ఫెయిర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందడానికి పండ్లతొక్కలతో ఫేస్ ప్యాక్..!

Posted By:
Subscribe to Boldsky

ప్రస్తుత సమాజంలో తొందరపాటు తనంతో, సమయాన్ని వృదా చేసుకోకూడదు అనే తత్వంతో మన చర్మ సం రక్షణ కోసం మనం మార్కెట్లో దొరికే అనేక వాటిపై ఆదారపడతాము, సరిగ్గా గమనిస్తే మనం వాడేవాటిల్లో ఎన్నో మనం ఇంట్లో ఉపయోగించుకునే వస్తువులతోనే తయరు చేస్తారు, అలాంటప్పుడు, డబ్బులు ఖర్చుపెట్టి, ఆ రసాయనాల ప్రభావం వల్ల ఇబ్బందులు పడే కన్నా మీరే ఈ "ఫేస్ ప్యాక్స్"ని తయారు చేసుకోవచ్చు.

బిజీ లైఫ్, ఒత్తిడి, చర్మం డ్రైగా మారడం, ఏసీల వల్ల చర్మం చాలా నిర్జీవంగా మారుతుంది. డ్రైగా, లైఫ్ లెస్ గా మారుతుంది. ఇలాంటప్పుడు చర్మానికి నూతనోత్తేజాన్ని అందించే మాస్క్ అప్లై చేసుకోవాలి.

అందంగా ఉండాలని కోరుకుంటారు చాలామంది. ఇందుకోసం మార్కెట్లో లభించే క్రీములను ఉపయోగిస్తుంటారు. ప్రకృతి ప్రసాదించిన పండ్లు తినడం వల్ల ఆర్యోగానికి ఎంతో మేలు. పండ్ల తిన్నాక ఆ తొక్కలను పారేస్తున్నారు. ఆ తొక్కలను ఫేస్ మాస్క్‌గా వేసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

పండ్లు పోషకాలయాలు. వాటిలో అనేక రకాల హెల్త్, బ్యూటీ బెన్ఫిట్స్ ఇమిడి ఉంటాయి. అయితే పండ్ల పోషకాల గురించి అందరికీ తెలిసిన విషయమే. కానీ.. పండ్ల తొక్కలలో కూడా ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, కొన్ని రకాల వ్యాధులను నయం చేసే సత్తా ఉందట. అందుకే.. ఏ పండు తొక్కలో ఏముందో తెలుసుకుందాం. ఏ పండు తొక్క తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు నివారించవచ్చో తెలుసుకుంటే.. ఇకపై తొక్కను నిర్లక్ష్యం చేయకుండా.. ఆరగించేస్తారు. మరి ఆ విశేషాలేంటో చూసేద్దామా..

అరటి తొక్క:

అరటి తొక్క:

అరటి తొక్క అనేక చర్మ సమస్యలను నివారిస్తుంది.కానీ చాలా మందికి ఈ తొక్కలోని ప్రయోజనాల గురించి అంతగా తెలియదు. ఇందులో విటమిన్స్, న్యూట్రీషియన్స్, అద్భుతంగా ఉండటం వల్ల స్కిన్ కాంప్లెక్స్ ను మెరుగుపరుస్తుంది. కాబట్టి, చర్మానికి నేరుగు బనానా తొక్కను అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ కంప్లెక్షన్ మెరుగ్గా ఉంటుంది.

ఆరెంజ్ తొక్క:

ఆరెంజ్ తొక్క:

బరువు తగ్గడానికి నారింజ తొక్క సరైన పరిష్కారం. అలాగే ఇది న్యాచురల్ స్క్రబ్ లా, బ్లీచింగ్ లా చర్మంపై పనిచేస్తుంది. అలాగే పంటి ఆరోగ్యానికి, శ్వాససంబంధిత సమస్యలకు, కాన్స్టిపేషన్ నివారించడానికి, ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడతాయి. అలాగే ఆరంజ్ పీల్స్ క్యాన్సర్ రిస్క్ తగ్గించడంతో పాటు, గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తాయి.

బొప్పాయి తొక్క :

బొప్పాయి తొక్క :

బొప్పాయి ఫేస్ ప్యాక్ ను అలసిన చర్మానికి వేసుకోవడం వల్ల చర్మం రిఫ్రెష్ అవుతుంది. చర్మంలో మలినాలు తొలగి, మంచి గ్లో అందిస్తుంది. చర్మంను బ్రైట్ గా ఫెయిర్ గా మార్చుతుంది.

దానిమ్మ తొక్క

దానిమ్మ తొక్క

చూడగానే తినాలనిపించే దానిమ్మ గింజల్లోనే కాదు.. తొక్కలోనే ఆరోగ్య రహస్యాలున్నాయి. దానిమ్మ తొక్క యాక్నె, పింపుల్స్, రాషెష్, జుట్టు రాలడం, చుండ్రు నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అలాగే హార్ట్ డిసీజ్, గొంతు నొప్పి నివారించడంలో దానిమ్మ తొక్క సహాయపడుతుంది. అలాగే ఎముకల ఆరోగ్యానికి, పళ్ల పరిశుభ్రతకి ఉపయోగపడుతుంది.

పుచ్చకాయ తొక్క :

పుచ్చకాయ తొక్క :

పుచ్చకాయ తొక్కలో ఉండే తెల్లటి భాగంలో అనేక పోషకాలు ఉంటాయి. అవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా.. ఈ పీల్ ని చర్మంపై రుద్దడం వల్ల చర్మంపై పేరుకున్న డర్ట్ తొలగిపోతుంది. అలాగే చర్మం డ్యామేజ్ కి లోనవకుండా.. అరికడుతుంది.

ఆపిల్ తొక్క:

ఆపిల్ తొక్క:

యాపిల్ తినడం వల్ల ఇన్ఫెక్షన్స్ నివారించవచ్చు.. అయితే యాపిల్ తొక్క తినడం వల్ల ఫ్లేవనాయిడ్స్, కెమికల్స్ క్యాన్సర్ సెల్స్ ని నాశనం చేస్తాయి. ఇమ్యునిటీ పెంచుతుంది. యాపిల్ పీల్ లో ఒబేసిటీని తగ్గించే గుణం ఉంటుంది.

లెమన్ తొక్క:

లెమన్ తొక్క:

నిమ్మ తొక్కలో అనేక బ్యూటీ బెన్ఫిట్స్ ఉన్నాయని తెలుసు. అలాగే ఇది చర్మంపై న్యాచురల్ మాయిశ్చరైజర్, క్లెన్సర్ లా పనిచేస్తుంది. అలాగే ఈ తొక్కలుబరువు తగ్గడానికి, పంటి సమస్యలు నివారించడానికి ఉపయోగపడతాయి. ఎముకల ఆరోగ్యానికి మంచిది. క్యాన్సర్ తో పోరాడే గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. టాక్సిన్స్ ని బయటకు పంపి.. ఒత్తిడిని తగ్గిస్తాయి.

పియర్స్ తొక్క :

పియర్స్ తొక్క :

ఫేస్ ప్యాక్ లో బేరిపండ్లు బ్యూటికి ఉపయోగపడుతాయి. బేరిపండ్ల తొక్కతో ప్యాక్ వేసిుకోవడం, తొక్కను వేడినీటిలో ఉడికించి ఆ నీళ్లు చల్లగా మారిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల స్కిన్ వైట్ గా మారుతుంది.

English summary

Try These 7 Wonderful Fruit Peels For Fair Skin

Try these excellent fruit peels to get a fair and bright complexion.
Story first published: Friday, March 17, 2017, 12:17 [IST]
Subscribe Newsletter