For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ హోంమేడ్ ఫేస్ మాస్క్ తో స్కిన్ కొల్లాజెన్ లెవల్స్ ను పెంచుకోవచ్చు!

|

మచ్చలేని, నిష్కళంక చర్మాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ అందరికీ అది సాధ్యపడదు. మరియు, ప్రతిరోజూ మనం ఎదుర్కొనే మురికి, ధూళి మరియు కాలుష్యం కారణంగా, చర్మ సంరక్షణ అనేది అత్యంత క్లిష్టతరంగా ఉంటుంది. మనం తరచుగా ప్రభావిత ప్రాంతాలను శుభ్రం చేయడం, బ్లీచ్ చేయడం, మరియు ఫేషియల్ చేయించుకోవటం వంటి సౌందర్య చికిత్సలను అనుసరించడం ద్వారా, కొన్ని చర్మ సమస్యలకు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ వీటి కోసం తరచుగా, వివిధరకాల స్పా మరియు సెలూన్లను సందర్శిస్తుంటాం. ఇవి ఖర్చుతో కూడిన వ్యవహారంగా ఉన్నా, నమ్మదగిన ఫలితాలను మాత్రం ఖచ్చితత్వంతో ఇవ్వలేవు. వాస్తవంగా ఈ సెలూన్ ఆధారిత చికిత్సలు, మీ చర్మానికి హానికలిగించే రసాయనాలతో కూడిన పదార్ధాలను కలిగి ఉంటాయి. మరి అలాంటప్పుడు మనం సులభమైన మరియు సరళతరమైన హోంమేడ్ రెమిడీస్ అనుసరించడం ఉత్తమంగా సూచించబడుతుంది. అంతేకాకుండా, దుష్ప్రభావాలులేని చికిత్సను అందించగలిగి, ఆరోగ్యకర చర్మాన్ని నిర్వహించేందుకు అనువుగా ఉంటుంది.

సహజసిద్దమైన పదార్థాలను ఉపయోగించి తయారుచేయగలిగిన, కొన్ని అద్భుతమైన నేచురల్ హోంమేడ్ ఫేస్ ప్యాక్స్ క్రింద పొందు పరచబడ్డాయి. మరిన్ని వివరాలకు వ్యాసంలో ముందుకు సాగండి.

1. అవొకాడో, టమోటో, మరియు ఎగ్ వైట్ :

1. అవొకాడో, టమోటో, మరియు ఎగ్ వైట్ :

అవకాడో నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తూ, హైడ్రేటెడ్ గుణాలను కలిగి ఉంటుంది. దీనిలో బీటాకెరోటిన్, లినోలెయిక్ ఆమ్లం, మరియు లెసితిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న కారణంగా, చర్మాన్నినిర్జలీకరణం కాకుండా చూస్తూ, మంచి పోషణను అందివ్వగలుగుతుంది. మీ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి, తేమను నిర్వహించడంతోపాటుగా, మంచి పోషణను అందించడానికి టమోటో మరియు ఎగ్ వైట్లను అవకాడోతో కలిపి ఫేస్ మాస్క్ తయారుచేయవచ్చు.

కావలసిన పదార్ధాలు :

• 2 టేబుల్ స్పూన్ల అవకాడో గుజ్జు

• 2 టేబుల్ స్పూన్ల టొమాటో గుజ్జు

• 1 ఎగ్ వైట్

అనుసరించు విధానం :

• ఒక గిన్నెలో అన్ని పదార్థాలను వేసి, వాటిని మిశ్రమంగా కలపండి.

• దీన్ని మీ ముఖం మరియు మెడ మీద అప్లై చేసి 15నిముషాలపాటు అలానే వదిలేయండి.

• చల్లటి నీటితో కడిగి, మీ ముఖాన్ని తువాలుతో పొడిగా చేసుకోండి.

• ఆశించిన ఫలితాల కోసం వారానికి ఒకసారి ఈ పద్దతిని పునరావృతం చేయండి.

2. దాల్చిన చెక్క, తేనె, మరియు పసుపు :

2. దాల్చిన చెక్క, తేనె, మరియు పసుపు :

దాల్చిన చెక్కలోని యాంటీ మైక్రోబయల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలు మరియు ఆక్నే సమస్యను తగ్గించడంలో సహాయపడుతాయి. మరోవైపు, తేనె మరియు పసుపు హానికరమైన ఫ్రీరాడికల్స్ నుండి మన చర్మాన్ని రక్షిస్తుంది. తద్వారా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి

• 1 టేబుల్ స్పూన్ తేనె

• ఒక చిటికెడు పసుపు

అనుసరించు విధానం :

• ఒక గిన్నెలో దాల్చిన చెక్క పొడి, తేనెను తీసుకుని మిశ్రమంగా కలపండి.

• దీనికి కొంత పసుపు చేర్చి, అన్ని పదార్థాలను మరలా కలపండి.

• దీన్ని మీ ముఖం మరియు మెడ మీద అప్లై చేసి సుమారు 15 నుండి 20 నిముషాలపాటు అలానే వదిలేయండి.

• ఆపై చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.

• కోరుకున్న ఫలితాల కోసం వారానికి రెండుసార్లు ఇలా పునరావృతం చేయండి.

3. పెరుగు మరియు అరటి :

3. పెరుగు మరియు అరటి :

పెరుగు మీ చర్మానికి ప్రయోజనకరంగా ఉండే అనేక విటమిన్స్ మరియు పోషకాలను కలిగి ఉంటుంది. ఇది లాక్టిక్ ఆమ్లాన్ని ప్రధానంగా కలిగి ఉంటుంది. ఇది చర్మ సంరక్షణ ఉత్పత్తులలో వినియోగించే ప్రధాన పదార్థాల్లో ఒకటిగా ఉంటుంది. పెరుగు, ఫేస్ మాస్క్ రూపంలో అప్లై చేసినప్పుడు, మీ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేసి, ప్రకాశవంతంగా మరియు కాంతివంతంగా మార్చగలుగుతుంది. అదేవిధంగా తరచుగా ఉపయోగించినప్పుడు మీ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో ఉత్తమంగా సహాయపడుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 టేబుల్ స్పూన్ యోగర్ట్ ( లేదా పెరుగు)

• 2 టేబుల్ స్పూన్ అరటి గుజ్జు

అనుసరించు విధానం :

• రెండు పదార్థాలను ఒక గిన్నెలోనికి తీసుకుని, వాటిని బాగా బ్లెండ్ చేయాలి.

• ఈ పేస్ట్ ను మీ ముఖం మరియు మెడ మీద అప్లై చేయండి.

• 20 నిమిషాలపాటు అలానే వదిలేసి, ఆ తర్వాత చల్లని నీటితో కడిగేయండి.

• ఆశించిన ఫలితాల కోసం ఈ ఫేస్ మాస్క్ ను వారంలో రెండుసార్లు పునరావృతం చేయండి.

4. ఆముదం నూనె, ఆలివ్ ఆయిల్, & నిమ్మ రసం :

4. ఆముదం నూనె, ఆలివ్ ఆయిల్, & నిమ్మ రసం :

ఆలివ్ ఆయిల్, ఆముదం నూనె, మరియు నిమ్మ, అద్భుతమైన స్కిన్ మాయిశ్చరైజింగ్ గుణాలను కలిగి ఉండడమే కాకుండా, మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను కూడా చంపగలుగుతాయి.

కావలసిన పదార్ధాలు :

• 1 టీస్పూన్ ఆముదం నూనె

• 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్

• 1 టేబుల్ స్పూన్ నిమ్మ రసం

అనుసరించు విధానం :

• అన్ని పదార్ధాలను ఒక గిన్నెలోనికి తీసుకుని, వాటిని మిశ్రమంగా కలపండి.

• బ్రష్ ఉపయోగించి మీ ముఖం మరియు మెడ మీద అప్లై చేయండి.

• 20 నిమిషాలపాటు అలానే గాలికి విడిచిపెట్టండి.

• ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.

• ఆశించిన ఫలితాలకోసం వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ విధానాన్ని పునరావృతం చేయండి.

5. బొప్పాయి, క్యాబేజీ, మరియు రోజ్ వాటర్ :

5. బొప్పాయి, క్యాబేజీ, మరియు రోజ్ వాటర్ :

' ఏంజెల్ ఫ్రూట్ ' అని పిలిచే బొప్పాయిలో అనేకరకాల అద్భుతమైన గుణాలతోపాటు, విటమిన్లు మరియు పోషకాలతో లోడ్ చేయబడి ఉంటాయి. క్రమంగా ఫేస్ మాస్క్లు లేదా ఫేస్ స్క్రబ్స్ రూపంలో సమయోచితంగా ఉపయోగించినప్పుడు మీ చర్మానికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పబడుతుంది. డార్క్ స్పాట్స్ మరియు తెల్లమచ్చలను తగ్గించడంతో పాటు, ఇది మీ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా బూస్ట్ చేస్తుంది. తద్వారా మొటిమలు మరియు ఆక్నే సమస్యకు దూరంగా ఉంచుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 2 టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జు

• 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్

• 1 టేబుల్ స్పూన్ క్యాబేజీ జ్యూస్

అనుసరించు విధానం :

• ఒక గిన్నెలో క్యాబేజీ రసం, రోజ్ వాటర్ తీసుకుని, ఆ రెండింటినీ మిశ్రమంగా కలపండి.

• దీనికి కొన్ని బొప్పాయి గుజ్జును జోడించి, అన్ని పదార్థాలను కలిపి మిశ్రమంగా చేయాలి.

• దీన్ని మీ ముఖం మీద అప్లై చేసి 20 నిముషాలపాటు అలానే వదిలేయాలి.

• చల్లటి నీటితో కడిగి, తువాలుతో తడిని తొలగించండి.

• కోరుకున్న ఫలితాల కోసం వారానికి ఒకసారి ఇలా పునరావృతం చేయండి.

6. కలబంద, బియ్యంపిండి, మరియు టీట్రీ ఆయిల్ :

6. కలబంద, బియ్యంపిండి, మరియు టీట్రీ ఆయిల్ :

కలబంద, చర్మంమీది చారలను మరియు ముడుతలను తగ్గించడానికి సహాయపడగలిగే ఉత్తమ సహజసిద్దమైన పదార్ధాలలో ఒకటిగా ఉంటుంది. అందువలన వృద్ధాప్య సంకేతాలను నిరోధించడంలో ఉత్తమంగా సహాయపడుతుందని సూచించబడుతుంది. ఇది మీ చర్మానికి తేమను మరియు పోషణను అందివ్వడంతో పాటుగా, సన్ బర్న్, టాన్, మరియు స్ట్రెచ్ మార్క్స్ చికిత్సలో కూడా సహాయపడుతుంది. క్రమంగా అలోవేర, బియ్యంపిండి, మరియు టీట్రీ ఆయిల్ ను ఉపయోగించి ఫేస్ మాస్క్ కూడా తయారుచేసుకోవచ్చు - ఇవన్నీ మీ చర్మానికి ప్రయోజనకరంగా ఉండి, అనేక చర్మ సంబంధ పరిస్థితులకు చికిత్స చేయడంలో సహాయపడతాయి.

కావలసిన పదార్ధాలు :

• 2 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు

• 1 1/2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి

• 1 టీస్పూన్ టీ ట్రీ ఆయిల్

అనుసరించు విధానం :

• ఒక గిన్నెలో తాజాగా సేకరించిన కలబంద గుజ్జు,మరియు బియ్యంపిండిని వేసి మిశ్రమంగా కలుపుకోవాలి.

• దీనికి కొంత టీ ట్రీ ఆయిల్ జోడించి, అన్ని పదార్థాలను కలిపి బ్లెండ్ చేయాలి.

• దీన్ని మీ ముఖం మరియు మెడ మీద అప్లై చేసి, 10 నుండి 12 నిముషాలపాటు వదిలేయాలి.

• ఆపై సాధారణ నీటితో శుభ్రపరచుకోవాలి.

• ఆశించిన ఫలితాలకోసం వారానికి రెండుసార్లు ఇలా పునరావృతం చేయండి.

7. పసుపు, నారింజ, మరియు మామిడి :

7. పసుపు, నారింజ, మరియు మామిడి :

యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉన్న, పసుపు ఒక హోం మేడ్ ఫేస్ మాస్క్ను తయారు చేయడానికి వచ్చినప్పుడు ఉత్తమమైన ఎంపికలుగా ఉంటాయి. వీటిని మీరు తేనె లేదా పెరుగుతో కలుపుకోవచ్చు. లేదా ఆరెంజ్ మరియు మామిడి పండ్ల వంటి కొన్ని అద్భుతమైన పండ్లను కూడా కలిపి హోంమేడ్ ఫేస్ మాస్క్ గా తయారుచేసుకోవచ్చు.

కావలసిన పదార్ధాలు :

• 1/2 టీ స్పూన్ పసుపు పొడి

• 1 టేబుల్ స్పూన్ నారింజ గుజ్జు లేదా, 1 టేబుల్ స్పూన్ నారింజ రసం.

• 1 టేబుల్ స్పూన్ మామిడి గుజ్జు లేదా, 1 టేబుల్ స్పూన్ మామిడిపండ్ల రసం.

అనుసరించు విధానం :

• నారింజ గుజ్జు, మామిడి గుజ్జును ఒక గిన్నెలో వేసి, వాటిని బాగా కలపాలి. మీరు జ్యూసులను కూడా గుజ్జుకు ప్రత్యామ్నాయంగా వినియోగించవచ్చు.

• తరువాత, దానికి కొంత పసుపును చేర్చి, అన్ని పదార్ధాలను బాగుగా కలపండి.

• దీన్ని మీ ముఖం మరియు మెడ మీద అప్లై చేసి 20 నిముషాలపాటు, డ్రై అయ్యే వరకు వదిలేయండి.

• 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో కడిగి, మీ ముఖం మరియు మెడనుండి తువాలుతో నీటిని తొలగించండి.

• ఆశించిన ఫలితాలకోసం వారంలో ఒకసారి ఈ ఫేస్ మాస్క్ ను పునరావృతం చేయండి.

8. క్యారెట్ & తేనె :

8. క్యారెట్ & తేనె :

క్యారెట్లలో విటమిన్ సి మరియు బీటాకెరోటిన్ పుష్కలంగా ఉండి మీ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతాయి. హోంమేడ్ ఫేస్ మాస్క్ అనుసరించడానికి, మీరు కొంత తేనెకు, క్యారెట్ తురుమును జోడించి అనుసరించవచ్చు.

కావలసిన పదార్ధాలు :

• 2 టేబుల్ స్పూన్ల తురిమిన క్యారెట్లు లేదా 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ గుజ్జు

• 1 టేబుల్ స్పూన్ తేనె

అనుసరించు విధానం :

• క్యారెట్ గుజ్జు లేదా తురిమిన క్యారెట్లను, కొంత తేనెతో కలిపి అన్ని పదార్థాలను మిశ్రమంగా బ్లెండ్ చేయండి.

• దీనిని మీ ముఖం మరియు మెడ మీద అప్లై చేసి సుమారు 15 నిముషాలపాటు అలానే వదిలేయండి.

• మాస్క్ అప్లై చేసేటప్పుడు మీ కళ్లు, చెవులు మరియు నోటికి దూరంగా ఉండాలని గుర్తుంచుకోండి.

• 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుని, తువాలుతో తడిని తొలగించండి.

• ఆశించిన ఫలితాల కొరకు ఈ మాస్క్ ని వారానికి రెండు లేదా మూడుసార్లు పునరావృతం చేయండి.

9. దోసకాయ, జామ, మరియు కివి :

9. దోసకాయ, జామ, మరియు కివి :

కీరా దోసకాయలో ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది, ఇది చర్మం మీది వాపును తగ్గించడంలో ఉత్తమంగా సహాయపడుతుంది. అదేవిధంగా డార్క్ సర్కిల్స్ మరియు డార్క్ స్పాట్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. హోంమేడ్ ఫేస్ మాస్క్ తయారుచేయడానికి మీరు జామ మరియు కివీలతో దోసకాయను కలిపి తీసుకోవచ్చు. ఈ ఫేస్ మాస్క్ మీ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో ఉత్తమంగా సహాయపడుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 2 టేబుల్ స్పూన్ల దోసకాయ గుజ్జు.

• 1 టేబుల్ స్పూన్ జామపండు గుజ్జు.

• 1 టేబుల్ స్పూన్ కివి గుజ్జు.

• 1 టీస్పూన్ తేనె.

అనుసరించు విధానం :

• అన్ని పదార్థాలను కలిపి ఒక గిన్నెలోకి తీసుకుని వాటిని బాగా బ్లెండ్ చేసి మృదువుగా, నిలకడగా పేస్ట్ లా తయారు చేసుకోవాలి.

• దీన్ని మీ ముఖం మరియు మెడ మీద అప్లై చేసి సుమారు 15 నిముషాలు అలానే వదిలేయాలి.

• ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

• ఉత్తమ ఫలితాలకోసం వారంలో ఒకసారి అనుసరించండి.

10. బాదం, కాచిన వెన్న, మరియు గ్రేప్ సీడ్ ఆయిల్ :

10. బాదం, కాచిన వెన్న, మరియు గ్రేప్ సీడ్ ఆయిల్ :

యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్ అధికంగా ఉన్న కారణంగా బాదం, మీ చర్మంలోని కొల్లాజెన్ ఉత్పత్తిని బూస్ట్ చేసి, చర్మాన్ని మృదువుగా చేయడంలో సహాయం చేస్తుంది. మీరు దీనిని కాచిన వెన్న మరియు గ్రేప్ సీడ్ ఆయిల్ తో కలిపి తీసుకోవడం ద్వారా, మీ చర్మ సంరక్షణలో ఉత్తమంగా సహాయం చేయగలదు.

కావలసిన పదార్ధాలు :

• 5 నుండి 6 బాదం పప్పుల పొడి

• 1 టేబుల్ స్పూన్ కాచి చల్లార్చిన వెన్న

• 1 టేబుల్ స్పూన్ గ్రేప్ సీడ్ ఆయిల్

అనుసరించు విధానం :

• ఒక గిన్నెలో కొంత బాదం పొడిని తీసుకోండి.

• దీనికి కొంత కాచిన వెన్నను జోడించి బాగుగా కలపండి.

• చివరగా, దీనికి కొంత గ్రేప్ సీడ్ ఆయిల్ జోడించి, అన్ని పదార్థాలను కలిపి బ్లెండ్ చేయాలి.

• బ్రష్ ఉపయోగించి మీ ముఖం మరియు మెడ మీద అప్లై చేయండి. తరువాత 15 నిమిషాలపాటు అలానే ఉంచి, చల్లటి నీటితో శుభ్రం చేయండి.

• ఆశించిన ఫలితాలకోసం రెండు రోజులకు ఒకసారి ఈ ప్రక్రియను పునరావృతం చేయండి.

11. పైనాపిల్ & పంచదార :

11. పైనాపిల్ & పంచదార :

విటమిన్ సి అధికంగా ఉండే పైనాపిల్ వంటి పదార్ధాలు, అనేక చర్మ సంబంధ సమస్యలకు ఒక ఎఫెక్టివ్ హోంరెమెడీగా చెప్పబడుతుంది. మొటిమలు మరియు ఆక్నేసమస్యను తగ్గించడమే కాకుండా. ఇది మీ చర్మంలోని కొలాజెన్ ఉత్పత్తిని సమర్థవంతంగా పెంచుతుంది. మరియు చర్మానికి మంచి టోన్ అందించి, మృదువుగా మారుస్తుంది.

కావలసిన పదార్ధాలు :

• 2 టేబుల్ స్పూన్ల పైనాపిల్ జ్యూస్

• 2 టేబుల్ స్పూన్ల ముడి పంచదార

అనుసరించు విధానం :

• పంచదార, పైనాపిల్ జ్యూస్ రెండింటిని ఒక గిన్నెలో వేసి బాగా మిశ్రమంగా కలపాలి.

• మీ చేతులతో మొత్తం మిశ్రమాన్ని తీసుకొని, మీ ముఖానికి మరియు మెడ భాగాలలో అప్లై చేయండి.

• క్రమంగా మీ ముఖాన్ని మృదువుగా రుద్ది మసాజ్ వలె చేయండి.

• మరో 10 నిమిషాలపాటు అలానే విడిచిపెట్టండి.

• చల్లటి నీటితో కడిగి, తువాలుతో తడిని తొలగించండి.

• ఆశించిన ఫలితాల కోసం వారానికి ఒకసారి ఇలా పునరావృతం చేయండి.

12. కొబ్బరి నూనె & తేనె :

12. కొబ్బరి నూనె & తేనె :

కొబ్బరి నూనె మీ జుట్టుకు మాత్రమే కాదు, మీ చర్మానికి కూడా ప్రయోజనకరమే. ఇది మీ చర్మానికి పోషణ అందించి, మాయిశ్చరైస్ చేసి మృదువుగా మారుస్తుంది. తేనెతో కలిపి తీసుకుంటే, ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు ప్రకాశించడానికి సహాయపడుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె

• 1 టేబుల్ స్పూన్ తేనె

అనుసరించు విధానం :

• ఒక గిన్నెలో కొబ్బరి నూనె మరియు తేనె రెండింటిని సమాన పరిమాణంలో తీసుకోండి.

• దీన్ని బ్రష్ ఉపయోగించి మీ ముఖం మరియు మెడమీద అప్లై చేయండి. మాస్క్ అప్లై చేసేటప్పుడు మీ కళ్లు, చెవులు మరియు నోటికి దూరంగా ఉంచాలని గుర్తుంచుకోండి.

• 20 నిమిషాలపాటు అలానే గాలికి ఉండనివ్వండి, ఆపై చల్లని నీటితో శుభ్రపరచండి.

• కోరుకున్న ఫలితాలకోసం రెండు రోజులకు ఒకసారి పునరావృతం చేయండి.

• మీకు ఆయిలీ స్కిన్ ఉంటే, కోరుకున్న ఫలితాల కోసం వారానికొకసారి వినియోగించవచ్చు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Boost Your Skin's Collagen Levels With These Home-made Face Masks!

Natural ingredients like avocados, tomatoes, egg whites, cinnamon, honey, turmeric, yoghurt, rosewater, tea tree oil, grapeseed oil, and even fruits like bananas, mangoes, papaya, kiwi can be used to make home-made face masks.
Story first published: Monday, June 3, 2019, 13:36 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more