భుజాలపై మొటిమలు, మచ్చలకు గృహాచికిత్స

Written By: Gayatri Devupalli
Subscribe to Boldsky

పురుషులైనా, స్త్రీలైనా, మనందరికీ మొటిమలనేవి ఒక పెద్ద సమస్యగా మారాయి. ఇది జీవితంలో ఒక్కసారైనా ప్రతిఒక్కరు ఎదుర్కొనే సమస్య. మొటిమలు కేవలం ముఖంమీదే కాదు భుజాలపై కూడా వస్తాయి.

కొన్ని రకాల మొటిమలకు పూర్తిగా చికిత్స చేయవచ్చు, కాని కొన్ని మాత్రం పదేపదే వస్తుంటాయి. ముఖం మీద మాదిరిగానే, భుజాలపై కూడా మృతచర్మం పెరుకుని, జిడ్డు అధికమవ్వడం మరియు ఇతర మలినాల వలన భుజాములపై ఉండే కేశాల మొదళ్ళు వాచినట్టవుతాయి.ఈ రంధ్రాలలో బాక్టీరియా చేరడం వలన కూడా భుజాలపై మొటిమలేర్పడవచ్చు.

Shoulder Acne

చాలా మార్లు భుజాలపై మొటిమలు ఒక్కసారిగా కనిపించినప్పటికి, అవి ఆకస్మిక చర్యల ఫలితం వలన కలిగినవి కాదు. ఇవి ఒత్తిడి,హార్మోన్ల అసమతుల్యత లేక మనం తినే కొన్నిరకాల ఆహార పదార్థాల వలన ఏర్పడవచ్చు. అవును , మీరు విన్నది నిజమే!

కొన్నిసార్లు వీటి చికిత్సకై మందులు వాడతాం, క్రీములు పూస్తాం. కానీ ఎప్పుడైనా మన ఇంట్లో సాధారణంగా లభించే పదార్ధాలతో సహజమైన నివారణ చర్యలు చేపట్టడం ఉత్తమం.

మీరు కనుక అధికమైన మొటిమలతో సతమతవుతున్నా లేదా మీ భుజాలపై మొటిమల సమస్య తీవ్రంగా ఉన్నా, వాటి నివారణకై ఎలా గృహవైద్యం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మరసం మరియు పంచదార స్క్రబ్:

నిమ్మరసం మరియు పంచదార స్క్రబ్:

నిమ్మకాయలో ఉండే సహజమైన యాస్ట్రిజంట్ మూసుకుపోయిన రంధ్రాలను తెరచి, ముఖాన్ని కాంతివంతంగా చేయటమే కాక మొటిమల వలన కలిగే నొప్పిని తగ్గిస్తుంది.

వాడే పద్ధతి:

ఒక నిమ్మకాయను తీసుకుని సగంగా లేదా పలుచని ముక్కలుగా కోయండి. ఈ ముక్కల్ని పంచదారతో బాగా కప్పేయండి. ఈ మిశ్రమంతో ఇప్పుడు మీ భుజాలను పంచదార కరిగిపోయేంతవరకు రెండు మూడు నిమిషాలు బాగా రుద్దండి. తరువాత ఐదు నిమిషాల పాటు బాగా ఆరనిచ్చి నీటితో శుభ్రం చేసుకోవాలి.

యాపిల్ సిడర్ వెనిగర్:

యాపిల్ సిడర్ వెనిగర్:

యాపిల్ సిడర్ వెనిగర్ లో ఉండే లాక్టిక్ ఆమ్లం మరియు మేలిక్ ఆమ్లం భుజాలపై మొటిమల చికిత్సకు బాగా సహాయపడతాయి. ఇవి చర్మం మీద పేరుకున్న మృతకణాలను తొలగించి pH ను సమతులం చేస్తాయి.

వాడే పద్ధతి:

కొన్ని చుక్కల యాపిల్ సిడర్ వెనిగర్ ను తీసుకుని నీటితో పల్చన చేసి మొటిమలున్న చోట రాసుకోండి. పదిహేను నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా రోజుకు రెండు మూడు సార్లు చేయండి.

అంతేకాక, యాపిల్ సిడర్ వెనిగర్ లో నీటిని కలిపి తాగినా మంచి ఫలితాలుంటాయి. దీనిని రోజుకు రెండు సార్లు తాగండి.

పసుపు:

పసుపు:

అనాదిగా పసుపును మొటిమల చికిత్సకై మన ఇళ్లల్లో వాడుతుంటారు. దీనిలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు మొటిమలు కలుగజేసే బాక్టీరియాను నశింపజేస్తాయి.

వాడే పద్ధతి:

ఒక చెంచాడు పసుపుకు నీరు లేదా కొబ్బరినూనె కలిపి ముద్ద చేయండి. దీనిని మొటిమలుండే ప్రదేశంలో అద్ది గంటసేపు ఆరనివ్వండి. తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా రోజుకు ఒకటి రెండు సార్లు చొప్పున కొన్ని రోజుల పాటు చేయండి.

టొమాటో రసం:

టొమాటో రసం:

టొమాటోలో చర్మానికి మేలుచేసే శక్తివంతమైన విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి. టొమాటో రసం మొటిమల వలన కలిగే నొప్పిని, మంటను తగ్గించడానికి దోహదపడుతుంది.

వాడే పద్ధతి:

ఒక టొమాటో ముక్కను తీసుకుని గుజ్జుగా చేయండి.దీనికి ఒక చెంచాడు తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి మాస్క్ లాగా వేసుకోండి. పదిహేను ఇరవై నిమిషాల పాటు ఆరిన తరువాత నీటితో శుభ్రం చేయాలి.

కలబంద గుజ్జు:

కలబంద గుజ్జు:

కలబందలో యాస్ట్రిజంట్ గుణాలతో పాటు యాంటీఫంగల్ గుణాలు కూడా ఉంటాయి. ఇవి భుజాలపై ముడుతలను త్వరగా తగ్గిస్తాయి.

ఒక టీ స్పూన్ కలబంద గుజ్జును తీసుకోండి. స్నానం చేసిన తరువాత మొటిమలు అధికంగా ఉన్న చోట దీనిని రాసుకోండి. ఇది కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆరిపోతుంది కనుక కడగనవసరం లేదు.

ఇలానే కాక, ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జుకు,ఒక టీ స్పూన్ తేనె మరియు కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి మొటిమలు ఉన్న చోట రాసుకోండి. పదిహేను నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి.

English summary

Home Remedies To Treat Shoulder Acne

Acne is a major issue faced among all of us, irrespective of whether we are men or women. But acne can not only appear on face but it also can appear on shoulders. The best way to get rid of these are by using some ingredients like lemon, aloe vera, oats, etc.Some types of acne can be completely treated, while some keep occurring again and again.
Story first published: Thursday, April 5, 2018, 9:00 [IST]