For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉల్లిపాయ మన చర్మంపై మాయాజాలం చేసి, కాంతివంతంగా తయారు చేస్తుందనిమీకు తెలుసా!

|

మన చర్మం విషయానికి వచ్చేసరికి, మనము కాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకుని సంరక్షణ చర్యలు చేపడతాము. కానీ ఈ పనిని మనమెలా చేయాలిఅనేదే పెద్ద ప్రశ్న! మీరు సాధారణ చర్మ సమస్యలు కొరకు అన్వేషిస్తున్నట్లైతే, సరైన చోటికి వచ్చినట్లే!

నల్లని మచ్చలు, మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్, మొదలైనవి వంటి కొన్ని సాధారణ చర్మ సమస్యల నివారణ కొరకు మనం అనేక రకాల రసాయన ఉత్పత్తులు మరియు సహజ చికిత్సలను ప్రయోగించాలనుకుంటాము. ఈ మనస్సులో మేము వివిధ ఈ రసాయన ఉత్పత్తులను ఉపయోగించి నివారణ చర్యలు చేపడితే, చివరికి మన చర్మానికి హాని కలిగిస్తాయి.

సూర్యుడి హానికరమైన కిరణాలు, కాలుష్యం, జీవనశైలి, అధిక ధూమపానం మరియు మద్యపానం, హార్మోన్ల అసమతౌల్యం మొదలైనటు వంటి అనేక కారణాల వలన ఈ సాధారణ చర్మ సమస్యలు సంభవిస్తాయి. అయినప్పటికీ, మీరు చింతించాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో తయారు చేసుకోగలిగే సహజమైన పదార్థాలతో ఎటువంటి దుష్ప్రభావాలు లేని నివారణ చర్యలు చేపట్టవచ్చు.

కనుక ఈ వ్యాసం ద్వారా, మీ చర్మ సమస్యలకు, మన వంటగదిలో ఎప్పుడూ లభించే ఒక పదార్ధం తో ఎలా పరిష్కారం చేసుకోవచ్చో తెలియజేస్తున్నాము. మీరు ఏమిటబ్బా? అనుకుంటున్న ఆ పదార్ధం మరేదో కాదండి, ఉల్లిపాయలే!

ఉల్లిపాయ ఎలా చర్మానికి ప్రయోజనం చేకూరుస్తుంది?

ఉల్లిపాయలో సమృద్ధిగా ఉండే యాంటిఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు ఖనిజాలు వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని మనకు తెలుసు. కానీ, ఈ సాధారణ కూరగాయ మీ చర్మంపై అద్భుతాలు చేయగలదని మీకు తెలుసా?

సూర్యుడి హానికరమైన UV కిరణాల నుండి మన చర్మాన్ని రక్షించడంలో సహాయపడే, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫ్లావనాయిడ్లు ఉల్లిపాయలలో ఉన్నాయి.

ఉల్లిపాయలు యాంటిఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి.

ఇవి రక్తం నుండి విషపదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి మరియు తద్వారా మన శరీరాన్ని శుద్ధి చేస్తాయి. దీనివలన మన చర్మంపై అనుకూల ప్రభావం ఏర్పడి, శుద్ధి అవుతుంది.

సల్ఫర్ సమృద్ధిగా ఉన్నందున, ఉల్లిపాయ ఫ్రీరాడికల్స్ తో పోరాడడంలో కూడా సహాయపడుతుంది. తద్వారా చర్మాన్ని, అకాల వృద్ధాప్యం నుండి నిరోధిస్తుంది.

యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నందున, ఈ సాధారణ కూరగాయను, ఇన్ఫెక్షన్లు, మచ్చలు, వాపులు మొదలైన పలురకాల చర్మ సమస్యలను చిటికెలో మాయం చేసేందుకు వాడతారు. అలాగే ఉల్లిపాయలో ఉన్న విటమిన్ సి చర్మం మీది గాయాలు మరియు పిగ్మెంటేషన్ ను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.

దీన్ని ఎలా వాడాలి?
అంతర్గతంగా మరియు బాహ్యంగా ఉపయోగించినట్లయితే, ఉల్లిపాయ మన చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఉల్లిపాయ, మనం వండే ప్రతి ఆహారంలో తప్పనిసరిగా వాడే పదార్ధం. కానీ దానిని చర్మంపై పూతగా వినియోగించడం, మనలో చాలామందికి ఆశ్చర్యకరంగా ఉంటుంది. కాబట్టి ప్యాక్స్ రూపంలో బాహ్యంగా దీన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.

1. మొటిమలతో పోరాడేందుకు:

1. మొటిమలతో పోరాడేందుకు:

కావలసిన పదార్థాలు:

1 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ రసం

1 టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె

తయారీ విధానం:

ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి, తురమండి. ఉల్లిపాయ తురుమును పిండి రసం తీయండి. ఇందులో ఆలివ్ ఆయిల్ ను వేసి, రెండు పదార్థాలను బాగా కలపాలి. మిశ్రమంలో ఒక దూది ఉండను ముంచి ప్రభావిత ప్రాంతానికి అది రాసుకోండి. 15 నిముషాల పాటు ఆరనిచ్చిన, తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. వేగవంతమైన మరియు మెరుగైన ఫలితాల కోసం ఈ చిట్కాను రోజుకు ఒకసారి ఉపయోగించండి.

2. వృద్ధాప్య ఛాయలను తగ్గించడానికి:

2. వృద్ధాప్య ఛాయలను తగ్గించడానికి:

కావలసిన పదార్థాలు:

1 మధ్య తరహా ఉల్లిపాయ

1 దూది ఉండ

తయారీ విధానం:

ఉల్లిపాయను తీసుకుని చిన్న ముక్కలుగా కొయ్యండి. ఈ ముక్కలను పేస్ట్ చేయడానికి మిక్సీలో వేయండి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ లో దూది ఉండ ముంచి,శుభ్రపరచుకున్న ముఖం మరియు మెడ మీద రాసుకోండి. తరువాత 20 నిముషాల పాటు వదిలేసి ఆపై సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.

క్రమం తప్పకుండా ఈ చిట్కాను ఉపయోగించి, మీ చర్మంలోని రక్త ప్రవాహంను మెరుగు పరచుకుని, బిగుతైన, యవ్వన కాంతులతో కూడిన చర్మంను సొంతం చేసుకోండి.

3. నల్లని మచ్చలను తొలగించడానికి:

3. నల్లని మచ్చలను తొలగించడానికి:

కావలసిన పదార్థాలు:

1 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ రసం

1 టేబుల్ స్పూన్ పెరుగు

లావెండర్ నూనె కొన్ని చుక్కలు

తయారీ విధానం:

ఒక శుభ్రమైన గిన్నెలో ఉల్లిపాయ రసం, పెరుగు మరియు లావెండర్ నూనె కొన్ని చుక్కలు వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని, మీ ముఖం మీద చేతివేళ్లను వలయాకార కదలికలతో మృదువుగా మర్దన చేసుకోండి.

4. చర్మం తక్షణమే తాజాగా కనిపించాలంటే:

4. చర్మం తక్షణమే తాజాగా కనిపించాలంటే:

కావలసిన పదార్థాలు:

2 టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ రసం

1 టేబుల్ స్పూన్ శనగపిండి

1 టీ స్పూన్ పాలు

తయారీ విధానం:

ఒక శుభ్రమైన గిన్నెలో, ఉల్లిపాయ రసం, శనగపిండి మరియు పచ్చిపాలు కలపండి. అన్నింటినీ బాగా కలిపి పేస్ట్ చేయండి. మీరు పేస్ట్ చాలా చిక్కగా ఉందని భావిస్తే, దానిపై కొన్ని పాలను కలిపి పలుచన చేసి ముఖానికి పట్టించండి.

ఈ ప్యాక్ ను మీ ముఖానికి పట్టించి 15 నిముషాల పాటు వదిలేసి ఆపై సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.

5. పిగ్మెంటేషన్ చికిత్సకు:

5. పిగ్మెంటేషన్ చికిత్సకు:

కావలసిన పదార్థాలు:

1 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ రసం

పసుపు ఒక చిటికెడు

తయారీ విధానం:

ఉల్లిపాయను బ్లెండ్ చేసి మృదువైన పేస్ట్ చేయండి. దీనిలో చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. దీనిని మీ ముఖం మరియు మెడ మీద రాసుకోండి.

మీ ముఖం మీద ఈ మిశ్రమంతో మృదువుగా మర్దన చేసుకుని, వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. మీరు వ్యత్యాసం గమనించేంత వరకు ప్రతి రోజూ పడుకోబోయే ముందు ఈ చిట్కాను ఉపయోగించండి.

English summary

Did You Know That Onion Can Do So Much On Your Skin?

We all give a little extra attention and care when it comes to our skin. But how we do that is a matter of question. If you are looking for natural solutions to treat your common skincare issues then you are absolutely at the right spot.Some common skin issues like dark spots, acne, pimple scars, blemishes, suntan, pigmentation, etc., can force us to experiment with a variety of products and natural remedies to treat them. And with this in mind we tend to try out different chemical products and remedies that ultimately harm our skin even more.
Story first published: Tuesday, August 7, 2018, 7:00 [IST]