చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుకునేందుకు DIY ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

ప్రతి రోజూ పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే. ఎందుకంటే, ఫ్రూట్స్ లో ముఖ్యమైన న్యూట్రియెంట్స్, విటమిన్స్ మరియు మినరల్స్ కలవు. ఇవి శరీరానికి అవసరమైనవి. అలాగే, చర్మసంరక్షణకు కూడా ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. మీకు ఫ్రూట్స్ అంటే అంతగా ఇష్టం లేకపోయినా ఫ్రూట్స్ ద్వారా చర్మ సంరక్షణకు ప్రయోజనం పొందేందుకు ఒక మార్గం ఉంది. ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్ ద్వారా మీరు చర్మ సౌందర్యాన్ని సంరక్షించుకోవచ్చు.

ఇప్పుడు, ఈ విషయం ఆసక్తికరంగా అనిపిస్తోంది కదూ? కొన్ని సార్లు సెలూన్ స్టయిల్ ఫేస్ ట్రీట్మెంట్ లంటే చర్మానికి పడదు. ఫేషియల్ మాస్క్ లో నుండే కఠినమైన కెమికల్స్ చర్మానికి హానీ చేస్తాయి. కాబట్టి, సహజసిద్ధమైన ఫ్రూట్స్ ద్వారా ఫేషియల్ చేయించుకుంటే చర్మం ప్రశాంతపడుతుంది. అంతేకాక, చర్మపోషణకు అవసరమైన న్యూట్రియెంట్స్ లభిస్తాయి.

DIY Fruit Face Packs For Radiant Skin,

ప్రకాశవంతమైన చర్మాన్ని పొందేందుకు DIY ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్

ఈ విధంగా మీరు హోమ్ మేడ్ ఫ్రూట్ ఫేషియల్ నుంచి కావలసినంత ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇది చాలా చౌక కూడా. కాస్ట్ ఎఫెక్టివ్ కావడం అలాగే ఫ్రూట్స్ ద్వారా వచ్చే సువాసనల వలన ఫేషియల్ అనేది అద్భుతమైన అనుభూతిని మిగులుస్తుంది. చర్మంతో పాటు మనసు కూడా రిలాక్స్ అవడంతో చర్మం ప్రశాంతపడుతుంది.

కాబట్టి, ఇక్కడ 8 రకాల ఫ్రూట్ మాస్క్స్ గురించి వివరించాము. ఈ ఫేషియల్స్ ను సులభంగా చేసుకోవచ్చు. ఆలాగే, వీటి ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. చర్మం హైడ్రేట్ అవడంతో పాటు కాంతివంతంగా కూడా మారుతుంది. వీటిని ప్రయత్నించి ప్రయోజనం పొందండి మరి.

DIY Fruit Face Packs For Radiant Skin,

1. బొప్పాయి మరియు తేనె ఫేస్ ప్యాక్:

బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ కలదు. ఇది నేచురల్ ఎక్స్ఫోలియేటర్ గా పనిచేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ ను చర్మంపై నుంచి తొలగిస్తుంది. బొప్పాయిలో విటమిన్ ఏ మరియు సి పుష్కలంగా కలవు. ఇది, ఫ్రీ రాడికల్స్ ఫార్మేషన్ ను తగ్గించేందుకు తోడ్పడుతుంది. ఫ్రీ రాడికల్స్ వలెనే ప్రీ మెచ్యూర్ ఏజింగ్ సమస్య వెంటాడుతుంది.

బొప్పాయిలో పొటాషియం లభిస్తుంది. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి చర్మంలోని డ్రై నెస్ ను తొలగిస్తుంది. అలాగే, చర్మాన్ని బిగుతుగా చేసి స్కార్స్ తో పాటు ఫైన్ లైన్స్ ను తొలగిస్తుంది.

తేనె చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. అంతేకాక, ఇందులోనున్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీలు చర్మాన్ని రిపెయిర్ చేసి ఎన్విరాన్మెంటల్ డేమేజ్ నుంచి చర్మాన్ని రక్షించడానికి తోడ్పడతాయి. తేనె అద్భుతమైన మాయిశ్చరైయిజర్ గా పనిచేస్తుంది. పోర్స్ ని శుభ్రపరుస్తుంది. స్కార్ ని లైటెన్ చేస్తుంది. యాక్నే, పింపుల్స్ మరియు రింకిల్స్ సమస్యను తగ్గించి. చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది.

కాబట్టి, బొప్పాయి మరియు తేనెను కంబైన్ చేస్తే అద్భుతమైన ఫేస్ ప్యాక్ తయారవుతుంది.

విధానం:

• రెండు బొప్పాయి ముక్కలను బ్లెండర్ లో వేసి స్మూత్ పేస్ట్ ను తయారుచేసుకోవాలి.

• ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ తేనెను జోడించాలి. ఈ రెండిటినీ బాగా కలపాలి.

• ఈ మిశ్రమాన్ని శుభ్రపరిచిన చర్మంపై ఈవెన్ గా అప్లై చేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు అలాగే ఉండనివ్వాలి.

• ఆ తరువాత నార్మల్ వాటర్ తో రిన్స్ చేయాలి.

• ఈ ప్యాక్ ను వారానికి ఒకసారి వాడితే ఆరోగ్యకరమైన మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.

DIY Fruit Face Packs For Radiant Skin,

2. అరటిపండు, తేనె మరియు నిమ్మరసం ఫేస్ ప్యాక్:

అరటిపండులో లభించే ముఖ్యమైన న్యూట్రియెంట్స్ చర్మానికి పోషణనిచ్చేనందుకు తోడ్పడతాయి. ఇందులో విటమిన్ బి6 మరియు సి లు కలవు. ఇవి చర్మం ఎలాస్టిసిటీకు ఉపయోగకరంగా ఉంటాయి. ఇందులో లభించే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీలు ఫ్రీ రాడికల్స్ వలన దెబ్బతిన్న చర్మాన్ని తిరిగి మాములుగా మార్చేందుకు తోడ్పడతాయి. ఇందులో లభించే విటమిన్ ఏ చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.

నిమ్మలో లభించే సిట్రిక్ యాసిడ్ అనేది నేచురల్ బ్లీచింగ్ కాంపోనెంట్ లా పనిచేస్తుంది. స్కిన్ కలర్ ని మెరుగుపరిచేందుకు తోడ్పడుతుంది. నిమ్మలో లభించే నేచురల్ యాసిడ్స్ డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించేందుకు ఉపయోగపడతాయి. అలాగే, ఫ్రెకిల్స్ ను కూడా తొలగిస్తాయి. బ్రౌన్ స్పాట్స్ ను లైట్ చేస్తాయి. స్కిన్ డిస్కలరేషన్ సమస్యను తొలగిస్తాయి.

విధానం:

• ఒక బౌల్ లో బాగా పండిన అరటిపండులోని సగభాగాన్ని తీసుకుని మ్యాష్ చేయండి. అందులో అర టేబుల్ స్పూన్ తేనెను కలపండి.

• వీటిని బాగా కలిపి ఈవెన్ గా చర్మంపై అప్లై చేయండి.

• ఈ ప్యాక్ ను ముఖంపై 30 నిమిషాలపాటు ఉంచండి.

• ఆ తరువాత నార్మల్ వాటర్ తో వాష్ చేయండి.

DIY Fruit Face Packs For Radiant Skin,

3. అవొకాడో, తేనె మరియు కివీ ఫేస్ ప్యాక్:

అవొకాడోలో చర్మ సంరక్షణకు అవసరమైన ఎసెన్షియల్ న్యూట్రియెంట్స్, విటమిన్స్, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కలవు. డ్రై, ఏజింగ్ మరియు డీహైడ్రేటెడ్ స్కిన్ కి ఇది మంచి రెమెడీగా పనిచేస్తుంది. ఇందులో అద్భుతమైన మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీలు కలవు. చర్మం ఎక్కువసేపు తాజాగా అలాగే ప్రకాశవంతంగా ఉండేందుకు ఈ పదార్థం తోడ్పడుతుంది.

కివీలో విటమిన్ సి కలదు. ఇది శరీరంలోని కొలాజెన్ ను ప్రొడ్యూస్ చేయడానికి తోడ్పడుతుంది. కొలాజెన్ అనే కనక్టివ్ టిష్యూ ప్రోటీన్ చర్మాన్ని టైట్ చేసేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొలాజెన్ ఉత్పత్తి తగ్గుతుంది. అందువలన, చర్మం తన ఎలాస్టిసిటీను కోల్పోతుంది. కివీ అనేది ఫైన్ లైన్స్ అపియరెన్స్ ను తగ్గించేందుకు ఆ విధంగా తోడ్పడుతుంది.

విధానం:

• ఈ ఫేస్ మాస్క్ తయారీకి ఒక అవొకాడోతో పాటు ఒక కివీ అవసరమవుతుంది. ఈ రెండిటి స్కిన్ ను తొలగించి స్మూత్ పేస్ట్ లా తయారయ్యే వరకు మ్యాష్ చేయండి.

• ఒక టేబుల్ స్పూన్ తేనెను జోడించి బాగా కలపండి.

• ఈ పేస్ట్ ను ముఖంపై అలాగే మెడపై అప్లై చేయండి. ఈ మిశ్రమాన్ని ముప్పై నిమిషాల పాటు అలాగే ఉండనివ్వండి.

• ఆ తరువాత నార్మల్ వాటర్ తో వాష్ చేయండి.

English summary

DIY Fruit Face Packs For Radiant Skin

DIY Fruit Face Packs For Radiant Skin, Consuming fruits every day is good for your health because fruits contain all the essential nutrients, vitamins and minerals that are good for the body and also for your skin. If you are not a fruit person but would like to take advantage of the benefits of fruits, then you can
Story first published: Tuesday, April 24, 2018, 19:00 [IST]