మీ కంటి కింద ముడతలు రాకుండా ఎలా నివారిస్తారు ?

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

వయసు పైబడి, వృద్ధాప్యం దగ్గర పడుతుండటం వల్ల మన చర్మం & కళ్ళ దగ్గర సంభవించే వృద్ధాప్య సంకేతాలను మనం ఏవిధంగాను అడ్డుకోలేము. వృద్ధాప్యాన్ని నివారించడం సాధ్యం కాకపోయినా దానిని ఆలస్యం చేయడం సాధ్యమే. కాబట్టి మీ కళ్ల కింద ఏర్పడే ముడతలను నివారించడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

వృద్ధాప్యం దరి చేరడానికి మీ వయస్సు మాత్రమే కారణం కాకుండా, కాలుష్యం, ధూమపానం, జీవనశైలి, చర్మ సంరక్షణను పాటించకపోవడం వంటి కొన్ని కారకాలు కూడా వృద్ధాప్య సంకేతాలుగా ఉన్నాయి. ఈ వృద్ధాప్య ఛాయలను మనం దాచలేము, బయటపడకుండా చేయలేము కానీ వీటిని నిరోధించవచ్చు.

How Can You Prevent Cure Under Eye Wrinkles?

మీ చర్మ సమస్యలకు 100% మంచి ఫలితాలను ఇవ్వగలిగే చర్మ సంరక్షణ ఉత్పత్తులు మార్కెట్లో చాలానే అందుబాటులో ఉన్నాయి కానీ, వాటిని పూర్తిగా నమ్మలేము. ఎందుకంటే వాటిలో ఉండే రసాయనాలు మీకు దుష్ప్రభావాలను కలుగచేయగలవు.

కాబట్టి, మీ కంటి కింద ఉన్న మడతలను అరికట్టే కొన్ని ఇంటి చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. అవి

1. కొబ్బరి నూనె :

1. కొబ్బరి నూనె :

కొబ్బరి నూనెలో విటమిన్ ఇ & యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి ఇవి మీ కంటి ముడతలను తగ్గిస్తుంది. మీరు ప్రతిరోజు రాత్రి నిద్రించేముందు కొన్ని చుక్కల కొబ్బరినూనెతో మడతలు ఉన్న ప్రాంతాన్ని మసాజ్ చేయడం ద్వారా, కంటి కింద ఏర్పడిన ముడతలను నివారించవచ్చు.

ఈ మడతలను తగ్గించే మరొక ప్రత్యామ్నాయం, కొబ్బరినూనె & పసుపుల ఫేస్ ప్యాక్. అందుకోసం మీరు ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెకు, చిటికెడు పసుపు కలిపి మెత్తగా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని మీకంటే కింద ఉన్న ముడతల పై అప్లై చేయండి. ఒక్క 20 నిమిషాల వరకు దానిని అలాగే వదిలేసి, ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రంగా మీ ముఖాన్ని కడగండి.

2. పెరుగు :

2. పెరుగు :

పెరుగులో ఉన్న లాక్టిక్ యాసిడ్ చనిపోయిన చర్మకణాలను తొలగించడంలో సహాయపడుతుంది, ఆ విధంగా మీ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. మరింత మంచి ఫలితాలను పొందడానికి పెరుగును మీ రోజువారి చర్మ సంరక్షణకోసం ఉపయోగించవచ్చు.

కావలసిన పదార్థాలు :

1 టేబుల్ స్పూన్ పెరుగు

1 టేబుల్స్పూన్ తేనె

తగినత రోజు వాటర్

తయారీ విధానం :

ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ పెరుగుకు, 1 టేబుల్ స్పూన్ తేనెను బాగా కలిపి దానికి అదనంగా కొన్ని చుక్కల రోజ్ వాటర్ను జోడించాలి. ఈ పదార్థాలన్నింటిని బాగా కలిపి మెత్తని పేస్టులా తయారు చేసుకున్న తర్వాత మీ కళ్ళ కింద ఉన్న ప్రాంతంలో ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. ఈ ఫేస్ప్యాక్ 15నిమిషాల పాటు బాగా ఆరనిచ్చిన తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి.

3. అలోవెరా :

3. అలోవెరా :

అలోవెరాలో విటమిన్ C & E పుష్కలంగా ఉన్నాయి. ఇది మీ చర్మాన్ని డీహైడ్రేట్గా ఉంచి, సంరక్షించడానికి బాగా సహాయపడుతుంది. ఇది మీ చర్మమును రిపేర్ చేసి, చర్మానికి కావలసిన పోషణను అందించి, మీ కళ్ళ చుట్టూ ఉన్న ముడుతలు తగ్గించడంలో సహాయపడుతుంది.

అందుకోసం మీరు అలోవెరా ఆకుల నుంచి సేకరించిన జెల్ను, ముడతలు ఉన్న సమస్యాత్మకమైన చర్మ ప్రాంతాలలో అప్లై చేసి, 5 నిమిషాల వరకు బాగా ఆరిన తరువాత, చల్లని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి.

4. బొప్పాయి :

4. బొప్పాయి :

మీ అందమైన కళ్ళ చుట్టు ఏర్పడిన ముడతలను, గీతలను తగ్గించడంలో బొప్పాయి బాగా సహాయపడుతుంది. మీ సమస్యను త్వరగా నివారించడంలో బొప్పాయి చాలా వేగంగా పనిచేస్తుంది.

తాజా బొప్పాయిని కొన్ని ముక్కలను కట్ చేసి సేకరించిన దాని గుజ్జును మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈ పేస్టును ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల వరకు వేచి ఉండాలి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుని, టవల్ సహాయంతో మీ ముఖ చర్మాన్ని పొడిగా మార్చాలి.

5. గ్రీన్ టీ :

5. గ్రీన్ టీ :

ఈ గ్రీన్ టీ లో యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల మీ ముఖం పై ఏర్పడిన ముడతలను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. అలాగే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న కారణంగా మీ కంటి చుట్టూ ఉన్న చర్మాన్ని బిగుతుగా చేయటంలో సహాయపడుతుంది.

మీరు గ్రీన్ టీని తయారు చేసుకుని, కాస్తా చల్లబరిచిన తరువాత వినియోగించాలి. మీ సమస్యాత్మకమైన చర్మ ప్రాంతాలలో దీనిని అప్లై చేయడం వల్ల, ముడతలు తగ్గుతాయి.

6. నిమ్మరసం :

6. నిమ్మరసం :

నిమ్మ లో ఉన్న కొన్ని ప్రత్యేక ఏజెంట్లు మీ కళ్ళ కింద ఉన్న చర్మాన్ని టైట్గా చేయటంలో సహాయపడతాయి. అంతేకాకుండా వీటిలో ఉన్న C విటమిన్, శరీరంలో సంచరించే స్వేచ్ఛ రాశులను నిరోధిస్తుంది.

మీ కంటి చుట్టూ ఉన్న ముడతలపైన నిమ్మరసాన్ని అప్లై చేయండి (లేదా) సగం నిమ్మకాయ ముక్కను తీసుకొని మీ కళ్ళ చుట్టూ ఉన్న మడతలపైన రుద్దండి. వృద్ధాప్యం కారణంగా ఏర్పడే కంటి ముడతలను తొలగించడంలో ఇది సహాయపడుతుంది.

7. తేనె :

7. తేనె :

మీ చర్మాన్ని బిగుతుగా తయారు చెయ్యగలిగే ఏజంట్లను తేనె కలిగి ఉంటుంది, అలాగే ఇది మీ చర్మాన్ని మెరుగుపరుస్తుంది. మరదలా నివారణకు పడితే నేను మీ కళ్ళ కింద నేరుగా అప్లై చేయవచ్చు (లేదా) మంచి ఫలితాలను పొందడం కోసం తేనెకు బియ్యం పిండిని కలిపి అప్లై చేయండి.

బియ్యం పిండిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మీ చర్మాన్ని హైడ్రేట్గా చేస్తాయి. 1 స్పూన్ బియ్యం పిండికి 1 స్పూన్ తేనెనూ కలపండి. ఇలా తయారుచేసుకున్న మిశ్రమం గట్టిగా ఉన్నట్లు భావిస్తే మరికొంత తేనెను అదనంగా కలపవచ్చు. ఈ ఫేస్ మాస్క్ ను వారానికి రెండు సార్లు అప్లై చేయడం వల్ల మీ కళ్ళ కింద ఉన్న ముడతలు బాగా తగ్గిపోతాయి.

English summary

How Can You Prevent Cure Under Eye Wrinkles?

We cannot deny the fact that the signs of ageing occur first on the skin and eyes. Though it is not possible to avoid ageing, it is surely possible to delay it at least. Some home ingredients like coconut oil, honey, lemon juice, olive oil, etc., can be used in our daily skin care routine to cure under-eye wrinkles.
Story first published: Sunday, May 6, 2018, 9:00 [IST]