ఈ సహజమైన చిట్కాల ద్వారా యుక్త వయస్సులోనే నుదిటి పై వచ్చే ముడతలను తొలిగించుకోవచ్చని మీకు తెలుసా ?

Written By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ఈ మధ్య కాలంలో చాలా మందికి యుక్తవయసులోనే నుదిటి పై ముడతలు వస్తున్నాయి. దీనినే నుదిటి పై గీతాలు రావడం అని కూడా అంటారు. ఇలా రావడానికి కారణం ఆ ప్రాంతంలోని కండరాల కణజాలాలు శక్తిహీనం అవ్వడమే. ముసలి వయస్సులో మాత్రమే ముడతలు రావాల్సిన అవసరం లేదు. అసలు నిజం ఏమిటంటే, ముసలి వయస్సుకి ముడతలకు ఎటువంటి సంబంధం లేదు.

యుక్త వయస్సులో ఉన్న వ్యక్తులకు కూడా నుదిటి పై ముడతలు రావడం అనే సమస్యని ఎదుర్కొంటున్నారు. ఇలా రావడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే, ఒత్తిడి, వంశపారంపర్యంగా రావడం, జీవన విధానం , ఎక్కువగా మేకప్ వేసుకోవడం మరియు ముఖ కవళికలు వ్యక్తపరిచే విధానం. ఇప్పుడు మీరు విన్న కారణాలు అన్ని కూడా నిజమైనవే.

15 Natural Ways To Fight Forehead Wrinkles At A Young Age

మీరు నవ్వినా మరియు కోపంగా ఉన్నా, ఇటువంటి ముఖ కవళికలు వ్యక్తపరిచే విధానం వల్ల కూడా నుదిటి పై ముడతలు వస్తుంటాయి. అందుకు కారణం ఆ ప్రాంతం లో ఉన్న కండరాల యొక్క కదలిక. అయితే ఇటువంటి విషయాలను జరగకుండా ఆపడం ఎవ్వరి తరం కాదు. ఎందుకంటే, మాట్లాడేటప్పుడు ఇవి చాలా ముఖ్యమైన అంశాలు.

ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో, అటువంటివారు ఈ మధ్య కాలంలో నుదిటిపై ముడతలను తొలగించుకోవడానికి సహజ సిద్దమైన చిట్కాలను వాడటానికి మొగ్గుచూపుతున్నారు. అలాంటి వ్యక్తులకు ఇప్పుడు వినబోయే చిట్కాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

మీ చర్మానికి ఎటువంటి హాని జరగకుండా నుదిటి పై ఉన్న ముడతలను తీసివేయడానికి, 15 సహజసిద్ధమైన విధానాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అవేమిటంటే :

మీ యొక్క జీవన విధానాన్ని మెరుగుపరుచుకోండి :

మీ యొక్క జీవన విధానాన్ని మెరుగుపరుచుకోండి :

ఆరోగ్యవంతమైన జీవన విధానం ప్రతి ఒక్క సమస్యకు సమాధానాన్ని చూపిస్తుంది. అలాగే మంచి జీవిన విధానాన్ని పాటించడం ద్వారా నుదిటి పై వచ్చే ముడతలను తొలగించుకోవచ్చు. మరీ ఎక్కువగా ఒత్తిడిని లేదా ఉద్రిక్తతకు లోను కాకండి. సమతుల్యమైన పోషకవిలువలున్న ఆహారాన్ని తీసుకోండి మరియు సరైన మోతాదులో నీటిని త్రాగండి. విటమిన్ ఏ, సి, ఈ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల నుదిటిపై ఉండే ముడతలను తొలిగించుకోవచ్చు.

 నుదిటి మర్దన చేయడం :

నుదిటి మర్దన చేయడం :

మర్దన చేసి నుదిటిపై ఉన్న ముడతలను తొలగించుకోవడం అనేది చాలా ప్రాచీనమైన పద్దతి. ఇలా చేయడం వల్ల కణజాలాల్లో రక్త ప్రసరణ ఎంతగానో పెరుగుతుంది. ఎంతో సులభంగా ఇంటిలోనే ఉండి మీరు మీ నుదిటి పై మర్దన చేసుకోవచ్చు.

నుదిటికి మర్దన ఎలా చేసుకోవాలంటే :

కొన్ని చుక్కల ఆలివ్ నూనెను తీసుకోండి. ఆ తర్వాత నుదిటి భాగంలో పైకి కిందకి అంటూ 8 నుండి 10 నిమిషాల పాటు మర్దన చేయండి. రోజుకి కనీసం 1 లేదా 2 సార్లు చేయడం వల్ల ఫలితాలు మీకు వేగంగా కనిపిస్తాయి. ఆలివ్ నూనె చర్మంపై తేమ శాతాన్ని తగ్గకుండా చేస్తుంది. దీని వల్ల చర్మంపై తగినంత నీటి శాతం ఉంటుంది. ఇందు కారణంగా ముడతలకు కారణమయ్యే కణాలు వృద్ధి కాకుండా అరికడుతుంది.

 సూర్య కాంతికి ఎక్కువగా బహిర్గతం కాకండి :

సూర్య కాంతికి ఎక్కువగా బహిర్గతం కాకండి :

సూర్యకాంతికి ఎక్కువగా బహిర్గతం కావడం వల్ల చర్మానికి ఎక్కువగా నష్టం కలుగుతుంది. దీనికితోడు నుదిటిపై కూడా ముడతలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎప్పుడైతే బయటకు అడుగుపెడతారో, అటువంటి సమయంలో సాధారణంగా వాడే సన్ స్క్రీన్ లోషన్ ని వాడండి లేదా మీ యొక్క నుదిటిని స్కార్ఫ్ ని ఉపయోగించి ఎండ తగలకుండా చేయండి. ఇలా చేయడం వల్ల సూర్యకాంతి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఇలా చేయడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే, సూర్యుడి నుండి వెలువడే హానికరమైన కిరణాలు మరియు వేడి చర్మానికి విపరీతమైన నష్టాన్ని చేకూరుస్తాయి.

తెల్లసొనతో మాస్క్ :

తెల్లసొనతో మాస్క్ :

గుడ్డులో ఉండే కొల్లాజెన్ మరియు ప్రోటీన్లు చర్మం బిగుతుగా ఉండేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి మరియు నుదిటి పైన గీతాలను తొలగిస్తాయి. గుడ్డు నుండి తెల్ల సొనను వేరుచేయండి. ఆ తెల్ల సొనను మీ యొక్క నుదిటి పై సమానం గా రాయండి. పది నిమిషాల పాటు అలా ఉంచి, ఎండిపోయిన తర్వాత గోరువెచ్చటి నీతితో కడగండి. ఇలా ప్రతిరోజూ హేయడం వల్ల మీకు ఫలితాలు వేగంగా కనిపిస్తాయి.

నిద్రపోయే భంగిమలను మార్చండి :

నిద్రపోయే భంగిమలను మార్చండి :

అవును మీరు విన్నది నిజమే, మీ పొట్ట పై పడుకోవడం మరియు మీ యొక్క నుదిటిని దిండులేదా పరుపుకి ఆనించి పడుకోవడం వల్ల నుదిటి పై ముడతలు వేగంగా వచ్చేస్తాయి. అందుచేత మీ వెన్నుముక్కను ఆధారంగా చేసుకొని వెనుకకు పడుకోండి లేదా పక్కకు పడుకోండి. ఇలా చేయడం ద్వారా నుదిటి పై మచ్చలు లేదా ముడతలు రాకుండా అరికట్టవచ్చు.

కొబ్బరి నూనె :

కొబ్బరి నూనె :

కొబ్బరి నూనె లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మానికి కావాల్సిన తేమను అందిస్తూ ఉంటాయి. అంతే కాకుండా చర్మం ఆరోగ్యవంతంగా మరియు నిగ నిగా మెరిసిపోయి ఉండటానికి ఎంతగానో సహకరిస్తాయి. దీనికితోడు హానికరమైన వాటి భారీపడకుండా చర్మాన్ని ఇది రక్షిస్తుంది. అందువల్ల చర్మం ఎప్పుడు తేజోవంతంగా ఉంటుంది.

కొద్దిగా కొబ్బరి నూనె ను తీసుకొని మీ యొక్క నుదిటి కి రాయండి. మీ చర్మం ఆ నూనె మొత్తాన్ని చర్మం పీల్చుకునే వరకు మృదువుగా చర్మానికి రాయండి. ప్రతిరోజూ పడుకొనే ముందు ఇలా చేయండి. ఇలా చేయడం ద్వారా కొద్ది వారాల్లోనే మీరు ఊహించనంత మార్పు కనపడుతుంది.

నిమ్మజాతికి చెందిన వాటితో పేస్ ప్యాక్ :

నిమ్మజాతికి చెందిన వాటితో పేస్ ప్యాక్ :

నిమ్మజాతికి చెందిన పండ్లు మరియు నిమ్మకాయలో విటమిన్ సి మరియు ఈ లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మం నిర్జలీకరణ కాకుండా సహాయపడతాయి మరియు చర్మం మృదువుగా ఉండటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నిమ్మజాతి చెందినటువంటి పళ్ళు అయిన నిమ్మకాయ మరియు కమలా పండుని నేరుగా మీ నుదిటి పై రాసుకోవచ్చు. అలా రాసిన తర్వాత ఎండిపోయినంత వరకు వేచి ఉండాలి. ఆపై గోరువెచ్చని నీతితో కడిగేయాలి.

మరొక మార్గం ఏమిటంటే, పావు కప్పులో కమలా పండు గుజ్జుని తీసుకోవాలి. దీనిని బియ్యం పిండిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ నుదిటికి రాసుకోవాలి. 25 నిమిషాల పాటు అలానే ఉంచిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగివేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.

ముడతలకు అలోవెరా :

ముడతలకు అలోవెరా :

అలోవెరా లో ఉండే కారకాలు చర్మానికి కొత్త తేజస్సుని ఇస్తాయి మరియు చర్మానికి జరిగే హానిని బాగుచేస్తాయి. దీని వల్ల చర్మం ఎప్పుడు మృదువుగా ఉంటుంది మరియు నిర్జలీకరణ అవ్వకుండా ఉంటుంది. పడుకొనే ముందు మరియు నిద్రలేచి ముఖం కడుక్కునే ముందు కొద్దిగా అలోవెరా ని తీసుకొని మీ యొక్క నుదిటికి మర్దన చేయండి. 15 నిముషాల పాటు అలానే ఉంచండి. ఎండిపోయిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయండి. ఇలా ప్రతిరోజూ చేయడం ద్వారా నుదిటి పై ఉండే ముడతలు కనుమరుగు అవుతాయి.

English summary

15 Natural Ways To Fight Forehead Wrinkles At A Young Age

A lot of young people face the problem of forehead wrinkles. Some of the reasons for this are stress, genetic heredity, lifestyle, excess make up and facial expressions. Improving your lifestyle habits, forehead massage, egg white mask, using honey, coconut oil, doing yoga, keeping the body hydrated, etc., are a few perfect natural remedies.