For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖంపై ట్యాన్ పోగొట్టడానికి నిమ్మరసం ఎలా వాడాలి

By Deepthi T A S
|

గత కొన్నిఏళ్ళుగా, చర్మ సంబంధ సమస్యలన్నిటికీ నిమ్మరసం దివ్యౌషధంగా మారిపోయింది. ఈ సహజమైన పదార్థంలో ఉండే విటమిన్ సి అయిన సిట్రిక్ యాసిడ్ మరియు ఇతర మూలకాలు మీ చర్మస్థితిని బాగుపరుస్తాయి.

ఇది చర్మం తెల్లబరిచే బ్లీచింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. నిమ్మరసంలోని ఈ గుణం సూర్యుడి వల్ల కమిలిన చర్మాన్ని బాగు చేయటంలో కూడా అందరికీ ఫేవరెట్ గా మారింది.

How To Use Lemon Juice To Remove Sun Tan From Your Face

సూర్యకాంతి వల్ల కమిలిన చర్మాన్ని పోగొట్టడానికి డజన్ల కొద్దీ సహజమైన పదార్థాలు ప్రభావం చూపేవి ఉన్నా, నిమ్మరసాన్ని ముఖ్యంగా ప్రభావవంతంగా చెప్తారు.

మీకు ఈ సమస్య చాలా చికాకు తెప్పించి, మీ ముఖంపై నుండి ట్యాన్ ను తొలగించివేయాలనుకుంటే, ఇదిగో మీకోసమే ఈ వ్యాసం. ఈరోజు నిమ్మరసాన్ని వివిధ రకాలుగా వాడి కమిలిన చర్మాన్ని ఎలా బాగుచేయొచ్చో చూడండి.

మీరు ఈ కింది వాటిల్లో ఏ పద్ధతినైనా ఎంచుకొని పాటించవచ్చు. ఈ చిట్కా పద్ధతులను చదవండి.

గమనిక ;ముఖంపై ఈ చిట్కాలు పాటించేముందు చేతిపైన ఈ పదార్థాలను పరీక్షించి తర్వాత ముఖానికి వాడండి.

1. దోసకాయతో నిమ్మరసం

1. దోసకాయతో నిమ్మరసం

1చెంచా నిమ్మరసాన్ని 1చెంచా దోసకాయ పేస్టును కలపండి.

ఈ మిశ్రమాన్ని చర్మంపై కమిలిన చోట రాయండి.

ఎండేవరకు 10నిమిషాలు ఉంచి గోరువెచ్చని నీటితో కడిగేయండి.

ఈ అద్భుత చిట్కాను వారానికి 3-4సార్లు వాడి ట్యాన్ ను తొలగించుకోండి.

2. పసుపుతో నిమ్మరసం

2. పసుపుతో నిమ్మరసం

1చెంచా నిమ్మరసాన్ని చిటికెడు పసుపు మరియు అరచెంచా రోజ్ వాటర్ తో కలపండి.

ఈ మిశ్రమాన్ని చర్మంపై కమిలిన చోట రాయండి.

ఎండేవరకు 10నిమిషాలు ఉంచి గోరువెచ్చని నీటితో కడిగేయండి.

ఈ అద్భుత చిట్కాను వారానికి రెండు సార్లు వాడి మంచి ఫలితాలు పొందండి.

3. మజ్జిగతో నిమ్మరసం

3. మజ్జిగతో నిమ్మరసం

1చెంచా నిమ్మరసాన్ని 2చెంచాల మజ్జిగతో కలపండి.

ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై రుద్ది 5నిముషాలు అలానే ఉంచేసి గోరువెచ్చని నీరుతో కడిగేయండి.

మీ ట్యాన్ ముఖాన్ని వారానికి 2-3సార్లు ఈ మిశ్రమంతో కడిగి మంచి ఫలితాలు పొందండి.

4. పెరుగుతో నిమ్మరసం

4. పెరుగుతో నిమ్మరసం

ఈ మిశ్రమాన్ని 1చెంచా నిమ్మరసం మరియు 2చెంచాల పెరుగుతో చేయండి.

దీన్ని మీ ముఖంపై ట్యాన్ ఉన్నచోట రాసి 5 నిమిషాలన్నా అలా వదిలేయండి.

గోరువెచ్చని నీటితో మొహం కడిగి, చర్మాన్ని తాజాగా మార్చే టోనర్ ను రాసుకోండి.

దీన్ని ప్రతిరోజూ పాటించి ముఖంపై ట్యాన్ ను వదిలించుకోండి.

5. ఆలోవెరా జెల్ మరియు కమలాపళ్ల తొక్కల పొడితో నిమ్మరసం

5. ఆలోవెరా జెల్ మరియు కమలాపళ్ల తొక్కల పొడితో నిమ్మరసం

1/2చెంచా నిమ్మరసాన్ని, 1చెంచా ఆలోవెరా జెల్ మరియు చిటికెడు కమలాపళ్ల తొక్కల పొడిని కలపండి.

దీన్ని మీ మొహం మొత్తం పట్టించండి.

10నిమిషాల పాటు ఎండనిచ్చి గోరువెచ్చని నీరుతో కడిగేయండి.

ఇలా వారానికోసారి చేసి చర్మంపై ట్యాన్ ను తొలగించుకోండి.

6. సెనగపిండి మరియు తేనెతో నిమ్మరసం

6. సెనగపిండి మరియు తేనెతో నిమ్మరసం

1చెంచా నిమ్మరసాన్ని అరచెంచా సెనగపిండి, 1 పెద్ద చెంచా ఆర్గానిక్ తేనెతో కలపండి.

ఇది మీ మొహంపై రాసుకునే ముందు కొంచెం ముఖాన్ని తడిచేసి తర్వాత రాయండి.

10-15 నిమిషాలు ఉండనిచ్చి గోరువెచ్చని నీరుతో ముఖం కడగండి.

వారానికోసారి ఈ చిట్కాను పాటించి ముఖంపై ట్యాన్ ను తొలగించుకోండి.

7. ఓట్ మీల్ తో నిమ్మరసం

7. ఓట్ మీల్ తో నిమ్మరసం

సింపుల్ గా 1చెంచా ఓట్ మీల్ ను 2చెంచాల నిమ్మరసంతో కలపండి.

ఈ మిశ్రమాన్ని కమిలిన చోట రుద్దండి.5-10 నిమిషాలు అలా చేస్తూ తర్వాత గోరువెచ్చని నీరుతో కడిగేయండి.

ఈ ఇంట్లో తయారుచేసిన నిమ్మరసం స్క్రబ్ ను వారానికి రెండుసార్లు వాడి మంచి ఫలితాలు చూడండి.

8. బొప్పాయి గుజ్జుతో నిమ్మరసం

8. బొప్పాయి గుజ్జుతో నిమ్మరసం

2చెంచాల తాజా నిమ్మరసాన్ని బొప్పాయి గుజ్జుతో కలపండి.

ఈ మిశ్రమాన్ని ట్యాన్ అయిన చోట ముఖంపై రాయండి.

కొంచెంసేపు అలానే ఉంచి గోరువెచ్చని నీటితో కడిగేయండి.

ఈ ప్రత్యేకమైన కాంబినేషన్ వారానికి మూడుసార్లు వాడి కావాల్సిన ఫలితాలను పొందవచ్చు.


English summary

How To Use Lemon Juice To Remove Sun Tan From Your Face

How To Use Lemon Juice To Remove Sun Tan From Your Face,Here’s how you can use lemon juice to remove sun tan from face. Read to know more.
Story first published:Wednesday, January 3, 2018, 14:53 [IST]
Desktop Bottom Promotion