మెరిసే చర్మం కోసం సులభమైన డిఐవై పెరుగు తేనె ఫేస్ ప్యాక్

Written By: DEEPTHI T A S
Subscribe to Boldsky

ఆరోగ్యవంతమైన మెరుస్తున్న చర్మం ఆరోగ్యవంతమైన శరీరానికి గుర్తు. కానీ, శారీరకంగా ఆరోగ్యంగానే ఉన్నా మీరు చర్మాన్ని సరిగ్గా సంరక్షించుకోకపోతే, మీ చర్మం డల్ గా, నిర్జీవంగా కన్పిస్తుంది. సాధారణంగా చేసే శుభ్రత, టోనింగ్, మాయిశ్చరైజింగ్ కూడా రొటీన్ గా పాటు మీ చర్మానికి ఆరోగ్యకరమైన కాంతి రావటానికి అదనపు సంరక్షణ అవసరం.

మీ చర్మం రకాన్ని బట్టి సరైన చర్మ ఉత్పత్తి ఎంచుకోవటం, రిటైల్ స్టోరు నుండి ఒకటి తర్వాత ఒకటి ప్రయత్నిస్తూ పోవటం వలన సమయం వృథా అలాగే ఖర్చు కూడా అవుతుంది.

Easy DIY Curd And Honey Face Pack For Glowing Skin

మెరిసే చర్మం కోసం ఇంట్లోనే చాలా చిట్కాలు ఉంటాయి కానీ ఖచ్చితమైనది మాత్రం చర్మంపై పెరుగు,తేనె రాసుకోవడం. చర్మకాంతి కోసం మీరు ఇంట్లోనే సురక్షితంగా ప్రయత్నించగలిగే పెరుగు తేనె ఫేస్ ప్యాక్ వివరంగా కింద ఇవ్వబడింది.

కానీ ఈ ఫేస్ ప్యాక్ గురించి చదివేముందు, ఈ ఫేస్ ప్యాక్ లో ముఖ్య వస్తువులైన పెరుగు,తేనె చర్మానికి అసలు కాంతి ఎలా ఇస్తాయో తెలుసుకోండి.

చర్మసంరక్షణలో పెరుగు ఎలా సాయపడుతుంది;

చర్మసంరక్షణలో పెరుగు ఎలా సాయపడుతుంది;

-చర్మంపై ఎక్స్ ఫోలియేషన్ లో సాయపడుతుంది

పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చనిపోయిన చర్మకణాలను తొలగించి, నెమ్మదిగా ఎక్స్ ఫోలియేట్ చేస్తుంది. అందుకని మీ చర్మం ఆరోగ్యంగా, తాజాగా,యవ్వనంతో కన్పిస్తుంది.

-చర్మపోషణలో సాయపడుతుంది

-చర్మపోషణలో సాయపడుతుంది

పెరుగు తిన్నప్పుడు ఎంత మంచి చేస్తుందో, పైన చర్మానికి రాసుకున్నప్పుడూ అంతే మంచి జరుగుతుంది.. అందులో ఉండే విటమిన్లు,ప్రొటీన్లు,కొవ్వులు,ఖనిజలవణాలు చర్మానికి పోషణనందించి ఆరోగ్యంగా ఉంచుతాయి.

-మొటిమలు రాకుండా నివారిస్తుంది

-మొటిమలు రాకుండా నివారిస్తుంది

పెరుగులో ఉండే బ్యాక్టీరియా వ్యతిరేక లక్షణాల వలన మొటిమలు,వాపులు,చర్మంపై గాట్లు రాకుండా నివారిస్తుంది.

-చర్మం పొడిబారటాన్ని నివారిస్తుంది

-చర్మం పొడిబారటాన్ని నివారిస్తుంది

పెరుగులో ఉండే కొవ్వు పదార్థం వలన చర్మంపై తేమను లాక్ చేసి ఎక్కువ సమయం హైడ్రేటడ్ గా ఉండేలా చేస్తుంది.

-డల్ నెస్, ట్యాన్, మచ్చలను నివారిస్తుంది

-డల్ నెస్, ట్యాన్, మచ్చలను నివారిస్తుంది

చాలామంది ఎదుర్కొనే సమస్యలు చర్మంలో జీవం లేకపోవటం, ట్యాన్ ఇంకా మచ్చలు. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మకణాలను బాగుచేసి ఈ సమస్యలను పరిష్కరిస్తుంది.

-చర్మానికి తేమనందిస్తుంది

-చర్మానికి తేమనందిస్తుంది

పెరుగు చర్మంపై కూలింగ్ ఎఫెక్ట్ ను ఇస్తుంది. ఇందులో వుండే రిబోఫ్లేవిన్ విటమిన్ చర్మానికి మరింత కాంతినిచ్చి హైడ్రేటడ్ గా ఉండటంలో సాయపడుతుంది.

చర్మసంరక్షణలో తేనె ఎలా సాయపడుతుంది

చర్మసంరక్షణలో తేనె ఎలా సాయపడుతుంది

-ముడతలు తగ్గించి, వయస్సు మీరే లక్షణాలను నియంత్రిస్తుంది

తేనె ఒక గొప్ప సహజ మాయిశ్చరైజర్. దీనిలో ఉండే ఎక్కువ తేమగుణాల వలన ఇది మీ మొహంపై ఉన్న ముడతలను,గీతలను తగ్గిస్తుంది, అలాగే యాంటీ ఆక్సిడెంట్ లక్షణంతో వయస్సు మీరే లక్షణాలను నెమ్మది చేస్తుంది.

-మొటిమలు

-మొటిమలు

తేనెలో ఉండే సహజ బ్యాక్టీరియా వ్యతిరేక, యాంటీసెప్టిక్ లక్షణాలు మొటిమలకి చికిత్సగా,నివారణగా పనిచేస్తాయి.

-క్లెన్సర్

-క్లెన్సర్

తేనె సహజమైన చర్మ క్లెన్సర్.ఇది చర్మంపై,చర్మ రంథ్రాలలో ఉన్న మురికిని పీల్చుకుని అలా పేరుకున్న చర్మరంథ్రాలను శుభ్రపరుస్తుంది. అది కూడా చర్మంపై ఉండే సహజ నూనెలను ఏ మాత్రం వేరుచేయకుండా చేస్తుంది.

-చర్మానికి కాంతినిస్తుంది

-చర్మానికి కాంతినిస్తుంది

తేనెలో ఉండే సహజ యాంటీ బ్యాక్టీరియల్,మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మాన్ని నొప్పి కలగకుండా తేమనందిస్తూ, కాంతివచ్చేలా సాయపడతాయి.

పెరుగు,తేనె ఫేస్ ప్యాక్ (మామూలు నుంచి పొడి చర్మం వారి కోసం)

పెరుగు,తేనె ఫేస్ ప్యాక్ (మామూలు నుంచి పొడి చర్మం వారి కోసం)

మీకిప్పుడు పెరుగు,తేనె ఉపయోగాలు తెలిసాయి కాబట్టి మనం వాటిని ఫేస్ ప్యాక్ లో ఎలా వాడతారో చూద్దాం. ఈ రెండు పదార్థాలలో ఉండే ఎక్కువ మాయిశ్చరైజింగ్ లక్షణాల వలన ఈ పెరుగు,తేనె ఫేస్ ప్యాక్ పొడి,పొట్టు ఊడిపోయే చర్మాన్ని బాగుచేయటానికి చాలా బాగుంటుంది.

మీకు కావలసినవి-

మీకు కావలసినవి-

మీకు కావలసినవి-

-2చెంచాల పెరుగు

-1చెంచా పచ్చి తేనె

తయారుచేసే సూచనలు

-పెరుగును తేనెను వేసి మృదువైన పేస్టులా స్మూత్ గా కలపండి.

-మీ మొహాన్ని మృదువైన క్లెన్సర్ తో కడుక్కుని పొడిగా తుడవండి.

-ఈ ప్యాక్ ను మొహానికి పట్టించి 20 నిమిషాలు అలానే వదిలేయండి.

-చల్లనీరుతో కడిగేయండి.

ఎన్నిసార్లు-

ఈ ఫేస్ ప్యాక్ ను వారానికోసారి ప్రయత్నిస్తే మంచి ఫలితాలు కన్పిస్తాయి.

చర్మ రకాలు-

ఈ పెరుగు,తేనె కాంబినేషన్ మామూలు నుండి పొడి చర్మ రకాలకి బాగా పనిచేస్తుంది, ఎందుకంటే పెరుగు,తేనెల్లో ఉన్న తేమ గుణాలు చర్మానికి మంచి మాయిశ్చరైజర్ లా పనిచేస్తాయి.

English summary

Easy DIY Curd And Honey Face Pack For Glowing Skin

Our skin needs a lot more than the usual cleansing, toning and moisturizing routine. It needs extra care for that healthy glow. Checking out for the right skin product based on your skin type, on a trial and error basis at retail stores can be time consuming and expensive. Curd and honey help reduce acne, pimples, and wrinkles, and also nourish our skin.