For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pimples In Winter: చలికాలంలో మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా, ఈ చిట్కాలు మీకోసమే

మీరు కూడా ఈ చలికాలంలో మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ వంటింటి చిట్కాలు పాటిస్తే మొటిమలు సులభంగా తొలగిపోతాయి.

|

Pimples In Winter: చర్మంపై ఉండే రంధ్రాలు మూసుకుపోవడం, అదనపు చర్మ నూనె వల్ల మొటిమలు ఏర్పడతాయి. చెడు ఆహారపు అలవాట్లు కూడా మొటిమలు రావడానికి కారణం అవుతాయి. అయితే వాతావరణంలో మార్పులు కూడా మొటిమలు రావడానికి కారణం అవుతుందని తెలుసా.. చాలా మంది చలికాలంలో మొటిమల సమస్య తీవ్రకావడం గమనించే ఉంటారు.

Home remedies for pimples in winter in Telugu

మీరు కూడా ఈ చలికాలంలో మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ వంటింటి చిట్కాలు పాటిస్తే మొటిమలు సులభంగా తొలగిపోతాయి.

ముల్తానీ మట్టి

ముల్తానీ మట్టి

ముల్తానీ మట్టిని సౌందర్య సాధనంగా చాలా కాలం నుండి వాడుతున్నారు. ముల్తానీ మట్టిలో మెగ్నీషియం క్లోరైడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది మొటిమలను తొలగించడంలో సహాయపడుతుంది. రోజ్ వాటర్ లో కొంత ముల్తానీ మట్టి కలిపి ఆ మిశ్రమాన్ని ముఖంపై ఫేస్ ప్యాక్ లా అప్లై చేసుకుని 20 నిమిషాలల తర్వాత కడిగేస్తే మొటిమలు తొలగిపోతాయి.

కలబంద

కలబంద

కలబందలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ముఖాన్ని కాంతివంతంగా చేస్తాయి. అలాగే మొటిమలు తొలగిపోయేలా చేస్తాయి. కలబంద గుజ్జును రోజూ ముఖానికి రాసుకుంటే మంచి ఫలితాన్ని గమనించవచ్చు. కలబంద గుజ్జు వల్ల చర్మంపై ఏర్పడ్డ మచ్చలూ తొలగిపోతాయి.

నిమ్మరసం

నిమ్మరసం

నిమ్మరసంలోని పోషకాలు మొటిమలను కలిగించే బ్యాక్టీరియాతో పోరాడతాయి. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. చిన్న పాత్రలో నిమ్మ రసం తీసుకుని కాటన్ క్లాత్ తో మొటిమలు ఉన్న ప్రాంతాల్లో నెమ్మదిగా మర్దన చేసి 10 నిమిషాలు అయ్యాక గోరు వెచ్చని నీటితో కడిగితే ఒకటి రెండు రోజుల్లో మొటిమలు తొలగిపోతాయి.

పెరుగు

పెరుగు

పెరుగులో ఉండే లాక్టిక్ కారోసివ్ చర్మంపై ఉండే మృత కణాలను తొలగిస్తుంది. దీని వల్ల చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. పెరుగును ముఖంపై ఫేస్ ప్యాక్ లా రోజూ అప్లై చేసుకుంటే కొన్ని రోజుల్లోనే మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.

బొప్పాయి

బొప్పాయి

బొప్పాయిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి మొటిమలను ప్రభావవంతంగా తొలగిస్తాయి. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. బొప్పాయి ఒక అద్భుతమైన ఎక్స్ ఫోలియేటర్. బొప్పాయి గుజ్జును ముఖంపై రాసి 10 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. అలా చేస్తే మంచి మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది.

పసుపు

పసుపు

చాలా కాలం నుండి పసుపును చర్మ సౌందర్యానికి ఉపయోగిస్తున్నారు. మృతకణాలను తొలగించడంలో, అదనపు చర్మ నూనెను తొలగించడంలో, చర్మాన్ని కాంతివంతం చేయడంలో పసుపు చక్కగా ఉపయోగపడుతుంది.

ఓట్స్

ఓట్స్

మొటిమలకు ఓట్స్ గొప్ప ఔషధం. ఓట్స్ చర్మంపై నూనెను పీల్చుకుంటాయి. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఓట్స్ ను మెత్తగా గ్రైండ్ చేసి ముఖంపై అప్లై చేసుకోవాలి. మొటిమలు ఇట్టే తొలగిపోతాయి.

రోజ్ వాటర్

రోజ్ వాటర్

మొటిమలను తగ్గించడంలోనే కాకుండా రోజ్ వాటర్ తో ఇంకా చాలా ప్రయోజనాలే ఉన్నాయి. టోనర్ కు బదులుగా రోజ్ వాటర్ ను చర్మానికి రాస్తే మంచి ఫలితం లభిస్తుంది. మొటిమలతో బాధపడే వారు రోజ్ వాటర్ తో ముఖాన్ని కడిగేస్తే మొటిమలు తొలగిపోతాయి.

బాదం

బాదం

బాదం శారీరక ఆరోగ్యానికే కాదు సౌందర్యానికి కూడా ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. బాదంలోని విటమిన్ ఈ మొటిమలను తగ్గించడంలో గొప్పగా పని చేస్తుంది. బాదం ఫేస్ ప్యాక్ 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత కడిగేస్తే చర్మం కాంతివంతం అవుతుంది.

మొటిమలు ఉంటే ఇలా చేయండి..

మొటిమలు ఉంటే ఇలా చేయండి..

* ముఖంపై మొటిమలు బాధిస్తుంటే తరచూ ముఖాన్ని కడగడం మర్చిపోవద్దు.

* రాత్రి సమయంలో ముఖంపై మేకప్ ను తప్పనిసరిగా తీసేయాలి.

* చలికాలం, వేసవి కాలంతో సంబంధం లేకుండా పుష్కలంగా నీటిని తాగాలి. నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి.

English summary

Home remedies for pimples in winter in Telugu

read on to know Home remedies for pimples in winter in Telugu
Story first published:Tuesday, November 29, 2022, 15:59 [IST]
Desktop Bottom Promotion