1. ఫేసియల్ మసాజ్:

1. ఫేసియల్ మసాజ్:

మీ అరచేతిలోకి కొన్ని చుక్కల ఆల్మండ్ ఆయిల్ ని తీసుకోండి.

ఈ నూనెతో ముఖంపై అలాగే మెడపై మసాజ్ చేసుకోండి.

బ్రైటర్ కాంప్లెక్షన్ ను పొందేందుకై ఈ నూనెను చర్మంపై రాత్రంతా అలాగే ఉంచండి.

మరుసటి ఉదయాన్నే, గోరువెచ్చటి నీటితో చర్మాన్ని శుభ్రపరుచుకోండి.

ఈ పద్దతిని వారానికి రెండు లేదా మూడు సార్లు పాటించడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.

2. బ్రౌన్ షుగర్ తో ఆల్మండ్ ఆయిల్:

2. బ్రౌన్ షుగర్ తో ఆల్మండ్ ఆయిల్:

ఒక టీస్పూన్ ఆల్మండ్ ఆయిల్ ని అర టీస్పూన్ బ్రౌన్ షుగర్ తో కలపండి.

ఈ మిశ్రమాన్ని ఫేసియల్ స్కిన్ పై బాగా మసాజ్ చేయండి.

పదినిమిషాల తరువాత, గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోండి.

ఈ ఎక్స్ఫోలియేటింగ్ బ్లెండ్ ను వారానికి ఒకసారి వాడటం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.

3. ల్యావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ తో ఆల్మండ్ ఆయిల్ :

3. ల్యావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ తో ఆల్మండ్ ఆయిల్ :

ఒక టీస్పూన్ ఆల్మండ్ ఆయిల్ ని రెండు లేదా మూడు చుక్కల ల్యావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ తో కలపండి.

ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి పదినిమిషాల పాటు అలాగే ఉంచండి.

ఆ తరువాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోండి.

ఈ బ్లెండ్ ని వారానికి ఒకసారి అప్లై చేయడం ద్వారా గొప్ప ఫలితాలను పొందవచ్చు.

4. అలోవెరా జెల్ తో ఆల్మండ్ ఆయిల్:

4. అలోవెరా జెల్ తో ఆల్మండ్ ఆయిల్:

ఒక టీస్పూన్ ఆల్మండ్ ఆయిల్ ని ఒక టీస్పూన్ అలోవెరా జెల్ తో కలపండి.

ఈ మిశ్రమంతో మీ ముఖాన్ని మసాజ్ చేసుకోండి. గంటపాటు ఈ మిశ్రమం ముఖంపై ఉండేలా చూసుకోండి.

తేలికపాటి ఫేస్ వాష్ ను అలాగే గోరువెచ్చటి నీటిని వాడి చర్మాన్ని శుభ్రపరుచుకోండి.

ఆ తరువాత తేలికపాటి స్కిన్ టోనర్ ను అప్లై చేయండి.

ఈ మిశ్రమాన్ని వారానికి ఒకసారి అప్లై చేయడం ద్వారా గొప్పఫలితాలను పొందవచ్చు.

5. విటమిన్ ఈ ఆయిల్ తో ఆల్మండ్ ఆయిల్:

5. విటమిన్ ఈ ఆయిల్ తో ఆల్మండ్ ఆయిల్:

అర టీస్పూన్ ఆల్మండ్ ఆయిల్ ని విటమిన్ ఈ క్యాప్సూల్ నుంచి సేకరించబడిన నూనెతో కలపండి.

ఇలా తయారైన మిశ్రమాన్ని ముఖంపై అలాగే మెడపై అప్లై చేయండి.

రాత్రంతా ఈ మిశ్రమాన్ని అలాగే ఉండనివ్వండి. మరుసటి ఉదయాన్నే తేలికపాటి క్లీన్సర్ తో ఈ మిశ్రమాన్ని తొలగించండి.

ఈ హోంమేడ్ బ్లెండ్ ను వారానికి మూడు లేదా నాలుగు సార్లు వాడటం ద్వారా ప్రకాశవంతమైన నిగారింపుని పొందవచ్చు.

6. రోజ్ వాటర్ మరియు గ్లిజరిన్ తో ఆల్మండ్ ఆయిల్:

6. రోజ్ వాటర్ మరియు గ్లిజరిన్ తో ఆల్మండ్ ఆయిల్:

ఒక పాత్రను తీసుకుని అందులో అర టీస్పూన్ ఆల్మండ్ ఆయిల్ , మూడు లేదా నాలుగు చుక్కల రోజ్ వాటర్ , నాలుగు లేదా అయిదు చుక్కల గ్లిజరిన్ ను జోడించండి.

వీటిని బాగా కలిపి ఈ మిశ్రమంతో ముఖాన్ని రిన్స్ చేసుకోండి.

ఆ తరువాత గోరువెచ్చటి నీటితో మీ ముఖాన్ని శుభ్రపరుచుకోండి.

ఈ ప్రత్యేకమైన పద్దతిలో ఆల్మండ్ ఆయిల్ ను వారానికి ఒకసారి వాడటం ద్వారా చర్మం సహజమైన కాంతితో ప్రకాశిస్తుంది.

7. లైమ్ జ్యూస్ మరియు మిల్క్ పౌడర్ తో ఆల్మండ్ ఆయిల్:

7. లైమ్ జ్యూస్ మరియు మిల్క్ పౌడర్ తో ఆల్మండ్ ఆయిల్:

అరటీస్పూన్ ఆల్మండ్ ఆయిల్ మరియు అరటీస్పూన్ మిల్క్ పౌడర్ లో ఒక టీస్పూన్ లైమ్ జ్యూస్ ని కలపండి.

ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై అప్లై చేసి పది నుంచి పదిహేను నిమిషాల వరకు అలాగే ఉండనివ్వండి.

గోరువెచ్చటి నీటితో మీ చర్మాన్ని శుభ్రపరుచుకోండి.

తేలికపాటి మాయిశ్చరైయిజర్ ను అప్లై చేయడం ద్వారా గొప్ప ఫలితాలను పొందండి.

ప్రకాశవంతమైన ఛాయ కోసం, ఈ విధమైన ఆల్మండ్ ఆయిల్ మాస్క్ ను వారానికి ఒకసారి అప్లై చేస్తే గొప్ప ఫలితం లభిస్తుంది.

8. అరటిపండుతో ఆల్మండ్ ఆయిల్:

8. అరటిపండుతో ఆల్మండ్ ఆయిల్:

ఒక అరటిపండును తీసుకుని బాగా మ్యాష్ చేయండి. అందులో ఒక టీస్పూన్ ఆల్మండ్ ఆయిల్ ను కలపండి.

ఈ మిశ్రమంతో ముఖాన్ని అలాగే మెడను మసాజ్ చేసుకోండి.

దీనిని 20 నుంచి 25 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వండి.

ఆ తరువాత గోరువెచ్చటి నీటితో మీ ముఖాన్ని శుభ్రపరుచుకోండి.

నెలలో రెండుసార్లు, ఈ విధమైన హోంమేడ్ మెటీరియల్ తో చర్మాన్ని సంరక్షించుకుంటే బ్రైటర్ కాంప్లెక్షన్ ని పొందవచ్చు.

Read more about: almond oil skin care tips బాదం నూనె చర్మ సంరక్షణ చిట్కాలు
English summary

Ways To Use Almond Oil For Brighter Complexion

Ways To Use Almond Oil For Brighter Complexion,Almond oil is one such ingredient that can be used for a brighter skin complexion, as it rich in vitamins, nutrients and hence boosts the skin’s overall health. Read to know more ways to use almond oil for a brighter complexion
Story first published: Monday, February 12, 2018, 16:00 [IST]
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X