For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్తగా ప్రయత్నించేవారికి సింపుల్ ఇంటి చిట్కా, నిమ్మ-గుడ్డు ఫేస్ ప్యాక్

|

మీ దగ్గరలోని పార్లర్ లో సమయం, డబ్బు పెట్టి పెట్టి విసిగిపోయారా? ఈ ఖరీదైన చికిత్సల ఫలితాలు ఎక్కువకాలం ఉంటున్నట్లు అన్పించటం లేదా?అయితే మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోటానికి ఇంటివద్ద తయారుచేసుకునే ఫేస్ ప్యాక్ లను ప్రయత్నించండి.

వీటికి అయ్యే ఖర్చు చాలా తక్కువ, ఇంట్లో చేసుకుంటే సమయం కూడా తక్కువే పడుతుంది. పార్లర్లోలాగా మీ వంతు కోసం గంటలు గంటలు ఎదురుచూడక్కర్లేదు. ఇంకా మంచి విషయం ఏంటంటే ఇంటి చిట్కా ఫేస్ ప్యాక్ తో ఫలితాలు అద్భుతంగా కూడా వస్తాయి.

Simple Homemade Lemon-Egg Face Pack For Beginners

ఇంట్లో తయారుచేసిన ఫేస్ ప్యాక్ లను వాడటం ఇదే మీకు మొదటిసారైతే, ఈ సింపుల్ కానీ ప్రభావవంతమైన కాంబినేషన్ ను ప్రయత్నించండి. గుడ్లు, నిమ్మల కాంబినేషన్ చర్మాన్ని శుభ్రపరిచి, దాని సహజ సౌందర్యాన్ని బయటకి తెస్తుంది. ఇందులో సింపుల్ గా రెండు పదార్థాలనే వాడతారు, సులభంగా తయారుచేసి,వాడుకోవచ్చు.

ఈ పద్ధతి మొత్తం పాటించాక “ఫేస్ లిఫ్ట్” అనుభూతిని పొందుతారు. ఇది మీ వదులుగా ఉన్న చర్మాన్ని గట్టిపర్చి, జిడ్డు తొలగించి, చర్మరంథ్రాల సైజును తగ్గించి, కాంతివంతంగా చేస్తుంది.

ఇదిగో మీరు దాన్ని ఇలా తయారుచేసి వాడవచ్చు.

కావాల్సిన వస్తువులుః

కావాల్సిన వస్తువులుః

-ఒక గుడ్డు తెల్లసొన

-అరచెక్క నిమ్మకాయ రసం

ఎలా వాడాలిః

ఎలా వాడాలిః

-గుడ్డు తెల్లసొనను నురగ వచ్చేవరకూ గిలకొట్టండి.

-నిమ్మరసాన్ని తెల్లసొనకి కలపండి.

-ఈ మాస్క్ ను కళ్ళకి, నోటి ప్రాంతంలో తగలకుండా మొహానికి పట్టించండి.

-ఈ మాస్క్ ను మొహంపైనే 30 నిమిషాలు అలానే ఉండనివ్వండి.

-నెమ్మదిగా గోరువెచ్చని నీటితో కడగండి.

-తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోండి.

చిట్కా ; మీ చర్మం ఎక్కువగా జిడ్డుగా ఉన్నట్లయితే ఈ ప్యాక్ కి 2 చెంచాల సెనగపిండిని కూడా జత చేయవచ్చు.

నిమ్మ-గుడ్డు ఫేస్ ప్యాక్ చర్మానికి ఎలా సాయపడుతుంది?

నిమ్మ-గుడ్డు ఫేస్ ప్యాక్ చర్మానికి ఎలా సాయపడుతుంది?

ఈ మాస్కులోని తెల్లసొన చర్మంలో అదనంగా ఉన్న సెబంను తగ్గించి, రంథ్రాలు చిన్నవిగా కన్పడేలా చేస్తుంది, మొత్తంమీద చర్మం గట్టిగా మారుతుంది.అదలా ఉంచితే నిమ్మ విటమిన్ సికి, ఆల్ఫా హైడ్రాక్సి యాసిడ్స్ కి సహజ వనరు. ఇది చర్మం తెల్లబడటానికి, ఎక్స్ ఫోలియేట్ అవటానికి సాయపడుతుంది. ఇది చర్మం సమయానికి ముందే వయస్సు పైబడినట్లు కన్పించటం,చర్మం రంగు రకరకాలుగా కన్పించటాన్ని నివారిస్తుంది. గుడ్డు తెల్లసొన, నిమ్మల కాంబినేషన్ జిడ్డు చర్మానికి మంచి ఫేస్ మాస్క్ గా పనిచేస్తుంది.

గుడ్డు తెల్లసొనతో చర్మానికి లాభాలు

గుడ్డు తెల్లసొనతో చర్మానికి లాభాలు

-మల్టీవిటమిన్లు, ఎంజైములతో నిండిన తెల్లసొనలు మొటిమలను తొలగించి,చర్మంపై పెద్దవైన రంథ్రాలను ముడుచుకునేలా చేస్తాయి. గుడ్డు తెల్లసొనలో ఉండే లైసోజైమ్ మొటిమలకి వ్యతిరేకంగా పనిచేసే పదార్థం, ఇది మొటిమలను కలుగచేసే బ్యాక్టీరియాతో పోరాడటంలో సాయపడుతుంది.

-తెల్లసొనలోని బి విటమిన్లు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేసి చర్మకణాలను ఫ్రీ రాడికల్స్ తో పాడవటం నుంచి రక్షిస్తాయి. అలా ముడతలు పడకుండా యవ్వనవంతమైన చర్మం ఉండేలా చేస్తాయి.ఇవి చర్మానికి పోషణనిచ్చి, కణాలను బాగుచేసి, తిరిగి తయారయ్యేలా చేస్తాయి.

-ప్రొటీన్ ఎక్కువగా ఉండటం వలన, తెల్లసొనలు కణజాలాల రిపేర్, ఎదుగుదలలో సాయపడతాయి. ఇవి చర్మకణాలని బలపరుస్తాయి కూడా.

-తెల్లసొన ఎక్స్ ఫోలియేటర్ గా కూడా పనిచేసి, చర్మరంథ్రాలలో పేరుకున్న మురికి, మట్టిని తొలగిస్తుంది.

-తెల్లసొన జిడ్డును,బ్లాక్ హెడ్స్, మచ్చలను నయం చేయడంలో కూడా సాయపడుతుంది.

నిమ్మకాయతో చర్మానికి లాభాలు

నిమ్మకాయతో చర్మానికి లాభాలు

-నిమ్మకాయలో అద్భుతమైన సిట్రస్ శక్తి సహజమైన బ్లీచింగ్ ఏజెంట్లా పనిచేసి గాయాలు, చారలను కన్పడకుండా చేస్తుంది. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ మొటిమలను నయంచేసి, డల్ గా ఉన్న చర్మాన్ని కాంతివంతం చేస్తుంది, మృతకణాలను ఎక్స్ ఫోలియేట్ చేసి, వయస్సు మీరే ప్రక్రియను నెమ్మది చేస్తుంది.

-నిమ్మకాయలోని ఘాటు లక్షణాలు జిడ్డు, మొటిమలు వచ్చే చర్మం ఉన్నవారికి సరిపోతాయి. ఇవి పెద్దవైన చర్మ రంథ్రాలను మూసుకునేలా చేసి, అదనంగా సెబమ్ ఉత్పత్తి కాకుండా చూస్తాయి.

-నిమ్మలోని బ్యాక్టీరియా వ్యతిరేక లక్షణాలు చర్మం మొటిమలతో పోరాడేలా సాయపడతాయి.

-నిమ్మలోని శక్తివంతమైన విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు వయస్సు మీరే ప్రక్రియను నెమ్మది చేస్తాయి, కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి, అలాగే చర్మంకి సాగే గుణాన్ని నిలిపి వుంచుతాయి. కణాలు పాడవటానికి దారితీసే ఫ్రీ రాడికల్స్ ను తొలగించి, చర్మం సమయానికి ముందే వయస్సు మీరటాన్ని ఆపుతాయి.

చిట్కాలుః

చిట్కాలుః

1.మీరు మాస్కును మొహంపై కేవలం ఒక కోట్ మాత్రమే వేసుకుంటంటే, తయారుచేసిన ఫేస్ మాస్క్ అదనంగా మిగిలిపోతుంది. దీన్ని ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు,కానీ మూడు రోజుల్లోపలే వాడాలని గుర్తుంచుకోండి.

2.మీకు తీవ్రమైన మొటిమలు ఉంటే, కేవలం ఒక చెంచా నిమ్మరసం మాత్రమే వాడండి. లేకపోతే అది మీ మొటిమలను మరింత పెంచవచ్చు.

3.పొరపాటున కూడా గుడ్డు లోపలి పసుపు సొనను ప్యాక్ కి జతచేయవచ్చు, ఎందుకంటే ఇది జిడ్డు లేదా మొటిమలు వచ్చే చర్మానికి సాయపడదు.

4. మీ లోపలి మోచేయిపై ఈ మాస్క్ రాసుకునేముందు ప్యాచ్ టెస్ట్ చేయండి. ఈ పదార్థాలకి మీరు అలర్జీయో కాదో తెలుస్తుంది.

English summary

Simple Homemade Lemon-Egg Face Pack For Beginners

Homemade face packs are very much affordable, and require less time when done at home, as you don't have to keep waiting endlessly for your turn as in the parlour. What's better, the end results of these homemade face packs are just amazing. Try this simple yet effective combination of eggs and lemon which can clear up your skin, revealing its natural beauty.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more