For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది, అమ్మాయిలూ ఇలా అందంగా కనిపించండి

ఇక్కడ ఉన్న చిట్కాలు చలికాలం పెళ్లిళ్ల సీజన్‌లో మంచి కాంతివంతమైన చర్మాన్ని పొందడానికి సహాయపడతాయి.

|

పార్టీలో లేదా పెళ్లిలో అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. మెరిసే చర్మం పొందడం అంత సులువేం కాదు. ఈ చలికాలంలో చర్మం కాంతివంతంగా కనిపించదు. పొడిబారిపోవడం, నిగారింపు కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి. ఈ పెళ్లిళ్ల సీజన్‌లో మీ అందంగా ఎలా కనిపించాలో ఇక్కడ చూద్దాం.

Skin care routine this wedding season in winter in Telugu

ఇక్కడ ఉన్న చిట్కాలు చలికాలం పెళ్లిళ్ల సీజన్‌లో మంచి కాంతివంతమైన చర్మాన్ని పొందడానికి సహాయపడతాయి.

1. పుష్కలంగా నీటిని తాగాలి

1. పుష్కలంగా నీటిని తాగాలి

మొత్తం ఆరోగ్యానికి నీరు ఎంతో కీలకం. శరీరం హైడ్రేటెడ్‌గా ఉండాలంటే రోజూ తగినన్ని నీళ్లు తాగాల్సిందే. ఇది చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతుంది. చర్మంలోని pH బ్యాలెన్స్‌ చేస్తుంది. టాక్సిన్స్ ప్లష్ చేయడానికి, ముడతలను తగ్గించడానికి, మొటిమలను నివారించడానికి, తేమ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది.

2. పచ్చి కూరగాయలు తినాలి

2. పచ్చి కూరగాయలు తినాలి

పోషకాలతో కూడిన ఆహారం చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ముదురు ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవాలి. విటమిన్లు, మినరల్స్, వయస్సుతో పోరాడే పైటో కెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ చర్మంపై ఆరోగ్యకరమైన మెరుపును కలిగి ఉంటాయి.

3. రోజూ శుభ్రం చేయడం

3. రోజూ శుభ్రం చేయడం

రోజువారీ శుభ్రత మెరిసే చర్మం యొక్క సీక్రెట్. చర్మంపై ఉన్న వ్యర్థాలు తొలగిపోవడానికి చర్మం శుభ్రం చేసుకోవడం ముఖ్యం. చలికాలంలో మాయిశ్చరైజింగ్ క్లెన్సర్ కు మారండి. ఇది ఎండిపోయిన చర్మాన్ని హైడ్రెట్ చేయడానికి సాయపడుతుంది.

4. మాయిశ్చరైజింగ్ ఆయిల్

4. మాయిశ్చరైజింగ్ ఆయిల్

చలికాలం వచ్చిందంటే చర్మం పొడిబారిపోతుంది. చర్మం తేమగా లేకపోతే ఎలాంటి మేకప్‌లు వేసినా నో యూస్. ఉదయం, రాత్రి సమయాల్లో ముఖం, మెడ చుట్టూ మాయిశ్చరైజింగ్ ఆయిల్ రాసుకోవాలి. రాత్రి మేకప్ తొలగించిన తర్వాత మాయిశ్చరైజింగ్ ఆయిల్ తప్పనిసరిగా రాసుకోవాలి.

5. ఫేస్ ప్యాక్

5. ఫేస్ ప్యాక్

చర్మాన్ని పాంపర్ చేయడానికి, మెరుపును పొందడానికి గులాబీ ప్యాక్ ను వాడాలి. గులాబీల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. వాటిని చర్మ సంరక్షణకు సరైన పదార్థాలుగా వాడుకోవచ్చు.

గులాబీ ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవడానికి కొన్ని గులాబీ రేకులు తీసుకోవాలి. కొన్ని పాలు, తేనె కలిపి అందులో గులాబీ రేకులు వేసి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్టును ముఖంపై మెడపై అప్లై చేసుకోవాలి. ఓ 15 నిమిషాలు అయ్యాక మాయిశ్చరైజర్ తో కడిగేయాలి. ఇలా కొన్ని రోజులపాటు చేస్తే గుర్తించగలిగే ఫలితం కనిపిస్తుంది.

6. ఎక్స్‌ఫోలియేషన్

6. ఎక్స్‌ఫోలియేషన్

కఠినమైన ఎక్స్‌ఫోలియేషన్‌ను నివారించండి. అది చర్మాన్ని పొడిగా మారుస్తుంది. చర్మ మెరుపును, తేమను తొలగిస్తాయి. ఎక్స్‌ఫోలియేషన్‌కు బదులు లాక్టిక్ యాసిడ్ ఉపయోగించడం ఉత్తమం. చర్మం యొక్క సహజ తేమ కారకాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది.

ఈ చర్మసంరక్షణ విధానాలు అనుసరించండి

ఈ చర్మసంరక్షణ విధానాలు అనుసరించండి

* ముఖాన్ని రోజుకు రెండు సార్లు చక్కగా కడుక్కోవాలి. క్రీమ్ లేదా నూనెతో ఒకరి శుభ్రం చేసి, మరొక ఫేస్ వాష్ ఉపయోగించాలి.

* ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోవాలి.

* టోనర్, నాన్ ఆల్కహాలిక్ టోనర్ ఉపయోగించాలి.

* హైలురోనిక్ యాసిడ్ లేదా విటమిన్-సి ఉన్న సీరం ఉపయోగించండి.

* తర్వాత నిమిషం అయ్యాక మాయిశ్చరైజర్ వాడండి

* ఇంటి నుండి బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి.

* చర్మాన్ని అతిగా ఎక్స్‌ఫోలియేట్ చేయవద్దు.

* కంటినిండా నిద్ర పోతే ముఖ్యం కాంతివంతంగా కనిపిస్తుంది.

అందంగా కనిపించడం మామూలు విషయమేం కాదు. దానికి కొద్దిగా శ్రమించాల్సిందే. చర్మాన్ని చక్కగా క్లీన్ చేసుకుంటూ చర్మంపై మృతకణాలను తొలగించుకుంటూ ఉండాలి.

English summary

Skin care routine this wedding season in winter in Telugu

read on to know Skin care routine this wedding season in winter in Telugu
Story first published:Thursday, December 8, 2022, 16:39 [IST]
Desktop Bottom Promotion