ఫెయిర్ & గ్లోయింగ్ స్కిన్ కోసం, గుమ్మడికాయతో తయారు చేసుకోవలసిన ఫేస్ ప్యాక్లు !

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

ఫేస్ మాస్క్లను తయారు చేయడానికి ఉపయోగించే వాటిలో మూలపదార్థంలో చాలా రకాల పండ్లు & కూరగాయలు ఉన్నాయి; కానీ కొంతమంది గుమ్మడికాయలను ఎంచుకుంటారు. మరికొంతమంది సాధారణంగా బొప్పాయి, స్ట్రాబెర్రీలు, బంగాళాదుంప, దోసకాయ, క్యారెట్లు, మొదలైన వాటిని ఎంపిక చేసుకోవచ్చు, కానీ గుమ్మడికాయ అన్ని రకాల చర్మాలకు అనుకూలమైన ఫేస్ ప్యాక్లా అద్భుతంగా పని చేస్తుందని మీకు తెలుసా?

అవును, ఇది అన్ని రకాల చర్మాలకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి, మీరు అందమైన చర్మం కోసం మీ ఇంట్లోనే తయారు చేసుకోగలిగే ఫేస్-ప్యాక్ల కోసం ఎదురుచూస్తున్నప్పుడు, మీరు గుమ్మడికాయతో చేసుకోగలిగే ఫేస్-ప్యాక్లను తప్పక ప్రయత్నించండి. మనం ఫేస్-ప్యాక్ల తయారీని ప్రారంభించడానికి ముందు, గుమ్మడికాయ వల్ల కలిగే ప్రయోజనాలను గూర్చి తెలుసుకుందాం !

DIY Pumpkin Face Masks For Fair And Glowing Skin

గుమ్మడికాయలో పొటాషియం, కాల్షియం, భాస్వరం, కాపర్, విటమిన్లు A, E, C, B-6 & నియాసిన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల మీ చర్మ ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది. గుమ్మడికాయలో ఉండే ఎక్స్-ఫోలియేటింగ్ లక్షణాలు, చనిపోయిన చర్మ కణాలను నెమ్మదిగా తొలగించి, మీ చర్మాన్ని మరింత మృదువుగా, ప్రకాశవంతంగా చేస్తుంది.

అలాగే ఇది మీ చర్మ నిర్మాణాన్ని కూడా మెరుగుపరుస్తుంది, అలాగే చర్మంపై ఏర్పడే గీతాలను, ముడుతలను తొలగిస్తుంది. సహజసిద్ధమైన పండ్లు & కూరగాయలు మీ చర్మం కోసం అద్భుతాలు చేస్తాయి, ఎందుకంటే ఇవి హానికరమైన రసాయనాలను కలిగి ఉండకపోవడం వల్ల మీ చర్మంపై ఎటువంటి దుష్ప్రభావాలను కలిగి ఉండవు కాబట్టి.

ఇక్కడ మీ కోసం, గుమ్మడికాయతో ఇంట్లోనే చేసుకోగలిగే కొన్ని ఫేస్-ప్యాక్ల గురించి తెలియజేశాము. అవేమిటో మీరూ చూడండి !

1. గుమ్మడికాయ & నిమ్మరసం :

నిమ్మకాయలు, విటమిన్-సి & సిట్రిక్ యాసిడ్లతో పూర్తిగా నిండి ఉండటం వల్ల అవి సహజమైన బ్లీచింగ్ ఏజెంట్గా పని చేస్తాయి, ఇవి నల్లని మచ్చలను తగ్గించి, మీ చర్మాన్ని ప్రకాశవంతంగా, కాంతివంతంగా మారుస్తాయి.

కావలసిన పదార్ధాలు :

• 1 టేబుల్ స్పూన్ గుమ్మడికాయ గుజ్జు

• నిమ్మరసం (కొన్ని చుక్కలు)

• 2-3 విటమిన్ E క్యాప్సూల్స్.

ఎలా ఉపయోగించాలి:

• ఒక కప్పులో తీసుకున్న గుమ్మడికాయ గుజ్జుకు, కొన్ని చుక్కల నిమ్మరసాన్ని జోడించి, బాగా కలపండి.

• ఇప్పుడు, 2-3 విటమిన్ E క్యాప్సూల్స్ తెరిచి, పైన ఉన్న మిశ్రమానికి కలపాలి.

• మీరు ఈ ఫేస్ ప్యాక్ను అప్లై చేసే ముందు, నీటితో మీ ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి.

• మీ ముఖము & మెడ మీద ఈ ప్యాక్ను సమానంగా అప్లై చేసి, 15-20 నిముషాల పాటు అలానే వదిలివేయండి.

• ఆ తర్వాత సాధారణ నీటితో మీ ముఖాన్ని శుభ్రంగా కడగాలి.

• మృదువైన చర్మం కోసం, వారంలో ఒకసారి ఈ ఫేస్-ప్యాక్ను ఉపయోగించండి.

DIY Pumpkin Face Masks For Fair And Glowing Skin

2. గుమ్మడికాయ & శనగపిండి :

శనగపిండి అనేది వివిధ సౌందర్యపరమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఒక అద్భుతమైన చర్మ సంరక్షణ పదార్ధం. శనగపిండిలో ఉండే సహజమైన ఎక్స్-ఫోలియేటింగ్ లక్షణాలు, చనిపోయిన చర్మ కణాలను నెమ్మదిగా తొలగించి, వాటి స్థానంలో కొత్త కణాలను పునరుత్పత్తి చేసేందుకు సహాయపడతాయి. ఇది మీ చర్మ టాన్ను తొలగించి, కాంతివంతమైన చర్మం టోన్గా తయారు చేయడంలో సహాయపడుతుంది, అది మీ చర్మాన్ని ప్రకాశవంతముగా, కోమలముగా కనిపించేలా చేస్తుంది.

కావాల్సిన పదార్థాలు :

• 1 టేబుల్ స్పూన్ గుమ్మడికాయ గుజ్జు

• 2 టీస్పూన్ల శనగపిండి

ఎలా ఉపయోగించాలి:

• ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్లు శనగపిండితో, 1 టేబుల్ స్పూను గుమ్మడికాయ గుజ్జును కలపాలి.

• మీ ముఖము & మెడ మీద ఈ ప్యాక్ను సమానంగా అప్లై చేసి, 15-20 నిముషాల పాటు అలానే వదిలివేయండి.

• అలాగే మీరు కట్ చేసిన దోసకాయ ముక్కలతో మీ కళ్ళను కూడా కప్పుకోవచ్చు.

• సాధారణ నీటితో మీ ముఖాన్ని శుభ్రంగా కడగాలి.

• మంచి ఫలితాల కోసం వారంలో ఒక్కసారి ఈ ఫేస్-ప్యాక్ను ఉపయోగించి చూడండి.

3. గుమ్మడికాయ, తేనె & పాలు :

మీ చర్మాన్ని తక్షణమే తేలికగా మార్చడానికి పచ్చిపాలు బాగా సహాయపడుతుంది. ఎందుకంటే ఈ పచ్చిపాలలో ప్రోటీన్లు, ఎంజైమ్లు, ఖనిజాలు & లాక్టిక్ ఆమ్లం వంటి వాటితో పూర్తిగా లోడ్ చేయబడుతుంది, ఇవన్నీ చర్మ సౌందర్యాన్ని పెంపొందించేలా దోహదం చేస్తాయి. ఈ పచ్చిపాలు మీ చర్మాన్ని హైడ్రేట్గానూ & తేమగానూ ఉంచడంతో పాటు, మీ చర్మం ఎండిపోకుండా కాపాడే ఇతర పదార్ధాలను కలిగి ఉంటుంది.

కావలసిన పదార్థాలు :

• 2 టేబుల్ స్పూన్ల గుమ్మడికాయ గుజ్జు

• అర టీస్పూను తేనె

• అర టీస్పూను పచ్చిపాలు

ఎలా ఉపయోగించాలి :

• అన్ని పైన పేర్కొన్న అన్ని పదార్ధాలను ఒక గిన్నెలో బాగా కలిపి, మృదువైన పేస్ట్లా చేయండి.

• ఇప్పుడు, మీ ముఖము & మెడ మీద ఈ ప్యాక్ను సమానంగా అప్లై చేసి, 15-20 నిముషాల పాటు అలానే వదిలివేయండి.

• ఆ తర్వాత, గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని శుభ్రంగా కడగాలి.

• రాత్రి పడుకునే ముందు ఈ ఫేస్ ప్యాక్ను అప్లై చేయాలి.

• మంచి ఫలితాలను పొందడం కోసం వారంలో 2-3 సార్లు ఉపయోగించండి.

Read more about: home remedies face pack skin care
English summary

DIY Pumpkin Face Masks For Fair And Glowing Skin

Pumpkins are rich in minerals that aid in improving the health of the skin. The exfoliating properties of pumpkin help to gently remove the dead skin cells and make the skin bright and soft. Homemade pumpkin face masks give you a glowing skin like never before. Blending pumpkin with lemon juice, oats, honey, or milk could work wonders for your skin.