For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సన్ స్క్రీన్ లోషన్ కొనుగోలు చేసేటప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సిన 8 విషయాలు !

సన్ స్క్రీన్ లోషన్ కొనుగోలు చేసేటప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సిన 8 విషయాలు !

|

మీ స్నేహితులతో కలిసి మీరు విందుకు (లేదా) బయట కార్యక్రమాలకు (లేదా) బీచ్లకు వెళ్తున్నారా ? అలాంటి సమయంలో, హానికరమైన సూర్యకిరణాల నుండి మీ చర్మాన్ని రక్షించడానికి సన్స్క్రీన్ లోషన్ను తీసుకు వెళ్లడం మర్చిపోకండి. బయట వాతావరణం ఎలా ఉన్నప్పటికీ - సూర్యకిరణాల నుంచి మీ చర్మాన్ని రక్షించడానికి మీరు సన్స్క్రీన్ను తప్పక ఉపయోగించాలి.

సన్స్క్రీన్ లోషన్ ఎందుకు అవసరమవుతుందని చాలామంది ఆలోచిస్తుంటారు ? కానీ, సన్స్క్రీన్ లోషన్ మీ చర్మంపై ఒక రక్షిత సృష్టిస్తుంది దాని వల్ల మీ చర్మం హానికరమైన సూర్యకిరణాల నుండి దెబ్బతినకుండా రక్షించబడుతుంది.

8 Things To Consider When Buying A Sunscreen Lotion

ఇప్పుడు మీరు దీనిని మంచిగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం - మీరు ఈ సన్స్క్రీన్ లోషన్ను ఉపయోగించకపోతే మీ చర్మం బయట మరియు లోపల దెబ్బతినే అవకాశం ఉంటుంది, అలా దాని దుష్ప్రభావాల కారణంగా మీకు అకాల వృద్ధాప్యం కలగవచ్చు. కాబట్టి మీరు బయట వాతావరణం లోనికి వెళ్లేటప్పుడు సన్స్క్రీన్ లోషన్ను తప్పకుండా ఉపయోగించడం ఎల్లప్పుడూ మంచిది.

సన్స్క్రీన్ లోషన్ను ఎందుకు ఉపయోగించడం మంచిదో ఇప్పుడు మీరు తెలుసుకుంటారు, సన్స్క్రీన్ లోషన్ను కొనుగోలు చేసేటప్పుడు పరిగణలోనికి తీసుకోవాల్సిన ముఖ్యమైన ఇతర విషయాలను తెలుసుకోవడంతో పాటు, సన్స్క్రీన్ లోషన్లో ఉండే SPF కంటెంట్ వంటి అతి ముఖ్యమైన ప్రాధమిక విషయాలను కూడా పరిశీలించాలి.

సన్స్క్రీన్ లోషన్ను కొనుగోలు చేసేటప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలు :-

1. సన్స్క్రీన్ లోషన్లో ఉండే SPF కంటెంట్ :

1. సన్స్క్రీన్ లోషన్లో ఉండే SPF కంటెంట్ :

మీరు సన్స్క్రీన్ లోషన్ను కొనడానికి బయటకు వెళ్ళేటప్పుడు గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన అంశాలలో ఇది ఒకటి. సన్స్క్రీన్ లోషన్ అందించే సంరక్షణ మొత్తం దాని SPF కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది. SPF కంటెంట్ ఎక్కువగా ఉన్న సన్స్క్రీన్ లోషన్ మీకు మరింత మంచి ఫలితాలను అందజేయగలదు. ఢిల్లీ, ముంబై, కోలకత్తా ప్రాంతాలలో ఉండే వాతావరణానికి మీరు ఉపయోగించే సన్స్క్రీన్ లోషన్ను యొక్క SPF కంటెంట్ 30 కంటే ఎక్కువగా ఉంటే కచ్చితంగా సరిపోతుంది. వాతావరణం కొద్దిగా చల్లగా ఉండే బెంగళూరు వంటి ప్రదేశాలలో SPF కంటెంట్ 30 కన్నా తక్కువగా ఉంటే సరిపోతుంది.

2. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ :

2. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ :

SPF కంటెంట్ తర్వాత గుర్తుంచుకోవలసిన అతి ముఖ్య విషయం సన్స్క్రీన్ లోషన్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. మీరు ఎలాంటి వస్తువులనైనా కొనుగోలు చేసే ముందయినా ఆ వస్తువుల యొక్క తయారీ తేదీని ఎప్పుడూ తనిఖీ చేయాలి. మీరు తినే వస్తువులను (లేదా) వాడే క్రిముల వంటి అంశాలను పక్కన పెట్టి, ఆ వస్తువు యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ను & ఎక్స్పైరీ డేట్ను విధిగా గుర్తించాలి. ఒకవేళ మీరు సన్స్క్రీన్ లోషన్ను కొనుగోలు చేసేటట్లయితే, దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఇటీవల కాలానికి సంబంధించినదిగా ఉండే దానిని ఎంచుకోవడం ఉత్తమం.

3. బ్రాండ్ :

3. బ్రాండ్ :

మీరు మరొక అత్యంత ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి. తక్కువ ధరల వద్ద లభించే వాటి కన్నా, ఒక మంచి బ్రాండెడ్లో లభించే సన్స్క్రీన్ లోషన్ అనేది చాలా మంచిది. మంచి బ్రాండెడ్లో లభించే సన్స్క్రీన్ లోషన్ను కొనుగోలు చేయడమనేది ఖర్చుతో కూడుకున్నదని మాత్రమే అర్ధం కాదు. మీ బడ్జెట్కు అనుకూలంగా ఉన్న కొన్ని బ్రాండెడ్ సన్స్క్రీన్ లోషన్ను కొనుగోలును కూడా మీరు చేయవచ్చు.

4. వాటిలో ఉండే హానికరమైన పదార్థాల స్థాయిలను గుర్తించండి :

4. వాటిలో ఉండే హానికరమైన పదార్థాల స్థాయిలను గుర్తించండి :

ఇప్పటివరకు మనం చెప్పుకున్న అంశాలలో ఇది చాలా ముఖ్యమైన అంశము కాబట్టి దీనిని తీవ్రంగా పరిగణించాలి. మీ శరీర ఆరోగ్యానికి (లేదా) చర్మ ఆరోగ్యానికి సంబంధం కలిగి ఉన్న ఏదైనా ప్రొడక్ట్లో ఎంతమేరకు హానికరమైన పదార్ధాలు కలిసి ఉన్నాయో అనేది చెక్ చేయడం చాలా ముఖ్యము అలాగే, మీరు ఎంచుకున్న సన్స్క్రీన్లోషన్ విషయంలో కూడా ! ఒకవేళ మీరు ఉపయోగించే సన్స్క్రీన్ లోషన్ల వంటి పదార్థాలలో ఆక్సిబెంజోన్ వంటి సమ్మేళనమును కలిగి ఉంటే అది మీ చర్మంపై ఎలర్జీలు ఏర్పడటానికి కారణం కావచ్చు.

5. స్ప్రే / పౌడర్ కంటే క్రీమ్ బాగా పనిచేస్తుంది :

5. స్ప్రే / పౌడర్ కంటే క్రీమ్ బాగా పనిచేస్తుంది :

మరో గమనించదగ్గ మంచి పాయింట్ ఇది ! మీరు ఒక సన్స్క్రీన్ లోషన్ను కొనుగోలు చేసేటప్పుడు, క్రీమ్ రూపంలో లభించే దానిని ఎంచుకోండి ఇది మీ చర్మంపై ఒక మంచి పొరను ఏర్పరచి, సూర్యరశ్మి మీ చర్మం లోపలకి చొచ్చుకొనిపోకుండా నిరోధించేలా చేస్తుంది. ఒకవేళ మీరు ఒక స్ప్రేని ఉపయోగించినట్లయితే, అది డ్రై అయిపోవడం వల్ల ముఖ్యమైన ఉద్దేశంతో అది పనిచేయకపోవచ్చు. అలాగే, మీరు ఒక పౌడర్ను ఉపయోగించాలనుకుంటే, అది కూడా డ్రై అయిపోవచ్చు. కానీ క్రీమ్ మాత్రం మీ ముఖానికి బాగా అంటుకుపోయి ఉండటం వల్ల అది మరిన్ని అద్భుతమైన లాభాలను కలుగచేయగలదు.

6. మీరు ఉపయోగించే సన్స్క్రీన్ లోషన్ చెమటను అడ్డుకుంటుందా ?

6. మీరు ఉపయోగించే సన్స్క్రీన్ లోషన్ చెమటను అడ్డుకుంటుందా ?

ఈ పాయింట్ కూడా పైన చెప్పిన వాటితో సమానంగా పరిగణించదగినది. ఒక సన్స్క్రీన్ను కొనుగోలు చేసేటప్పుడు - అన్ని ఇతర విషయాలతో పాటు - ఇది చెమటను అడ్డుకోగలదా అని మీరు తనిఖీ కూడా చేయాలి. చెమటతో మీ సన్స్క్రీన్ లోషన్ యొక్క అనుకూలతను మీరు గాని తనిఖీ చేయకపోతే, దానిని మీరు ఉపయోగించిన వెంటనే డ్రై అయిపోవచ్చు. మీకు చెమట పట్టినప్పుడు అది మీ ముఖాన్ని చాలా జిడ్డుగా తయారుచేస్తుంది, అలాగే మీ మొత్తం లుక్ను వాడు చేయడంతో పాటు, మీరు ధరించిన అలంకరణను కూడా పూర్తిగా నాశనం చేస్తుంది.

7. సన్స్క్రీన్, మీ పిల్లలకు కూడా ఫ్రెండ్లీనా ?

7. సన్స్క్రీన్, మీ పిల్లలకు కూడా ఫ్రెండ్లీనా ?

ఆ తరువాత, మీరు గుర్తుంచుకోవలసిన ఇంకొక పాయింట్ ఇది. మీ ఇంట్లో మీరు పిల్లలను కలిగి ఉంటే, మీరు ఉపయోగించే అలంకరణ సాధనాలు (లేదా) అందాన్ని పెంపొందించే ఉత్పత్తుల కోసం అధిక ప్రాధాన్యతను ఇవ్వండి.

8. మొటిమలను కలిగి ఉన్న చర్మం కోసం కూడా మీరు దీనిని ఉపయోగించవచ్చా?

8. మొటిమలను కలిగి ఉన్న చర్మం కోసం కూడా మీరు దీనిని ఉపయోగించవచ్చా?

మీరు గమనించదగ్గ మరోక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక సన్స్క్రీన్ను కొనుగోలు చేసేటప్పుడు, అది అన్ని రకాల చర్మాలకు సరిపోయినట్లుగా ఉంటుందా అనేది మీరు ఎల్లప్పుడూ తనిఖీ చేసుకోవాలి, ముఖ్యంగా సున్నితమైన చర్మమును కలిగి ఉన్నవారు !

English summary

8 Things To Consider When Buying A Sunscreen Lotion

8 Things To Consider When Buying A Sunscreen Lotion, Heading out for lunch with friends or going to the beach for some outdoor activities? Well, don't forget to carry a sunscreen lotion with you, as it will protect your skin from the harmful sun rays. Whatever the weather is - you should apply a sunscreen to protect y
Desktop Bottom Promotion