For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాదం నూనె ఉపయోగించి, మీ కళ్ళ కింద నల్లని వలయాలకు వీడ్కోలు చెప్పండి.

|

చర్మం పొడిబారడం, మొటిమలు ఏర్పడటం, జిడ్డు చర్మం, ఎరుపుదనం లేదా రంధ్రాలు తెరుచుకోవడం - ఇటువంటి దైనందిన చర్మ సమస్యలను మనలో చాలా మంది ఎదుర్కుంటాము. వీటన్నింటినీ వైద్య పరంగా చర్మ సమస్యల కింద వర్గీకరించవచ్చు. ఎందుకంటే, ఇవి చర్మంలో తలెత్తే అసాధారణతల మూలంగా తలెత్తుతాయి. వీటన్నింటిలోకి మనను అత్యధికంగా బాధిచే సమస్య కళ్ళ కింద నల్లని వలయాలు. ఎందుకనగా వీటిని మనం ఎంత ప్రయత్నించినా దాచలేము. ఇవి ఒక్కరాత్రిలో మనని విడిచిపెట్టి పోవు.

నల్లని వలయాలు సరిగ్గా కళ్ళ కింద కనిపిస్తాయి. వాటిని అవాంఛనీయంగా భావించడానికి కారణం, అంతేకాక,వీటిని కనపడకుండా ముస్తాబు చేసుకుందామన్నా ,అది చాలా కష్టంతో కూడుకున్న పని. ఎంతో నేర్పరితనం మరియు అత్యుత్తమమైన అలంకరణ ఉత్పత్తులను ఉపయోగిస్తే కానీ ఇది సాధ్యం కాదు.

Get Rid Of Dark Circles Instantly Using Almond Oil

నిద్ర లేమి, తామర, ఒత్తిడి, ధూమపానం లేదా మద్యపానం మరియు వారసత్వ లక్షణాల కారణంగా ఇవి ఏర్పడవచ్చు. నిజానికి, మీ ఆహార తయారీలో అధికంగా ఉప్పు వాడుతున్న ఫలితంగా, శరీరంలో ద్రవాలు అధికంగా నిలుపుదల చేయబడి, నల్లని వలయాలు ఏర్పడతాయి.

బాహ్య కారకాల కన్నా, అంతర్గత కారకాల ప్రభావం వలన ఇవి ఏర్పడతాయి. కనుక, ఈ సమస్యను అధిగమించడం కష్టతరమని అంటారు. మీరు కనుక వీటిని కలిగి ఉన్నట్లయితే, ఈ పాటికే ఈ సమస్య పరిష్కారానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు. లేజర్ చికిత్స లేదా కాస్మెటిక్ చికిత్సా పద్ధతులను కూడా ఆశ్రయించి ఉండవచ్చు.

వీటి నివారణకు మందులు, క్రీములు వాడాలనుకుంటే, వాటిలోని రసాయనాలు కళ్ళ చుట్టూ ఉండే సున్నితమైన చర్మాన్ని చికాకుపరుస్తాయి. అంతేకాక, వీటిపై మనం వెచ్చించే సొమ్ము మీకు భారంగా అనిపిస్తున్నట్లైతే, మీరు సరైన చోటికి వచ్చినట్లే! ఈ వ్యాసం ద్వారా మీకు నల్లని వలయాలను ప్రభావవంతంగా తొలగించేదిగా నిరూపితమైన ఒక సహజ పదార్ధం గురించి తెలియజేయబోతున్నాము. ఆ పదార్ధమే - బాదం నూనె!

మనకు ఇదివరకే తెలిసినప్పటికీ, జుట్టు మరియు చర్మ సంరక్షణకు బాదం నూనె అందించే ప్రయోజనాలు గురించి మనం మళ్ళీ తెలుసుకునే సమయం వచ్చింది. అందవికారంగా కంటి కింద కనిపించే నల్లని వలయాల వంటి లక్ష్యిత ప్రాంతాల్లోని సమస్యలను తొలగించడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది.

బాదం నూనెలో యాంటిఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లలమేటరీ లక్షణాలు ఉన్నందున, కళ్ళు చుట్టూ ప్రాంతంలోని మేనిఛాయను తేలికపరచి, నల్లని వలయాల తీవ్రతను తగ్గిస్తుంది. అంతేకాక, దీనిలో ఇ మరియు కే విటమిన్లు మరియు రెటినాల్ సమృద్ధిగా ఉండటంతో, రక్తనాళాలు ముడుచుకుని, నలుపుదనం తగ్గుతుంది.

బాదం నూనెను మరింత ప్రభావవంతంగా తయారు చేయడానికి, దీనికి ను మిళితం చేస్తే, ఫలితాలు త్వరగా లభిస్తాయి.

మీ కళ్ల క్రింద ఆ చీకటి వలయాలను తొలగించడానికి, బాదం నూనెను ఇతర సహజ పదార్ధాలతో కలిపి ఎలా ఉపయోగించాలో తెలిపే వివిధ మార్గాలను మీ కోసం ఇక్కడ అందజేస్తున్నాము.

1) తేనె మరియు బాదం నూనె

1) తేనె మరియు బాదం నూనె

మనకు ప్రకృతి ఇచ్చిన అమూల్యమైన బహుమతి తేనె. మన సౌందర్య సమస్యలను పరిష్కరించడం నుండి ఎన్నో వ్యాధులను నయం చేయడం వరకు,ఇది ఎంతో సహాయ పడుతుంది. ఆయుర్వేదంలో దీనిని ద్రవ బంగారం అనడంలో అతిశయోక్తి లేదు. దీని యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మరింత కళ్ళ క్రింద ఉబ్బడం మరియు నలుపుదనం తగ్గిస్తాయి.

కావలసిన పదార్థాలు:

- ఒక టీ స్పూన్ తేనె

- 4-5 చుక్కల బాదం నూనె

తయారీ విధానము

1) ఒక గిన్నెలో పై రెండు పదార్ధాలను కలపండి.

2) మిశ్రమాన్ని శుభ్రపరచుకున్న ముఖం మీద, కళ్ళ క్రింద పూర్తిగా అంటుకునేటట్లు రాసుకోండి.

3) నిద్రపోయే ముందు రాసుకుని, ఉదయం లేవగానే శుభ్రం చేసుకోండి.

2) రోజ్ వాటర్ మరియు బాదం నూనె

2) రోజ్ వాటర్ మరియు బాదం నూనె

చర్మ సౌందర్య సంరక్షణ లక్షణాలను కలిగి ఉన్నందున, రోజ్ వాటర్ చర్మాన్ని చైతన్యవంతం చేస్తుంది. ఇది తేలికపాటి గుణాలు ఉన్నది, ప్రభావవంతమైనది మరియు సున్నితమైన చర్మం కలిగిన వారికి కూడా తగినది. బాదం నూనెతో పాటు కలిపి ఉపయోగించినపుడు, అది కంటి కింద ఏర్పడే నల్లని వలయాలను తొలగిస్తుంది. ప్రకాశవంతమైన కళ్ళు పొందాలంటే, దీనిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం!

కావలసిన పదార్థాలు:

-1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్

- 5 చుక్కలు బాదం నూనె

తయారీ విధానం

1) రోజ్ వాటర్ ను ఒక శుభ్రమైన గిన్నెలో తీసుకొని, బాదం నూనెను దానికి కలపండి. బాగా కలిసిన మిశ్రమం ఏర్పడే వరకు వాటిని కలపండి.

2) మీ కళ్ళకు, ఈ మిశ్రమంను దూది ఉండ సహాయంతో రాసుకోండి.

3) 15 నిమిషాల పాటు ఆరనిచ్చి చల్లటి నీటితో కడుక్కోండి.

4) ప్రతిరోజు ఇలా చేస్తుంటే, మీ కళ్ళ కింద నల్లని వలయాలు కొన్ని రోజుల్లోనే తగ్గడాన్ని మీరు గమనించవచ్చు.

3) నిమ్మ రసం మరియు బాదం నూనె

3) నిమ్మ రసం మరియు బాదం నూనె

ఈ మిశ్రమాన్ని ఉపయోగించడం వలన, మీ కళ్ళ చుట్టూ ఉండే నల్లని వలయాలను తొలగిపోవడమే కాక, మీ కళ్ళు ప్రకాశవంతంగా మారతాయి. నిమ్మరసంలోని సహజ బ్లీచింగ్ లక్షణాలతో పాటు బాదం నూనెలోని తేమను కాపాడే లక్షణాలు, నల్లదనంతో పోరాడటమే కాక, చర్మం యొక్క సున్నితమైన పొరకు పోషణను కూడా అందిస్తాయి.

కావలసిన పదార్థాలు:

- ½ టీ స్పూన్ తాజాగా పిండిని నిమ్మ రసం .

- 3-4 చుక్కల బాదం నూనె

తయారీ విధానం:

1) ఒక గిన్నెలో రెండు పదార్ధాలను కలపండి.

2) దీనిలో దూది ఉండను ముంచి, కంటి కింద భాగంలో రాసుకోండి.

3) అలా 15 నిమిషాలు పాటు ఆరనిచ్చి,చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.

4) నిమ్మ రసం మీ కళ్ళులో మాన్తా కలుగజేస్తుంది కనుక, రాసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. రాసుకోబోయే ప్రతిసారి, తాజాగా తయారు చేసుకోవడం మరువకండి.

4) కలబంద గుజ్జు మరియు బాదం నూనె

4) కలబంద గుజ్జు మరియు బాదం నూనె

కలబంద గుజ్జులో, అధిక విటమిన్ ఇ ఉన్నందున, కళ్ళు కింద ముడుతలతో పాటు నలుపుదనాన్ని తొలగించి, నల్లని వలయాలను ప్రభావవంతంగా తగ్గించగలదు. కనుక, నల్లని వలయాలు ఉన్నవారు, వాటిని పరిష్కరించుకోవడానికి, మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలియజేస్తున్నాం.

కావలసిన పదార్థాలు:

-1/2 టీస్పూన్ తాజా కలబంద గుజ్జు

- 1/2 టీస్పూన్ బాదం నూనె

తయారీ విధానం:

1) బాదం నూనెను, కలబంద గుజ్జును బాగా కలపండి.

2) కళ్ళు కింద ఈ మిశ్రమాన్ని ఉపయోగించి, 2 నిమిషాలు పాటు మర్దన చేసి, అరగంట పాటు ఆరనివ్వండి.

3) తరువాత ఒక దూది ఉండతో దీనిని తుడుచుకోండి. కావాలనుకుంటే, మీరు రాత్రంతా ఉంచుకుని, ఉదయం కడుక్కోవచ్చు.

4) ఇలా మీరు ప్రతి రోజూ చేయాలి. రోజు ఉపయోగించడం కొరకు మీరు ఈ మిశ్రమాన్ని ఒకేసారి ఎక్కువగా చేసుకోవచ్చు.

English summary

Get Rid Of Dark Circles Instantly Using Almond Oil

Dark circles are patches that appear just under the eyes. What makes them unwanted is the fact that they can make you older than you are. Also, it is quite difficult to hide them as they need to lot of colour correcting precision and the best make-up products. Get rid of dark circles instantly at home using almond oil, honey, or rosewater.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more