స్మైల్ లైన్స్ ను తగ్గించే 8 హోమ్ రెమెడీస్

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

స్మైల్ రింకిల్స్ లేదా లాఫ్టర్ రింకిల్స్ అనేవి ఏజింగ్ కి సంబంధించినవి కావు. ఒక వ్యక్తి తరచూ నవ్వడం వలన ఈ లైన్స్ ఏర్పడతాయి. ఆశ్చర్యపోతున్నారా? అవును, మీరు చదివింది నిజమే! కొన్నిసార్లు, నవ్వడం, చిరునవ్వు వాటివలన నోటి చుట్టూ ఫైన్ లైన్స్ ఏర్పడతాయి. ఇవి, మిమ్మల్ని ఓల్డ్ గా కనిపించేలా చేస్తాయి. అయితే, వీటికి రెమెడీస్ ఉన్నాయి.

వివిధ కాస్మెటిక్ సర్జరీలు మరియు కెమికల్ ట్రీట్మెంట్స్ వలన ముడతలు వేగవంతంగా తగ్గిపోతాయి. అయితే, వాటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. కాబట్టి, బెస్ట్ న్యాచురల్ హోమ్ రెమెడీస్ తో ఇంటివద్దే మీరు సులభంగా ఈ ఫైన్ లైన్స్ ను తగ్గించుకోవచ్చు.

Eight Home Remedies To Treat Smile Lines

న్యాచురల్ ఇంగ్రిడియెంట్స్ తో అలాగే కొన్ని రెమెడీస్ తో స్మైల్ రింకిల్స్ ను తగ్గించుకోవచ్చు. కాబట్టి, ఇక్కడ వివరించబడిన బెస్ట్ న్యాచురల్ రెమెడీస్ ను చూసి రింకిల్స్ ను తగ్గించుకోండి మరి.

నీళ్లను త్రాగండి:

నీళ్లను త్రాగండి:

తగిన మోతాదులో నీటిని తీసుకోవడం చేత చర్మం ఎప్పుడు మాయిశ్చరైజ్డ్ గా అలాగే హైడ్రేటెడ్ గా ఉంటుంది. డ్రై స్కిన్ సమస్య దరిచేరదు. డ్రై స్కిన్ సమస్య అనేది డీ హైడ్రేషన్ వలన ఏర్పడుతుంది. రింకిల్స్ కూడా ఏర్పడతాయి. కాబట్టి, స్మైల్ రింకిల్స్ నుంచి చర్మాన్ని సంరక్షించేందుకు సరైన కేర్ ను మంచినీళ్లను తీసుకోవడం ద్వారా అందించవచ్చు. ప్రతిరోజూ తగినంత నీటిని తీసుకుంటే ముడతల సమస్య దరిచేరదు.

నిమ్మరసం:

నిమ్మరసం:

నోటి చుట్టూ ఉన్న చర్మాన్ని టైటన్ చేసే లక్షణం నిమ్మరసంలో కలదు. అలాగే, ఇందులో లభించే విటమిన్ సి ఫ్రీ రాడికల్స్ ని అరికడుతుంది. నోటి చుట్టూ ముడతలపై నిమ్మరసాన్ని అప్లై చేస్తే స్మైల్ రింకిల్స్ మటుమాయమవుతాయి.

ఎగ్ వైట్స్:

ఎగ్ వైట్స్:

స్మైల్ రింకిల్స్ ని ట్రీట్ చేసేందుకు ఎగ్ వైట్స్ ఉపయోగకరంగా ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ తేనెను ఇందులో కలిపి ఈ మిశ్రమాన్ని రింకిల్స్ పై అప్లై చేయండి. ఈ మిశ్రమాన్ని నోటి చుట్టూ ఉన్న రింకిల్స్ పై అప్లై చేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు అలాగే ఉంచండి. ఇరవై నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో ఈ మిశ్రమాన్ని వాష్ చేయండి. ఈ రెమెడీని వారానికి రెండు సార్లు ప్రయత్నిస్తే మెరుగైన ఫలితాన్ని పొందవచ్చు.

అలోవెరా:

అలోవెరా:

అలోవెరాలో విటమిన్ సి మరియు ఈ పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మాన్ని బిగుతుగా ఉంచి చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. చర్మాన్ని నరిష్ చేసి స్కిన్ ను రిపేయిర్ చేస్తుంది. ఆ విధంగా నోటి చుట్టూ ఉన్న ముడతలు తగ్గుముఖం పడతాయి. అలోవెరా లీఫ్ నుంచి జెల్ ను సేకరించి ఈ జెల్ ను ముడతలపై అప్లై చేయండి. అయిదు నిమిషాల తరువాత సాధారణ నీటితో చర్మాన్ని వాష్ చేసుకోండి.

పసుపు:

పసుపు:

పసుపులో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కలవు. ఇవి ముడతలను తగ్గించి అలాగే ఫైన్ లైన్స్ ను తగ్గించేందుకు తోడ్పడతాయి. ఒక టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ ను ఒక బౌల్ లోకి తీసుకోండి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను జోడించి ఈ రెండిటినీ బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని నోటిచుట్టూ ఉన్న ముడతలపై అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తరువాత నార్మల్ వాటర్ తో చర్మాన్ని శుభ్రపరుచుకోండి.

బొప్పాయి:

బొప్పాయి:

ముడతలని అలాగే నోటి చుట్టూ ఉన్న ఫైన్ లైన్స్ ని తగ్గించే లక్షణం బొప్పాయిలో కలదు. బొప్పాయి రెమెడీ ఫైన్ లైన్స్ ను తగ్గించేందుకు వేగవంతంగా పనిచేస్తుంది. ఒక బొప్పాయిని చిన్న చిన్న ముక్కలుగా తరుగుకుని దానిని మ్యాష్ చేసి బొప్పాయి గుజ్జును తయారుచేసుకోండి. ఈ గుజ్జును ముడతలపై అప్లై చేసి పదిహేను నిమిషాలపాటు వెయిట్ చేయండి. పదిహేను నిమిషాల తరువాత ప్లెయిన్ వాటర్ తో రిన్స్ చేసి తడిని ఆరబెట్టండి.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

గ్రీన్ టీ లో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీలు కలవు. ఇవి చర్మంపై ముడతలను తగ్గిస్తాయి. ఇందులో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ నోటి చుట్టూ ఉన్న చర్మాన్ని టైట్ చేసేందుకు తోడ్పడతాయి. కొంత గ్రీన్ టీ ను చేసుకుని రెఫ్రిజిరేట్ చేయండి. ముఖంపైన ముడతలపై అప్లై చేయండి. ఇది లాఫ్ రింకిల్స్ ను తగ్గించేందుకు తోడ్పడుతుంది.

ఫేషియల్ ఎక్సర్సైజేస్:

ఫేషియల్ ఎక్సర్సైజేస్:

నోటి చుట్టూ స్మైల్ లైన్స్ ను తగ్గించేందుకు ఫేషియల్ ఎక్సర్సైజేస్ కూడా తోడ్పడతాయి. ముడతలను తగ్గించుకునేందుకు వివిధ ఫేషియల్ ఎక్సర్సైజ్ లు కలవు. అటువంటి ఒక ఎక్సర్సైజ్ ను ఇక్కడ వివరించాము.

టీత్ ను క్లోస్ చేసి పూర్తిగా స్మైల్ ఇవ్వండి. పది సెకండ్ల పాటు ఆగి అదే ప్రాసెస్ ను రిపీట్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ ను రోజుకు 15-20 నిముషాలు చేస్తే మీరు తేడాను గుర్తించగలుగుతారు.

English summary

Eight Home Remedies To Treat Smile Lines

Smile wrinkles or laughter wrinkles are not necessarily the signs of ageing. Sometimes, this can be caused when a person laughs or smiles too often. Smile wrinkles can be treated with natural ingredients and remedies. Ingredients like aloe vera, turmeric, lemon juice, etc., are some of the natural remedies that can help fight the smile lines problem.