For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మచ్చలేని చర్మం పొందడానికి ఎర్రచందనం ఏ విధంగా ఉపయోగపడుతుంది?

మచ్చలేని చర్మం పొందడానికి ఎర్రచందనం ఏ విధంగా ఉపయోగపడుతుంది?

|

మన దైనందిన జీవితంలో వివిధ రకాల చర్మ సమస్యలను ఎదుర్కొంటున్నాము. పొడి చర్మం, మోటిమలు లేదా మచ్చలు, పిగ్మెంటేషన్ మొదలైన కొన్ని సాధారణ సమస్యలు, మనకు చాలా ఇబ్బంది కలిగిస్తుంటాయి. ఫలితంగా, ఈ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తాయని భావించి, మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రతి ఉత్పత్తిని ప్రయత్నించి భంగపడతాము. వీటిలో ఏ ఉత్పత్తి సహజమైనది, సురక్షితమైనది మరియు వ్యయాన్ని తగ్గించేవి కావు. ఆఖరికి ఇవి ఏ సమస్యను సహజాంగా నివారించలేవు.

ఎర్ర చందనం చర్మానికి ఏ విధంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది?

రక్త చందనంగా కూడా పిలిచే ఎర్ర చందనం అనేది మన పూర్వీకులు తమ దైనందిన సౌందర్య సంరక్షణకు ఉపయోగించిన ఒక ఆయుర్వేద మూలిక. దీనిని పేస్ట్ రూపంలో లేదా పొడి రూపంలో ఉపయోగించవచ్చు. సాధారణ గంధంతో పోలిస్తే ఎర్ర చందనం కొంత మూతకగా ఉంటుంది. ఇది ఏ రకమైన చర్మం కలిగినవారికైనా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది మేనిఛాయను సమతులం చేసి, మచ్చలు మరియు పిగ్మెంటేషన్లను తొలగిస్తుంది. అంతేకాకుండా, ఎర్ర చందనంను తరచూ ఉపయోగిస్తే చర్మం కమలకుండా, తాజాగా ఉంటుంది.

How To Use Red Sandalwood Powder For Flawless Skin

సమస్యలు లేని చర్మం కోసం ఎర్ర చందనంను ఎలా ఉపయోగించాలో చూద్దాం.

1. రోజ్ వాటర్ మరియు ఎర్ర చందనం ప్యాక్

1. రోజ్ వాటర్ మరియు ఎర్ర చందనం ప్యాక్

కావలసిన పదార్థాలు:

1 టేబుల్ స్పూన్ ఎర్ర చందనం పొడి

1 టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్

1 స్పూన్ తేనె

పసుపు ఒక చిటికెడు

తయారీ విధానం:

ఈ మాస్కులోని చల్లదనాన్నిచ్చే గుణం ఉన్నందున, మోటిమలు మరియు మచ్చలు చికిత్సలో మీకు సహాయపడుతుంది. ఎర్ర చందనం పొడిని మరియు రోజ్ వాటర్ తో కలపండి. దానిలో తేనె, పసుపు వేసి బాగా కలపాలి. మీకు పసుపు అంటే అలెర్జీ అయితే, మీరు ఈ పదార్ధాన్ని విడిచిపెట్టవచ్చు.

ఈ మాస్కును, మీ ముఖం మీద లేదా ప్రభావిత ప్రాంతంలో రాసుకోండి. అది ఆరిపోయే వరకు ఆగి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తేడా మీరు గమనించేంత వరకు రోజూ దీనిని ఉపయోగించవచ్చు.

2. నిమ్మ రసం మరియు ఎర్ర చందనం ప్యాక్

2. నిమ్మ రసం మరియు ఎర్ర చందనం ప్యాక్

కావలసిన పదార్థాలు

1 టేబుల్ స్పూన్ ఎర్ర చందనం పొడి

నిమ్మ రసం- కొన్ని చుక్కలు

తయారీ విధానం:

జిడ్డు చర్మం కలిగినవారికి ఈ మాస్కు బాగా పనిచేస్తుంది. ఇది చర్మం రంధ్రాలను బిగుతుగా చేసి, చర్మంపై సీబం ఉత్పత్తిని నియంత్రిస్తుంది.

మీరు చేయవలసినదల్లా, ఎర్ర చందనం పొడి మరియు నిమ్మ రసం కలిపి ఒక మృదువైన పేస్ట్ తయారుచేయాలి. దీనిని శుభ్రపరచుకున్న ముఖంపై రాసుకుని, 15-20 నిముషాల పాటు వదిలివేయాలి. బాగా ఆరిన తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. నిమ్మ రసం ఆమ్ల లక్షణాలను కలిగి ఉండటం వలన మీ చర్మం పొడిగా మారుతుంది. కనుక ముఖం కడుక్కున్నాక, జిడ్డు చర్మం వారికి సరిపడే మాయిశ్చరైజర్ ను రాసుకోండి.

3. బొప్పాయి మరియు ఎర్ర చందనం ప్యాక్

3. బొప్పాయి మరియు ఎర్ర చందనం ప్యాక్

వలసిన పదార్థాలు:

1 టేబుల్ స్పూన్ ఎర్ర చందనం పొడి

½ ముగ్గిన బొప్పాయి

తయారీ విధానం:

మృతచర్మకణాలను తొలగించడం ద్వారా చర్మం మెరిపించే లక్షణాలను బొప్పాయి మరియు ఎర్ర చందనం పొడి ప్యాక్ కలిగి ఉంది. చివరకు మీ చర్మం తాజాగా మరియు ఆరోగ్యకరంగా కనిపిస్తుంది.

మొదట, బొప్పాయిని చిన్న ముక్కలుగా కట్ చేసి, పేస్ట్ చేయండి. ఎర్ర చందనం పొడికి, 2 టేబుల్ స్పూన్లు బొప్పాయి పేస్ట్ జతచేయండి. రెండు పదార్ధాలను బాగా కలపండి.

మీ ముఖం మీద ఈ పేస్ట్ ను సమానంగా రాసుకుని, 2 నుండి 3 నిమిషాలు మృదువుగా మర్దన చేయండి. 20 నిముషాల పాటు ఆరనిచ్చి, సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. మీ చర్మాన్ని పునరుజ్జీవింప చేయడానికి వారానికి ఒకసారి ఈ మాస్కును ఉపయోగించండి.

4. పెరుగు, పాలు మరియు ఎర్ర చందనం పొడి ప్యాక్

4. పెరుగు, పాలు మరియు ఎర్ర చందనం పొడి ప్యాక్

కావలసిన పదార్థాలు:

1 టేబుల్ స్పూన్ ఎర్ర చందనం పొడి

2 టేబుల్ స్పూన్లు పెరుగు

2 టేబుల్ స్పూన్లు పాలు

½ టేబుల్ స్పూన్ పసుపు

తయారీ విధానం:

మీ చర్మం మచ్చలు మరియు పిగ్మెంటేషన్ కలిగి ఉంటే, ఈ ప్యాక్ మీకు ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది మరియు సమానమైన మేని ఛాయను ఇస్తుంది.

ఒక గిన్నెలో, 1 టేబుల్ స్పూన్ ఎర్ర చందనం పొడి, పెరుగు మరియు పాలు కలపాలి. మీకు అలెర్జీ లేనట్లయితే చిటికెడు పసుపును దీనికి కలపండి. దీన్ని మీ ముఖానికి రాసుకుని కొద్ది నిమిషాల పాటు ఆరనివ్వండి. తరువాత సాధారణ నీటిని ఉపయోగించి రుద్దుకుంటూ శుభ్రం చేసుకోవాలి. ముఖం కడుక్కున్నాక పొడిగా తుడుచుకోవాలి. మెరుగైన ఫలితాల కోసం వారానికి ఒకసారి లేదా రెండుసార్లు ఈ పద్ధతిని పాటించండి.

5. దోసకాయ మరియు ఎర్ర చందనం పొడి ప్యాక్

5. దోసకాయ మరియు ఎర్ర చందనం పొడి ప్యాక్

కావలసిన పదార్థాలు:

1 టేబుల్ స్పూన్ ఎర్ర చందనం పొడి

½ దోసకాయ

తయారీ విధానం:

దోసకాయలోని చల్లబరిచే లక్షణాలు, మీ చర్మం తాజాగా మరియు ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడతాయి. ఎర్ర చందనం పొడిని దీనికి కలిపి ఉపయోగించినప్పుడు, అది సూర్యుని ప్రతాపం వలన కమిలిన చర్మాన్ని సహజస్థితికి తీసుకురావడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.

దోసకాయ చెక్కు తీసి చిన్న ముక్కలుగా కోయండి. దీనిని ఒక పేస్ట్ గా చేయండి. మీరు దోసకాయలను తురిమి కూడా రసంని తీసుకోవచ్చు. ఇప్పుడు ఎర్ర చందనం పొడికి, 2 టేబుల్ స్పూన్లు దోసకాయ రసం చేర్చి బాగా కలపాలి.

దీన్ని మీ ముఖానికి రాసుకుని 15 నిముషాల పాటు ఆరవ్వండి. 15 నిముషాలు తరువాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. మీరు తేడా గమనించే వరకు దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించండి.

English summary

How To Use Red Sandalwood Powder For Flawless Skin

We all face different types of skin issues in our everyday life. Some common issues like dry skin, acne or pimple scars, pigmentation etc., bother us to a great extent. Red sandalwood also known as Rakta Chandana is an ayurvedic herb that can come to our rescue against these. It can help in getting rid of blemishes and pigmentation along with evening the skin tone.
Desktop Bottom Promotion