For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఆఫీస్ లో స్ట్రెస్ ఫుల్ డే వలన అలసిన చర్మానికి కాస్తంత విశ్రాంతిని అందించడమెలా?

  |

  ఆఫీస్ లోని ఒత్తిడిపూర్వకమైన రోజు ప్రభావం చర్మంపై కూడా పడుతుంది. అలసట వలన చర్మం నిస్తేజంగా మారుతుంది. తద్వారా జీవంలేనట్టుగా కనపడుతుంది. ఒత్తిడికి చెందిన సమస్యలనేవి చర్మ సంబంధ సమస్యలను మరింత పెంచుతాయి. తద్వారా, చర్మం తనలోని కాంతిని పోగొట్టుకుంటుంది. నిస్తేజంగా మారుతుంది.

  అందుకే, పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న రోజుల్లో మహిళలు తమ చర్మానికి మరింత ప్రత్యేకమైన పోషణని అందించాలని స్కిన్ కేర్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. మీరు అటువంటి స్కిన్ కేర్ గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారా? అయితే, ఈ ఆర్టికల్ మీ కోసమే.

  hectic day

  ఈ రోజు బోల్డ్ స్కైలో, విపరీతమైన పనిఒత్తిడి వలన అలసిన చర్మాన్ని రిలాక్స్ చేసే అద్భుతమైన మార్గాలను సరళంగా వివరించాము. ఈ చిట్కాలన్నీ సహజసిద్ధమైనవి. వీటిని పాటిస్తే బ్యూటీ సెలూన్ ను సందర్శించవలసిన అవసరం ఉండదు.

  రాత్రిపూట ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన స్కిన్ కేర్ రూల్స్..!

  ఇంకా చెప్పాలంటే, ఈ చిట్కాలను సులభంగా పాటించవచ్చు. వీటి వలన చర్మానికి తగినంత పోషణ లభిస్తుంది. హెక్టిక్ డే కి సంబంధించిన అలసట చిహ్నాలు చర్మంపై కనుమరుగవుతాయి. దాంతో, చర్మం మరింత తాజాగా, కాంతివంతంగా తయారవుతుంది.

  ఈ చిట్కాలను మీ రోజువారీ బ్యూటీ రొటీన్ లో భాగంగా చేసుకోవడం ద్వారా అద్భుతమైన, కాంతివంతమైన చర్మాన్ని తిరిగి పొందవచ్చు.

  చర్మాన్ని ఇంటివద్దే ఎలా రిలాక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం.

  1. మసాజ్:

  1. మసాజ్:

  హెక్టిక్ డే వలన అలసి సొలసిన చర్మానికి తగినంత మసాజ్ ను అందివ్వడం ద్వారా చర్మంలోని సహజసిద్ధమైన కాంతిని తిరిగి పొందవచ్చు. కాస్తంత వర్జిన్ ఆలివ్ ఆయిల్ ను తీసుకుని మీ మ్రునివేళ్లతో ముఖంపై సున్నితంగా మసాజ్ చేయండి.

  సర్క్యూలర్ మోషన్ లో మసాజ్ చేయడం ద్వారా రక్తప్రసరణను పెంపొందించవచ్చు. తద్వారా, చర్మం అలసటను తగ్గించవచ్చు. ఈ ప్రాచీనమైన చిట్కా వలన మీ చర్మం ఉత్తేజంగా అలాగే కాంతివంతంగా కనిపిస్తుంది.

  2. ఎక్స్ఫోలియేషన్

  2. ఎక్స్ఫోలియేషన్

  చర్మ సంరక్షణలో ఎక్స్ఫోలియేషన్ అనేది ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ మెథడ్ వలన చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్ తో పాటు దుమ్మూ ధూళి అనేవి తొలగిపోతాయి. తద్వారా మీ చర్మం సహజసిద్ధంగా మరింత కాంతివంతంగా అలాగే అందంగా తయారుచేసింది.

  పనిఒత్తిడి ఎక్కువగా ఉన్న రోజులలో తేలికపాటి ఫేస్ స్క్రబ్ ను తీసుకుని చర్మాన్ని ఎక్స్ఫోలియెట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా చర్మ సౌందర్యాన్ని సంరక్షించుకున్నవారవుతారు.

  3. ఫేస్ మాస్క్

  3. ఫేస్ మాస్క్

  మీ ఫేషియల్ స్కిన్ ని ఫేస్ మాస్క్ తో సంరక్షించుకోండి. ఫేస్ మాస్క్ లు మార్కెట్ లో విరివిగా దొరుకుతున్నాయి. ఇంట్లో కూడా సహజసిద్ధమైన పదార్థాలతో వీటిని సులువుగా తయారుచేసుకోవచ్చు. మీ చర్మం తీరుకి సూట్ అయ్యే ఫేస్ మాస్క్ ని తీసుకుని వాడండి.

  వీటివలన, ముఖంపై ఉన్న దుమ్మూ ధూళి తొలగిపోవడంతో పాటు, తెరుచుకున్న చర్మ రంధ్రాలు మూసుకోబడతాయి. అలాగే, సహజసిద్ధమైన కాంతితో మీ చర్మం మెరిసిపోయి తాజాగా కనిపిస్తుంది.

  4. స్కిన్ టోనర్

  4. స్కిన్ టోనర్

  హెక్టిక్ డే రోజున స్కిన్ టోనర్ ని వాడటం అత్యంత అవసరం.

  అయితే, స్కిన్ టోనర్ ని వాడేముందు మీరు మేకప్ ని పూర్తిగా తొలగించుకోవాలి. ఆ తరువాత చర్మాన్ని రిఫ్రెష్ చేసే టోనర్ ని చర్మంపై స్ప్రే చేసుకోవాలి.

  ఇలా చేయడం ద్వారా, చర్మ రంధ్రాలు శుభ్రపడటంతో పాటు బిగుసుకుంటాయి. తద్వారా, మీ చర్మం తాజాగా, లైవ్లీగా కనిపిస్తుంది.

  చర్మం మృదుత్వానికి అలోవెర జెల్ ..!

  5. రోజ్ వాటర్

  5. రోజ్ వాటర్

  రోజ్ వాటర్ అనే చర్మ సంరక్షణ పదార్థమనేది చర్మానికి తగిన పోషణనివ్వడంలో అత్యద్భుతంగా పనిచేస్తుంది. చర్మానికి అవసరమైన తేమని అందించేందుకు ఈ పదార్థం ఉపయోగపడుతుంది. దాంతో, మీ చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది.

  ఒక కాటన్ బాల్ ని రోజ్ వాటర్ లో ముంచి ఆ కాటన్ బాల్ తో మీ ముఖాన్ని అలాగే మెడని సున్నితంగా రుద్దండి. ఒక గంట తరువాత చల్లటి నీటితో చర్మాన్ని శుభ్రపరుచుకోండి.

  6. ఐస్ క్యూబ్స్

  6. ఐస్ క్యూబ్స్

  కోల్డ్ కంప్రెస్ అనే చిట్కాను పాటించడం ద్వారా మీ చర్మాన్ని అత్యంత తాజాగా అలాగే అందంగా ఉంచుకోవచ్చు. రెండు నుంచి మూడు ఐస్ క్యూబ్స్ ని ఒక శుభ్రమైన వస్త్రంలో ఉంచి, ఆ వస్త్రాన్ని చర్మంపై ఉంచండి.

  చర్మంలోని వివిధప్రాంతాలలో ఈ వస్త్రాన్ని కొన్ని నిమిషాలపాటు ఉంచండి. ఆ విధంగా, చర్మంలోని రక్తప్రసరణ అనేది మెరుగవుతుంది. మీ చర్మం కాంతిని సంతరించుకుంటుంది.

  7. అలో వెరా జెల్

  7. అలో వెరా జెల్

  అలోవెరా జెల్ అనేది చర్మాన్ని ప్రశాంతపరిచే అద్భుతమైన పదార్థం. అలసిన మీ చర్మాన్ని తిరిగి తాజాగా అలాగే కాంతివంతంగా తయారుచేయడానికి ఈ పదార్థం అమితంగా తోడ్పడుతుంది.

  అలోవెరా జెల్ ను తీసుకుని ముఖంపై సున్నితంగా రాసుకోండి. మెడపై కూడా అలోవెరా జెల్ తో మర్దనా చేయండి. పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో మీ చర్మాన్ని శుభ్రపరచుకోండి.

  8. దోసకాయ

  8. దోసకాయ

  చర్మానికి ఉపశమనం కలిగించే పదార్థాలలో దోసకాయ ముందుంటుంది. పనిఒత్తిడి వలన చర్మంపై కలిగిన ప్రభావం తగ్గేందుకు ఈ పదార్థాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు.

  దోసకాయలో నీరు శాతం అధికంగా ఉంటుంది. అందువలన, చర్మానికి అవసరమైనంత తేమ లభిస్తుంది. తద్వారా, మీ చర్మం తాజాగా, కాంతివంతంగా మారుతుంది.

  కాస్తంత దోసకాయ గుజ్జుని మీ చర్మంపై అప్లై చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల తరువాత చల్లటి నీటితో చర్మాన్ని శుభ్రం చేయండి.

  9. ఫేషియల్ స్టీమ్

  9. ఫేషియల్ స్టీమ్

  ఆవిరిపట్టటమనేది సౌందర్య చిట్కాలలో ముఖ్యమైనది. ఆవిరిపట్టడం ద్వారా చర్మంలో పేరుకున్న దుమ్మూ ధూళినుంచి ఉపశమనం పొందవచ్చు. వేడినీటిని ఒక పాత్రలో ఉంచి చర్మానికి అయిదు నుంచి పదినిమిషాల పాటు ఆవిరిపట్టండి. ఈ పద్దతిని పాటిస్తే చర్మంపైన పేరుకున్న దుమ్మూ ధూళి తొలగిపోతాయి.

  ఆవిరిపట్టిన తరువాత చర్మానికి మాయిశ్చరైజర్ ను అప్లై చేస్తే మృదువైన, కోమలమైన మరియు కాంతివంతమైన చర్మం మీ సొంతమవుతుంది.

  English summary

  How To Relax Your Skin After A Stressful Day At Work

  There are tried-and-tested tips that can make give your skin the much-needed hydration boost after a hectic day and make it look fresh and radiant. Include these tips in your beauty routine and look gorgeous at any time of the day.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more