For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్ట్రెచ్ మార్క్స్ కు గుడ్ బై చెప్పేందుకు హోంమేడ్ కాఫీ కోకోనట్ ఆయిల్ స్క్రబ్

స్ట్రెచ్ మార్క్స్ కు గుడ్ బై చెప్పేందుకు హోంమేడ్ కాఫీ కోకోనట్ ఆయిల్ స్క్రబ్

|

చాలా మంది మహిళలు స్ట్రెస్ మార్క్స్ ను పీడకలలా భావిస్తారు. ఏజింగ్ కు చిహ్నంగా నిలిచే ఈ స్రెచ్ మార్క్స్ వలన మానసిక ప్రశాంతతను కోల్పోతారు.

అయితే, కేవలం ఏజింగ్ వలెనే స్ట్రెచ్ మార్క్స్ సమస్య తలెత్తుతుందని భావించకూడదు. చర్మం తన సామర్థ్యానికి మించి సాగినప్పుడు స్ట్రెచ్ మార్క్స్ దర్శనమిస్తాయి. ప్రెగ్నెన్సీ, అధిక బరువు లేదా బరువు తగ్గడం వంటి కొన్ని అంశాలు స్ట్రెచ్ మార్క్స్ కు దారితీస్తాయి.

చర్మంపై ఇవి మొదటగా పింక్ లైన్స్ లా కనిపిస్తాయి. అయినప్పటికీ, కాలం గడిచే కొద్దీ స్కిన్ టోన్ తో మ్యాచ్ అవుతాయి. చర్మంపై స్ట్రెచ్ మార్క్స్ ని మీరు గమనిస్తే మీరు చర్మ సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే, వీటిని అలాగే వదిలేస్తే వీటి నుంచి విముక్తి పొందటం కష్టతరం.

Homemade Coffee-coconut Oil Scrub For Stretch Marks

కాబట్టి, వీటిని ఎలా ట్రీట్ చేయాలని మీరీ పాటికే మధనపడుతూ ఉండుంటారు. ఈ విషయంలో మీరు ఇకపై దిగులు చెందవలసిన అవసరం లేదు. చక్కటి రెమెడీస్ ను ఇక్కడ వివరించాము. స్ట్రెచ్ మార్క్స్ ను తగ్గించే లోషన్స్ అలాగే క్రీమ్స్ బయట మార్కెట్ లో లభ్యమయినా కూడా ఈ హోమ్ రెమెడీస్ అనేవి చర్మ సంరక్షణకు అత్యంత ఉపయోగకరంగా ఉంటాయి.

ఇక్కడ, కాఫీ మరియు కోకోనట్ ఆయిల్ ను వాడి తయారుచేసిన సింపుల్ హోమ్ రెమెడీ గురించి ప్రస్తావించాము. ఈ మ్యాజికల్ స్క్రబ్ ను ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

కావలసిన పదార్థాలు:

5 టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్

3 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె

1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్

తయారుచేసే విధానం

తయారుచేసే విధానం

1. ఒక శుభ్రమైన జార్ ను తీసుకుని అందులో ఈ స్క్రబ్ ను ఫ్యూచర్ యూజ్ కోసం భద్రపరచుకోవచ్చు.

2. ఈ జార్ లో అయిదు టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్ మరియు మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను జోడించండి.

3. కొబ్బరి నూనెను వేడి చేసి కరిగించి దాన్ని ఈ జార్ లో వేయండి.

4. తాజా అలోవెరా లీఫ్ ను కట్ చేసి అందులోంచి జెల్ ను సేకరించండి. దీన్ని ఈ కాఫీ మిశ్రమానికి జోడించండి.

5. ఈ పదార్థాలన్నిటినీ బాగా కలిపి అందులో కొన్ని చుక్కల నీటిని జోడిస్తే మిశ్రమం కొంచెం పలచగా తయారవుతుంది.

6. సాధ్యమైతే, ఒక చెక్క గరిటెతో ఈ పదార్థాలని మరింత బాగా కలపండి.

7. ఈ కంటైనర్ లిడ్ ను క్లోజ్ చేసి చల్లటి అలాగే డార్క్ ప్లేస్ లో ఈ కంటైనర్ ను భద్రపరచండి.

ఎలా వాడాలి?

ఎలా వాడాలి?

1. కొంత కాఫీ-కోకోనట్ ఆయిల్ మిశ్రమాన్ని తీసుకుని ప్రభావిత ప్రాంతంపై స్క్రబ్ చేయండి.

2. సర్క్యూలర్ మోషన్ లో అయిదు నిమిషాల పాటు స్క్రబ్ చేయండి.

3. ఈ మిశ్రమాన్ని ఇరవై నిమిషాలపాటు అలాగే వదిలేయండి.

4. ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో ఈ మిశ్రమాన్ని తొలగించండి.

5. ఈ స్క్రబ్ ను తొలగించిన తరువాత మీరు రెగ్యులర్ గా వాడే మాయిశ్చరైజర్ ను అప్లై చేయండి.

6. ఈ రెమెడీను వారానికి రెండు మూడు సార్లు వాడితే వేగవంతమైన మరియు మెరుగయిన ఫలితాలను పొందగలుగుతారు.

కాఫీలో లభించే చర్మ సంరక్షణ గుణాలు:

కాఫీలో లభించే చర్మ సంరక్షణ గుణాలు:

కాఫీలో లభించే పోషకాలు చర్మంపై ప్రభావవంతంగా పనిచేస్తాయి. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇవి చర్మాన్ని టైటన్ చేస్తాయి. చర్మం బిగుతుగా మారుతుంది. చర్మాన్ని ఎక్స్ఫోలియెట్ చేయడం వలన బ్లడ్ సర్క్యూలేషన్ పెంపొందుతుంది. చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.

అంతేకాక, కాఫీ అనేది చర్మాన్ని హైడ్రేట్ చేసేందుకు తోడ్పడుతుంది. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. తద్వారా, చర్మానికి లోలోపల నుంచి పోషణనిస్తుంది.

కొబ్బరి నూనె వలన కలిగే ప్రయోజనాలు:

కొబ్బరి నూనె వలన కలిగే ప్రయోజనాలు:

కొబ్బరి నూనె అనేది ఎంతో మంది మగువల ఫేవరెట్ బ్యూటీ ప్రోడక్ట్. ఇది చర్మాన్ని స్మూత్ గా ఆలాగే హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. చర్మాన్ని హీల్ చేస్తుంది. దీంతో ఉన్న యాంటీ మైక్రోబయాల్ గుణాలు ఇందుకు తోడ్పడతాయి.

కొబ్బరి నూనెలో లభించే విటమిన్ ఈ మరియు విటమిన్ కె అనేవి ప్రీమెచ్యూర్ సెల్ ఏజింగ్ ను అరికడతాయి. కొబ్బరి నూనెలో లభించే ఎమినో యాసిడ్స్ అనేవి స్ట్రెచ్ మార్క్స్ ని అరికడతాయి. టిష్యూ ఫైబర్స్ ని కలిపి ఉంచడం ద్వారా ఇది స్ట్రెచ్ మార్క్స్ ని అరికడుతుంది. కొబ్బరి నూనె అనేది తనలోని ఫ్యాటీ యాసిడ్స్ వలన చర్మంలోని తేమను నిలిపి ఉంచుతుంది.

అలోవెరా ద్వారా అందే చర్మ సంరక్షణ గుణాలు:

అలోవెరా ద్వారా అందే చర్మ సంరక్షణ గుణాలు:

అలోవెరా అనేది అనేక చర్మ సమస్యల నుంచి రక్షణను అందిస్తుంది. ఇందులో విటమిన్స్ మరియు మినరల్స్ కలవు. ఇవి చర్మానికి తగిన పోషణను అందిస్తాయి. మాయిశ్చరైజింగ్ తో పాటు ఇందులో ఉండే యాంటీ ఇంఫ్లేమేటరీ గుణాలు అన్ని రకాల ఇంఫ్లేమేషన్ మరియు ఇరిటేషన్ ను తగ్గించేందుకు తోడ్పడతాయి. ఇందులో లభించే కొలాజిన్ అనేది చర్మం ఎలాస్టిసిటీను మెరుగుపరుస్తుంది.

English summary

Homemade Coffee-coconut Oil Scrub For Stretch Marks

Stretch marks appear when the skin is stretched beyond its capacity. This can occur due to pregnancy or excess weight gain or loss as well. So now you must be wondering how to treat them, right? Do not panic as we have all the remedies here. Stretch marks can be easily treated with a scrub using coffee and coconut oil.
Desktop Bottom Promotion