For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మునగకాయల (డ్రమ్-స్టిక్స్) వల్ల కలిగే సౌందర్య ప్రయోజనాలు, మీకు కూడా తెలియదు !

మునగకాయల (డ్రమ్-స్టిక్స్) వల్ల కలిగే సౌందర్య ప్రయోజనాలు, మీకు కూడా తెలియదు !

|

భారతీయుల ఇష్టమైన కూరగాయలలో డ్రమ్-స్టిక్స్ (లేదా) మునగకాయలు ఒకటిగా ఉన్నాయి. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు దృష్ట్యా దీనిని సాంబార్, ఊరగాయల వంటి మొదలైన భారతీయ వంటలలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. దానిలో ఉండే పోషక విలువల వల్ల మునగచెట్టు ప్రతి భాగమైన పండు, ఆకులు, పువ్వులు మొదలైన వాటిని విరివిగా వినియోగిస్తారు.

కానీ ఈ మునగకాయలు మీ సౌందర్యాన్ని తీర్చిదద్దడంలో సహాయపడతాయని మీకు తెలుసా? అవును, మీరు చదివింది నిజమే. వీటిలో మీ సౌందర్యాన్ని పెంపొందించే అంశాలు ఉన్న కారణంగా వీటిని అనేక కాస్మెటిక్ ఉత్పత్తులలో ఉపయోగించడమనేది చాలా సాధారణ అంశంగా మారింది.

Beauty Benefits Of Drumsticks (Moringa)

మీ సౌందర్యాన్ని తీర్చిదద్దడంలో మునగకాయలు చాలా లాభాలను చేకూర్చేవిగా ఉన్నాయి. కాబట్టి మీ ఇంట్లోనే మునగకాయల ఫేస్-ప్యాక్ను తయారు చేసి వాడటానికి ప్రయత్నించి చూడండి.

* మొటిమలను నివారిస్తుంది :-

మునగకాయలు పింపుల్స్ను, మొటిమలను & చర్మ పగుళ్లను కలుగచేసే హానికరమైన అంశాలతో పోరాడుతుంది. దీని కోసం, మీ చర్మ ప్రభావిత ప్రాంతంలోని మునగతో చేసిన ఆయిల్ను అప్లై చేయాలి. మునగాకులతో చేసిన పేస్ట్ను మోటిమలు & పింపుల్స్ ఉన్న చోట అప్లై చేయడం వల్ల మీరు కోరుకున్న ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే, మునగలో యాంటీ-బాక్టీరియల్ & యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి మీ చర్మంపై ఏదైనా ఏర్పడిన వాపులను (లేదా) పగుళ్లను చికిత్స చేయడంలో సహాయపడుతుంది.

* మీ చర్మపు ఛాయను మెరుగుపరుస్తుంది :-

మచ్చలు, డార్క్ స్పాట్స్ & పిగ్మేంటేషన్ వంటి చర్మ సంబంధమైన రుగ్మతలకు చికిత్స చేయడం ద్వారా మీ చర్మపు ఛాయను మెరుగుపరచడంలో మునగకాయలు సహాయపడతాయి. మునగాకులతో తయారు చేసిన పేస్ట్ను మచ్చలు, డార్క్ స్పాట్స్ పై వాడండి. వేగవంతమైన ఫలితాల కోసం మీరు ఇదే పద్ధతిని వారంలో 2-3 సార్లు చెప్పున ఉపయోగించాలి.

* వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది :-

మునగకాయలు, చర్మపు వృద్ధాప్య ఛాయలను తగ్గించడంలో సహాయపడుతుంది. వీటిని తరచూగా ఉపయోగించడం వల్ల స్వేచ్ఛా రాడికల్ వల్ల నష్టం నుండి మీ చర్మాన్ని కాపాడుతుంది. ఇది మీ చర్మంపై ముడుతలను చారాల వంటి గీతలను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది మన చర్మాన్ని బలంగానూ & గట్టిగా ఉంచుతూ, చర్మము పాలిపోవడాన్ని నిరోధిస్తుంది. ఈ ప్రయోజనాలను పొందటం కోసం మునగ ద్వారా చెయ్యబడిన ఆయిల్ను & మునగాకులను మీరు ఉపయోగించవచ్చు.

* మృదువైన పెదాల కోసం :-

మునగలో ఉండే హైడ్రేటింగ్ లక్షణాలు మీ పెదాలను తేమగా ఉంచడంలో సహాయం చేస్తాయి. మునగలో ఉండే ఈ లక్షణాల కారణంగా, దీనిని పెదవి సంరక్షణ ఉత్పత్తుల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. మీరు పడుకోవడానికి వెళ్ళే ముందు ప్రతి రోజూ మీ పెదవులమీద కూడా మునగతో చేసిన ఆయిల్ను కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది మీ పెదాలను తేమగా ఉంచుతూ, మరింత మృదువుగా ఉండేటట్లు చేస్తుంది.

* పెద్ద చర్మ రంధ్రాలను తగ్గిస్తుంది :-

మునగ, మీ చర్మాన్ని మరింత ప్రకాశవంతంగా, అందంగా తయారు చెయ్యడంలో సహాయపడే కొల్లాజెన్ ఉత్పత్తిని మరింతగా పెంచడంలో సహాయపడుతుంది. చివరిగా, సంకోచానికి దారితీసే పెద్ద చర్మ రంధ్రాలను చిన్నవిగా చెయ్యడంలో మీకు ఇది బాగా సహాయపడుతుంది.

మీ ఇంట్లోనే, మునగకాయలతో ఫేస్ మాస్క్ను తయారు చేయడం ఎలా ?

కావలసినవి :-

½ టేబుల్ స్పూన్ మునగకాయల పౌడర్

1 టేబుల్ స్పూన్ పచ్చి తేనె

1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్

నిమ్మరసం (కొన్ని చుక్కలు)

ఎలా తయారు చెయ్యాలి :-

1. ఒక శుభ్రమైన గిన్నెలో మునగకాయల పౌడర్ను, పచ్చి తేనెను, రోజ్ వాటర్ను & నిమ్మ రసాన్ని వేసి బాగా మెత్తగా పేస్ట్లా కలుపుకోవాలి.

2. ఇలా తయారయ్యే పేస్ట్ మరింత మృదువుగా ఉండటానికి అవసరమైతే కొన్ని నీటి చుక్కలను కలపవచ్చు.

3. బాగా శుభ్రపరచుకున్న ముఖము & మెడ భాగాలలో ఈ పేస్ట్ మందపాటి పొరలా అప్లై చేయాలి.

4. అలా అప్లై చేసిన ఫేస్ మాస్క్ను 20 నిముషాల పాటు అలానే వదిలివేయండి, ఆ తరువాత నీటితో మీ చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి.

5. మీ శరీరం పొడిగా మారిన తర్వాత, మీకు ఇష్టమైన మాయిశ్చరైజర్తో మృదువుగా మసాజ్ చేయాలి.

English summary

Beauty Benefits Of Drumsticks (Moringa)

Drumsticks or moringa has always been one of the favourite vegetables of Indians. Drumstick is also becoming a common ingredient in cosmetic products these days because of its beauty enhancing properties. Improved skin tone, moisturised lips, anti-ageing, etc., are some of the benefits of using drumsticks.
Desktop Bottom Promotion