For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చేందుకు యోగర్ట్ ఏ విధంగా ప్రయోజనకారిగా ఉంటుందో మీరు తెలుసుకోవాలి

|

ఈ రోజుల్లో స్కిన్ కేర్ అనేది సులభమైన ప్రక్రియ కాదు. మార్కెట్ లో స్కిన్ కేర్ కోసం అనేకరకాల ప్రోడక్ట్స్ అందుబాటులో కలవు. వాటిలో ఏది చర్మానికి మేలు కలిగిస్తుందో తెలుసుకోవటం కష్టమే. అంతేకాక, కొన్ని రకాల స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ బ్రేకవుట్స్ సమస్యను మరింత పెంపొందించేవిగా ఉంటాయి. చర్మంపై దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి, నేచురల్ వైపు మొగ్గు చూపడం ఉత్తమమైన ఆలోచన.

నేచురల్ ఇంగ్రీడియెంట్స్ అనేవి చర్మంపై కఠినంగా వ్యవహరించవు. కాబట్టి, చర్మంపై బ్రేకవుట్స్ వంటి సమస్యలు తలెత్తవు. సెన్సిటివ్ స్కిన్ పై కూడా ఇవి హానికర రియాక్షన్స్ ని కలిగించవు. ఈ ఇంగ్రిడియెంట్స్ అనేవి చౌకగా లభ్యమవుతాయి. బిజీగా ఉండే వర్కింగ్ విమెన్ కి కూడా ఇవి సూట్ అవుతాయి.

Amazing benefits of yogurt for glowing skin you probably didnt know

ఈ రోజుల్లో, చర్మ సంరక్షణకు అధిక సమస్యని కేటాయించడమనేది సమస్యగా మారుతోంది. రోజంతా బిజీగా ఉండటం వలన చర్మసంరక్షణకు సమయాన్ని కేటాయించే వీలు దొరకటం లేదు. ఒత్తిడి స్థాయి పెరుగుతూ ఉండటం. పొల్యూషన్ వంటివి కూడా చర్మ సమస్యలను పెంచుతున్నాయి. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా చర్మ సౌందర్యంపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. డల్ స్కిన్ కి దారితీస్తున్నాయి.

మన చర్మం అందంగా అలాగే ఫ్రెష్ గా ఉండాలని మనం కోరుకుంటూనే ఉంటాం కదా? యోగర్ట్ లేదా పెరుగు అనేది చర్మ సౌందర్యాన్ని సంరక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో లారిక్ యాసిడ్ లభిస్తుంది. ఇది చర్మాన్ని సున్నితంగా ఎక్స్ఫోలియెట్ చేస్తుంది. తద్వారా, చర్మాన్ని కాంతివంతంగా, ఫ్రెష్ గా అలాగే యవ్వనంగా ఉంచుతుంది.

లాక్టిక్ యాసిడ్ ని స్కిన్ కేర్ ఇంగ్రిడియెంట్ గా అనేక స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ లో వాడతారు. అయితే, ఇంట్లోనే యోగర్ట్ ద్వారా ఈ ప్రయోజనాలను పొందవచ్చు.

ఇక్కడ వివరించబడిన యోగర్ట్ ఫేస్ మాస్క్స్ ని పాటించడం ద్వారా చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోండి మరి.

1. యోగర్ట్ మరియు బేసన్ ఫేస్ ప్యాక్:

1. యోగర్ట్ మరియు బేసన్ ఫేస్ ప్యాక్:

ఈ పేస్ ప్యాక్ అనేది ఆయిలీ స్కిన్ లేదా కాంబినేషన్ స్కిన్ కు చక్కగా సరిపోతుంది. గ్రామ్ ఫ్లోర్ లేదా బేసన్ అనేది చర్మాన్ని ఎక్స్ఫోలియెట్ చేసేందుకు తోడ్పడుతుంది. మార్కెట్ లో లభ్యమయ్యే ఎక్స్ఫోలియేటర్స్ కంటే ఇది ఎంతో సున్నితంగా వ్యవహరించి చర్మపైనున్న డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ తయారీ కోసం, ఒక కప్పుడు పెరుగులో ఒక టీస్పూన్ బేసన్ ను జోడించాలి. ఈ క్వాన్టిటీని మీ అవసరానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఈ రెండు పదార్థాలని బాగా కలిపి మిశ్రమాన్ని తయారుచేసుకోండి. ఈ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ లా అప్లై చేసుకోండి. ఈ మిశ్రమాన్ని మెల్లగా సర్క్యూలర్ మోషన్ లో స్కిన్ ను మసాజ్ చేసేందుకు ఉపయోగించండి. ఆ తరువాత, చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.

2. యోగర్ట్ మరియు లెమన్ ఫేస్ ప్యాక్:

2. యోగర్ట్ మరియు లెమన్ ఫేస్ ప్యాక్:

ఈ ఫేస్ ప్యాక్ తయారీకోసం మీకు రెండు టేబుల్ స్పూన్ల యోగర్ట్ తో పాటు ఒక టీస్పూన్ నిమ్మరసం అవసరపడుతుంది. ఈ రెండిటినీ బాగా కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ అనేది నార్మల్ అలాగే ఆయిలీ స్కిన్ కలిగిన వారికి ఉపయోగపడుతుంది. ఈ ఫేస్ మాస్క్ ను పది నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత వాష్ చేసుకోవాలి. వారానికి ఒకసారి ఈ ఫేస్ మాస్క్ ని వాడాలి. లెమన్ లో లభించే సిట్రిక్ యాసిడ్ చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చేందుకు తోడ్పడుతుంది. పిగ్మెంటేషన్ సమస్యను తొలగించి యాక్నే ద్వారా కలిగిన స్కార్స్ ను పోగొడుతుంది.

3. యోగర్ట్ మరియు హనీ ఫేస్ ప్యాక్:

3. యోగర్ట్ మరియు హనీ ఫేస్ ప్యాక్:

ఈ ఫేస్ ప్యాక్ డ్రై, ఫ్లేకీ స్కిన్ సమస్య కలిగిన వారికి అద్భుతమైన పరిష్కారంగా పనిచేస్తుంది. కాబట్టి, మీ చర్మం డ్రై గా మారినప్పుడు ఈ ఫేస్ మాస్క్ ను ప్రయత్నించండి. రెండు టేబుల్ స్పూన్ల హనీలో ఒక కప్పుడు పెరుగును జోడించి చిక్కటి పేస్ట్ ను తయారుచేయండి. ఈ పేస్ట్ ను ఫేస్ పై అప్లై చేయండి. ఇరవై నిమిషాలపాటు అలాగే ఉండనివ్వండి. ఆ తరువాత ఫేస్ ను సాధారణ పద్దతిలో వాష్ చేయండి.ఈ రెండు పదార్థాలు మాయిశ్చరైజింగ్ క్వాలిటీస్ కలిగినవి. తేనె సహజసిద్ధమైన హ్యూమేక్టన్ట్ గా పనిచేస్తుంది. తద్వారా చర్మంలోని మాయిశ్చర్ ను నిలిపి ఉంచుతుంది. ఈ ఫేస్ మాస్క్ డ్రై స్కిన్ కి గ్లోను అందిస్తుంది.

4. యోగర్ట్ మరియు టర్మరిక్ ఫేస్ ప్యాక్:

4. యోగర్ట్ మరియు టర్మరిక్ ఫేస్ ప్యాక్:

ఇందుకోసం, మీకు పావు టీస్పూన్ టర్మరిక్ అలాగే అరకప్పు యోగర్ట్ అవసరపడతాయి. ఈ రెండిటినీ బాగా కలిపి పేస్ట్ లా తయారుచేసుకోండి. ఈ పేస్ట్ ను ఫేస్ ప్యాక్ లా అప్లై చేయండి. పదిహేను నిమిషాలపాటు అలాగే ఉండనివ్వండి. మీ ముఖాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుని జెల్ వంటి ఫెషీయల్ క్లీన్సర్ ను అప్లై చేయండి. ఈ మాస్క్ అన్ని రకాల చర్మతత్వాలకు సూట్ అవుతుంది. టర్మరిక్ అనేది యాంటీసెప్టిక్ అలాగే యాంటీబాక్టీరియల్ పదార్థంగా పనిచేస్తుంది. అందువలన, చర్మంలోని ఇంప్యూరిటీస్ అనేవి తొలగిపోతాయి. రెగ్యులర్ గా ఉపయోగించడం వలన చర్మం కాంతివంతంగా మారుతుంది.

English summary

Amazing benefits of yogurt for glowing skin you probably didn't know

Skincare can be really tricky these days as way too many options for products are available in the markets. What's more, these products could make you breakout or have other such bad reactions on your skin. That is why we suggest that going natural is the best idea.Natural ingredients are so mild, and hence would not cause any bad reactions even on skin that is extremely sensitive. These ingredients are cost effective and can be easily found in our kitchens and fridges, which suits all of those busy working girls perfectly.
Desktop Bottom Promotion