అలసిన మీ చర్మాన్ని ఈ టర్మరిక్ ఫేస్ పాక్స్ తో కాంతివంతంగా మార్చుకోండి

By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

పసుపు అనేది భారతీయ మహిళల చర్మ సౌందర్యంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఈ పదార్థాన్ని సౌందర్య పదార్థంగా భారతీయ మహిళలు ఎంతో కాలం నుంచి వాడుతూ రావడం మనకు తెలిసిన విషయమే. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ పసుపులో పుష్కలంగా లభిస్తాయి. వివిధ చర్మసమస్యలు పారద్రోలే శక్తి పసుపులో అధికంగా కలదు. అందువలన, దీనిని మిరకిల్ బ్యూటీ ఇంగ్రిడియెంట్ అని ముద్దుగా పిలుస్తారు.

మొటిమలపై పోరాటం కానివ్వండి, అలసిన చర్మాన్ని ఉత్తేజపరచడానికై కానివ్వండి ఎటువంటి చర్మ సమస్యనైనా పసుపు అరికడుతుందనడం అతిశయోక్తి కాదు. ఇప్పుడు చెప్పుకోబడిన చర్మసమస్యలనేవి మహిళలలో కామన్. ముఖ్యంగా, డల్ గా ఉండే చర్మంపై ఇవి ఎక్కువగా దాడి చేస్తాయి.

రోజువారి గజిబిజి షెడ్యూల్ వలన చర్మానికి తగిన సంరక్షణను అందించడం మనకు సులభం కాదు. తద్వారా, చర్మం నిస్తేజంగా మారుతుంది. అందువలన, మేకప్ ని దట్టంగా వేయడం అవసరపడుతుంది. అలా అసహజంగా చర్మాన్ని కాంతివంతంగా చేసేందుకు మనం మేకప్ పై ఆధారపడతాము.

అయినప్పటికీ, పసుపుని వాడటం ద్వారా చర్మాన్ని కాంతివంతంగా చేయవచ్చన్న సంగతిని మనం మరచిపోకూడదు. ఈ రోజు, బోల్డ్ స్కై లో పసుపుని వివిధ విధాలుగా వాడే మార్గాలను స్పష్టంగా వివరించాము. తద్వారా, చర్మంలోని సహజ కాంతిని పెంపొందించుకోవచ్చు. పసుపు ద్వారా కలిగే ప్రయోజనాలకు ఏ ఇతర కాస్మెటిక్ కూడా సాటి రాదు.

స్కిన్ కాంప్లెక్షన్ ని తక్షణమే మెరుగుపరుచుకోవడానికి ఇక్కడ సూచించబడిన పాక్స్ ని ప్రయత్నించండి. ఈ పేస్ పాక్స్ గురించి ఇక్కడ తెలుసుకోండి.

 ప్యాక్ 1: టర్మరిక్ పౌడర్, శెనగపిండి మరియు రోజ్ వాటర్

ప్యాక్ 1: టర్మరిక్ పౌడర్, శెనగపిండి మరియు రోజ్ వాటర్

కావలసిన పదార్థాలు:

చిటికెడు టర్మరిక్ పౌడర్

అర టీస్పూన్ శెనగపిండి

ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్

ఎలా వాడాలి:

ఈ పదార్థాలని బాగా కలిపి మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. ఈ ప్యాక్ ని తడి చర్మంపై సున్నితంగా అప్లై చేయాలి.

దాదాపు పదిహేను నిమిషాల వరకు ఈ ప్యాక్ ని తొలగించవద్దు.

ఆ తరువాత ప్యాక్ ని తొలగించి తేలికపాటి స్కిన్ టోనర్ ని అప్లై చేయాలి.

ప్యాక్ 2: టర్మరిక్ పౌడర్, లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ మరియు యోగర్ట్

ప్యాక్ 2: టర్మరిక్ పౌడర్, లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ మరియు యోగర్ట్

కావలసిన పదార్థాలు:

చిటికెడు టర్మరిక్ పౌడర్

రెండు లేదా మూడు డ్రాప్స్ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్

రెండు టీస్పూన్ల యోగర్ట్

ఎలా వాడాలి:

ఈ పదార్థాలని ఒక పాత్రలోకి తీసుకుని బాగా కలిపి స్కిన్ బ్రైటెనింగ్ ప్యాక్ ను తయారుచేసుకోండి.

ఈ ప్యాక్ ను చర్మంపై సున్నితంగా అప్లై చేసి పదినిమిషాల పాటు అలాగే ఉండనివ్వండి.

ఆ తరువాత గోరువెచ్చటి నీటితో ఈ ప్యాక్ ను తొలగించుకోండి.

ప్యాక్ 3: టర్మరిక్ పౌడర్ మరియు తేనె

ప్యాక్ 3: టర్మరిక్ పౌడర్ మరియు తేనె

కావలసిన పదార్థాలు:

చిటికెడు టర్మరిక్ పౌడర్

ఒకటి టేబుల్ స్పూన్ తేనే

ఎలా వాడాలి:

ఈ పదార్థాలని బాగా కలిపి అద్భుతమైన ఫేస్ ప్యాక్ ను సిద్ధం చేసుకోండి.

ఈ ప్యాక్ ను బాగా అప్లై చేసుకోండి.

పదినిమిషాల తరువాత గోరువెచ్చటి నీటిని ఉపయోగిస్తూ ఈ ప్యాక్ ను తొలగించుకోండి.

 ప్యాక్ 4: టర్మరిక్ పౌడర్, ఆలివ్ ఆయిల్ మరియు శాండల్వుడ్ పౌడర్

ప్యాక్ 4: టర్మరిక్ పౌడర్, ఆలివ్ ఆయిల్ మరియు శాండల్వుడ్ పౌడర్

కావలసిన పదార్థాలు:

చిటికెడు టర్మరిక్ పౌడర్

ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్

అర టీస్పూన్ శాండల్వుడ్ పౌడర్

ఎలా వాడాలి:

ఈ పదార్థాలని బాగా కలిపి చర్మ కాంతిని మెరుగుపరిచే అద్భుతమైన ఫేస్ ప్యాక్ ను సిద్ధం చేసుకోండి.

ఈ ప్యాక్ ను ఒక లేయర్ లా బాగా అప్లై చేసుకోండి.

పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో ఈ ప్యాక్ ను తొలగించుకోండి.

 ప్యాక్ 5: టర్మరిక్ పౌడర్ మరియు పాలు

ప్యాక్ 5: టర్మరిక్ పౌడర్ మరియు పాలు

కావలసిన పదార్థాలు:

తగినంత టర్మరిక్ పౌడర్

రెండు టీస్పూన్ల పాలు

ఎలా వాడాలి:

ఈ పదార్థాలని బాగా కలిపి తయారైన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి.

ఆ తరువాత పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఈ ప్యాక్ ని తొలగించకూడదు.

ఇరవై నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో ఈ ప్యాక్ ను తొలగించుకోవాలి. ఆ తరువాత తేలికపాటి మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి.

ప్యాక్ 6: టర్మరిక్ పౌడర్ మరియు ఆల్మండ్ ఆయిల్

ప్యాక్ 6: టర్మరిక్ పౌడర్ మరియు ఆల్మండ్ ఆయిల్

కావలసిన పదార్థాలు:

చిటికెడు టర్మరిక్ పౌడర్

ఒక టీస్పూన్ ఆల్మండ్ ఆయిల్

ఎలా వాడాలి:

పైన పేర్కొనబడిన పదార్థాలను బాగా కలిపి పేస్ట్ లా తయారుచేసుకోవాలి.

ఈ ప్యాక్ ని ముఖానికి అలాగే మెడకు అప్లై చేసుకోవాలి.

పదినిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో ప్యాక్ ను తొలగించుకోవాలి.

ప్యాక్ 7: టర్మరిక్ పౌడర్ మరియు ఎగ్ వైట్

ప్యాక్ 7: టర్మరిక్ పౌడర్ మరియు ఎగ్ వైట్

కావలసిన పదార్థాలు:

చిటికెడు టర్మరిక్ పౌడర్

ఒక ఎగ్ వైట్

ఎలా వాడాలి:

ఒక పాత్రలోకి ఎగ్ వైట్ ను తీసుకుని అందులో టర్మరిక్ పౌడర్ ను కలపాలి.

ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఫేస్ ప్యాక్ లా అప్లై చేసుకోండి.

ఇరవై నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో మీ ముఖాన్ని శుభ్రపరుచుకోండి.

ప్యాక్ 8: టర్మరిక్ పౌడర్, లెమన్ జ్యూస్ మరియు అలోవెరా జెల్

ప్యాక్ 8: టర్మరిక్ పౌడర్, లెమన్ జ్యూస్ మరియు అలోవెరా జెల్

కావలసిన పదార్థాలు

చిటికెడు టర్మరిక్ పౌడర్

ఒక టీస్పూన్ లెమన్ జ్యూస్

ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్

ఎలా వాడాలి:

ఒక పాత్రలోకి ఈ పదార్థాలని తీసుకొని బాగా కలపండి. స్పూన్ ని ఉపయోగిస్తే బాగా కలుస్తాయి.

ఈ మెటీరియల్ ని ముఖానికి అప్లై చేయండి. మెడపై కూడా అప్లై చేయండి.

పది నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో ఈ ప్యాక్ ను తొలగించండి.

English summary

Brighten Tired Skin With These Effective Turmeric Face Packs

Indian women have always used turmeric for its numerous skin benefits. A treasure trove of powerful antioxidants, this natural ingredient is often hailed as a miracle-worker for various skin-related issues.
Story first published: Monday, February 5, 2018, 14:00 [IST]
Subscribe Newsletter