For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజూ గూస్బెర్రీ-హనీ జ్యూస్ తాగడం వల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.

రోజూ గూస్బెర్రీ-హనీ జ్యూస్ తాగడం వల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.

|

మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, ప్రతి ఒక్కరూ ఉసిరికాయను రుచి చూసే ఉంటారు. కారం మరియు ఉప్పుతో కలిపి తిన్న అనుభం మనలో చాలా మందికి ఉంటుంది. కానీ ఈ పండులో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయని మీకు తెలుసా? భారతదేశంలో ఆమ్లా అని కూడా పిలువబడే గూస్బెర్రీ మీ చర్మం, జుట్టు మరియు ఆరోగ్యానికి చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పుల్లని మరియు ఆరోగ్యకరమైన పండు యొక్క శాస్త్రీయ నామం పాలియంతుస్ ఎంబ్లికా మరియు పోషకాహారంలో మహా గొప్పది.

ప్రస్తుతం, దీన్ని అనేక రకాలుగా ఉపయోగిస్తున్నారు. ఊరగాయలు, చట్నీలు ఆరోగ్యకరమైన రసం వంటి తయారుచేసుకుంటున్నారు. అంతే కాదు వీటి ద్వారా అనేక ప్రయోజనాలను పొందుతూ ఉపయోగించబడుతున్నది. భారతదేశంలో ఆమ్లా రసం తయారీకి ప్రసిద్ది చెందింది. ఈ ఆరోగ్యకరమైన పానీయంలో విటమిన్ సి కంటెంట్ మరియు ఇతర ఆరోగ్యకరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి, ఇవి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

Drink This Amla And Honey Juice Daily For Flawless Skin

ఆయుర్వేద ఔషధం విషయానికొస్తే పెద్ద ఉసిరికి కాయల్లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మం నుండి చర్మంలో మ్రుత కణాలను తొలగించి కొత్త కణాలను పెంచుతుంది. చర్మం కాంతివంతం చేయడానికి ఉసిరికాయ చాలా బాగా పనిచేస్తుంది. దీనితో ఫేస్ ప్యాక్ గా తయారు చేయవచ్చు. ఉసిరికాయ మరియు పసుపుతోటి ఫేస్ ప్యాక్ తయారుచేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా చర్మం ఆరోగ్యం మొత్తాన్ని కాపాడుతుంద. పెద్ద నెల్లికాయగా పిలిచుకునే ఈ ఉసిరికాయలో ఉండే విటమిన్ సి చర్మ నిర్జీవంగా ఉన్న చర్మంలో కొన్ని అద్భుతాలను చూపుతుంది. చర్మ సమస్యలను నుండి ఉపశమనం కలిగిస్తుంది మరియు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది మరియు వృద్ధాప్యం లక్షణాలను ఆలస్యం చేస్తుంది.

మీరు అందంగా కనబడబాలంటే రోజూ ఎంతో కొంత

మీరు అందంగా కనబడబాలంటే రోజూ ఎంతో కొంత

మీరు అందంగా కనబడబాలంటే రోజూ ఎంతో కొంత ఈ జ్యూస్ తాగాలి. దీన్ని తయారుచేయడం కూడా చాలా సులభం. ఉసిరికాయలో విత్తనాలను తీసేసి, తేనెతో కలిపి పేస్ట్ చేసుకోవాలి. తేనె యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. దాంతో చర్మ నష్టాన్ని తగ్గిస్తుంది. అలాగే స్కిన్ ఎలాసిటిని పెంచుతుంది, డ్రై స్కిన్ నివారిస్తుంది. చర్మం అలసిపోవటను సరిచేస్తుంది. డయాబెటిస్ ఉన్న వారికి మరియు బరువు తగ్గాలని ఆలోచించే వారికి ఇది చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. మీరు దీన్ని మీ ముఖం మీద రాస్తే, మీ చర్మంలో నల్లదనాన్ని పూర్తిగా తొలగిస్తుంది. దీన్ని ఉపయోగించడం కంటే త్రాగటం మంచిది. ఉసిరికాయ జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దాం.

జ్యూస్ తయారీ

జ్యూస్ తయారీ

* 5 నుండి 7 ఉసిరికాయలను బాగా శుభ్రంగా కడగాలి.

* విత్తనాలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసి, రెండు కప్పులు నీరు జోడించాలి.

* మొత్తగా అయ్యే వరకూ గ్రైండ్ చేయాలి. ఈ పేస్ట్ మరీ చిక్కగా ఉందనుకుంటే మరికొద్దిగా నీళ్లు చేర్చి తిరిగి గ్రైండ్ చేయాలి.

* ఈ మిశ్రమాన్ని వడగట్టి, ఉసిరికాయ గుజ్జును వేరుచేయాలి.

* ఈ జ్యూస్ కు మీ టేస్ట్ కు తగ్గంత తేనెను చేర్చి త్రాగాలి.

ఈ జ్యూస్ త్రాగడం వల్ల అందమైన చర్మ సౌందర్యం పొందుతారు, చర్మం పూర్తిగా శుభ్రపరుస్తుంది. యవ్వనంగా కనబడేలా చేస్తుంది. ఈ జ్యూస్ ను కొద్దిరోజుల పాటు ప్రయత్నించి ఫలితం చూడండి. ఈ జ్యూస్ త్రాగిన తర్వాత చర్మంలో మార్పులు ఈ విధంగా ఉంటాయి....

చర్మం సంరక్షణలో ఉసిరికాయ ప్రయోజనాలు:

చర్మం సంరక్షణలో ఉసిరికాయ ప్రయోజనాలు:

1. యాంటీ ఏజింగ్ లక్షణాలు:

గూస్బెర్రీ జ్యూస్ తీసుకోవడం ద్వారా మీ చర్మ వయస్సు నెమ్మదించడానికి సహాయపడుతుంది. మీ వయస్సు పెరిగే కొద్ది, మీరు ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు మరియు అది వృద్ధాప్యం యొక్క ఒక నిర్దిష్ట దశ. అయితే, యవ్వనంగా కనిపించడానికి ఎవరు ఇష్టపడరు? కాబట్టి, కొంచెం ఆమ్లా రసం తయారు చేసి, అందులో కొంచెం తేనె వేసి త్రాగాలి. ఈ పానీయంలో యాంటీఆక్సిడెంట్లు చాలా ఉన్నాయి, ఇవి మీ చర్మం మెరుగ్గా ఉంచుతుంది మరియు వృద్ధాప్య కణాలతో పోరాడుతుంది. ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది మరియు ఇది మెరుస్తున్న చర్మానికి సహాయపడుతుంది. రోజూ ఆమ్లా రసం తాగడం వల్ల అకాల వృద్ధాప్యం, చర్మంలో సన్నని గీతలు, డార్క్ ప్యాచ్ లు మరియు ముడతలు రాకుండా చేస్తుంది.

2. మొటిమలకు చికిత్స చేస్తుంది:

2. మొటిమలకు చికిత్స చేస్తుంది:

ఆమ్లా మరియు పుసుపుతో మీరు ఆమ్లా పేస్ట్ తయారు చేసి, మీ ముఖం మొటిమలతో ప్రభావితమైన ప్రాంతంలో పూయవచ్చు మరియు 15 నిముషాల కంటే ఎక్కువ ఆరబెట్టండి. ఇది మొటిమలు, చర్మంలో చారలు, సన్నని గీతలు మరియు మొటిమల వల్ల వచ్చే మచ్చలను తగ్గిస్తుంది. ఇది మొటిమలను మరియు మొటిమల తరువాత వచ్చే ప్రభావాలను దూరంగా ఉంచే సహజ రక్త శుద్దీకరణ చేస్తుంది. అందువలన, ఆమ్లా రసం మీకు మచ్చలేని చర్మాన్ని ఇస్తుంది.

3. మంచి స్కిన్ టోన్ అందిస్తుంది:

3. మంచి స్కిన్ టోన్ అందిస్తుంది:

మీ చర్మంలో అధిక మొత్తంలో కొల్లాజెన్ కంటెంట్ చర్మం దృఢత్వానికి సహాయపడుతుంది మరియు మీ చర్మం మృదువుగా కనిపిస్తుంది. ఆమ్లా రసం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ సి స్థాయిని పెంచుతుంది మరియు మీ చర్మంలో కొల్లాజెన్ స్థాయి ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది మీ చర్మం మృదువుగా మరియు యవ్వనంగా కనబడేలా చేస్తుంది.

4. స్కిన్ పిగ్మెంటేషన్ కు చికిత్స చేస్తుంది:

4. స్కిన్ పిగ్మెంటేషన్ కు చికిత్స చేస్తుంది:

ఆమ్లా రసం తాగడం లేదా పేస్ట్ ను లేపనంగా రాయడం వల్ల మీ చర్మాన్ని శుభ్రపరుస్తుంది మరియు చర్మంలో నలుపు తగ్గుతుంది. మీరు చేయవలసిందల్లా మీ ముఖం మీద కొంచెం ఆమ్లా రసం పూయడం మరియు ఇది ఎండిన తర్వాత, మీరు ఒక చిన్న పత్తి ముక్కను ఉపయోగించుకుని, దానిని పూర్తిగా తుడిచేయండి. అలాగే, మీరు ఇలా చేస్తున్నప్పుడు మీ కన్నులు మూసుకోండి. రోజూ ఇలా చేయడం వల్ల చర్మం గుర్తులు తేలికవుతాయి మరియు స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గుతుంది.

5. చర్మంలో మృత కణాలను తొలగిస్తుంది:

5. చర్మంలో మృత కణాలను తొలగిస్తుంది:

ఆమ్లా జ్యూస్ మీ చర్మాన్ని చైతన్యంగా నింపుతుందని మరియు చర్మం ప్రకాశవంతంగా కనబడుటకు అదనపు పొరను జోడించి, మీ చర్మం వెలుపలికి వచ్చేలా చేస్తుంది. మీ చర్మం ప్రకాశవంతంగా మరియు ఉత్తేజంగా కనిపించడంతో మీరు మరింత ఎక్కువ నమ్మకాన్ని పొందవచ్చు. ఇది మీ ఆత్మవిశ్వాసానికి కొంత అదనపు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే, ఆమ్లా జ్యూస్ నేరుగా అప్లై చేసినా, తీసుకున్నా ఒక అద్భుతమైన ప్రక్షాళనగా పనిచేస్తుంది. ఇది మృత కణాలను తొలగించడానికి మరియు యాంటీ ఏజింగ్ ను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.

English summary

Drink This Amla And Honey Juice Daily For Flawless Skin

Amla juice is very effective in managing diabetes and facilitating weight loss. Applying amla juice topically on your face can help fight pigmentation and blemishes, says Ayurveda Expert Ashutosh Gautam. If you are looking for long-term effects, you can consider drinking this juice daily.
Story first published:Wednesday, November 20, 2019, 14:41 [IST]
Desktop Bottom Promotion