For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

DIY కాఫీ పేషీయల్ గైడ్ ని పాటించడం ద్వారా చర్మసౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు

|

ఒక కాఫీతో రోజును ప్రారంభిస్తే ఎంతటి హెక్టిక్ డే నాడైనా ఎనర్జిటిక్ గా ఉంటూ పనులను వేగవంతంగా తగిన నేర్పుతో పూర్తిచేయగలుగుతాము. ఇది, కాఫీతో మనకున్నటువంటి అనుబంధం. అయితే, ఈ అద్భుతమైన పదార్థానికి మీ చర్మ సౌందర్యాన్ని సంరక్షించే గుణం కలదన్న విషయం మీకు తెలుసా. స్క్రబ్, మాస్క్, క్లీన్సర్ లా వివిధ రకాలుగా మీ చర్మాన్ని సంరక్షించే సామర్థ్యం కాఫీ కుందన్న విషయం మీకు తెలుసా?

కెఫైన్ లో చర్మానికి పోషణాలిచ్చే ఎబిలిటీస్ ఉన్నాయి. ఇవి చర్మాన్ని హెల్తీగా ఉంచుతూ చర్మ సౌందర్యాన్ని సంరక్షిస్తూ ఉంటాయి. డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, స్కిన్ ట్యాన్ వంటి సమస్యలను తొలగిస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది.

How Can Coffee Help In Enhancing Beauty? A DIY Coffee Facial Guide

కాఫీ అనేది చర్మాన్ని టైటన్ చేసే యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తూ అదే సమయంలో ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. స్కిన్ ఎక్స్ఫోలియేషన్ కి కూడా ఉపయోగపడుతుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది.

అనేక చర్మ సమస్యలకు ఇది చక్కటి పరిష్కారంగా ఉంటుంది. ఇంటి వద్దే చర్మ సౌందర్యాన్ని సంరక్షించుకునే పద్దతులను సులభంగా పాటించే అవకాశం ఉండటం అదృష్టం కదా? ఈ ఆర్టికల్ లో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే స్టెప్ బై స్టెప్ కాఫీ ఫేసియల్ గైడ్ ను మీకందిస్తున్నాము.

స్టెప్ 1: క్లీన్సింగ్

స్టెప్ 1: క్లీన్సింగ్

ఫేసియల్ లో క్లీన్సింగ్ అనేది బేసిక్ స్టెప్. ఇది దుమ్ముని, అదనపు నూనెను అలాగే అన్వాన్టేడ్ ఇంప్యూరిటీస్ ను తొలగించి చర్మాన్ని తేటపరుస్తుంది.

ఎలా చేయాలి: ఇది చాలా సింపుల్ ప్రాసెస్. కాఫీ పౌడర్ మరియు అలోవెరా జెల్ ను కలిపి ఈ ఫేసియల్ ను చేసుకోవాలి. ముందుగా ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ ను ఒక బౌల్ లోకి తీసుకోవాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ ను కలిపి ఈ రెండు పదార్థాలని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై కలిపి సర్క్యూలర్ మోషన్ లో దాదాపు 2 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. రెండు నిమిషాల తరువాత, సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ఇంతటితో, ఈ స్టెప్ పూర్తయినట్టే!

స్టెప్ 2: స్క్రబ్బింగ్

స్టెప్ 2: స్క్రబ్బింగ్

క్లీన్సింగ్ తరువాత మరుసటి స్టెప్ స్క్రబ్బింగ్. స్క్రబ్బింగ్ అనేది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి ఓవరాల్ లుక్ ని మెరుగుపరుస్తుంది. స్కిన్ ను ఎక్స్ఫోలియేట్ చేస్తుంది.

ఎలా చేయాలి: ఒక బౌల్ లో ఒక టేబుల్ స్పూన్ షుగర్ ను అలాగే ఒక టేబుల్ స్పూన్ కాఫీను తీసుకోవాలి. ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కోకోనట్ ఆయిల్ ను జోడించాలి. ఈ మిశ్రమంతో ముఖంపై సర్క్యూలర్ మోషన్ లో స్క్రబ్ చేయాలి. ఈ ప్రాసెస్ ద్వారా చర్మంపైన డెడ్ సెల్స్ తొలగిపోతాయి. తద్వారా, మీ చర్మం మరింత కాంతివంతంగా మారుతుంది. అయిదు నిమిషాల తరువాత సాధారణ నీటితో చర్మాన్ని శుభ్రపరచుకోవాలి.

స్టెప్ 3: ఫేస్ మాస్క్

స్టెప్ 3: ఫేస్ మాస్క్

అవును. ప్రకాశవంతమైన, మెరుగైన చర్మాన్ని పొందేందుకు మీరు కేవలం ఒక స్టెప్ దూరంలోనే ఉన్నారు. ఫేసియల్ లో ఫేస్ మాస్క్ అనేది కీలకమైన స్టెప్. ఫేస్ మాస్క్స్ లనేవి చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి తోడ్పడతాయి. అందువలన, మీ చర్మం మరింత కాంతివంతంగా మారుతుంది. ఇక్కడ కొన్ని కాఫీ బేస్డ్ మాస్క్స్ గురించి వివరించాము.

కాఫీ అండ్ హానీ ఫేస్ మాస్క్

కాఫీ అండ్ హానీ ఫేస్ మాస్క్

ఎలా చేయాలి: ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ ను ఒక బౌల్ లోకి తీసుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ తేనెని బాగా కలపాలి. ఈ మాస్క్ ను ముఖానికి పట్టించాలి. సర్క్యూలర్ మోషన్ లో బాగా మసాజ్ చేయాలి. ఇది 15 నిమిషాల పాటు ఆరాలి. ఆ తరువాత ముఖాన్ని శుభ్రపరచాలి. తేనెలో మాయిశ్చరైజింగ్ ఏజెంట్స్ కలవు. కాఫీలో వీటిని కలిపినప్పుడు చర్మం మాయిశ్చరైజ్ అయి ప్రకాశవంతంగా మారుతుంది.

కాఫీ అండ్ లెమన్ ఫేస్ మాస్క్

కాఫీ అండ్ లెమన్ ఫేస్ మాస్క్

ఎలా చేయాలి: ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ లో కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలపాలి. మెత్తటి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అలాగే మెడకు అప్లై చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 30 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వాలి. ఆ తరువాత మిశ్రమాన్ని ముఖంపైనుంచి అలాగే మెడపైనుంచి తొలగించాలి. లెమన్ లో విటమిన్ సి కలిగి ఉంటుంది. ఇది చర్మంపైనున్న దుమ్మును తొలగించి చర్మాన్ని తేటపరచి ఆరోగ్యంగా తయారుచేస్తుంది.

కాఫీ అండ్ మిల్క్ ఫేస్ మాస్క్

కాఫీ అండ్ మిల్క్ ఫేస్ మాస్క్

ఎలా చేయాలి: ఒక టేబుల్ స్పూన్ కేజీ పౌడర్ లో ఒక టేబుల్ స్పూన్ మిల్క్ ని కలిపి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల వరకు అలాగే ఉండనివ్వాలి. ఆ తరువాత, సర్క్యూలర్ మోషన్ లో మసాజ్ చేయాలి. మిల్క్ లో చర్మ కాంతిని మరింత పెంపొందించే గుణాలు కలవు.

ఈ సింపుల్ DIY కాఫీ ఫేసియల్ గైడ్ అనేది చర్మంపై వండర్స్ ను చేస్తుంది. ఈ ప్రాసెస్ ని వారానికి ఒకసారి నెల లేదా రెండు నెలలపాటు చేస్తే మీరు అద్భుతమైన ఫలితాలను గమనించవచ్చు.

English summary

How Can Coffee Help In Enhancing Beauty? A DIY Coffee Facial Guide

How Can Coffee Help In Enhancing Beauty? A DIY Coffee Facial Guide,No matter how busy we are, our day cannot start without a cup of coffee, isn't it?Have you ever wondered how coffee plays a vital role in enhancing beauty? Yes, this wonderful ingredient can help you gain a beautiful skin in the form of a scrub, mask
Desktop Bottom Promotion