిన్స్, మినరల్స్ చర్మ ఆరోగ్యానికి సహాయపడతాయి. ఇది కణాలకు పోషకాలు అందిస్తుంది. చర్మాన్ని టైట్ గా మార్చి.. అందంగా, గ్లోయింగ్ గా ఉండేలా చేస్తుంది.

వయస్సు మీద పడకుండా.. యవ్వనంగా కనిపించేలా..!

పుచ్చకాయ

పుచ్చకాయ

పుచ్చకాయ చర్మానికి న్యూట్రీషన్ అందించి.. ముడతలు నివారించడానికి సహాయపడే.. పోషకాలు అందిస్తుంది. ఇందులోని విత్తనాలు కూడా పండు ఎంత ముఖ్యమో అవి కూడా అంతే ఇంపార్టెంట్. ఇది చర్మానికి ఉపయోగపడే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అందిస్తుంది.

అవకాడో

అవకాడో

చర్మానికి సహాయపడే.. విటమిన్ ఈ, బితో పాటు.. అనేక పోషకాలను అందిస్తుంది అవకాడో. విటమిన్ ఈ చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడానికి, ఇందులో ఉండే పొటాషియం చర్మానికి కావాల్సిన వాటర్ బ్యాలెన్స్ చేస్తుంది. ఇందులో ఉండే గ్లూటాథైయాన్.. యాంటీ ఏజింగ్ ప్రాసెస్ ని అరికడుతుంది.

అరటిపండు

అరటిపండు

అరటిపండులో ఉండే విటమిన్ సి, బి6 స్కిన్ ఎలాస్టిసిటీని రెగ్యులేట్ చేస్తుంది. ఇందులో ఉండే మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్స్ హైడ్రేషన్ ను అందించి.. ముడతలు, ఫైన్ లైన్స్ అరికడతాయి.

గ్రేప్స్

గ్రేప్స్

గ్రేప్స్ ఉండే విటమిన్ సి, మాంగనీస్ ఆల్ట్రావయోలెట్ రేడియేషన్స్ తో పోరాడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ నివారించి.. వయసు పెరుగుతున్న లక్షణాలు దరిచేరకుండా చూస్తుంది.

ఆపిల్

ఆపిల్

ఆపిల్ ముడతలను ఎదుర్కోవడంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఆపిల్ ని తిన్న లేదా రాసిన వృద్ధాప్య గుర్తులను తగ్గించటంలో సహాయపడుతుంది.

ఆరెంజ్

ఆరెంజ్

ఆరెంజ్ లో సిట్రిక్ ఆమ్లం ఉండుట వలన ఫ్రీ రాడికల్స్ తగ్గించటానికి మరియు కొల్లాజెన్ ఉత్పత్తిలో ఉద్దీపన కలిగిస్తుంది. దాంతో వయసు పైబడే లక్షణాలను దూరం చేస్తుంది.

అలర్ట్ : మీ అందాన్ని రెట్టింపుచేసే 10 అమేజింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్

బొప్పాయి

బొప్పాయి

బొప్పాయిలో పపైన్ అనే అద్భుతమైన సమ్మేళనం ఉంది. ఈ సమ్మేళనం చనిపోయిన చర్మ కణాలను తొలగించటం మరియు చర్మాన్ని టైట్ గా ఉంచే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Top 9 Fruits That Fight Ageing

    Ageing is an inevitable process. Even though we can't control the process of ageing, it can be postponed by making a wise choice of foods.The foods that we eat makes a lot of difference too. Including lots of superfoods that are loaded with antioxidants improves the skin's elasticity.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more