For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫెయిర్ స్కిన్ పొందాలంటే ఇంట్లోనే స్వయంగా బంగాళదుంప ఫేస్ మాస్క్ ట్రై చేయండి

|

ప్రకాశవంతమైన, మరియు ఆకర్షణీయమైన చర్మ సౌందర్యం అనేది ప్రతి ఒక్కరి అభిలాషగా ఉంటుంది. అవునా ? అందంగా కనపడాలని భావించే హక్కు అందరికీ ఉంటుంది. క్రమంగా మనలో అనేకమంది వివిధ రకాల మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. కొందరు పాతకాలపు చిట్కాలను ప్రయత్నిస్తే, కొందరు అదునాతన ఉత్పత్తుల మీద ఆధారపడుతూ ఉంటారు. క్రమంగా గ్రాండ్ సెలూన్లకు వేలకు వేలు వెచ్చిస్తూ ఉంటారు. ఒక్కోసారి ఈ రసాయనిక ఉత్పత్తులు, తీవ్ర చర్మ మరియు ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశాలు లేకపోలేదు. అనేక రకాల చర్మ కాన్సర్లకు కూడా ఈ సౌందర్య ఉత్పత్తులలోని రసాయనాలే కారణంగా కొన్ని పరిశోధనల్లో తేలింది. కానీ ఇంట్లోనే తయారు చేసుకోదగిన ఫేస్ మాస్క్లు మీ ఆలోచనలకు ఊతం అందివ్వగలవని సౌందర్య నిపుణులు సూచిస్తుంటారు. చర్మ సంరక్షణకు హోం మేడ్ రెసిపీలను దాటి ప్రయోజనాలను అందించేవి ఉండవు అన్నది వాస్తవం.

ఆసక్తికరంగా ఉంది కదూ ? చర్మ సంరక్షణ అనేది దైనందిక జీవితానికి ఎంత ముఖ్యమైన అంశమో మనకు తెలియనిది కాదు. అందుకే ఈరోజు మేము, ఒక ఉత్తమమైన ఫేస్ మాస్క్ రెసిపీని మీముందు ఉంచబోతున్నాము. ఇది కేవలం మీకు ప్రకాశవంతమైన చర్మాన్ని అందివ్వడమే కాకుండా, మీ చర్మం లోపల మరియు వెలుపల కూడా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మరిన్ని వివరాల కోసం వ్యాసంలో ముందుకు సాగండి.

బంగాళా దుంపలను ఫేస్ మాస్క్ల రూపంలో అప్లై చేసినప్పుడు, చర్మానికి సహజ సిద్దమైన గ్లో అందివ్వడమే కాకుండా, మీ చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. క్రమంగా మీ ముఖం మీద ఈ పాక్ అప్లై చేసినప్పుడు బంగాళా దుంపలలో ఉండే పోషకాలు, మీ చర్మానికి ఎంతో మేలును చేకూరుస్తాయని చెప్పబడుతుంది.

మరెందుకు ఆలస్యం ? మరిన్ని వివరాల కోసం వ్యాసంలో ముందుకు సాగండి.

మరెందుకు ఆలస్యం ? మరిన్ని వివరాల కోసం వ్యాసంలో ముందుకు సాగండి.

కావలసిన పదార్ధాలు :

• ముక్కలుగా చేసిన బంగాళా దుంప ఒకటి

• ముక్కలు చేసిన కీరా దోస ఒకటి

• ముక్కలు చేసిన నిమ్మకాయ

• చిటికెడు పసుపు

పదార్ధాలన్నీ సమకూర్చుకున్న తర్వాత, రెసిపీని ప్రారంభించండి.

తయారుచేయు విధానం :

• ఒక మీడియం సైజ్ గిన్నెను తీసుకోండి.

• గిన్నెలో బంగాళా దుంప రసాన్ని తీసుకోండి.

• ఇప్పుడు, గిన్నెలోకి దోసకాయ రసాన్ని కూడా జోడించి, బంగాళా దుంప రసంలో కలపండి.

• ఈ మిశ్రమానికి కొన్ని చుక్కల నిమ్మ రసాన్ని కలపండి.

• చివరగా, దీనికి ఒక చిటికెడు పసుపును కలపండి.

• మృదువైన పేస్ట్ తయారుచేయడం కొరకు అన్ని పదార్థాలను బ్లెండ్ చేయండి.

• ఇప్పుడు, ఈ మిశ్రమానికి కొన్ని నిమిషాలపాటు విశ్రాంతినివ్వండి, కాసేపటి తరువాత మీ ముఖంపై అప్లై చేయండి.

• కనీసం 15 నిమిషాలపాటు గాలికి ఆరనివ్వండి. తరువాత చల్లటి నీటితో దానిని శుభ్రం చేయండి.

• తరువాత ముఖాన్ని శుభ్రమైన టవల్తో తుడవండి.

ఆశించిన ఫలితాల కోసం వారానికి కనీసం రెండుసార్లు ఈ ఫేస్ మాస్క్ ను పునరావృతం చేయండి.

చిట్కా: ఏదైనా ఫేస్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత మీ ముఖాన్ని కడుక్కోవడం కోసం ఫేస్ వాష్ లేదా సబ్బును ఉపయోగించడం సరికాదు. వాటిలోని రసాయన పదార్ధాల ప్రభావం, చర్మం మీద పడి సహజ సిద్దమైన మెరుపును తగ్గిస్తుంది. కేవలం నీటితో మాత్రమే ముఖాన్ని కడుక్కోవడం మంచిదిగా సూచించబడుతుంది.

గమనిక : ఏదైనా ఫేస్ ప్యాక్ అప్లై చేయడానికి ముందు, మీ ముంజేతిపై కొంత మొత్తాన్ని అప్లై చేయడానికి ప్రయత్నించిన తర్వాతనే, మిగిలిన ప్రొసీజర్ అనుసరిచండి. మీ చర్మంపై ఎటువంటి రియాక్షన్ కలిగినా, ఆ ఫేస్ పాక్ వినియోగాన్ని ఆపండి. ఎటువంటి దుష్ప్రభావాలు లేవని నిర్ధారించుకున్న తర్వాతనే ముఖానికి అప్లై చేయండి. 24 గంటలు కనీస పర్యవేక్షణ అవసరం. సున్నితమైన చర్మం ఉన్న వారు తమ ముఖం మీద ప్రయత్నించడానికి ముందు ఈ ఫేస్ ప్యాక్ ను ఖచ్చితంగా ముంజేతి మీద ప్రయోగించాల్సిందిగా సూచించబడుతుంది.

ఈ ఫేస్ పాక్లో వినియోగించబడిన పదార్ధాల మూలాన కలిగే ప్రయోజనాల గురించిన సమగ్ర వివరాలను ఇక్కడ పొందుపరచబడ్డాయి.

బంగాళా దుంపల వలన కలిగే ప్రయోజనాలు :

బంగాళా దుంపల వలన కలిగే ప్రయోజనాలు :

• బంగాళా దుంపలు ముఖంపై కనిపించే వికారమైన డార్క్ స్పాట్స్ వదిలించుకోవడానికి సహాయపడతాయి.

• దీనిలో వాపును తగ్గించే సామర్ధ్యం ఉంటుంది.

• ఇది యాంటీ ఏజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. క్రమంగా అకాల వృద్దాప్య లక్షణాలకు చెక్ పెట్టగలుగుతుంది.

• మొటిమలను, ఆక్నే సమస్యను, ముడుతలను, చారలను తగ్గిస్తుందని చెప్పబడుతుంది.

• ఇది మీకు సహజ సిద్దమైనమైన మెరుపును ఇస్తుంది.

కీరా దోసకాయ వలన కలిగే ప్రయోజనాలు :

కీరా దోసకాయ వలన కలిగే ప్రయోజనాలు :

• ఇది సన్ బర్న్ తగ్గించడంలో సహాయపడుతుంది

• టాన్ తొలగించడానికి సహాయపడుతుంది

• మచ్చల్ని మరియు డార్క్ స్పాట్స్ తగ్గించే సామర్ధ్యం కలిగి ఉంటుంది.

• ఇది చర్మ రంద్రాల చికిత్సలో కూడా సహాయపడుతుంది.

పసుపుతో కలిగే ప్రయోజనాలు :

పసుపుతో కలిగే ప్రయోజనాలు :

• మొటిమలు మరియు ఆక్నే సమస్య నుండి మిమ్ములను బయటవేయడంలో పసుపు ఎంతగానో సహాయపడుతుంది.

• పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది

• మచ్చలు, చారలను తగ్గిస్తుంది

• మీ చర్మంపై ఉండే రంధ్రాలపై చికిత్సలో సహాయపడుతుంది.

నిమ్మ వలన కలిగే ప్రయోజనాలు :

నిమ్మ వలన కలిగే ప్రయోజనాలు :

చర్మ సంరక్షణలో నిమ్మ చేసే సహాయం అంతా ఇంత కాదు. నిమ్మను నేరుగా ఆహార ప్రణాళికలోనికి జోడించుకోవడమే కాకుండా, ఫేస్ పాక్స్, ఫేస్ వాష్ల తయారీలో కూడా విరివిగా వినియోగించబడడం జరుగుతుంది. దీనికి కారణం ఇందులోని విటమిన్ C నిల్వలే.

• చారలు మరియు మచ్చల చికిత్సలో నిమ్మ సహాయపడుతుంది

• మీ చర్మం తేమను పొందడానికి సహాయపడుతుంది

• నిమ్మ చర్మాన్ని లోలోపలే శుభ్రపరుస్తుంది మరియు మొటిమలు మరియు ఆక్నే సమస్యను తగ్గిస్తుంది

మీరు ఇప్పటికే అనేకరకాల ఫేస్ మాస్కులను ప్రయత్నించి ఉంటారు. ఆ క్రమంలో భాగంగానే ఒకసారి ఫేస్ మాస్క్ కూడా కొత్తగా ప్రయత్నించి చూడండి. మరియు ఈ వారాంతంలో ఏదైనా చర్మ సంరక్షణా పద్దతులను అనుసరించాలని భావిస్తున్న ఎడల, ఈ ఫేస్ మాస్క్ మీకు మంచి ఊరటను అందివ్వగలదు. ఈ ఫేస్ పాక్ అనుసరించిన తరువాత, మీ అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి.

English summary

DIY potato face mask for fair skin

Do you like potatoes? Well, if you do, nothing like it! But, if you don't, you must try it now. Potatoes are loaded with vitamins C, B1, B3, as well as B6 and are a rich source of minerals like phosphorus, potassium, and magnesium. Blending potatoes with turmeric, cucumber, and lemon can give you fair skin tone.