For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొటిమల యొక్క మచ్చల నివారణకు ఈ DIY మాస్కును ఉపయోగించి చూడండి!

|

మొటిమలు మరియు మొటిమల వలన కలిగే మచ్చలు కన్నా భయంకరమైన మరియు చికాకు కలిగించే చర్మ సమస్యలు ఏముంటాయి? వీటి చికిత్సకు ఎన్నో రకాల రసాయన ఉత్పత్తులు దొరుకుతున్నప్పటికీ, ఇవి చర్మానికి వేరే విధమైన నష్టాన్ని కలుగజేస్తాయి. అయితే, మనకు మరొక ప్రత్యామ్నాయమే లేదా? చింతించకండి! దీనికి పరిష్కారం మన వంటగదిలోనే ఉంది.

ఆశ్చర్యంగా ఉందా? అవును. మీరు చదివింది నిజమే! చర్మంపై ఏర్పడే మొటిమల యొక్క మచ్చల చికిత్సలో మీకు సహాయం అందించే, సహజ పదార్ధాలను ఉపయోగించి తయారు చేసే ఒక DIY (మీకు మీరుగా తయారు చేసుకునే) నివారణ గురించి ఇప్పుడు తెలియజేయబోతున్నాము.

మొటిమల యొక్క మచ్చల నివారణకు ఈ DIY మాస్కును ఉపయోగించి చూడండి!

మచ్చలు చికిత్సకు కావలసిన పదార్థాలు ఏమిటో మరియు వాటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం!

కావలసిన పదార్థాలు:

కావలసిన పదార్థాలు:

½ స్పూన్ పసుపు పొడి

1 స్పూన్ దాల్చిన చెక్క పొడి

1 టేబుల్ స్పూన్ తేనె

కొన్ని చుక్కల నిమ్మ రసం

ఎలా తయారు చెయ్యాలి?

ఎలా తయారు చెయ్యాలి?

ఒక శుభ్రమైన గిన్నెలో, పసుపును తీసుకోండి. పసుపును అతిగా వేస్తే, మీ చర్మం పసుపురంగులోకి మారుతుంది కనుక దీనిని కొద్ది మొత్తంలోనే వేయాలి.

2. తరువాత, అదే గిన్నెలో దాల్చిన చెక్క పొడి వేయండి.

3. ఈ మిశ్రమంలో తేనెని వేసి, అన్ని పదార్ధాలను చక్కగా కలపండి.

4.ఆఖరుగా, మిశ్రమంలో నిమ్మరసం వేసి బ్లెండ్ చేయండి. ఇప్పుడు మీ ఫేస్ ప్యాక్ ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నట్లే!

5. మీరు దీన్ని ఒక సీసాలో నిల్వ చేసి, మీకు నచ్చినప్పుడు ఉపయోగించవచ్చు.

ఎలా వాడాలి?

ఎలా వాడాలి?

1. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని ప్రభావిత ప్రాంతం మీద లేదా మొత్తం ముఖం అంతటా గాని రాసుకోండి.

2. 15-20 నిముషాల పాటు ఆరనివ్వండి.

3. తరువాత, సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుని, పొడిగా తుడుచుకోవాలి.

4. మీ చర్మం నిమ్మకాయ ప్రభావం వల్ల పొడిగా ఉన్నట్లు అనిపిస్తే, మాయిశ్చరైజర్ ను కూడా రాసుకోవచ్చు.

5. మరీంత మెరుగైన ఫలితాలు త్వరగా రావాలంటే, ఇలా వారానికి ఒకసారి చేయండి.

గమనిక: ఈ DIY మాస్కు చర్మంపై దురద కలిగించే అవకాశం ఉంటుంది కనుక, సున్నితమైన చర్మం ఉన్నవారు ఈ మాస్కును ఉపయోగించరాదు. అంతేకాకుండా, ఎక్కువసేపు దీనిని చర్మంపై వదిలివేయవద్దు.

ఈ మాస్కును ప్రయత్నించిన తరువాత, మీకు కలిగిన అనుభవాన్ని మాకు తెలియజేయండి.

పసుపు వలన కలిగే ప్రయోజనాలు:

పసుపు వలన కలిగే ప్రయోజనాలు:

పసుపు యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీసెప్టిక్ లక్షణాలు ఉన్నందున, ఇది చర్మ వ్యాధుల చికిత్సలో ఉపయోగపడుతుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్స్, చర్మంపై మచ్చలను తెలికపరిచి, మేనిఛాయను మెరుగుపరుస్తుంది. చర్మం యొక్క మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. మొత్తంమీద పసుపు, మొటిమలు మచ్చలను సమర్థవంతంగా నివారించడంలో సహాయపడుతుంది.

దాల్చిన చెక్క పొడి వలన కలిగే ప్రయోజనాలు:

దాల్చిన చెక్క పొడి వలన కలిగే ప్రయోజనాలు:

దాల్చినచెక్కలో యాంటీసెప్టిక్, యాంటీఫంగల్ మరియు యాస్ట్రిజెంట్ లక్షణాలు చర్మంపై అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా దీనిలోని మృతచర్మకణాలను తొలగించే గుణం, చర్మానికి లోతైన పోషణను ఇచ్చి, సమతుల మేనిఛాయ కలిగించడంతో పాటు నల్లని మచ్చలను తేలికపరుస్తుంది.

 నిమ్మ రసం వలన కలిగే ప్రయోజనాలు:

నిమ్మ రసం వలన కలిగే ప్రయోజనాలు:

సిట్రస్ జాతి పండు అయిన నిమ్మకాయలో, విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మేనిఛాయను మెరుగుపరచడంతో పాటుగా, మీ ముఖం మీద పేరుకున్న మృతచర్మకణాలను తొలగిస్తుంది. ఇది మొటిమలు తగ్గేందుకు సహాయపడే యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది.

 తేనె వలన కలిగే ప్రయోజనాలు:

తేనె వలన కలిగే ప్రయోజనాలు:

తేనెలో మొటిమలను నయం చేసే గుణం, మొటిమల చికిత్సలో సహాయపడుతుంది. ఇది మూసుకుపోయిన రంధ్రాలను తెరిచి, చర్మానికి తేమను అందిస్తుంది. మొటిమల వలన కలిగే నొప్పిని, నయం చేయడంలో కూడా తేనె సహాయపడుతుంది.

English summary

DIY Remedy To Treat Acne Spots

What is more frightening and irritating than pimple/acne spots? Though we have numerous chemicals to treat these we also know the damage that all these cause. So now, what is the alternative? Do not worry, as we have the solution for these stubborn spots right in your kitchen. You can easily make a mask using ingredients like turmeric, honey, etc.
Story first published: Thursday, August 23, 2018, 18:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more