ఫేషియల్ ట్రీట్మెంట్ తరువాత తప్పనిసరిగా నివారించవల్సిన ముఖ్య విషయాలు

Subscribe to Boldsky

అందమైన ముఖ కాంతిని పొందటానికి మీ చర్మాన్ని చాలా మృదువుగా చేసుకోవడమే ఉత్తమమైన మార్గము. ఎల్లప్పుడూ మార్పులను చోటుచేసుకునే ఈ ప్రపంచానికి, ఆరోగ్యంగా ఉన్న మీ చర్మ కాంతిని ప్రదర్శించడం కోసం నెలవారీగా శ్రమించడమే మీ వీధి.

రకరకాల చర్మాన్ని మరియు వయస్సును కలిగి ఉన్న మహిళలు తరచుగా ఫేషియల్ కోసం వెళ్తుంటారు. ఫేషియల్ అనే సౌందర్య చికిత్స వల్ల అనువైన ప్రభావాలను కలిగి, మీయొక్క చర్మ ఆరోగ్యము పెంపొందించబడుతుంది.

మీ చర్మం నుండి దుమ్ము, ధూళిని తొలగించి, చర్మానికి కావలసిన ప్రకాశాన్ని ఈ చికిత్స ద్వారా అందించబడి, చర్మకాంతిని మరింతగా ప్రకాశింపచేస్తుంది. అయితే, ఈ చికిత్స విధానాన్ని సరైన క్రమంలో అనుసరించకపోతే మీ చర్మానికి మంచి కంటే మరింత హానిని కలుగజేయవచ్చు.

Top Things You Must Avoid After A Facial Treatment

ఈరోజు బోల్డ్ స్కై వద్ద, ఫేషియల్ ట్రీట్మెంట్ తర్వాత మీరు తప్పనిసరిగా కొన్ని చర్యలను నివారించాలి.

లేదంటే ముఖ-విచ్ఛేదనం, ఎర్రగా మారడం, మీ చర్మం అంటువ్యాధులకు గురవడం వంటి కారకాలకు ప్రభావితమయ్యే ప్రమాదముంది.

మీరు ఫేషియల్ చికిత్స ద్వారా అధికమైన ముఖ తేజస్సును పొందటానికి, చర్మ చికిత్సా విధానము సరైన రీతిలో ఉండి, ఈ క్రింది విషయాలను దూరంగా ఉండాలని నిర్ధారించుకోండి.

1. ఎక్సోలియేషన్ :

1. ఎక్సోలియేషన్ :

ఫేషియల్ చికిత్స తరువాత ఎక్సోలియేషన్ అనేది వద్దే వద్దు. ఫేషియల్ చికిత్సను చేయించుకున్న తర్వాత 'స్క్రబ్బింగ్' అనే సాధారణ విధానము - మీ చర్మాన్ని పగిలేటట్లు చేసి మరింత అందవిహీనంగా కనబడటానికి కారణమవుతుంది.

అలా జరగకుండా ఉండేందుకు మీరు ఎక్సోలియేషన్ కు కాస్త దూరంగా ఉండటం మంచిది. కనీసంగా ఫేషియల్ చికిత్స జరిగిన 3 రోజుల వరకు, ఎక్సోలియేషన్కు దూరంగా ఉండండి.

2. ముఖానికి ఆవిరి పట్టడం :

2. ముఖానికి ఆవిరి పట్టడం :

చర్మం యొక్క సున్నితత్వానికి కారణమైన "ముఖానికి ఆవిరి పట్టే" చర్యకు - ఫేషియల్ చికిత్స తరువాత మీరు దూరంగా ఉండవలసిన మరొక విషయం. మీ చర్మాన్ని బీటలువారేగా చేసేటందుకూ దారితీస్తుంది మరియు మీ చర్మము ఫేషియల్ చికిత్స కంటే ముందు ఉన్న స్థితి కన్నా, ఇంకా దారుణమైన స్థితిలో మీ చర్మము కనిపిస్తుంది. ఫేషియల్ చికిత్స జరిగిన కనీసం ఒక వారం వరకూ, ఈ ఆవిరి పట్టే విధానానికి దూరంగా ఉండండి.

3. మేకప్ :

3. మేకప్ :

మేకప్ వస్తువులు, చాలా కఠినమైన రసాయనాలతో నింపబడి తయారు కాబడేవిగా ఉంటాయని అందరికీ తెలిసిన వాస్తవం. ఫేషియల్ చికిత్స తరువాత అటువంటి వస్తువులను వాడటం వల్ల మీ చర్మం ఆరోగ్యానికి తీవ్రమైన నష్టాన్ని కలిగించవచ్చు. అందుకే ఫేషియల్ జరిగినా 72 గంటల వరకు మేకప్ ని ఉపయోగించకుండా ఉండటం చాలా మంచిది.

4. ముఖానికి మర్దనా చేయటం :

4. ముఖానికి మర్దనా చేయటం :

ఫేషియల్ చికిత్స తరువాత, కొంత మంది నిపుణుల ద్వారా ముఖానికి మసాజ్ చేయించుకునే పద్ధతిలో చర్మాన్ని తాకటం వంటి చర్యలకు దూరంగా ఉండటంపై నేటి మహిళలు ప్రత్యేక దృష్టిని పెట్టారు. లేకుంటే ఈ మసాజ్ వల్ల చర్మానికి ఇన్ఫెక్షన్స్ కలగడానికి కారణమయ్యే వికారమైన రూపానికి దారితీస్తుంది. కాబట్టి ఈ చికిత్సా విధానానికి కనీసం వారం రోజులు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి.

5. మొటిమల చికిత్స :

5. మొటిమల చికిత్స :

ఫేషియల్ తర్వాత, మీరు ఈ మొటిమల చికిత్సకు ఆకర్షింపబడవచ్చు. అయితే అలా చేయడం వల్ల మీరు ఒక వికృతమైన రూపమును పొందటానికి ఖచ్చితంగా కారణమవుతుంది మరియు అనేక అంటురోగాలు ఎక్కువ అయ్యేందుకు కూడా దారితీస్తుంది. ఫేషియల్ తర్వాత, మొటిమల చికిత్స అనేది మంచిది కాదని నిర్ధారించుకోండి.

6. సూర్యకాంతిలో :

6. సూర్యకాంతిలో :

ఫేషియల్ తర్వాత మీ చర్మం సున్నితంగా మారుతుంది, అలాగే సూర్య కిరణాలకు నేరుగా మీ ముఖానికి తాకటం వలన మీ చర్మము యొక్క సున్నితత్వం మరింతగా పెరిగి, మీ సున్నితమైన చర్మము దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. సూర్యకాంతిలోకి అడుగు పెట్టడానికి ముందు, మీరు మీ చర్మము గూర్చి తగిన జాగ్రత్తలను పాటించాలి.

7. కేమికల్ పీల్స్ :

7. కేమికల్ పీల్స్ :

ఈ చికిత్స వల్ల చర్మం లోపల నుండి ఆరోగ్యంగా ఉంటాదని చాలా మంది మహిళలు నిర్ధారించుకొన్నారు. అయితే, ఈ చికిత్సను ఫేషియల్ ట్రీట్మెంట్కు తర్వాత అప్లై చేయడం వలన చర్మం పగిలిపోయి, చర్మం దెబ్బతింటుంది. ఫేషియల్ తరువాత ఈ చికిత్స చేయించుకోవడానికి సుమారు రెండు వారాల గడువు వరకూ వేచి ఉండండి.

8. వాక్సింగ్ (లేదా) థ్రెడింగ్ :

8. వాక్సింగ్ (లేదా) థ్రెడింగ్ :

వాక్సింగ్ (లేదా) థ్రెడింగ్ అనేది క్లిష్టమైన సౌందర్య చికిత్సలుగా పరిగణించబడుతుంది. ఫేషియల్ తర్వాత ఈ చికిత్స కోసం వెళ్లినట్లయితే, మీ చర్మము ఎర్రగా మారి, సున్నితత్వముకు దారితీసేదిగా ఉంటుంది. ఈ చికిత్స విధానాన్ని ఫేషియల్ కన్నా ముందు చేయించుకోవటం ఉత్తమం.

9. ఫేషియల్ ప్యాక్స్ - మాస్క్ :

9. ఫేషియల్ ప్యాక్స్ - మాస్క్ :

ఫేషియల్ ట్రీట్మెంట్ తర్వాత ఒక వారం వరకు ఆ చర్మాన్ని అలాగే వదిలేయమని చివరగా చెప్పే ఒక ఉత్తమమైన సలహా ఇది. ఫేషియల్ ప్యాక్స్ - మాస్క్ ను అప్లై చేయడం వల్ల చర్మానికి మంచి సంరక్షణ పద్ధతులలో ఒకటిగా భావిస్తారు. కానీ, ఫేషియల్ తర్వాత దీనిని అప్లై చేయడం వల్ల చర్మం పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతూ - చికాకును కలిగిస్తుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Top Things You Must Avoid After A Facial Treatment

    There are certain things that must be avoided after you get a facial done. Read to know what are the things that you should not do after you get a facial
    Story first published: Monday, November 27, 2017, 14:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more