నిస్తేజంగా మారిన పొడిబారిన చర్మాన్ని తిరిగి ప్రకాశవంతంగా మార్చేందుకై DIY శాండల్వుడ్ మరియు కర్డ్ ఫేస్ ప్యాక్

Subscribe to Boldsky

డ్రై మరియు ఫ్లేకీ స్కిన్ సమస్య ఎంతో చికాకును కలిగిస్తుంది. కొన్ని సార్లు, ఈ సమస్య మరింత జఠిలంగా మారే ప్రమాదం ఉంది. అందుకే చర్మానికి తగిన సంరక్షణను అందించాలి. చర్మానికి తగిన సంరక్షణను అందించకపోతే స్కిన్ క్రాక్స్ కు గురయ్యి చర్మం మరింతగా దెబ్బతింటుంది. అసలీ డ్రైనెస్ కు కారణమేంటి? చల్లటి ఉష్ణోగ్రత, తగినన్ని నీళ్లు తీసుకోకపోవడం, ఒత్తిడి, నిద్రలేమి, పొల్యూషన్, స్మోకింగ్, ఎక్కువగా మ్యాటే మేకప్ ని వేసుకోవడం, అనారోగ్యకరమైన డైట్ వంటివి డ్రైనెస్ కు కారణమవుతాయి.

డ్రై స్కిన్ వలన దురద మొదలవుతుంది. దురద వలన చర్మాన్ని స్క్రాచ్ చేస్తే చర్మం మరింత దెబ్బతింటుంది. చర్మం థిక్ గా అలాగే డార్క్ గా మారుతుంది. అతిగా పొడిబారటం వలన స్కిన్ క్రాక్స్ కు గురవుతుంది. ఈ విధంగా డ్రై స్కిన్ సమస్య అనేది చర్మాన్ని మరింత నిస్తేజంగా మార్చుతుంది.

DIY Sandalwood And Curd Face Pack For Dull And Dry Skin

అటువంటి చర్మాన్ని మీరు కోరుకోవట్లేదు కదూ? అయితే, ఇంకా సమయం మించిపోలేదు. ఇప్పటినుంచైనా, చర్మ సంరక్షణ విషయంలో అశ్రద్ధ వహించకండి. పొడిబారిన చర్మం సమస్యను తగ్గించుకునేందుకు కేవలం మాయిశ్చరైజర్స్ తోడ్పడవు. చర్మం స్మూత్ గా అలాగే కాంతివంతంగా మారాలంటే మరింత కేర్ ను మీరు చర్మంపై ప్రదర్శించాలి.

కాబట్టి, ఈ శాండల్వుడ్ మరియు కర్డ్ ఫేస్ ప్యాక్ ను ప్రయత్నించండి. ఇది మీ చర్మానికి తగిన పోషణను అందిస్తుంది. తద్వారా, చర్మానికి తగినంత తేమ లభిస్తుంది. పొడిబారే సమస్య తగ్గుముఖం పడుతుంది. హోంమేడ్ ఫేస్ ఫ్యాక్స్ ను వాడటం చర్మానికి సురక్షితం. మార్కెట్ లో లభించే ప్యాక్స్ ను వాడితే వాటిలో నుండే హానికర కెమికల్స్ వలన చర్మం మరింత దెబ్బతింటుంది. హోంమేడ్ ప్యాక్స్ ను వాడితే చర్మం ప్రశాంతపడుతుంది.

శాండల్వుడ్ లో చర్మసంరక్షణ గుణాలు అనేకం ఉన్నాయి. ఇందులో సూతింగ్ మరియు కూలింగ్ ప్రాపర్టీస్ కలవు. ఇవి డ్రై మరియు డల్ స్కిన్ ప్రాబ్లెమ్ ని అరికట్టేందుకు చక్కగా తోడ్పడతాయి. ర్యాషెస్ ను అలాగే బ్లేమిషెస్ ను హీల్ చేయడంతో పాటు ట్యాన్ ను తగ్గించడం అలాగే చర్మాన్ని మరింత కాంతివంతంగా మార్చడంలో శాండల్వుడ్ తనదైన పాత్ర పోషిస్తుంది.

పెరుగులో మంచి బాక్టీరియా లభిస్తుంది. ఇది చర్మానికి పోషణని అందిస్తుంది. అంతేకాక, ఇందులో ప్రోటీన్స్, విటమిన్ డి మరియు కేల్షియం లభిస్తాయి. ఇవి మీ కాంప్లెక్షన్ ను మరింత మెరుగ్గా చేస్తాయి.

పెరుగులో లభించే ల్యాక్టిక్ యాసిడ్ అనేది అద్భుతమైన ఎక్స్ఫోలియేటర్ లా పనిచేసి డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడానికి తోడ్పడుతుంది. అదే సమయంలో చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది.

కాబట్టి, ఈ రెండు పదార్థాలతో తయారుచేయబడిన ఈ ఫేస్ ప్యాక్ అత్యద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. శాండల్వుడ్ మరియు కర్డ్ ను కలిపి తయారుచేసిన ఈ ప్యాక్ ను చర్మానికి అప్లై చేస్తే డల్ మరియు డ్రై స్కిన్ సమస్య వేధించదు. శాండల్వుడ్ మరియు కర్డ్ ఫేస్ ప్యాక్ ను ఏ విధంగా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ లో ఇక్కడ వివరించాము. వీటిని పరిశీలించండి మరి.

శాండల్వుడ్, తేనె మరియు కర్డ్ ఫేస్ ప్యాక్:

శాండల్వుడ్, తేనె మరియు కర్డ్ ఫేస్ ప్యాక్:

శాండల్వుడ్ పౌడర్ లో చర్మానికి ప్రయోజనాలను చేకూర్చే అనేక గుణాలు కలవు. చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడానికి, మాయిశ్చరైయిజ్ చేయడానికి అలాగే స్కిన్ టోన్ ను మెరుగుపరచేందుకు ఈ గుణాలు తోడ్పడతాయి. డ్రై స్కిన్ వలన చర్మం నిస్తేజంగా మారుతుంది. కొన్ని సార్లు చర్మం ఎర్రగా మారడంతో దురద సమస్య వేధిస్తుంది. కాబట్టి, శాండల్వుడ్ అనేది చర్మాన్ని ప్రశాంతపరచి కాంతివంతంగా మార్చేందుకు తోడ్పడుతుంది.

పెరుగు

పెరుగు

పెరుగులో మిల్క్ ప్రోటీన్స్ కలవు. ఇవి చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేసేందుకు అలాగే మాయిశ్చర్ చేసేందుకు తోడ్పడతాయి. చర్మాన్ని మృదువుగా అలాగే కాంతివంతంగా మార్చుతాయి.

తేనె

తేనె

తేనె నేచురల్ హ్యుమెక్టన్ట్ గా పనిచేస్తుంది. అంటే గాలిలోని తేమను గ్రహించి చర్మానికి అందిస్తుంది. తద్వారా చర్మం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండేందుకు తోడ్పడుతుంది. తద్వారా, చర్మం పొడిబారే సమస్య తగ్గుముఖం పడుతుంది.

డ్రై స్కిన్ వలన స్కిన్ ఇరిటేషన్ మరియు డల్ నెస్ సమస్య

డ్రై స్కిన్ వలన స్కిన్ ఇరిటేషన్ మరియు డల్ నెస్ సమస్య

డ్రై స్కిన్ వలన స్కిన్ ఇరిటేషన్ మరియు డల్ నెస్ సమస్య వేధిస్తుంది. కాబట్టి తేనె వలన చర్మం కాంతివంతంగా అలాగే ప్రకాశవంతంగా మారుతుంది. తేనెలో లభ్యమయ్యే యాంటీబాక్టీరియల్ ప్రాపర్టీలు చర్మాన్ని ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షిస్తాయి.

కాబట్టి, తేనెను శాండల్వుడ్ మరియు పెరుగుతో కలిపినప్పుడు అద్భుతమైన ఫేస్ ప్యాక్ తయారవుతుంది. ఇది డ్రై మరియు డల్ స్కిన్ నుంచి రక్షణను అందిస్తుంది. ఈ కింద ఇవ్వబడిన సూచనలను పాటించడం ద్వారా ఈ ఫేస్ ప్యాక్ ను తయారుచేసుకోండి.

కావలసిన పదార్థాలు:

కావలసిన పదార్థాలు:

ఒక టేబుల్ స్పూన్ శాండల్వుడ్ పౌడర్

ఒక టీస్పూన్ పుల్లటి పెరుగు

అరటీస్పూన్ తేనె

ఎలావాడాలి:

ఎలావాడాలి:

• ఒక చిన్న పాత్రను తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ శాండల్వుడ్ పౌడర్ ను అలాగే ఒక టీస్పూన్ పుల్లటి పెరుగును జోడించాలి. వీటితో పాటు అర టీస్పూన్ తేనెను కూడా కలపాలి.

• ఈ పదార్థాలన్నిటినీ బాగా కలపాలి. అప్పుడు, చిక్కటి మిశ్రమం తయారవుతుంది.

• ఈ ఫేస్ ప్యాక్ ను ముఖానికి అలాగే మెడకు ఈవెన్ గా అప్లై చేయాలి.

• ఈ ప్యాక్ ను ముఖంపై ముప్పై నిమిషాల నుంచి గంట పాటు అలాగే ఉండనివ్వండి.

• ఆ తరువాత నార్మల్ వాటర్ తో వాష్ చేయండి.

• ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి ఒకటి లేదా రెండు సార్లు వాడితే కాంతివంతమైన అలాగే ఆరోగ్యమైన చర్మం మీ సొంతమవుతుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    DIY Sandalwood And Curd Face Pack For Dull And Dry Skin

    What causes dryness? Frigid temperature, lack of water intake, stress, lack of sleep, pollution, smoking, wearing a lot of matte makeup, unhealthy diet, etc. Itching is one of the most common symptoms of dry skin. Sandalwood and curd face pack will provide your skin with extra love and care. And it is completely natural.
    Story first published: Tuesday, May 29, 2018, 8:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more