For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  చర్మ దద్దుర్ల నుండి ఉపశమనం పొందడానికి ఉత్తమ పరిష్కారాలు!

  By Ashwini Pappireddy
  |

  సాధారణంగా ఎక్కువ అసౌకర్యాన్ని కలిగించే చర్మ సమస్యలలో దద్దుర్లు కూడా ఒకటి. ఈ దద్దుర్లు మామూలుగా అలర్జీ వలన వస్తుంటాయి మరియు దీనివలన చర్మం ఎర్ర బడటం, దురద రావడం జరుగుతుంటుంది.

  ఈ రకమైన దద్దుర్లు మీ శరీరంలో ఏ భాగంలోలైనా రావచ్చు మరియు దీని చికిత్స దద్దుర్ల యొక్క తీవ్రత,లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. అలాకాకుండా దదుర్లు తీవ్రమైనప్పుడు ఆలస్యం చేయకుండా చర్మ వ్యాధి నిపుణుల్ని సంప్రదించడం మంచిది.

  ఏది ఏమైనా ఈ చర్మపు దద్దుర్లు అధిక శాతం వరకు తక్కువగానే ఉంటాయి. ఇవి మాములుగా మీ చర్మం కొన్ని అలర్జీ లకి గురవడం వలన ఇవి ఏర్పడుతూ ఉంటాయి. అలాగే సూర్య కిరణాలు, తామర వంటి ఇతర కారణాల వలన కూడా దదుర్లు ఏర్పడవచ్చు.

  Best Remedies To Get Relief From Skin Rashes

  ఈ చర్మ సమస్యను పరిష్కరించడానికి వివిధ రకాల క్రీమ్స్ దుకాణాల్లో అందుబాటులో ఉన్నప్పటికీ, వాటిలో అధికభాగం మంచి కంటే హానిని కలిగించే కఠినమైన రసాయనాలతో నిండి ఉంటాయి.

  అటువంటి రసాయనిక ఉత్పత్తులను ఉపయోగించటానికి బదులుగా, సహజమైన నివారణలను ఉపయోగించడం ఉత్తమం, ఇవి చర్మపు దద్దురును చికిత్స చేయటానికి మరియు ఏ విధంగా వ్యాప్తి చెందకుండా సంక్రమణను నివారించే శోథ నిరోధక మరియు క్రిమినాశక లక్షణాలతో నిండి ఉంటుంది.

  చర్మ దదుర్ల చికిత్స కోసం మరియు దానివలన ఏర్పడే ఎరువు, వాపు దురద నుండి మీకు ఉపశమనాన్నిచ్చే కొన్ని నివారణ పద్ధతులను మీకోసం తెలియజేయడం జరిగింది. ఇప్పుడు అవేంటో చదివి తెలుసుకుందాం.

  1. రోజ్ వాటర్

  1. రోజ్ వాటర్

  రోజ్ వాటర్ తరచుగా చర్మం దద్దుర్ల నుండి ఉపశమనం పొందడానికి ఉపయోగించబడే ఉత్తమ ఔషధంగా పరిగణించబడుతుంది. దదుర్లనుండి ఉపశమనం పొందడానికి మీరు కేవలం చేయాల్సిందల్లా దదుర్లు ఏర్పడిన ప్రాంతంలో ఈ రోజ్ వాటర్ ని అప్లై చేసి, 15-20 నిముషాల పాటు చర్మం మీద ఉండనిచ్చి తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.

  2. వోట్మీల్

  2. వోట్మీల్

  వోట్మీల్ చర్మం దద్దుర్ల నుండి ఓదార్పు నిస్తుంది మరియు దదుర్లు వ్యాపించకుండా అరికడుతుంది. దీనికోసం మీరు దదుర్లు ఏర్పడిన ప్రాంతంలో ఈ వోట్మీల్ ని అప్లై చేసుకొని 10 నిముషాల పాటు ఉంచి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోండి.

  3.ఆలివ్ ఆయిల్

  3.ఆలివ్ ఆయిల్

  ఆలివ్ నూనెలో వుండే పోషక విలువలు చర్మ సమస్యలని పోగొట్టడంలో ప్రభావవంతమైన పరిష్కారం గా చెప్పవచ్చు. కొంచం ఆలివ్ ఆయిల్ ని కాటన్ సహాయంతో తీసుకొని దదుర్లు ఏర్పడిన ప్రాంతంలో రాయండి. కనీసం 20 నిముషాల పాటు ఉండనిచ్చి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

  4. ఐస్ క్యూబ్స్

  4. ఐస్ క్యూబ్స్

  చర్మ సమస్యలకు ఐస్ క్యూబ్స్ అద్భుతంగా పనిచేస్తాయి. ఇది దదుర్లనుండి ఉపశమనం కలిగించి మీ చికాకుని తగ్గిస్తుంది మరియు ఇది ఇంకా ఎరుపు, వాపుని కూడా తగ్గిస్తుంది. దీనికోసం జస్ట్ మీరు చేయవలసిందల్లా ఒక శుభ్రమైన వస్త్రం లో చిన్న ముక్కని తీసుకొని దానిలో కొన్ని ఐస్ క్యూబ్స్ ని నింపి ప్రభావిత ప్రాంతంలో ఉంచండి. బాధించే దద్దుర్ల నుండి ఉపశమనం పొందటానికి ఈ పద్ధతిని రోజుకు అనేక సార్లు ప్రయత్నించండి.

  5. చమోమిలే టీ (చామంతి)

  5. చమోమిలే టీ (చామంతి)

  చమోమిలే టీ బాధించే, ఇబ్బందికి గురిచేసే చర్మ సమస్యల చికిత్స కోసం ఒక అద్భుతమైన పరిష్కారం గా చెప్పవచ్చు. ఈ మూలికా ఔషధం మీకు దురద మరియు వాపు నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. గమనించదగ్గ ఫలితాలను పొందడానికి చల్లార్చిన చమోమిలే టీ ని దదుర్ల ప్రాంతంలో రాయాలి.

  6. అలోవెరా జెల్

  6. అలోవెరా జెల్

  ఆల్మైటీ అలోవెరా జెల్ చర్మానికి ఉపశమనాన్ని కలిగించే లక్షణాలతో నిండివుంటుంది. ఇది చర్మం దద్దుర్ల నుండి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. అప్పుడే తీసిన అలోవెరా జెల్ ని దదుర్లు ఏర్పడిన ప్రాంతంలో రాసుకొని 20-25 నిముషాల పాటు వదిలివేయండి. తరువాత, మీ చర్మం నుండి జెల్ ని కడగడానికి చల్లని నీటిని ఉపయోగించండి.

  7. మజ్జిగ

  7. మజ్జిగ

  అలర్జీల వలన ఏర్పడే చర్మ సమస్యలని పరిష్కరించడానికి మజ్జిగ ఒక చక్కటి పరిష్కారం. దీనికి మీరు చేయాల్సిందల్లా మజ్జిగను దదుర్లు ఏర్పడిన ప్రాంతంలో రాసి 10-15 నిముషాల పాటు ఉండనిచ్చి తరువాత చల్లని నీటితో కడిగేయండి.

  8. ఆపిల్ సైడర్ వెనిగర్

  8. ఆపిల్ సైడర్ వెనిగర్

  యాపిల్ సైడర్ వినెగార్ లో వుండే క్రిమినాశక లక్షణాలు ఈ అసహ్యకరమైన మరియు బాధించే చర్మ సమస్యకు ఒక అద్భుతమైన పరిహారం. స్వేదనజలంతో ఆపిల్ సైడర్ వెనీగర్ కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక కాటన్ సహాయంతో దదుర్లు ఏర్పడిన ప్రాంతంలో రాయండి. కనీసం 5-10 నిమిషాల పాటు ఉండనిచ్చి తరువాత చల్లటి నీటితో చర్మాన్ని శుభ్రం చేసుకోండి.

  9. బాసిల్ ఆకులు

  9. బాసిల్ ఆకులు

  బాసిల్ ఆకులలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి ఇవి దదుర్ల వంటి చర్మ సమస్యకి చికిత్స చేయడంలో సహాయపడతాయి. దీనికోసం కొన్ని బాసిల్ ఆకులు లను క్రష్ చేసి నీటితో కలపాలి. ఈ పేస్ట్ ని దదుర్లు వున్న ప్రాంతంలో అప్లై చేయండి. 15 నిమిషాల తరువాత, చల్లని నీటితో శుభ్రం చేసుకోండి.

  దద్దుర్లు మరియు హోమ్ రెమెడీ నివారణల గురించి తెలుసుకోవడానికి మరింత చదవండి.

  English summary

  Best Remedies To Get Relief From Skin Rashes

  One skin problem that can cause a great deal of discomfort is a skin rash. A majority of these rashes are caused by allergens and can be characterized by inflamed, itchy and red skin.This type of rash can occur on any part of your body. And, its treatment would depend on the severity of the symptoms. In case of a
  Story first published: Wednesday, January 3, 2018, 8:30 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more