For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రకాశవంతమైన చర్మ సౌందర్యానికై బాదం ఫేస్ పాక్

|

చర్మ సంరక్షణ కోసంగా మనం అనేక వ్యాసాలు ఇదివరకే చదివున్నాం. తద్వారా చర్మ నిగారింపు మరియు సంరక్షణా పద్దతుల గురించిన అవగాహన ఖచ్చితంగా ఉంటుంది. రిఫరెన్స్ కోసం మా పేజీలో ప్రచురించిన వ్యాసాలపై ఒక లుక్కేయండి. కానీ అన్నిటినీ ఫాలో అవ్వాలా అనే ప్రశ్నకు కాదనే సమాధానం ఉంటుంది. అవసరాన్ని ఉద్దేశించి, చర్మ విధానాన్ని అనుసరించి ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. మీకు ఏమాత్రం సమయం ఉన్నా ఇంటిపద్దతులనే అనుసరించడం మేలు. అనేకులు, ఈ సమయాన్ని కేటాయించలేక సెలూన్లపై ఆధారపడుతున్నారు. వారంలో లేదా నెలలో ఒక ౩౦ నిమిషాలు కేటాయించి సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే అది అత్యాశే అవుతుంది. కావున ఇంటి పద్దతులపైన కూడా ఒక దృష్టి ఉంచాల్సిన అవసరo ఉంది.

కానీ, మీరు ఏ సమయంలోనైనా ఇంట్లో సాధారణంగా లభించే పదార్థాలతో మీ ముఖానికి సరైన ప్యాక్ తయారు చేయగలరని మీకు తెలుసా? ఇవి మీ ముఖాన్ని సంరక్షించడమే కాదు, సరికొత్త నిగారిoపును కూడా తీసుకుని వస్తాయి. దీనికి 30 నిమిషాలు కూడా అవసరం లేదు, కనీసం 20 నిమిషాలు ఉన్నా చాలు.

ఈ డై ఆల్మండ్ ఫేస్ పాక్ మీ చర్మానికి తక్షణ నిగారిoపును తీసుకుని రావడంలో ఎంతగానో సహాయం చేస్తుంది. ఇంతకు ముందెన్నడూ మీరు గమనించని మార్పును మీరు చూడగలుగుతారు. ఇంకెందుకు ఆలస్యం? మీకు ఈరోజు సరైన సమయం ఉంటే ఈరోజే మొదలుపెట్టండి. మేము ఖచ్చితంగా చెప్పగలం, మీరు ఎటువంటి నిరాశకు లోనుకారు అని.

ఈ ఫేస్ పాక్ లో దొరికే అన్ని రకాల పదార్ధాలు, మీ వంటింటిలో లభ్యమయ్యే పదార్దాలుగానే ఉంటాయి. కావున మీరు ప్రత్యేకించి షాపింగ్ కై సమయం కేటాయించవలసిన పని కూడా లేదు.

ఈ ఫేస్ పాక్ సమయానుసారం అనుసరించడం మూలంగా, మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితాలను కూడా పొందగలరు. ప్రయోగాత్మకంగా చెప్తున్న వివరాల ప్రకారం, ఎటువంటి చర్మానికైనా నప్పే ఈ ఫేస్ పాక్, మీకు ఎటువంటి దుష్ప్రభావాలను కలిగించదు.

కావలసిన పదార్ధాలు:

కావలసిన పదార్ధాలు:

• ఒక టీస్పూన్ క్రష్ చేసిన బాదం పొడి/ నికరంగా 5 బాదం పప్పులు

• 2 టీస్పూన్ల పచ్చి పాలు

ఎలా తయారుచేయాలి:

ఎలా తయారుచేయాలి:

• ఒక మధ్య తరహా బౌల్ ను తీసుకోండి.

• దానిలో బాదం పొడి వేయండి.

• కొంచెం పాలు వేసి మృదువుగా వచ్చేలా తయారు చేసుకోవాలి.

• ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, మీ వద్ద బాదం పొడి సిద్ధంగా లేకపోతే, ఆందోళన పడనవసరం లేదు. ఒక 4-5 బాదం పప్పులను తీసుకుని, వాటిని క్రష్ చేయండి.

• పొడి సిద్ధంగా ఉంటే, దానిలో పాలు కలపి స్మూతీ మిశ్రమం వచ్చేలా మిక్స్ చేయండి.

• మీ ముఖం మరియు మెడ మీద సమానంగా అప్లై చేయండి. మీ ముఖం మరియు మెడ రెండూ ఒకే రకమైన ప్రభావాన్ని కలిగి ఉంటాయి. కావున మొత్తానికి అప్లై చేయవలసినదిగా సూచించడమైనది.

• కనీసం 10 నిమిషాలు వేచి ఉండండి.

• ముఖంపై మిశ్రమమ పొడి బారాక, చల్లటి నీటితో కడిగివేసి, టవల్ తో సున్నితంగా నీటిని తొలగించండి.

మంచి ఫలితాలకోసం ప్రతిరోజూ దీనిని అప్లై చెయ్యడం అలవాటుగా చేసుకోండి.

మంచి ఫలితాలకోసం ప్రతిరోజూ దీనిని అప్లై చెయ్యడం అలవాటుగా చేసుకోండి.

మీకు వెంటనే చేసుకునే క్విక్ ఫేస్ పాక్ వలె కనపడలేదా? 5 నిమిషాల్లో ఈ మిశ్రమాన్ని తయారుచేయవచ్చు, అప్లై చేయడానికి 2 నిమిషాలకన్నా సమయం పట్టదు. మరియు పొడిబారాక ముఖాన్ని కడగాలి, దీనికి 10 నిమిషాలు. కనీసం 20 నిమిషాలు కూడా పట్టని ఈ ఫేస్ పాక్ మీకు ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం.

ఖరీదైన పార్లర్ చికిత్సల్లో ఒక్క పెన్నీని కూడా వృధా చేయకుండా, కేవలం 20 నిమిషాలు సమయం వెచ్చించడం మూలంగా నిగారింపుతో కూడిన, ఆరోగ్యకర చర్మం మీ సొంతమవుతుంది. మీకు చాలా ఉపయోగకరంగా అనిపిస్తుంది కదా.

అసలు ఎందుకు ఈ ప్యాక్ వినియోగించాలి?

అసలు ఎందుకు ఈ ప్యాక్ వినియోగించాలి?

అసలు ఎందుకు ఈ ప్యాక్ వినియోగించాలి? దీనిలో ఉండే ప్రత్యేక లక్షణాలు ఏమిటి? బాదం మరియు పాలు మాత్రమే ఎందుకు? ఈ సమాధానాలన్నీ క్రింది సెక్షన్లో.

పాల వలన ఉపయోగం:

పాల వలన ఉపయోగం:

• పాలు మీ చర్మo రంగును మెరుగుపరుస్తుంది.

• పాలు మీకు ప్రకాశవంతమైన చర్మం టోన్ ఇస్తుంది, సహజ సిద్దమైన టోనర్ పాలు.

• పాలు మీ చర్మానికి అద్భుతమైన క్లెన్సర్ లా పనిచేస్తుంది.

• పాలు మీ ముఖం మీద రంధ్రాలను పూడుస్తుంది.

• పాలు ప్రకాశవంతమైన చర్మం కోసం మంచి ఎంపికగా ఉంటుంది.

• పాలు దద్దుర్లు మరియు చికాకును తగ్గిస్తుంది.

• చనిపోయిన మృత చర్మ కణాలను తొలగించడానికి పాలు సహాయపడుతుంది.

• ఇది స్కార్స్ మరియు ముడుతలను నునుపుగా చేస్తుంది.

• పాలు ఎండవేడిమి వలన ఏర్పడిన టాన్ కు సహజ సిద్దమైన ఏజెంట్ గా పనిచేస్తుంది

చర్మ సంరక్షణలో బాదం పాత్ర :

చర్మ సంరక్షణలో బాదం పాత్ర :

• బాదం మచ్చలు వదిలించుకోవటంలో సహాయం చేస్తుంది.

• బాదం మోటిమలకు మరియు మొటిమల కారణంగా ఏర్పడే మచ్చలను తొలగించడంలో సహాయం చేస్తుంది.

• విటమిన్-ఇ అధికంగా ఉండే బాదం మీచర్మాన్ని మృదువుగా మార్చడంలో సహాయం చేస్తుంది.

• యాంటీఏజెంట్ లక్షణాలను కలిగి ఉన్న బాదం, చర్మానికి ముడతలు రాకుండా అడ్డుకుంటుంది.

 ఈవేసవిలో, ఈవారాంతంలో మీఇంట్లోనే ఈ అద్భుతమైన ప్రత్యేక ఫేస్ ప్యాక్ ప్రయత్నించండి.

ఈవేసవిలో, ఈవారాంతంలో మీఇంట్లోనే ఈ అద్భుతమైన ప్రత్యేక ఫేస్ ప్యాక్ ప్రయత్నించండి.

ఇది చాలా మంచిది మరియు సాధ్యమైనంత ఉత్తమమైన మార్గంలో మీకు సహాయం చేస్తుంది. వేసవిలో సూర్యుని తాపానికి గురై చర్మం ఎన్ని సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుందో మీకు తెలియనిది కాదు. టాన్, రాషెస్, దద్దుర్లు, చమట పొక్కులు, దురద ఇలాంటి అనేక సమస్యలకు కేంద్రబిందువు ఈ వేసవి. కావున చర్మ సంరక్షణ కూడా మీ ప్రధమ భాద్యత అవుతుంది.

ఈ ఫేస్ పాక్ వాడిన పిదప, మీ అనుభవాలను క్రింది కామెంట్ సెక్షన్లో తెలుపండి.

English summary

Amazing DIY Almond Face Pack For A Clear Skin

This DIY almond face pack will give you an instant clear skin and a glow like never before. Well, what are you waiting for? The homemade aspect of this pack makes it really special. It uses all basic ingredients that are readily available in your kitchen. Mix a teaspoon of almond powder with raw milk and apply it on your face to get a clear and glowing skin.
Story first published: Wednesday, May 16, 2018, 17:33 [IST]