For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉసిరికాయ వలన కలిగే చర్మ సౌందర్య ప్రయోజనాలు

ఉసిరికాయ వలన కలిగే చర్మ సౌందర్య ప్రయోజనాలు

|

ఉసిరికాయలో ఉన్న ఔషధ గుణాల వలన దీనిని ఆయుర్వేద రత్నమని పిలుస్తారు. ఇది అల్సర్లు, దగ్గు, మధుమేహం, మలబద్దకం, కొలెస్ట్రాల్ లతో పోరాడుతుంది. ఉసిరికాయలో పోషకాలు మెండుగా ఉంటాయి. విటమిన్ సి యొక్క ముఖ్య సహజ వనరుగా చెప్పుకోవచ్చు. ఇది చర్మానికి, కేశాలకు అద్భుతమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.

కాస్తంత కసగా ఉండటం వలన కొంతమంది ఉసిరికాయను తినడానికి ఇష్టపడరు. దీని ప్రయోజనాలను పొందడానికి తినవలసిన అవసరమే లేదు, ముఖంపై మాస్కులా పూసుకున్నా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఉసిరికాయ లో వివిధ రకాల పోషకాలు, విటమిన్ ఎ మరియు సి ఉంటాయి. ఇవి చర్మ సమస్యలు మొటిమలు, మచ్చలతో పోరాడతాయి.

beauty tips in telugu

సహజ పదార్థాలను వినియోగించడం వలన ఎలాంటి దుష్ప్రభావాలు కలుగవు, పైగా వాటిలో ఎటువంటి రసాయనాలు ఉండవు. ఈ రోజు మనం ఉసిరికాయ వలన కలిగే చర్మ సౌందర్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. చదివాకా ఒక్క చిన్న, గుండ్రని కాయ ఇన్ని అద్భుతాలు చేస్తుందా! అని ఆశ్చర్యపోవడమే మీ వంతు.

ఉసిరికాయ కలుగజేసే పది చర్మ సౌందర్య ప్రయోజనాలు:

1. మేనిఛాయను మెరుగుపరుస్తుంది:

1. మేనిఛాయను మెరుగుపరుస్తుంది:

ఉసిరిలోని యాంటీబాక్టీరియల్ మరియు యాస్ట్రిజెంట్ తత్వాలు, చర్మం పై మృతకణాలను తొలగించి నూతన చర్మ కణాలను వెలుపలకు తెస్తుంది. మీది కనుక సున్నితమైన చర్మ తత్వమైనట్లైతే, రాసుకునేటప్పుడు కొన్ని చుక్కలు నీరు కలిపి రాసుకోవడం ఉత్తమం.

2. దెబ్బతిన్న కణజాలాన్ని బాగుచేస్తుంది:

2. దెబ్బతిన్న కణజాలాన్ని బాగుచేస్తుంది:

ఉసిరికాయ వైద్య లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిలోని విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్లు దెబ్బతిన్న కణజాలాన్ని వేగవంతంగా కోలుకునేటట్టు చేస్తాయి.

3. పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది:

3. పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది:

ఉసిరికాయలోని విటమిన్ సి చర్మాన్ని శుభ్రపరచి, పిగ్మెంటేషన్ తగ్గించి, ప్రకాశవంతంగా తయారు చేస్తుంది. క్రమం తప్పకుండా ముఖానికి ఉసిరిక రసం రాసుకుంటే, పిగ్మెంటేషన్ తగ్గి, చర్మం కాంతివంతంగా మారుతుంది.

4. మొటిమలు, మచ్చలను నివారిస్తుంది:

4. మొటిమలు, మచ్చలను నివారిస్తుంది:

ఉసిరికాయలో మెండుగా ఉండే విటమిన్ సి, మొటిమలు కలిగించే బాక్టీరియాతో పోరాడుతుంది. ఉసిరిక రసాన్ని పైపూతగా పూసుకోవడం లేదా ప్రతిరోజూ పొద్దుట తాగటం వలన మొటిమలు ఏర్పడటాన్ని నిరోధించవచ్చు.

5. చర్మాన్ని బిగుతుగా తయారు చేస్తుంది:

5. చర్మాన్ని బిగుతుగా తయారు చేస్తుంది:

వయసు పెరుగుతున్న కొద్దీ చర్మం బిగుతు తగ్గి సాగడం మొదలవుతుంది. ఎక్కువగా సాగితే ముడుతలు, గీతలు ఏర్పడతాయి. ఉసిరికాయలోని విటమిన్ ఎ మరియు సి, కొల్లాజన్ ఉత్పత్తిని ప్రోత్సహించి చర్మాన్ని నునుపుగా యవ్వనంతో మిసమిసలాడేలా మారుస్తుంది.

6. వృద్ధాప్య ఛాయలతో పోరాడి త్వరగా రానివ్వదు:

6. వృద్ధాప్య ఛాయలతో పోరాడి త్వరగా రానివ్వదు:

ఉసిరికాయలో ఉండే విటమిన్ సి, వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వదు. మీలో వయస్సు పైబడిన ఛాయలు కనపడటం మొదలైన వెంటనే, తరచుగా ఉసిరిక రసం వాడినట్లైతే తగ్గుతాయి. అంతేకాక, ఇంతకుముందు చెప్పినట్లు విటమిన్ ఏ కొల్లాజన్ ఉత్పత్తిని పెంచడం వలన చర్మం యవ్వనంతో మెరిసిపోతుంది. ఉసిరికాయలో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు అకాల వృద్ధాప్యంను పారద్రోలుతుంది.

7. అద్భుతమైన క్లెసర్ గా పనిచేస్తుంది:

7. అద్భుతమైన క్లెసర్ గా పనిచేస్తుంది:

విటమిన్ సి, అమైనో ఆమ్లాలు మరియు టేనిన్లు మీ ముఖచర్మంపై పేరుకున్న దుమ్ము ధూళిని సమర్ధవంతంగా శుభ్రపరుస్తాయి. ఉసిరికాయ మీ చర్మాన్ని టోన్ చేసి, తాజాగా, ప్రకాశవంతంగా తీర్చిదిద్దుతుంది.

8. చర్మం పై జిడ్డు పేరుకోవడాన్ని నిరోధిస్తుంది:

8. చర్మం పై జిడ్డు పేరుకోవడాన్ని నిరోధిస్తుంది:

చర్మంలో ఉండే సెబెషియస్ గ్రంధాలు సెబంను అధికంగా ఉత్పత్తి చేయడం వలన చర్మం జిడ్డుగా మారుతుంది. నూనె ఉత్పత్తి తగు మాత్రంలో ఉంటే చర్మానికి మేలు చేస్తుంది. అదే ఎక్కువైతే చర్మ రంధ్రాలను పూడుకుపోయి మొటిమలేర్పడతాయి. ఉసిరిలోని యాంటీబాక్టీరియల్ తత్వాలు, సెబం ఉత్పత్తిని తగ్గించి, చర్మంను శుభ్రంగా, తేటుగా మారుస్తుంది.

9. చర్మరంధ్రాలను చిన్నవిగా చేస్తుంది:

9. చర్మరంధ్రాలను చిన్నవిగా చేస్తుంది:

విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్ గుణాలు సమృద్ధిగా ఉన్నందున, ఉసిరిక రసంతో ముఖచికిత్స చేసుకుంటే, పెద్ద పెద్ద చర్మరంధ్రాలు ముడుచుకుని చిన్నవిగా మారుతాయి. కొల్లాజన్ ఉత్పత్తిని పెంచి, చర్మం యొక్క సాగే గుణాన్ని మరియు బిగిని పునరుద్ధరిస్తుంది.

10. మెరిసే చర్మాన్ని అందజేస్తుంది:

10. మెరిసే చర్మాన్ని అందజేస్తుంది:

ఉసిరికాయ చర్మానికి పోషకాలతో కూడిన ఆహారంగా పనికివస్తుంది. వీటిలోని విటమిన్ సి శుభ్రమైన మరియు స్పష్టమైన చర్మంను అందిస్తుంది. ఉసిరిక రసాన్ని తాగడమో లేదా ముఖానికి పూసుకోవడమో చేస్తే, మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. మేనిఛాయను మెరుగుపరిచి, మచ్చలు లేకుండా చేస్తుంది.

English summary

10 Striking Beauty Benefits Of Amla For Skin

Amla, or Indian gooseberry, works amazing on your face. Some people may not like its bitter and sour taste, but it's not necessary to consume it, you can apply it topically on your face. Amla is loaded with nutrients, vitamins A and C that help to get rid of all skin problems, be it acne, pimples, blemishes, etc.
Story first published:Saturday, May 26, 2018, 13:33 [IST]
Desktop Bottom Promotion