ఈ 6 ఫేస్-ప్యాక్స్ తో శాశ్వతంగా బ్లాక్-హెడ్స్ ను వదిలించుకోండి !

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

యుక్తవయస్సు ప్రారంభమైనప్పటి నుండి, ఒక అమ్మాయి మచ్చలులేని ముఖ చర్మాన్ని కలిగి ఉండాలని కలలు కంటుంది. అయితే, అలా ఉండటం అందరికీ సాధ్యపడదు. అందమైన చర్మాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తున్నవారిలో కేవలం కొంతమందికి మాత్రమే, వారి జీవితకాలమంతా ఒకే విధంగా తమ చర్మ సౌందర్యాన్ని నిర్వహించగలుగుతున్నారు.

మీ చర్మం బాల్యదశలోనే పింపుల్స్, మొటిమల వంటి చర్మ సమస్యలతో ప్రారంభమై ముడతలకు, మచ్చలకు దారితీస్తుంది. వీటన్నింటిలో మీకు విసుగు కలిగించే విషయం 'బ్లాక్-హెడ్స్' !

తరచుగా ఈ చర్మ సమస్యలు ఆయిల్ స్కిన్ ఉన్న మహిళల్లో ప్రధానంగా కనిపించినప్పటికీ, కొంతమంది బాధితులు ఇదే ప్రధాన సమస్యగా లేదని చెబుతున్నారు. అధిక మొత్తంలో శ్లేష్మము విడుదల కావడం చేత మీ చర్మరంధ్రాలు మూసుకుపోవడానికి కారణంగా మారుతోంది.

Want to remove blackheads permanently

చాలా ఎక్కువ మోతాదులో శ్లేష్మము ఉత్పత్తి కావడం వల్ల చర్మ రంధ్రాలను అడ్డుపడి, ఆ రంధ్రాలను మరింత పెద్దవిగా మారుస్తుంది. దాని పర్యవసానంగా, చర్మ రంధ్రాలలోకి గాలి ప్రవేశించి ఆక్సీకరణం చెందుతుంది. ఈ ప్రభావం చేత మీ చర్మ ఉపరితలం పసుపు (లేదా) నలుపు రంగుల్లో కనిపించేలా చేస్తుంది.

మీరు ఈ బ్లాక్-హెడ్స్ను గుర్తించి తగిన చర్యలు తీసుకోకపోతే, అవి మీ చర్మ రంధ్రాలను శాశ్వతంగా ప్రభావితం చేస్తుంది. ఇలా మీకు ఎదురయ్యే ఈ సమస్యను ఎదుర్కోగల అత్యుత్తమ మార్గం ఏమిటంటే, మీరు ఈ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించినపుడు వెంటనే నివారణ చర్యలను పాటించి మొగ్గ దశలోనే దీనిని పూర్తిగా నివారించండి.

బ్లాక్హెడ్స్ & ఇతర చర్మ సమస్యలు లేని, సంపూర్ణమైన చర్మ సౌందర్యాన్ని పెంపొందించగల కొన్ని ఫేస్ ప్యాక్లు ఇక్కడ ఉన్నాయి. అవి,

1. గుడ్డు తెల్లని సొనతో ఫేస్-ప్యాక్ :

1. గుడ్డు తెల్లని సొనతో ఫేస్-ప్యాక్ :

ఈ ఫేస్-ప్యాక్ జిడ్డు చర్మంతో ఉన్న వారికి బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ, మీరు చేయాల్సిందల్లా ఒక టీ స్పూను తేనెను, ఒక గుడ్డు తెల్లని సొనతో కలపాలి, అలా తయారైన మిశ్రమాన్ని మీ ముఖం మీదే అప్లై చేయాలి. ఇది ఆరిపోయిన తర్వాత, మీరు గోరు వెచ్చని నీటితో మీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి 1-2 సార్లు చేయడం ద్వారా చనిపోయిన చర్మ కణాలను మీ ముఖం నుంచి తొలగించి, బ్లాక్-హెడ్స్ ఏర్పడకుండా ఉండటాన్ని నిర్థారిస్తుంది.

2. దాల్చినచెక్క పొడితో ఫేస్-ప్యాక్ :

2. దాల్చినచెక్క పొడితో ఫేస్-ప్యాక్ :

ఈ గుడ్డు సొనతో చేసిన ఫేస్-ప్యాక్ను పోల్చుకుంటే, దీనిని ఉపయోగించాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. మీరు వారంలో 4 సార్లు ఈ ప్యాక్ను అప్లై చేయాలి. ఇక్కడ, మీరు 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని & దాల్చినచెక్క పొడిని తీసుకుని బాగా కలపాలి. బ్లాక్ హెడ్స్ ఉన్న చర్మ ప్రాంతాల్లో ఈ మిశ్రమాన్ని ఉపయోగించండి. మెడ, భుజాలు, వీపు భాగంలో ఉన్న బ్లాక్ హెడ్స్ను నివారించడానికి ఈ ప్యాక్ను ఉపయోగించవచ్చు. ఈ ప్యాక్ను అప్లై చేసిన 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రంగా కడగండి.

3. అలోవెరా ఫేస్-ప్యాక్ :

3. అలోవెరా ఫేస్-ప్యాక్ :

ఈ ఫేస్ ప్యాక్ అన్ని రకాల వయసుల వారికి & అన్ని రకాల చర్మాల వారికి సరిగ్గా సరిపోతుంది. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా, అలోవెరా మొక్క నుంచి తాజా జెల్ను సేకరించి మీ ముఖానికంతటికీ ప్యాక్లా అప్లై చేయండి. ఒక 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఈ ప్యాక్ను రోజువారీగా అప్లై వల్ల పెద్దగా తెరచి ఉన్న చర్మ రంధ్రాలను మూసి వేసి, బిగుతైన సున్నితమైన చర్మాన్ని కలిగి ఉండేలా చేస్తుంది.

4. పసుపుతో ఫేస్-ప్యాక్ :

4. పసుపుతో ఫేస్-ప్యాక్ :

ఇక్కడ, మీరు చేయాల్సినదల్లా ఒక టేబుల్ స్పూన్ పసుపు పొడిని, 2 టేబుల్ స్పూన్ల తాజా పుదీనా రసంతో కలపాలి. పసుపులో ప్రధాన పదార్ధంగా "కర్కుమిన్" అనే సమ్మేళనం ఉంది. ఇది ప్రకృతి సిద్ధమైన యాంటీమైక్రోబయాల్ వంటి లక్షణాన్ని కలిగి, చర్మ రంధ్రాలలో ఉన్న బాక్టీరియాను తొలగిస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ & యాంటీ బాక్టీరియా లక్షణాలు అన్ని రకాల చర్మాలను సంరక్షించేలా ఉంటాయి. ఈ పేస్ట్ను బ్లాక్ హెడ్స్ కలిగి ఉన్న ప్రదేశాలకు అప్లై చేసి, 10-15 నిముషాల తర్వాత, మీ చర్మాన్ని శుభ్రంగా నీటితో కడగండి.

5. మెంతులతో ఫేస్-ప్యాక్ :

5. మెంతులతో ఫేస్-ప్యాక్ :

ఈ ఫేస్-ప్యాక్ను సిద్ధం చేయడం చాలా సులభం & అన్ని రకాల చర్మాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ ను తయారుచేయడం కోసం మీరు శుభ్రపరచిన మెంతాకులను సేకరించి వాటిని నీటితో కలిపి మెత్తని పేస్ట్లా తయారు చేసుకొని, ప్రభావిత చర్మ ప్రాంతాలలో అప్లై చేయండి. సుమారు 10 నిమిషాల తరువాత, ఆ చర్మ భాగాన్ని నీటితో శుభ్రం చేయండి. ఈ ప్యాక్ను వారానికి ఒకసారి మాత్రమే అప్లై చేయాలి. పొడిచర్మం కలిగి ఉన్నవారు ఈ ప్యాక్ను ఉపయోగించడం వల్ల వీరికి దుష్ప్రభావాలు ఏర్పడతాయి. అందువల్ల వీరు ఈ ప్యాక్ను అప్లై చేసి, నీటితో శుభ్రపరచుకున్న తర్వాత మీరు ప్రతిసారీ మాయిశ్చరైజర్ను ఖచ్చితంగా వాడటాన్ని నిర్ధారించుకోవాలి.

6. టమోటో ఫేస్-ప్యాక్ :

6. టమోటో ఫేస్-ప్యాక్ :

టమోటాలో ఉండే లైకోపీన్, దాని యాంటీఆక్సిడెంట్ ప్రభావాన్ని చర్మంపై కలిగిస్తుంది, అలాగే శరీరానికి నష్టాన్ని కలుగజేసే అన్ని స్వేచ్ఛారాశులను నాశనం చేస్తుంది. ఇటువంటి గొప్ప ప్రయోజనాలను పొందడానికి మీరు చేయవలసినదల్లా, తాజా టమోటా నుంచి గుజ్జును సేకరించి బ్లాక్-హెడ్స్ పై అప్లై చేయండి. మీరు సున్నితమైన చర్మాన్ని కలిగి ఉంటే, మీరు ఈ గుజ్జును నీటితో కలిపి ఉపయోగించవచ్చు. ఈ పేస్ట్ను రాత్రి వేళలో అప్లై చేసి మరుసటి రోజు ఉదయం నీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మంపై ఉన్న బ్లాక్ హెడ్స్ను నివారించడంలో గల వేగవంతమైన చర్యను మీరు గానీ చూస్తే ఆశ్చర్యపోతారు.

English summary

Want to remove blackheads permanently? Try these 6 face masks

Since onset of puberty, all that a girl dreams of is to have a flawless skin. While the range of problems that your skin goes through is from pimples, acne to wrinkles, one thing that is a constant nuisance are blackheads. Egg white masks, aloe vera mask, turmeric paste, cinnamon mask work best for all skin types.
Story first published: Friday, April 13, 2018, 17:30 [IST]