ఈ స్కిన్ ఏజింగ్ సైన్స్ ని మీరు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

మన చర్మం మనకు ఎన్నో విషయాలను చెప్తుంది. కాస్త గమనిస్తే మనకి చర్మం అందించే సూచనలు అర్థమవుతాయి. లేదంటే, చర్మ సౌందర్యం దెబ్బతింటుంది

25 ఏళ్ళు దాటిన మహిళలలో ఏజింగ్ లక్షణాలు కనిపించడం ఈ మధ్యకాలంలో సర్వ సాధారణమైపోయింది. ఈ ఏజింగ్ సైన్స్ కి సరైన సమయంలో చికిత్సని ఇవ్వడం ద్వారా ఈ సైన్స్ ని రూపుమాపవచ్చు. తద్వారా, మీ అఫియరెన్స్ ను మరింత మెరుగుపరచుకోవచ్చు.

signs-of-skin-ageing-you-must-never-overlook

ఈ రోజు బోల్డ్ స్కై లో స్కిన్ ఏజింగ్ సైన్స్ కి సంబంధించిన విషయాలను పొందుబరచాము. ఏజింగ్ సైన్స్ ని గుర్తించి తగిన రెమెడీస్ ని పాటించడం ద్వారా చర్మంపై కనిపించే అకాల వృద్ధాప్య చిహ్నాలను తగ్గించుకోవచ్చు.

వయసు మీదపడుతున్న చర్మాన్ని బిగుతుగా ఉంచే కొలాజిన్ అలాగే ఎలాస్టిన్ అనే పదార్థాల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇందువలన కింద చెప్పుకోబడిన ఏజింగ్ సైన్స్ అనేవి చర్మంపై దర్శనమిస్తాయి.

అయినప్పటికీ, ఎంత త్వరగా మనం ఈ ఏజింగ్ సైన్స్ ని గుర్తిస్తామో అంత త్వరగా రెమెడీస్ ను పాటించడం ద్వారా చర్మ సౌందర్యాన్ని సంరక్షించుకోవచ్చు. ఈ ఏజింగ్ సైన్స్ ని నిర్లక్ష్యం చేయకపోవడం మంచిది.

ఇప్పుడు, మీ చర్మం ఏజింగ్ సైన్స్ రూపంలో మీకందించే సూచనల గురించి తెలుసుకోండి.

1. చర్మం పొడిబారుట:

1. చర్మం పొడిబారుట:

చర్మం పొడిబారటమనేది కూడా ఏజింగ్ చిహ్నమే. 25 ఏళ్ళు దాటిన అమ్మాయిలు పొడిబారిన చర్మాన్ని ఎక్స్పీరియెన్స్ చేయడం సాధారణ విషయమైపోయింది. వయసుమీదపడే కొద్దీ చర్మంలోని నూనె గ్రంధుల పనితీరు సన్నగిల్లుతుంది. తద్వారా, చర్మం పొడిబారటం ప్రారంభిస్తుంది.

2. నిస్తేజంగా మారిన చర్మం:

2. నిస్తేజంగా మారిన చర్మం:

ఏజింగ్ కి సంబంధించిన మరొక చిహ్నం చర్మం నిస్తేజంగా మారటం. ఈ చిహ్నాన్ని మీరు నిర్లక్ష్యం చేయకూడదు. వయసుమీదపడే కొద్దీ చర్మం తన సహజ కాంతిని కోల్పోతుంది. తద్వారా, చర్మం నిస్తేజంగా అలాగే నిర్జీవంగా కనిపిస్తుంది.

3. క్రోస్ ఫీట్:

3. క్రోస్ ఫీట్:

కంటి చివర కనిపించే ముడతలనే క్రోస్ ఫీట్ అనంటారు. ఏజింగ్ కి సంబంధించిన మరొక ముఖ్య చిహ్నమిది. ఈ ఏజింగ్ సైన్ ని గమనించగానే మీరు తగిన రెమెడీస్ ని పాటించడం ద్వారా కేర్ తీసుకోవాలి. ఓవర్నైట్ ఐ క్రీమ్స్ ని వాడాలి. తద్వారా, గుర్తించదగిన ఫలితాలను పొందవచ్చు.

4. ఫైన్ లైన్స్:

4. ఫైన్ లైన్స్:

30 దాటిన తరువాత ఫైన్ లైన్స్ చర్మంపై దర్శనమిస్తాయి. కొలాజిన్ అలాగే ఎలాస్టిన్ లు చర్మంలో తగినంతగా లేకపోవడం వలన ఈ సమస్య ఏర్పడుతుంది. ఇందువలన ఫెషియల్ స్కిన్ పై ఫైన్ లైన్స్ కనిపిస్తాయి. ఈ లైన్స్ కి సరైన సమయంలో కేర్ తీసుకోవాలి. లేదంటే ఇవి స్థిరంగా ఉండిపోతాయి.

5. ముడతలు:

5. ముడతలు:

చర్మం ముడతలు పడటాన్ని వృద్ధాప్యానికి ముఖ్య చిహ్నంగా భావించాలి. సాధారణంగా, 25 దాటిన వారిలో చర్మం ముడతలు పడటం ప్రారంభమవుతోంది. అయితే, సన్ డేమేజ్ తో పాటు స్మోకింగ్ అలాగే డ్రింకింగ్ వంటి మరికొన్ని అనారోగ్యకరమైన లైఫ్ స్టయిల్ హేబిట్స్ వలన ప్రీమెచ్యూర్ రింకిల్స్ ఏర్పడతాయి.

6. సాగిపోయే చర్మం:

6. సాగిపోయే చర్మం:

ఏజింగ్ ప్రాసెస్ కి సంబంధించి చర్మం సాగిపోవటం కూడా సాధారణం. ఎలాస్టిన్ ని చర్మం కోల్పోవడం వలన చర్మం సాగుతుంది. దీని వలన చర్మం సౌందర్యం దెబ్బతింటుంది. ఈ చిహ్నాన్ని మీరు గమనిస్తూ తగిన కేర్ తీసుకుంటే చర్మ సౌందర్యాన్ని సంరక్షించుకున్నవారవుతారు.

7. డార్క్ స్పాట్స్:

7. డార్క్ స్పాట్స్:

ఎండలో ఎక్కువసేపు ఉండటం వలన చర్మంపై గుర్తించదగిన ఏజింగ్ సైన్స్ ముందుగానే దర్శనమిస్తాయి. సాధారణంగా, 30 దాటిన తరువాత డార్క్ స్పాట్స్ సమస్య తలెత్తుతుంది. ఈ స్పాట్స్ సాధారణంగా హానీకరమైనవి కావు. అయితే, కాలానికి అనుగుణంగా సహజంగా స్కిన్ ఏజింగ్ జరగాలి గాని ముందుగా స్కిన్ ఏజింగ్ లక్షణాలు కనిపిస్తే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. 20 లలో ఎక్కువ సేపు ఎండలో ఉండకుండా జాగ్రత్తపడటం మంచిది.

8.పెద్దవైన ఫెషియల్ పోర్స్:

8.పెద్దవైన ఫెషియల్ పోర్స్:

పేషియల్ పోర్స్ పెద్దవిగా మారటం కూడా ఏజింగ్ కి సంబంధించిన చిహ్నమే. చర్మం తన ఎలాస్టిసిటీని కోల్పోయినప్పుడు చర్మరంధ్రాలు విస్తరించడం ప్రారంభమవుతుంది. సరైన సమయంలో కేర్ తీసుకోకపోతే వికారమైన బ్రేక్ అవుట్స్ చర్మంపై దర్శనమిస్తాయి.

English summary

signs of skin ageing | tips to find skin ageing

Most of the telltale signs of ageing often go overlooked, unless they become too prominent and hard to conceal. However, with early treatment, it is possible to minimize their prominence. That is why it is incredibly important to never turn a blind eye to these signs.
Story first published: Wednesday, February 7, 2018, 15:40 [IST]