మీ స్కిన్ టోన్ను మెరుగుపరచడంలో మిల్క్ పౌడర్ ఏ విధంగా సహాయపడుతుంది ?

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

భారతదేశంలో ఉన్న ప్రతి ఇంటిలో పాలపొడి వాడుకలో ఉన్నది. ఇది ఒక ఆరోగ్యవంతమైన పానీయమే కాకుండా, అనేక సౌందర్య ప్రయోజనాలను కలుగజేసేదిగా కూడా ఉన్నది. ఇంకా చెప్పాలంటే, ఇది చర్మంపై అద్భుతంగా పనిచేస్తుంది. పాలపొడిలో లాక్టోస్ సమృద్ధిగా ఉన్నందున, అనేక చర్మ సంబంధిత సమస్యలకు ఇది ఒక పరిష్కార మార్గంగా పనిచేస్తుంది.

నల్లని మచ్చలు, సన్-బర్న్ & టాన్ వంటి వాటినుంచి మీ చర్మాన్ని సంరక్షించి, ప్రకాశవంతమైన చర్మాన్ని పొందటం కోసం పాలపొడిని ఉపయోగించవచ్చు. చనిపోయిన చర్మ కణాలను తొలగించి మీ చర్మాన్ని సజీవంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే బ్లీచింగ్ ఏజెంట్గా ఇది పనిచేస్తుంది.

Does Milk Powder Help You To Improve Your Skin Tone

మీ అందాన్ని పెంపొందించడానికి మిల్క్ పౌడర్ ఏ విధంగా ఉపయోగపడుతుందో మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు, మీరు కాదంటారా ? మీ చర్మాన్ని సంరక్షించే ఫేస్ మాస్క్ (లేదా) ఫేస్ ప్యాక్ రూపంలో ఉండే దీనిని మీరు మీ ఇంట్లోనే ప్రయత్నించవచ్చు. మీ చర్మంపై అద్భుతమైన ఫలితాలను రాబట్టడానికి, ఈ పొడితో ఆచరించవలసిన కొన్ని బ్యూటీ సీక్రెట్ను, ఎలా ఫాల్లో అవ్వాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1. స్కిన్ క్లీన్సర్గా :-

1. స్కిన్ క్లీన్సర్గా :-

ఈ పాలపొడి చర్మంపై ఏర్పడే మలినాలకు కారణమైన బ్యాక్టీరియాను మొదటిగా చంపుతుంది. ఆ తర్వాత చనిపోయిన చర్మకణాలను తొలగిస్తుంది. ఈ విధంగా మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

దీన్ని ఎలా తయారు చేయాలి :

ఒక గిన్నెలో 3 స్పూన్ల పాలపొడిని తీసుకొని దానికి 1 చెంచా ఆలివ్ ఆయిల్ను, బాదం ఆయిల్ అలాగే కొన్ని చుక్కల రోజ్ వాటర్ను కలపాలి. ఈ పదార్థాలన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. దూది సహాయంతో ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా మీ ముఖానికి అప్లై చేయాలి. మీ చర్మంపై ఉండే అదనపు మలినాలను తొలగించడంలో ఇది సహాయపడుతుంది. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై 15 నిమిషాల వరకు బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లని నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. మీరు అలసిపోయి ఇంటికి తిరిగివచ్చిన సమయాల్లో దీన్ని తప్పక ఆచరించండి.

2. స్కిన్ టోన్ను మెరుగుపరచడానికి :-

2. స్కిన్ టోన్ను మెరుగుపరచడానికి :-

ముందు చెప్పిన విధంగా, ఈ పాలపొడిలో లాక్టోస్ అనే సమ్మేళనం కలిగి ఉండటంవల్ల మీ స్కిన్ టోన్ను మెరుగుపరచడంలో బాగా సహాయపడుతుంది అందువల్ల మీ చర్మం కాంతివంతంగా, ప్రకాశవంతంగా తయారవుతుంది.

దీన్ని ఎలా తయారు చేయాలి :

ఒక టేబుల్ స్పూను పాలపొడిని తీసుకుని దానికి

ఒక టేబుల్ స్పూన్ పసుపు & పంచదారను బాగా కలిపి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని మీ ముఖము & మెడ భాగాల్లో అప్లై చేయాలి. ఒక అరగంట వరకు దానిని అలాగే వదిలేసిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. మంచి ఫలితాల కోసం ఈ పద్ధతినే వారానికి రెండుసార్లు చెప్పున ఆచరించండి.

3. డ్రై స్కిన్ కోసం :-

3. డ్రై స్కిన్ కోసం :-

డ్రై స్కిన్ను కలిగి ఉన్న మీలాంటి వారికోసం ఈ చిట్కా చాలా మంచి ఫలితాలను అందిస్తుంది.

దీన్ని ఎలా తయారు చేయాలి :

ఒక మెత్తని అరటిని తీసుకొని, దాని గుజ్జుని బాగా పేస్టులా చేయాలి. ఈ అరటి గుజ్జుకి 1 టేబుల్ స్పూన్ పాలపొడిని కలిపి, బాగా మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల వరకు దానిని అలాగే ఉంచి, ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మానికి హానిచేసే మలినాలను దూరంచేసి, మీ చర్మం మరింత ప్రకాశవంతంగా కనిపించేలా తయారు చేస్తుంది.

4. డార్క్ స్పాట్స్ కు చెక్ పెట్టడం :-

4. డార్క్ స్పాట్స్ కు చెక్ పెట్టడం :-

మీ చర్మంపై ఉన్న డార్క్ స్పాట్స్ను ఉపశమనపరిచే

ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్లను ఈ పాలపొడి కలిగి ఉండటం వల్ల తిరిగి మీ చర్మాన్ని సహజ స్థితిలోకి తీసుకు వస్తుంది.

ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నారింజ రసాన్ని, 2 టేబుల్ స్పూన్ల పాలపొడిని & తగినంత నీరు చేర్చి బాగా కలపాలి. ఈ పేస్ట్ ను ముఖము, మెడ భాగంలో ఆప్లై చేసి, 30 నిమిషాలపాటు బాగా ఆరినిచ్చిన తరువాత, చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు తప్పకుండా చేయటంవల్ల మంచి ఫలితాలను పొందగలరు.

డార్క్ స్పాట్స్ను తొలగించేందుకు మరొక ప్రత్యామ్నాయమైన పరిష్కారం కూడా ఉంది. అదేమిటంటే, ఒక గిన్నెలోకి పాలపొడిని, కొద్దిగా రోజ్ వాటర్ను తీసుకుని బాగా మిక్స్ చేసి, దూది సాయంతో మీ ముఖానికి అప్లై చేయండి. 10-15 నిమిషాల వరకు బాగా ఆరిన తరువాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడగాలి. ఇలా రోజుకి రెండు మూడుసార్లు ప్రయత్నించండి.

5. సన్ టాన్ను తగ్గించడానికి :-

5. సన్ టాన్ను తగ్గించడానికి :-

సన్ టాన్ను నిరోధించడానికి ఉత్తమ పరిష్కార మార్గముగా ముడి పాలపొడిని ఉపయోగించండి. మంచి ఫలితాల కోసం ఇతర పదార్ధాలను కలిపి వాడండి.

2 టేబుల్ స్పూన్ల పాలపొడికి, మెత్తని పేస్ట్లా చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల టమాటా రసాన్ని ఒక్కటిగా కలిపి మీ ముఖానికి అప్లై చేయాలి. అలా 30 నిమిషాలపాటు వదిలి వేసిన తరువాత మంచి నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయండి.

దీనికి మరొక ప్రత్యామ్నాయం ఏమిటంటే, తేనె & పాల పొడిని ఉపయోగించి తయారుచేసుకునే ఫేస్ప్యాక్. ఈ రెండు మిశ్రమాలను 2 స్పూన్ల చొప్పున తీసుకుని బాగా కలిపి మిక్స్ చేయాలి. మీ చర్మాన్ని ఐదు నిమిషాలపాటు మసాజ్ చేసిన తర్వాత ఈ ప్యాక్ను అప్లై చేసి 15నిముషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత మంచి నీటితో మీ ముఖాన్ని శుభ్రంగా కడగాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల మీరు మంచి ఫలితాలను పొందగలరు.

English summary

Does Milk Powder Help You To Improve Your Skin Tone?

Milk powder can be used in the form of masks or packs for the skin, which you can try sitting back at home. Milk powder acts as one solution for improving skin tone, as a cleanser, removing tan, keeping the skin moisturized, etc. Some of the packs that can be used with milk powder for skin care are honey, banana, olive oil, etc.