For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  కేవలం 7 రోజుల్లో మీ చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోండి !

  |

  ప్రకాశవంతమైన, స్పష్టమైన, దోషరహితమైన చర్మమును కలిగి ఉండాలని ప్రతి అమ్మాయి కలలు కంటుంది. కాలుష్యము, UV వంటి హానికరమైన కిరణాల వంటి పర్యావరణ కారకాల వల్ల మీ చర్మము సహజ స్థితిని కోల్పోతుంది. అనిశ్చయమైన జీవనశైలి, క్రమరహితమైన ఆహార పద్ధతుల వంటి ఇతర కారణాల చేత ఆకర్షణగా లేని అసమతుల్యమైన స్కిన్ టోన్కు దారితీస్తుంది.

  మీ చర్మం సహజమైన నిగారింపును కలిగి ఉండటం కోసం మీరు అనేక రకాల రసాయనిక చికిత్సలను (లేదా) వివిధ రకాల సౌందర్య సాధనాలను ఉపయోగిస్తున్నాము. ఈ రకమైన చర్యల వల్ల మీ చర్మానికి మరింత నష్టం వాటిల్లగలదు. ఏదేమైనప్పటికీ సహజమైన పరిష్కార మార్గాలను అనుసరించడం ఎంతో మంచిది, అవి దీర్ఘకాలిక లాభాలను కూడా కలుగజేస్తాయి.

  Brighten Your Skin Within 7 Days

  ఇక్కడ మీ చర్మ సౌందర్యాన్ని మరింత తెల్లగా, మృదువుగా పెంపొందించుకోవడానికి 5 సులభమైన చికిత్స మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అవి

  1. బియ్యంపిండి + పాలుతో చేసిన ఫేస్ ప్యాక్ :-

  1. బియ్యంపిండి + పాలుతో చేసిన ఫేస్ ప్యాక్ :-

  బియ్యంపిండి ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ & స్కిన్ వైటనింగ్ ఏజెంట్లను కలిగి ఉండటంవల్ల, మీ చర్మానికి ఉపశమనాన్ని కలిగించి ప్రకాశవంతమైన, మృదువైన చర్మాన్ని మీకు అందిస్తుంది. మీ చర్మాన్ని హైడ్రేట్గా చేయడంలో సహాయపడుతూ, మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

  కావలసిన పదార్థాలు :

  3 టేబుల్ స్పూన్లు : బియ్యంపిండి

  2-3 టేబుల్ స్పూన్లు : పాలు

  తయారీ విధానం :

  • ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని తీసుకోండి. ( మీ దగ్గర బియ్యం పిండి లేకపోతే, పచ్చి బియ్యాన్ని తీసుకుని మెత్తగా ఆడించండి)

  • బియ్యం పిండికి 2-3 టేబుల్ స్పూన్ల పాలను కలపి, మెత్తని పేస్టులా చేయండి.

  • ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి, 20-30 నిమిషాల వరకు అలానే వదిలేయండి.

  • గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి.

  మంచి ఫలితాలను పొందడం కోసం వారంలో మూడుసార్లు ఈ విధంగా ప్రయత్నించండి.

  2. పొటాటో జ్యూస్ :-

  2. పొటాటో జ్యూస్ :-

  బంగాళాదుంపలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం చేత, అవి చర్మ కాంతిని ప్రకాశించేలా చేయడంలో సహాయపడతాయి. ఇందులో బ్లీచింగ్ ఏజెంట్లను కలిగి ఉండటం చేత చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది.

  కావలసిన పదార్థాలు :

  1 బంగాళాదుంప

  తయారీ విధానం :

  • బంగాళదుంపలను చిన్న ముక్కలుగా కట్ చేయండి.

  • ఆ ముక్కలను బాగా గ్రైండ్ చేసి జ్యూసును సేకరించండి.

  • ఆ రసంలో దూదిని ముంచి మీ ముఖానికి అప్లై చేయండి.

  • అప్లై చేసిన తర్వాత, ఆ రసం మీ ముఖంలోకి బాగా ఇంకేలా 15-20 నిమిషాల వరకు అలానే వదిలివేయండి.

  • ఆ తర్వాత నీటితో మీ ముఖాన్ని శుభ్రపరచుకోండి.

  మీ ముఖాన్ని శుభ్రపరిచిన తర్వాత చర్మం పొడిగా మారే అవకాశం ఉంది కాబట్టి మాయిశ్చరైజర్ను అప్లై చేయండి. వారానికి మూడుసార్లు ఈ విధంగా చేయండి.

  3. బేకింగ్ సోడా స్క్రబ్ :-

  3. బేకింగ్ సోడా స్క్రబ్ :-

  చనిపోయిన చర్మకణాలను తొలగించడంలో సహాయపడే లక్షణాలను బేకింగ్ సోడా కలిగి ఉంది, అంతేకాకుండా ఇది హానికరమైన బ్యాక్టీరియాను చంపే ఈ ముఖాన్ని తాజాగా, ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది.

  కావలసినవి :

  2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా

  తగినంత నీరు

  తయారి విధానం :

  • ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూను బేకింగ్ సోడాకు తీసుకొని, దానికి తగినంత నీరును జత చేసి బాగా కలపాలి.

  • వృత్తాకార కదలికలో ఈ పేస్టుని ముఖానికి అప్లై చేయాలి.

  • ఈ ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసి, మాయిశ్చరైజర్ను అప్లై చేయాలి.

  మీరు ఈ పద్ధతిని పూర్తిగా 2 వారాల వరకు ఆచరించడం వల్ల కలిగే ఫలితాలలో తేడాను మీరే చూస్తారు. సున్నితమైన చర్మం & మొటిమల చర్మం గలవారు మాత్రం ఈ పద్ధతిని మాత్రం అస్సలు అనుసరించవద్దు.

  4. ఓట్మీల్ ఫేస్-ప్యాక్ :-

  4. ఓట్మీల్ ఫేస్-ప్యాక్ :-

  ఓట్మీల్ లో ఉండే ఎక్స్ఫోలియాటింగ్ ఏజెంట్లు చనిపోయిన కణాలను తీసివేసే గుణాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఇది మీ చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా కనిపించేలా చేసే లక్షణాలను కూడా కలిగి ఉంటుంది

  కావలసినవి :

  3 టేబుల్ స్పూన్ల ఓట్స్

  2-3 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్

  తయారీ విధానం :

  • ఓట్మీల్ను గ్రైండర్లో వేసి మెత్తని పౌడర్లా చేయాలి

  • ఓట్మీల్ పౌడర్కు రోజ్ వాటర్ని కలిపి మెత్తని పేస్టులా తయారు చేసుకోండి.

  • ఈ పేస్టును మీ ముఖం మెడ భాగాల్లో అప్లై చేయాలి.

  • అది బాగా ఆరేలా 15 నిమిషాల వరకు ఉంచి ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయండి.

  మెరుగైన ఫలితాల కోసం దీనిని వారానికి రెండు సార్లు అప్లై చేయండి.

  5. యోగర్ట్ (పెరుగు) ప్యాక్ :

  5. యోగర్ట్ (పెరుగు) ప్యాక్ :

  మీ చర్మంలో ఉన్న మురికిని, మలినాలను తొలగించడంలో పెరుగు బాగా సహాయపడుతుంది.

  మీ ముఖం కాంతివంతంగా, శుభ్రంగా ఉంచుతుంది.

  కావలసినవి :

  2 టేబుల్ స్పూన్ల పెరుగు

  1 టేబుల్ స్పూన్ల తేనె

  తయారీ విధానం :

  • ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ల తేనెను, 2 టేబుల్స్పూన్ల పెరుగుకు కలిపి మెత్తని పేస్టులా తయారు చేసుకోండి.

  • ఈ పేస్టును ముఖము మరియు మెడ మీద అప్లై చేయాలి.

  • అప్లై చేసిన 30 నిమిషాల వరకు దానిని అలాగే వదిలి వేయండి.

  • ఆ తర్వాత చల్లని నీటితో మీ ముఖాన్ని శుభ్రపరచుకోవాలి.

  వేగవంతమైన ఫలితాల కోసం ఈ ఫేస్ ప్యాక్ను ప్రతిరోజూ పాటించాలి.

  English summary

  Brighten Your Skin Within 7 Days

  Brighten Your Skin Within 7 Days ,Bright, clear and flawless skin is every girl's dream. But, sometimes, our skin gets damaged or loses its tone due to several reasons like environmental factors, including pollution, harmful UV rays, etc. Other reasons could be our lifestyle, improper diet, etc., which lead to an imb
  Story first published: Tuesday, April 24, 2018, 15:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more