For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెర్ఫ్యూమ్ యొక్క పరిమళం ఎక్కువ సమయం ఉండాలంటే!

ఎలాంటి పెర్ఫ్యూమ్ వాసన అయిన దీర్ఘకాలం పాటు ఎందుకు కొనసాగదని నన్ను నేను ఎప్పుడూ ప్రశ్నించుకుంటాను. మీరు కూడా నాలాగే భావిస్తున్నారా ? సాధారణంగా, పెర్ఫ్యూమ్ యొక్క సువాసన కేవలం కొన్ని నిమిషాల వరకూ మాత్రమే

|

ఎలాంటి పెర్ఫ్యూమ్ వాసన అయిన దీర్ఘకాలం పాటు ఎందుకు కొనసాగదని నన్ను నేను ఎప్పుడూ ప్రశ్నించుకుంటాను. మీరు కూడా నాలాగే భావిస్తున్నారా ? సాధారణంగా, పెర్ఫ్యూమ్ యొక్క సువాసన కేవలం కొన్ని నిమిషాల వరకూ మాత్రమే వెదజల్లబడుతూ ఉంటుంది, ఖచ్చితంగా అయితే మనం కోరుకునేది ఇది మాత్రం కాదు.

నిరంతరము సువాసనను వెదజల్లబడే పెర్ఫ్యూమ్ కోసం మీరెంత ఖర్చు చేస్తున్నారన్నది ముఖ్యమైన విషయం కాదు, ఆ సువాసన యొక్క తీవ్రత కేవలం కొన్ని గంటల్లోనే పూర్తిగా ఆవిరైపోతుందన్న వాస్తవాన్ని మీరు అంగీకరించాలి.

నిజంగా ఇది చిరాకు కలిగించే విషయమని అనిపించవచ్చు. ఏదేమైనప్పటికీ, మీ పెర్ఫ్యూమ్ దీర్ఘకాలంపాటు సువాసనలను వెదజల్లాలి అంటే మీరు తప్పకుండా కొన్ని చిట్కాలను పాటించవలసిన అవసరం ఉంది. ఆ విధంగా మీరు పెర్ఫ్యూమ్ యొక్క సువాసనను ఎక్కువకాలం పాటు నిలకడగా ఉంచుకొని, ఆహ్లాదకరమైన భావనను పొందగలరు.

పెర్ఫ్యూమ్ అనేది ఆల్కహాల్తో కలిసినప్పుడు మరింతగా గొప్పదిగా ఉంటుంది, కానీ దానిని సరైన మార్గంలో అప్లై చెయ్యకపోతే మటుకు ఆవిరైపోతుంది. సుదీర్ఘమైన పెర్ఫ్యూమ్ సువాసనలను కలిగి ఉండటానికిగానూ, విజయవంతంగా ప్రయత్నించబడిన మరియు పరీక్షించిన కొన్ని పద్దతులు ఇక్కడ తెలియజేయడమైనది.

మీరు చూడచక్కని రూపంతో చాలా మంచి వ్యక్తిగా మరియు మర్యాదస్థుడిగా కనపడుతున్నట్లయితే, ఆ రోజంతా మిమ్మల్ని తాజాగా ఉంచ్చేందుకు మరియు ఎల్లప్పుడూ మంచి సువాసనను వెదజల్లే పెర్ఫ్యూమ్ కూడా కావాలని కోరుకుంటారు.

పెర్ఫ్యూమ్ యొక్క తాజా సువాసన ఎక్కువకాలం పాటు ఉండటం కోసం మీరు చాలా రకాల ప్రయత్నాలను కొనసాగించి విఫలమైనట్లైతే, ఈ క్రింద సూచించబడిన పద్ధతులను ఒక్కసారి ప్రయత్నించి చూడండి.

1. స్టోర్ చెయ్యడం :

1. స్టోర్ చెయ్యడం :

మీ పెర్ఫ్యూమ్ యొక్క పరిమళం దీర్ఘకాలం పాటు కొనసాగాలంటే, దానిని చీకటి మరియు వేడిని కలిగి ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉంచేటట్లుగా నిర్ధారించుకోండి. లేదంటే, వెలుతురు (లేదా) వేడి అనేవి పెర్ఫ్యూమ్ యొక్క రసాయనాలను విచ్ఛిన్నం చేయడంతో పాటు, దాని నాణ్యతను కూడా దెబ్బతీస్తుంది. అందుకే సూర్యకిరణాల నుండి దూరంగానూ (లేదా) వేడిగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉంచుతూ, చల్లని మరియు పొడి ప్రదేశాలలో పెర్ఫ్యూమ్ను దాచి ఉంచాలి. పెర్ఫ్యూమ్ను బాత్రూముల్లో ఉంచడాన్ని కూడా మానుకోండి.

2. పెట్రోలియం జెల్లీని ఉపయోగించండి :

2. పెట్రోలియం జెల్లీని ఉపయోగించండి :

మీరు మీకిష్టమైన సువాసనను ఎక్కువ సమయం వరకూ నిలచియుండటం కోసం, పెర్ఫ్యూమ్ను ఉపయోగించే ముందు పెట్రోలియం జెల్లీని వాడతున్నరని నిర్ధారించుకోండి. పెట్రోలియం జెల్లీలో ఉన్న విశేషాంశాలు, మీ చర్మం మీద సువాసనను ఎక్కువ కాలం పాటు ఉంచేటట్లుగా సహాయపడే పదార్ధాలలో ఒకటి.

3. దుస్తులను వేసుకునే ముందు పెర్ఫ్యూమ్ను వాడాలి :

3. దుస్తులను వేసుకునే ముందు పెర్ఫ్యూమ్ను వాడాలి :

మనం వేసుకొనే బట్టల నుండి మంచి సువాసన రావాలనే పెర్ఫ్యూమ్ను ఉపయోగిస్తాం అలా మనం చేసే తప్పులలో ఇదే పెద్ద తప్పు. నిజానికి సరైన పద్దతి ఏమిటంటే, స్నానం చేసిన తర్వాత - బట్టలు వేసుకొనే ముందు పెర్ఫ్యూమ్ను ఉపయోగించాలి. ఇలా ఎక్కువసేపు సువాసనలను వెదజల్లడమే కాకుండా, మీరు వేసుకున్న బట్టలను (లేదా) ఆభరణాలను నాశనం చేయకుండా కూడా ఉంటాయి.

4. మీ మణికట్టును రుద్దడాన్ని ఆపండి :

4. మీ మణికట్టును రుద్దడాన్ని ఆపండి :

మీ మణికట్టులను ఒకదానితో మరోకటి రుద్దడం వల్ల, అప్లై చెయ్యబడిన పెర్ఫ్యూమ్ యొక్క సువాసన అనేది చాలా త్వరగా ఆవిరైపోతుంది. పెర్ఫ్యూమ్ను వాడిన తరువాత మీ మణికట్టులను రుద్దటం వల్ల, దాని యొక్క ప్రభావాన్ని మొట్టమొదటగా కోల్పోతారు.

5. పల్స్ వద్ద పెర్ఫ్యూమ్ను వాడండి :

5. పల్స్ వద్ద పెర్ఫ్యూమ్ను వాడండి :

ఎక్కువకాలం పాటు పెర్ఫ్యూమ్ యొక్క సువాసన నిలచి వుండేలా పల్స్ పాయింట్ వద్ద పెర్ఫ్యూమ్ను వాడి చూడండి. 2 చేతులు మణికట్టుల వద్ద, చెవుల వెనక, మెడకింద మధ్య భాగంలో పెర్ఫ్యూమ్ను వెదజల్లండి. మణికట్టుల వద్ద ఉపయోగించడం వల్ల, పెర్ఫ్యూమ్లో ఉన్న ఆల్కహాల్ను ఉత్తేజితం చేస్తుంది మరియు ఎక్కువ సేపు సువాసన నిలచి ఉండేలా అనుమతించబడుతుంది. అలా మాత్రమే కాకుండా మీ కాలి పిక్కల మీద మరియు చీలమండల మీద పెర్ఫ్యూమ్ను వెదజల్లడం వల్ల ఎక్కువకాలం పాటు దాని సువాసనను కలిగి ఉంటుంది.

6. మీ దువ్వెన పై పెర్ఫ్యూమ్ను స్ప్రే చేయండి :

6. మీ దువ్వెన పై పెర్ఫ్యూమ్ను స్ప్రే చేయండి :

శరీరం మీదన మాత్రమే కాకుండా, జుట్టు నుండి కూడా మంచి సువాసన రావాలని చాలామంది మహిళలు కోరుకుంటున్నారు. అందుకోసం మీరు చేయాల్సిందల్లా మీ జుట్టు కోసం వాడే దువ్వెన పై కొద్ది మొత్తంలో పెర్ఫ్యూమ్ని స్ప్రే చేసి, మీ జుట్టును దానితో దువ్వుకోండి. మీ పెర్ఫ్యూమ్ యొక్క సువాసనను ఎక్కువ కాలంపాటు వెదజల్లడానికి ఇది చాలా మంచి ట్రిక్, దీనిని మళ్లీ మళ్లీ మీరు ఉపయోగించవలసిన అవసరం లేదు.

7. కొంచెం పెర్ఫ్యూమ్తో - ఎక్కువ సమయం సువాసన వచ్చేలా :

7. కొంచెం పెర్ఫ్యూమ్తో - ఎక్కువ సమయం సువాసన వచ్చేలా :

ఎక్కువసార్లు స్ప్రే చేయడం వల్ల వచ్చే సువాసనను ఎక్కువసేపు కలిగి ఉండొచ్చని చాలామంది భావిస్తున్నారు. ఇది కొన్నిసార్లు నిజం కావచ్చు, కానీ అన్నిసార్లు పనిచేయకపోవచ్చు. మీరు తేలికపాటి సువాసనను గానీ కోరుకున్నట్లయితే, పెర్ఫ్యూమ్ను పూతలా వేసుకోవలసిన పని లేదు. గాలిలోకి కొద్ది పెర్ఫ్యూమ్ను స్ప్రే చేసి, ఆ దిశ వైపుగా మీరు నడిచినట్లయితే చాలు. మీరు గాలిలోకి పెర్ఫ్యూమ్ను స్ప్రే చెయ్యడం వల్ల, నిరంతరము సువాసనను వెదజల్లేలా అది మీ చర్మాన్ని తో సంబంధాన్ని కలిగి ఉంటుంది. నిజంగా ఇది చాలా మంచి ఆలోచన.

8. మాయిశ్చరైజర్ తో కలిపి వాడండి :

8. మాయిశ్చరైజర్ తో కలిపి వాడండి :

బాడీ లోషన్ (లేదా) హైయిర్ జెల్ వంటి ఉత్పత్తులలో కొంచెం పెర్ఫ్యూమ్ను కలిపి వాడి, మీ చర్మంపై ఉపయోగించటం వల్ల దీర్ఘకాలం పాటు మంచి సువాసనను వెదజల్లుతుంది. మాయిశ్చరైజర్ మరియు పెర్ఫ్యూమ్ అనేది ఒకదానితో మరొకటి బాగా కలిసి పోవడం వల్ల దాని వల్ల వచ్చే సువాసన ఎక్కువ కాలం పాటు కొనసాగుతుంది.

9. పెర్ఫ్యూమ్ను పూతలా వేసుకోవడం :

9. పెర్ఫ్యూమ్ను పూతలా వేసుకోవడం :

రోజంతా మిమ్మల్ని తాజాగా ఉంచేందుకు పెర్ఫ్యూమ్ను పూతలా వాడటమనేది చాలా మంచిది. అందుకు తగ్గట్లుగా బాడీ సోప్ను వాడటం వల్ల ఆ సువాసన ఆనేది మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ చాలామంది మంచి సువాసన కోసం 2 - 3 రకాల పెర్ఫ్యూమ్ బ్రాండ్లను వాడి, మంచి ఫలితాలను ఇవ్వలేదని వదిలేస్తారు.

10. తేమగా ఉండటం :

10. తేమగా ఉండటం :

మీకు అందుబాటులో పెట్రోలియం-జెల్లి గనుక లేకపోతే, మీ చర్మం కాస్త తేమగా ఉండేటట్లుగా చూసుకోండి లేకపోతే, పొడి చర్మం మీద ఈ పేపెర్ఫ్యూమ్స్ యొక్క ప్రభావం ఎక్కువ కాలం పనిచెయ్యదు. జిడ్డు చర్మాన్ని కలిగి ఉండటాన్ని చాలామంది ఇష్టపడరు. కానీ పెర్ఫ్యూమ్ యొక్క సువాసన ఎక్కువ సమయంపాటు నిలచి ఉండాలంటే, అది కేవలం జిడ్డు చర్మంపైన మాత్రమే ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలా లేనివాళ్ళు మాయిశ్చర్ ఉత్పత్తులను వాడటం మంచిది.

English summary

Tips To Make Perfume Last Longer | Ways To Make Your Perfume Last Longer | How To Make Your Perfume Last Longer | Simple Tips To Make Perfume Last Longer

I always find myself questioning why does a perfume not last longer. Do you feel the same? Usually, the perfume seems to last only for a few minutes and that is exactly not what we want.
Story first published:Monday, January 15, 2018, 15:02 [IST]
Desktop Bottom Promotion