ఫేసియల్ మసాజ్ ద్వారా కలిగే ఈ ప్రయోజనాల గురించి మీరు తప్పక తెలుసుకోవాలి

Subscribe to Boldsky

ఫేసియల్ మసాజ్ వలన ఎన్నో సౌందర్య ప్రయోజనాలను పొందవచ్చు. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకునేందుకు ఇదొక చక్కని మార్గం. ఈ పురాతన పద్దతి ఇప్పటికీ ప్రాచుర్యంలోనే ఉంది. ఎంతో మంది ఈ స్కిన్ కేర్ మెథడ్ ని అనుసరించి వారి చర్మ సౌందర్యాన్ని పరిరక్షించుకుంటున్నారు.

ఫేసియల్ మసాజులను బ్యూటీ రొటీన్ లో భాగంగా చేసుకోమని ప్రపంచవ్యాప్తంగా స్కిన్ కేర్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా చర్మం ఆరోగ్యంగా అలాగే ప్రకాశవంతంగా తయారవుతుంది.

కేవలం ఫేసియల్ మసాజ్ ల కోసమే సెలూన్లను సందర్శిస్తారు. దీని వలన కలిగే బోలెడు సౌందర్య ప్రయోజనాలను పొందేందుకే బ్యూటీ కాన్షియస్ మహిళలు ఫేసియల్ మసాజ్ ను తమ బ్యూటీ రొటీన్ లో భాగంగా చేసుకుంటున్నారు. అయితే, ఫేసియల్ మసాజ్ ని ఇంటివద్దే సులభంగా చేసుకోవచ్చు. అలా ఇంటివద్దే ఫేసియల్ మసాజ్ ను చేసుకుంటే ఒకవైపు ఖర్చూ తగ్గుతుంది మరొకవైపు చర్మ సౌందర్యం మెరుగవుతుంది.

Benefits Of Facial Massage You Should Know About

ఒకవేళ, మీకు ఫేసియల్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు తెలియకపోతే ఈ పోస్ట్ ని తప్పక చదవండి. ఈ రోజు బోల్డ్ స్కై మీకోసం ఫేసియల్ మసాజ్ కు సంబంధించి అనేక విషయాలను మీ ముందుంచింది.

ఫేసియల్ మసాజ్ ద్వారా కలిగే బెనిఫిట్స్ వలన ఈ బ్యూటీ టెక్నీక్ ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించింది. అందువలన, మీరు కూడా ఈ బ్యూటీ టెక్నీక్ ని ఫాలో అయితే ఆ బెనిఫిట్స్ మీరు కూడా పొందవచ్చు.

ఫేసియల్ మసాజ్ మీ చర్మానికి ప్రశాంతతను అందించడంతో పాటు చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది. తద్వారా, మీ ఓవరాల్ అఫియరెన్స్ అనేది ప్లెజంట్ గా ఉంటుంది.

1. చర్మానికి రక్తప్రసరణని మెరుగుపరుస్తుంది

1. చర్మానికి రక్తప్రసరణని మెరుగుపరుస్తుంది

చర్మానికి రక్తప్రసరణని మెరుగుపరచడం ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. సరైన రక్తప్రసరణ వలన స్కిన్ సెల్స్ కి తగినంత పోషణ లభించి అవి ఉత్తేజంగా మారతాయి. తద్వారా, యవ్వనం ఉట్టిపడే చర్మం మీ సొంతమవుతుంది.

2. చర్మంపై వార్ధక్యపు ఛాయలను కనపడకుండా చేస్తుంది

2. చర్మంపై వార్ధక్యపు ఛాయలను కనపడకుండా చేస్తుంది

ఫేసియల్ మసాజ్ వలన కలిగే మరో అద్భుతమైన ప్రయోజనమిది. ఈ బ్యూటీ టెక్నీక్ వలన ముడతలు, ఫైన్ లైన్స్ వంటివి కనిపించవు. ఫైన్ లైన్స్ ఫార్మేషన్ ని తగ్గించి ముడతలని అరికడుతుంది. కళ్లచుట్టూ అలాగే నోటి చుట్టూ చర్మంపై ముడతలు, ఫైన్ లైన్స్ కనిపించవు.

3. కొలాజెన్ ఉత్పత్తిని వృద్ధి చేస్తుంది

3. కొలాజెన్ ఉత్పత్తిని వృద్ధి చేస్తుంది

చర్మంలోని కొలాజెన్ శాతం తగ్గిపోతే చర్మం అనేక సమస్యలతో సతమతమవుతుంది. అయితే, క్రమపద్దతిలో ఫేసియల్ మసాజ్ ను అందించడం వలన కొలాజెన్ నష్టాన్ని నివారించవచ్చు. తద్వారా, చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

4. చర్మంలోని ఎలాస్టిటీని మెరుగుపరుస్తుంది

4. చర్మంలోని ఎలాస్టిటీని మెరుగుపరుస్తుంది

చర్మంలోని ఎలాస్టిసిటీని ఫేసియల్ మసాజ్ మెరుగుపరుస్తుంది. ఈ సహజసిద్ధమైన పద్దతి వలన చర్మంలోని ఎలాస్టిసిటీ పుంజుకుంటుంది. తద్వారా, చర్మం బిగుతుగా అలాగే యవ్వనంగా కనిపిస్తుంది.

5. కళ్లకింద బ్యాగ్స్ ని అలాగే నల్లటి వలయాలని అరికడుతుంది

5. కళ్లకింద బ్యాగ్స్ ని అలాగే నల్లటి వలయాలని అరికడుతుంది

కళ్లకింద బ్యాగ్స్ తో పాటు నల్లటి వలయాలు చర్మంలోని వాటర్ రిటెన్షన్ వలన ఏర్పడతాయి. వాటర్ రిటెన్షన్ ని అరికట్టే ఒకానొక అత్యద్భుతమైన ప్రక్రియ మసాజ్. సరైన ఫేసియల్ మసాజ్ ద్వారా కంటి కింద ఫ్లూయిడ్ రిటెన్షన్ ని అరికట్టి కళ్లకింద బ్యాగ్స్ ని అలాగే నల్లటి వలయాలను తగ్గించుకోవచ్చు.

6. చర్మాన్ని డిటాక్సిఫై చేస్తుంది

6. చర్మాన్ని డిటాక్సిఫై చేస్తుంది

ప్రతిరోజూ చర్మరంధ్రాలలో ఎంతో కొంత టాక్సిన్స్ పేరుకుపోతాయి. కాలుష్యానికి చర్మం గురికావటం వలన ఇలా జరుగుతుంది. తద్వారా, మొటిమల సమస్య వేధిస్తుంది. అందువలన, చర్మాన్ని తరచూ డిటాక్సిఫై చేసుకోవడం ఎంతో ముఖ్యం. చర్మాన్ని మసాజ్ చేయడం ద్వారా చర్మాన్ని శుభ్రపరచుకోవచ్చు. చర్మరంధ్రాలలో పేరుకుపోయిన దుమ్మూ ధూళిని అలాగే టాక్సిన్స్ ని తొలగించుకుని మొటిమల సమస్యను నివారించవచ్చు.

7. ఫేసియల్ మజిల్స్ ని బిగుతుపరుస్తుంది

7. ఫేసియల్ మజిల్స్ ని బిగుతుపరుస్తుంది

ముఖంపై చర్మం సాగిపోవటం వలన మీరు అందవికారంగా కనిపిస్తారు. చర్మానికి మంచి మసాజ్ ని అందించడం ద్వారా ముఖంపై చర్మం కాంతివంతంగా అలాగే యవ్వనంగా తయారవుతుంది. అందువలన, ఈ బ్యూటీ టెక్నీక్ ని మీ బ్యూటీ రొటీన్ లో భాగం చేసుకోండి.

8. చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది

8. చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది

ఫేసియల్ మసాజ్ వలన చర్మంలోని కాంతి ఉట్టిపడుతుంది. అందువలన చర్మం నిస్తేజంగా మారినప్పుడు చాలా మంది స్కిన్ కేర్ ఎక్స్పర్ట్స్ ఫేసియల్ మసాజ్ ని సూచిస్తారు. ఈ టెక్నీక్ అనేది చర్మాన్ని లోపల నుంచి ఉత్తేజపరిచి కాంతివంతం చేస్తుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Benefits Of Facial Massage You Should Know About

    Skin care experts all over the world urge people to incorporate facial massages into their beauty routine. It can help your skin to stay healthy and look gorgeous.
    Story first published: Thursday, February 1, 2018, 8:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more